మీరు యెహోవా ఇష్టాన్ని చేస్తారా?
యెహోవాసాక్షులమైన మా గురించి, మా పనుల గురించి, మా సంస్థ పనితీరు గురించి తెలుసుకోవడానికి సమయం తీసుకొని ఈ బ్రోషుర్ను పరిశీలించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ రోజుల్లో యెహోవా ఇష్టాన్ని చేస్తున్నది మేమే అని గుర్తించేలా అది మీకు సహాయం చేసిందని ఆశిస్తున్నాం. దేవుని గురించిన జ్ఞానం సంపాదిస్తూ ఉండమని, నేర్చుకుంటున్న విషయాలు మీ ఇంట్లోవాళ్లతో స్నేహితులతో చెప్పమని, క్రైస్తవ కూటాల్లో మాతో క్రమంగా సహవసించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.—హెబ్రీయులు 10:23-25.
మీరు యెహోవా గురించి నేర్చుకునేకొద్దీ ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకుంటారు. అప్పుడు మీరు కూడా యెహోవా మీద ప్రేమ చూపించడానికి శాయశక్తులా కృషిచేయాలని కోరుకుంటారు. (1 యోహాను 4:8-10, 19) అయితే మీకు ఆ కోరిక ఉందని రోజువారీ జీవితంలో ఎలా చూపించవచ్చు? దేవుని నైతిక ప్రమాణాలు పాటించడం మీకే మంచిదని ఎలా చెప్పవచ్చు? మాతో పాటు దేవుని ఇష్టాన్ని చేయాలని కోరుకునేలా ఏది మీకు సహాయం చేస్తుంది? మీతో బైబిలు అధ్యయనం చేస్తున్నవాళ్లు, ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి మీకు సంతోషంగా సహాయం చేస్తారు. అప్పుడు మీరు, మీ కుటుంబ సభ్యులు “దేవుడు ప్రేమించే ప్రజలుగా ఉంటూ శాశ్వత జీవితం” పొందగలుగుతారు.—యూదా 21.
దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి పుస్తకాన్ని కూడా అధ్యయనం చేసి సత్యమార్గంలో ముందుకు సాగమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.