7
సెక్స్‌లో పాల్గొనమని ఎవరైనా ఒత్తిడి చేస్తే నేనేం చేయాలి?
మీరు ఏం చేస్తారు?
ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: హెదర్‌కి మైక్ రెండు నెలలనుండే పరిచయం. అయినా, అతను ఎప్పటినుండో తనకు తెలుసు అన్నట్లు హెదర్‌కి అనిపిస్తుంది. వాళ్లు ఎప్పుడూ మెసేజ్‌లు పంపించుకుంటారు, గంటలు తరబడి ఫోన్లో మాట్లాడుకుంటారు. వాళ్ల మాటలు కూడా బాగా కలిసిపోయాయి!
ఆ రెండు నెలల్లో, వాళ్లు ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు, అప్పుడప్పుడు ముద్దు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు మైక్‌కి ఇంకా ఏదో కావాలనిపిస్తోంది. కానీ అంతకుమించి దూరం వెళ్లడం హెదర్‌కి ఇష్టం లేదు. అలాగని, మైక్‌ని దూరం చేసుకోవడం కూడా ఆమెకు ఇష్టం లేదు. మైక్ ఆమె అందాన్ని పొగుడుతాడు, ఆమెను చాలా ప్రత్యేకంగా చూస్తాడు. ఇంతవరకు ఎవ్వరూ ఆమెను అలా చూడలేదు. ‘పైగా, నేనూ మైక్ ఒకర్నొకరం ప్రేమించుకుంటున్నాం ...’ అని ఆమె సమర్థించుకుంటుంది.
మీకు డేటింగ్ చేసేంత వయసు ఉంటే, హెదర్ స్థానంలో మీరున్నట్లు ఊహించుకోండి. మీరైతే ఏం చేస్తారు?
ఒక్కక్షణం ఆగి, ఆలోచించండి!
సెక్స్ అనేది దేవుడు భార్యాభర్తలకు మాత్రమే ఇచ్చిన బహుమతి. పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొంటే, మీరు ఆ బహుమానాన్ని పాడుచేస్తున్నట్లే. అంటే, వేరేవాళ్లు మీకు బహుమతిగా ఇచ్చిన మంచి బట్టల్ని, ఇల్లు తుడవడానికి ఉపయోగిస్తున్నట్లే
గురుత్వాకర్షణ అనే భౌతిక నియమాన్ని పాటించకుండా చెట్టుమీద నుండి దూకితే, దెబ్బలు తగలుతాయి. అదేవిధంగా, ‘జారత్వానికి దూరంగా ఉండండి’ అనే నైతిక నియమాన్ని పాటించకపోతే కూడా ప్రమాదంలో పడతాం.—1 థెస్సలొనీకయులు 4:3.
ఆ ఆజ్ఞను నిర్లక్ష్యం చేస్తే, ఎలాంటి ఫలితాలు వస్తాయి? బైబిలు ఇలా చెప్తుంది: ‘జారత్వం చేసేవాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు.’ (1 కొరింథీయులు 6:18) అదెలా?
పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్న చాలామంది యౌవనులు, వీటిలో ఏదోక పర్యవసానాల్ని ఖచ్చితంగా ఎదుర్కొంటారని పరిశోధకులు చెప్తున్నారు.
కృంగుదల. పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్న చాలామంది యౌవనులు, తాము చేసిన తప్పుకు కృంగిపోతున్నామని చెప్తున్నారు.
నమ్మకం లేకపోవడం. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత ఆ అమ్మాయి, అబ్బాయి, ‘ఈయన/ఈమె ఇంకా ఎవరితో సెక్స్‌లో పాల్గొన్నారో?’ అని భయపడుతుంటారు.
నిరాశ. నిజానికి, చాలామంది అమ్మాయిలు తమను కాపాడే అబ్బాయిని ఎక్కువగా ఇష్టపడతారు కానీ, తమను వాడుకునే అబ్బాయిని కాదు. అలాగే చాలామంది అబ్బాయిలు తమకు శారీరకంగా దగ్గరైన అమ్మాయిని అంతగా ఇష్టపడరు.
ఒక్కమాటలో: మీరు పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొంటే, మీ దగ్గరున్న విలువైనదాన్ని పాడుచేసుకుని, మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటారు. (రోమీయులు 1:24) మీ శరీరం చాలా విలువైనది, దాన్ని పాడుచేసుకోకండి!
‘జారత్వానికి దూరంగా’ ఉండే సామర్థ్యం మీకుందని చూపించండి. (1 థెస్సలొనీకయులు 4:3) జారత్వానికి దూరంగా ఉంటే, పెళ్లయ్యాక సెక్స్‌ను ఆనందించగలుగుతారు. ఎందుకంటే, పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్నవాళ్లకు ఉండే చింతలు, బాధలు, అభద్రతా భావాలు మీకు ఉండవు.—సామెతలు 7:22, 23; 1 కొరింథీయులు 7:3.
మీకేమనిపిస్తుంది?
మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి, శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని కృంగదీస్తాడా?
మీమీద నిజంగా శ్రద్ధ ఉన్న వ్యక్తి, దేవునితో మీకున్న స్నేహాన్ని పాడుచేసుకునేలా మిమ్మల్ని బలవంతపెడతాడా?—హెబ్రీయులు 13:4.