కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 22 పేజీ 58-పేజీ 59 పేరా 6
  • నలుగురు శిష్యులు మనుషుల్ని పట్టే జాలర్లు అవుతారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నలుగురు శిష్యులు మనుషుల్ని పట్టే జాలర్లు అవుతారు
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • నలుగురు శిష్యులు పిలువబడిరి
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • మనుష్యులను పట్టు జాలరులుగా సేవచేయుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • బైబిలు కాలాల్లో చేపలు పట్టే వలలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • భయపడడం, సందేహించడం అనే బలహీనతలతో ఆయన పోరాడాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 22 పేజీ 58-పేజీ 59 పేరా 6
గలిలయ సముద్రం ఒడ్డున యేసు పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులతో మాట్లాడుతున్నాడు

22వ అధ్యాయం

నలుగురు శిష్యులు మనుషుల్ని పట్టే జాలర్లు అవుతారు

మత్తయి 4:13-22 మార్కు 1:16-20 లూకా 5:1-11

  • ఎప్పుడూ తన వెంటే ఉండమని యేసు తన శిష్యుల్ని ఆహ్వానించాడు

  • చేపలు పట్టే జాలర్లు మనుషుల్ని పట్టే జాలర్లు అవుతారు

నజరేతు ప్రజలు యేసును చంపాలని ప్రయత్నించిన తర్వాత, ఆయన గలిలయ సముద్రం దగ్గర్లో ఉన్న కపెర్నహూము నగరానికి వెళ్లాడు. గలిలయ సముద్రానికి “గెన్నేసరెతు సరస్సు” అనే పేరు కూడా ఉంది. (లూకా 5:1) యేసు అక్కడికి వెళ్లడం వల్ల, సముద్ర తీరంలో ఉన్న గలిలయ ప్రజలు గొప్ప వెలుగును చూస్తారనే యెషయా ప్రవచనం నెరవేరింది.—యెషయా 9:1, 2.

యేసు గలిలయలోని ఈ ప్రాంతంలో కూడా, “పరలోక రాజ్యం దగ్గరపడింది” అని ప్రకటిస్తూ ఉన్నాడు. (మత్తయి 4:17) యేసు తన శిష్యుల్లో నలుగురిని అక్కడ చూశాడు. వాళ్లు ఇంతకుముందు యేసుతోపాటు ప్రయాణించారు. కానీ యూదయ నుండి తిరిగొచ్చిన తర్వాత, మళ్లీ తమ చేపల వ్యాపారాన్ని కొనసాగించారు. (యోహాను 1:35-42) అయితే వాళ్లు ఇప్పుడు యేసు వెంటే ఉండాల్సిన సమయం వచ్చింది. అలా ఉంటేనే, యేసు వెళ్లిపోయిన తర్వాత కూడా పరిచర్యను కొనసాగించేలా ఆయన వాళ్లకు శిక్షణ ఇవ్వగలడు.

యేసు సముద్ర తీరంలో నడుస్తున్నప్పుడు సీమోను పేతురును, అతని సహోదరుడైన అంద్రెయను, వాళ్లతోపాటు ఇంకొంతమంది జాలర్లను చూశాడు. వాళ్లు తమ వలల్ని శుభ్రం చేసుకుంటున్నారు. యేసు వాళ్ల దగ్గరికి వెళ్లి, పేతురు పడవ ఎక్కి, పడవను ఒడ్డుకు కాస్త దూరంగా లాగమని చెప్పాడు. తర్వాత ఆ పడవలో కూర్చుని, తీరం దగ్గరికి వచ్చిన ప్రజలకు రాజ్యం గురించిన సత్యాల్ని బోధించాడు.

తర్వాత యేసు పేతురుతో, “పడవను లోతుగా ఉన్న చోటికి తీసుకెళ్లి అక్కడ మీ వలలు వేయండి” అన్నాడు. దానికి పేతురు, “బోధకుడా, మేము రాత్రంతా కష్టపడినా మాకు ఏమీ దొరకలేదు. అయినా నువ్వు చెప్పావు కాబట్టి వలలు వేస్తాను” అన్నాడు.—లూకా 5:4, 5.

వలల్ని పడవలోకి లాగడానికి అంద్రెయ, యాకోబు, యోహాను తీవ్రంగా కష్టపడుతున్నారు; పేతురు యేసు ముందు మోకాళ్లూనాడు

వాళ్లు వలలు వేసినప్పుడు చేపలు ఎంత ఎక్కువగా పడ్డాయంటే వలలు పిగిలిపోసాగాయి! వెంటనే వాళ్లు, సహాయం చేయడానికి రమ్మని దగ్గర్లోని పడవలో ఉన్న తోటి జాలర్లకు సైగచేశారు. కాసేపటికే రెండు పడవలు చేపలతో నిండిపోయి, ఆ బరువుకి మునిగిపోసాగాయి. అది చూసిన పేతురు యేసు ముందు సాగిలపడి, “ప్రభువా, నేను పాపిని, నన్ను విడిచివెళ్లు” అన్నాడు. అప్పుడు యేసు, “భయపడకు. ఇప్పటినుండి నువ్వు మనుషుల్ని పట్టే జాలరిగా ఉంటావు” అన్నాడు.—లూకా 5:8, 10.

తర్వాత యేసు పేతురు అంద్రెయలతో ఇలా అన్నాడు: “నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరులుగా చేస్తాను.” (మత్తయి 4:19) యేసు ఇంకో ఇద్దరు జాలర్లను కూడా అలాగే పిలిచాడు. వాళ్లు ఎవరంటే, జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను. వాళ్లు కూడా ఇంకేం ఆలోచించకుండా ఆయన వెంట వెళ్లారు. అలా, ఆ నలుగురు శిష్యులు చేపల వ్యాపారాన్ని విడిచిపెట్టి ఎప్పుడూ ఆయన వెంటే ఉన్నారు.

  • ఎప్పుడూ తన వెంటే ఉండమని యేసు ఎవర్ని ఆహ్వానించాడు? వాళ్లు ఏం పని చేసేవాళ్లు?

  • ఏ అద్భుతం చూసి పేతురు భయపడ్డాడు?

  • నలుగురు శిష్యులు ఇప్పుడు ఎలాంటి జాలర్లు అయ్యారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి