కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • yc పాఠం 7 పేజీలు 16-17
  • మీకు ఎప్పుడైనా ఒంటరిగా, భయంగా ఉన్నట్టు అనిపించిందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకు ఎప్పుడైనా ఒంటరిగా, భయంగా ఉన్నట్టు అనిపించిందా?
  • చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తన దేవుని వల్ల ఊరట పొందాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • తన దేవుని వల్ల ఊరట పొందాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • మీరు ఏలీయావలె నమ్మకంగా ఉంటారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • యెహోవా ఏలీయాకు శక్తినిచ్చాడు
    నా బైబిలు పుస్తకం
మరిన్ని
చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
yc పాఠం 7 పేజీలు 16-17
ఎవరూ లేరనిపించి భయపడుతున్న బాబు

7

మీకు ఎప్పుడైనా ఒంటరిగా, భయంగా ఉన్నట్టు అనిపించిందా?

ఇక్కడున్న బాబును చూడండి. ఇతను ఒంటరిగా, భయంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు కదా? మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా?— అప్పుడప్పుడు ప్రతి ఒక్కరికీ అలా అనిపిస్తుంది. యెహోవా స్నేహితులకు కూడా కొన్నిసార్లు ఒంటరిగా, భయంగా ఉన్నట్టు అనిపించింది, వాళ్ల గురించి బైబిల్లో ఉంది. వాళ్లలో ఏలీయా ఒకరు. ఆయన గురించి ఇప్పుడు నేర్చుకుందామా?

కోపంగా అరుస్తున్న యెజెబెలు రాణి

యెజెబెలు ఏలీయాను చంపాలనుకుంది

ఈయన యేసు పుట్టకముందు ఎన్నో ఏళ్ల కిందట జీవించాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న అహాబు సత్య దేవుడైన యెహోవాను ఆరాధించేవాడు కాదు. అతను, అతని భార్య యెజెబెలు బయలు అనే అబద్ధ దేవతను పూజించేవాళ్లు. అందుకే, ఇశ్రాయేలులో చాలామంది బయలును పూజించడం మొదలుపెట్టారు. యెజెబెలు రాణి చాలా చెడ్డది, క్రూరురాలు కూడా. యెహోవాను ఆరాధించే వాళ్లందర్నీ ఆమె చంపించాలనుకుంది, అందులో ఏలీయా కూడా ఉన్నాడు! అప్పుడు ఏలీయా ఏమి చేశాడో తెలుసా?—

ఏలీయా పారిపోయాడు! ఎక్కడో దూరానున్న ఎడారికి పారిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. ఆయన ఎందుకలా పారిపోయాడు?— ఆఁ, ఆయన భయపడ్డాడు. అసలు ఏలీయా భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకని? ఎందుకంటే, యెహోవా తనకు సహాయం చేయగలడని ఏలీయాకు తెలుసు. యెహోవా తనకు ఎంత శక్తి ఉందో ఏలీయాకు అంతకుముందు చూపించాడు. ఓసారి ఏలీయా చేసిన ప్రార్థన విని యెహోవా పరలోకం నుండి అగ్ని పంపించాడు. అలాంటి యెహోవా ఇప్పుడు ఏలీయాకు సహాయం చేయలేడా?

ఏలీయా ప్రార్థనకు జవాబుగా యెహోవా పరలోకం నుండి అగ్ని పంపించాడు; గుహలో ఉన్న ఏలీయా; యెహోవా చెప్పిన ప్రోత్సాహకరమైన మాటలు విన్నాక సంతోషం పొందిన ఏలీయా

యెహోవా ఏలీయాకు ఎలా సహాయం చేశాడు?

ఏలీయా గుహలో ఉండగా యెహోవా ఆయనను, ‘నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు?’ అని అడిగాడు. దానికి ఏలీయా ఇలా చెప్పాడు: ‘నేను ఒక్కడినే ఇంకా నిన్ను ఆరాధిస్తున్నాను. నేను ఒక్కడినైపోయా. నన్ను చంపేస్తారేమోనని భయంగా ఉంది.’ యెహోవాను ఆరాధించే వాళ్లందర్నీ చంపేశారని ఏలీయా అనుకున్నాడు. కానీ యెహోవా ఏలీయాతో ఇలా అన్నాడు: ‘అది నిజం కాదు, ఇంకా నన్ను ఆరాధిస్తున్న వాళ్లు 7,000 మంది ఉన్నారు. ధైర్యంగా ఉండు. నా కోసం నువ్వు చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది!’ అది విన్నప్పుడు ఏలీయా సంతోషించాడా?—

ఏలీయాకు జరిగిన దాని నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?— మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉన్నామని అనుకోవద్దు, భయపడొద్దు. యెహోవాను, మిమ్మల్ని ప్రేమించే స్నేహితులు మీకు ఉన్నారు. అంతేకాదు యెహోవాకు ఎంతో శక్తి ఉంది, ఆయన ఎప్పుడూ మీకు అండగా ఉంటాడు! మీరు ఎప్పుడూ ఒంటరివాళ్లు కాదనే విషయం తెలుసుకున్నందుకు మీకు సంతోషంగా లేదా?—

మీ బైబిల్లో చదవండి

  • 1 రాజులు 19:3-18

  • కీర్తన 145:18

  • 1 పేతురు 5:9

ప్రశ్నలు:

  • ఏలీయా కాలంలో, ఇశ్రాయేలులోని చాలామంది యెహోవాను ఆరాధించారా? మరి ఎవర్ని ఆరాధించారు?

  • ఏలీయా ఎందుకు పారిపోయి గుహలో దాక్కున్నాడు?

  • యెహోవా ఏలీయాకు ఏమి చెప్పాడు?

  • ఏలీయాకు జరిగిన దాని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి