విషయసూచిక
1వ భాగం యెహోవా దగ్గరకు ఎందుకు తిరిగి రావాలి?
బైబిలు కాలాల్లో యెహోవా ప్రజలు మనలాంటి సమస్యలనే ఎదుర్కొన్నారు. యెహోవా వాళ్లకు తన చేయి అందించి, సహాయం చేశాడు. మాటిచ్చినట్లే, యెహోవా ఇప్పుడు కూడా మనకు సహాయం చేస్తాడు. ప్రేమగల, శ్రద్ధగల కాపరిలానే యెహోవా తప్పిపోయిన గొర్రెలను వెదికి, తిరిగి తన దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తాడు.
1వ భాగం-యెహోవా దగ్గరకు ఎందుకు తిరిగి రావాలి?
2-4 భాగాలు తిరిగి రావడానికి ఎదురయ్యే కొన్ని సమస్యలు ఏమిటి?
దేవుని నమ్మకమైన సేవకులు కూడా కొన్నిసార్లు ఆందోళనలు, మనసుకు తగిలిన గాయాలు, అపరాధ భావాలు వంటివాటి వల్ల బాధపడ్డారు. దానివల్ల, వాళ్లు దేవుని సేవ సరిగ్గా చేయలేకపోయారు. మళ్లీ కోలుకుని, తన ప్రజలతో తిరిగి సహవసించేలా, ఆనందాన్ని పొందేలా యెహోవా వాళ్లకెలా సహాయం చేశాడో పరిశీలించండి.
2వ భాగం ఆందోళన-ఎటుచూసినా ఇబ్బందులే
3వ భాగం మనసుకు తగిలిన గాయాలు-‘ఎవరైనా మీకు హాని చేసినప్పుడు’
4వ భాగం అపరాధ భావాలు-“నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము ”
5వ భాగం యెహోవా దగ్గరకు ఎలా తిరిగి రావాలి?
మీరు తన దగ్గరకు తిరిగి రావాలని యెహోవా కోరుకుంటున్నాడు అనడానికి రుజువులు పరిశీలించండి. చాలామంది క్రైస్తవులు యెహోవా దగ్గరకు ఎలా తిరిగి వచ్చారో, వాళ్లను సంఘం ఎలా అక్కున చేర్చుకుందో, మళ్లీ దేవుని సేవ చురుగ్గా చేయడానికి పెద్దలు ఎలా సహాయం చేశారో తెలుసుకోండి.
5వ భాగం “మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన” దేవుని దగ్గరకు తిరిగి రండి