కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 78 పేజీ 182-పేజీ 183 పేరా 1
  • నమ్మకమైన గృహనిర్వాహకుడు సిద్ధంగా ఉండాలి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నమ్మకమైన గృహనిర్వాహకుడు సిద్ధంగా ఉండాలి!
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • సిద్ధముగా ఉండుడి!
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • ముందుచూపుతో ఉండండి, తెలివిగా నడుచుకోండి
    యేసే మార్గం, సత్యం, జీవం
  • మీకు తెలుసా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • నమ్మకమైన గృహనిర్వాహకుడు అతని పరిపాలక సభ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 78 పేజీ 182-పేజీ 183 పేరా 1
దీపం పట్టుకొని తమ యజమాని రాక కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు వ్యక్తులు

78వ అధ్యాయం

నమ్మకమైన గృహనిర్వాహకుడు సిద్ధంగా ఉండాలి!

లూకా 12:35-59

  • నమ్మకమైన గృహనిర్వాహకుడు సిద్ధంగా ఉండాలి

  • విరోధం పెట్టడానికే యేసు వచ్చాడు

కేవలం ‘చిన్నమందకు’ మాత్రమే పరలోక రాజ్యం ఇవ్వబడుతుందని యేసు వివరించాడు. (లూకా 12:32) ఆ అద్భుతమైన బహుమతి పొందే అవకాశాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఒక వ్యక్తి దాన్ని పొందాలంటే ఎలాంటి వైఖరితో ఉండాలో యేసు వివరించడం మొదలుపెట్టాడు.

అలా వివరిస్తూ, తాను తిరిగొచ్చే సమయం కోసం శిష్యులు సిద్ధంగా ఉండాలని యేసు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “మీ నడుం కట్టుకొని సిద్ధంగా ఉండండి, మీ దీపాలు మండుతూ ఉండేలా చూసుకోండి. యజమాని పెళ్లి నుండి తిరిగొచ్చి తలుపు తట్టగానే దాన్ని తీయాలని, అతని కోసం ఎదురుచూస్తున్న దాసుల్లా మీరు ఉండాలి. యజమాని వచ్చి ఏ దాసులు అలా మెలకువగా ఉండడం చూస్తాడో ఆ దాసులు సంతోషంగా ఉంటారు!”—లూకా 12:35-37.

ఎలాంటి వైఖరితో ఉండాలని యేసు చెప్తున్నాడో శిష్యులు సులభంగానే అర్థం చేసుకొని ఉంటారు. ఉదాహరణలోని దాసులు తమ యజమాని రాక కోసం ఎదురుచూస్తూ సిద్ధంగా ఉండడం ద్వారా సరైన వైఖరిని చూపించారు. యేసు ఇలా వివరించాడు: “యజమాని రెండో జామున [దాదాపు రాత్రి తొమ్మిదింటి నుండి మధ్యరాత్రి వరకు] వచ్చినా, చివరికి మూడో జామున [మధ్యరాత్రి నుండి దాదాపు ఉదయం మూడింటి వరకు] వచ్చినా ఆ దాసులు సిద్ధంగా ఉంటే వాళ్లు సంతోషంగా ఉంటారు!”—లూకా 12:38.

యేసు ఇస్తున్న సలహా, మంచి దాసులుగా లేదా పనివాళ్లుగా ఎలా ఉండాలనే దానిగురించి కాదు. అలాగని ఎందుకు చెప్పవచ్చంటే, యేసు ఆ ఉదాహరణ చివర్లో మానవ కుమారుని గురించి, అంటే తన గురించి ప్రస్తావించాడు. ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “మీరు కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. ఎందుకంటే, మీరు అనుకోని సమయంలో మానవ కుమారుడు వస్తున్నాడు.” (లూకా 12:40) అంటే, భవిష్యత్తులో ఒకానొక సమయంలో యేసు వస్తాడు. అప్పుడు తన అనుచరులు, ముఖ్యంగా ‘చిన్నమందకు’ చెందినవాళ్లు సిద్ధంగా ఉండాలన్నది యేసు కోరిక.

పేతురు ఆ ఉదాహరణ అర్థాన్ని ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలనుకున్నాడు. కాబట్టి అతను “ప్రభువా, ఈ ఉదాహరణను మాకు మాత్రమే చెప్తున్నావా లేక అందరికీ చెప్తున్నావా?” అని అడిగాడు. పేతురు అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబిచ్చే బదులు, యేసు అలాంటి మరో ఉదాహరణ చెప్పాడు: “తన సేవకులందరికీ తగిన సమయంలో, తగినంత ఆహారం పెడుతూ ఉండేలా యజమాని వాళ్లమీద నియమించే నమ్మకమైన, బుద్ధిగల గృహనిర్వాహకుడు నిజంగా ఎవరు? యజమాని వచ్చి ఆ దాసుడు అలాచేస్తూ ఉండడం చూస్తే, ఆ దాసుడు సంతోషంగా ఉంటాడు! నేను మీతో నిజం చెప్తున్నాను, ఆయన ఆ దాసుణ్ణి తన ఆస్తి అంతటి మీద నియమిస్తాడు.”—లూకా 12:41-44.

మొదట చెప్పిన ఉదాహరణలోని “యజమాని,” మానవ కుమారుడైన యేసును సూచిస్తున్నాడు. ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు,’ రాజ్యాన్ని పొందే ‘చిన్నమందలోని’ కొంతమంది పురుషుల్ని సూచిస్తున్నాడు. (లూకా 12:32) వాళ్లు “తన సేవకులందరికీ తగిన సమయంలో, తగినంత ఆహారం పెడుతూ” ఉంటారని యేసు చెప్పాడు. యేసు బోధల్ని వింటూ, ఆయన ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకుంటున్న పేతురు, ఇతర శిష్యులు మానవ కుమారుడు భవిష్యత్తులో వచ్చే సమయం ఒకటుందని ఆ ఉదాహరణల ద్వారా అర్థం చేసుకుని ఉంటారు. ఆ సమయంలో, ‘యజమాని సేవకులందరికీ’ అంటే యేసు అనుచరులందరికీ ఆధ్యాత్మిక ఆహారం పెట్టే ఒక ఏర్పాటు ఉంటుంది.

తన శిష్యులు అప్రమత్తంగా ఉండాలని, సరైన వైఖరితో ఉండాలని యేసు మరో విధంగా కూడా వివరించాడు. అలా ఉండకపోతే నిర్లక్ష్యంగా తయారై, చివరికి తమ తోటివాళ్లను వ్యతిరేకించే ప్రమాదం ఉంది. ఆయన ఇలా చెప్పాడు: “ఒకవేళ ఆ దాసుడు, ‘నా యజమాని ఆలస్యం చేస్తున్నాడు’ అని తన హృదయంలో అనుకొని పనివాళ్లను, పనికత్తెలను కొడుతూ, తింటూ తాగుతూ మత్తుగా ఉంటే ఆ దాసుడు ఎదురుచూడని రోజున, అతనికి తెలియని సమయంలో యజమాని వచ్చి అతన్ని అతి కఠినంగా శిక్షిస్తాడు, నమ్మకంగాలేని వాళ్ల మధ్య అతన్ని ఉంచుతాడు.”—లూకా 12:45, 46.

తర్వాత యేసు, “నేను భూమ్మీద నిప్పు అంటించడానికి వచ్చాను” అన్నాడు. అవును, ఇప్పటికే ఆయన చెప్పిన కొన్ని విషయాలు వాడివేడి చర్చలకు దారితీశాయి, తప్పుడు బోధల్ని-ఆచారాల్ని దహించివేశాయి. దానివల్ల కలిసి ఉండాల్సినవాళ్లు కూడా విడిపోతారు. “తండ్రి కుమారుడికి, కుమారుడు తండ్రికి, తల్లి కూతురికి, కూతురు తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకు వ్యతిరేకంగా ఉంటారు.”—లూకా 12:49, 53.

యేసు ఆ మాటల్ని ప్రత్యేకించి తన శిష్యుల కోసమే చెప్పాడు. తర్వాత ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడాడు. యేసే మెస్సీయ అని నిరూపించే రుజువులు ఉన్నప్పటికీ చాలామంది వాటిని మొండిగా నిరాకరిస్తున్నారు. కాబట్టి ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “పడమటి నుండి మబ్బు పైకి రావడం మీరు చూసినప్పుడు వెంటనే, ‘తుఫాను రాబోతుంది’ అంటారు; అది వస్తుంది. అలాగే, దక్షిణ గాలి వీచడం మీరు చూసినప్పుడు, ‘వడగాలి రాబోతుంది’ అంటారు; అది వస్తుంది. వేషధారులారా, భూమినీ ఆకాశాన్నీ చూసి వాతావరణం ఎలా ఉంటుందో మీరు గ్రహించగలరు. కానీ ఈ సమయంలో జరుగుతున్న వాటి అర్థాన్ని మీరు ఎందుకు గ్రహించట్లేదు?” (లూకా 12:54-56) అవును, నిజంగానే వాళ్లు సిద్ధంగా లేరు.

  • “యజమాని,” ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ ఎవరు?

  • భవిష్యత్తులో ఒక నమ్మకమైన గృహనిర్వాహకుడు ఉంటాడని శిష్యులు ఎందుకు అర్థంచేసుకొని ఉండవచ్చు? ఆ గృహనిర్వాహకుడు ఏం చేస్తూ ఉంటాడు?

  • “సిద్ధంగా ఉండండి” అని యేసు ఇచ్చిన సలహా ఎందుకు ముఖ్యమైనది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి