కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • bm భాగం 8 పేజీ 11
  • ఇశ్రాయేలీయులు కనాను దేశంలోకి ప్రవేశించారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇశ్రాయేలీయులు కనాను దేశంలోకి ప్రవేశించారు
  • బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోషువ పుస్తకంలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ఆమె “తన చేతల వల్ల నీతిమంతురాలని తీర్పు పొందింది”
    కావలికోట: దేవుడు ప్రేమలేని వాడని అనుకునేలా చేసిన అబద్ధాలు
  • రాహాబు వేగులవాళ్లను దాచిపెట్టడం
    నా బైబిలు కథల పుస్తకము
  • నిర్దేశాలు వింతగా అనిపించినా పాటించాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
మరిన్ని
బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
bm భాగం 8 పేజీ 11
యాజకులు బూరలు ఊదుతుండగా యెహోషువ యుద్ధ నినాదం చేస్తున్నాడు

భాగం 8

ఇశ్రాయేలీయులు కనాను దేశంలోకి ప్రవేశించారు

యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కనానీయులను జయించారు. తన ప్రజలను అణచివేత నుండి కాపాడడానికి యెహోవా న్యాయాధిపతులను నియమించాడు

ఇశ్రాయేలీయులు కనానులోకి ప్రవేశించడానికి ఎన్నో శతాబ్దాలముందే, ఆ దేశాన్ని అబ్రాహాము వంశస్థులకు ఇస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

కనానీయులు దేశాన్నంతా నీచాతినీచమైన లైంగిక దుష్క్రియలతో, విపరీతమైన రక్తపాతంతో నింపేశారు. అందుకే వాళ్లను నాశనం చేయాలని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు, ఏ పట్టణాలనైతే జయిస్తారో వాటిని పూర్తిగా నాశనం చేయమని దేవుడు వాళ్లకు చెప్పాడు.

వాగ్దాన దేశంలోకి ప్రవేశించబోయే ముందు ఆ ప్రాంతాన్ని చూసిరమ్మని యెహోషువ ఇద్దరు వేగులవాళ్లను పంపించాడు. వాళ్లు యెరికో పట్టణంలో ఉంటున్న రాహాబు అనే స్త్రీ ఇంటికి వెళ్లారు. వాళ్లు ఇశ్రాయేలీయులని తెలిసినా ఆమె వాళ్లను ఇంట్లోకి రానిచ్చి, వాళ్లని కాపాడింది. యెహోవా తన ప్రజలను రక్షించడానికి చేసిన గొప్ప కార్యాల గురించి ఆమె విని ఆయనపై విశ్వాసముంచింది. తనను, తన ఇంటివాళ్లను చంపకుండా వదిలేయాలని వేగులవాళ్లతో ప్రమాణం చేయించుకుంది.

ఇశ్రాయేలీయులు కనానులోకి ప్రవేశించి యెరికోపై దాడి చేసినప్పుడు యెహోవా అద్భుతరీతిలో యెరికో గోడలు కూలిపోయేలా చేశాడు. యెహోషువ సైన్యం పట్టణంలోకి దూసుకెళ్లి దాన్ని నాశనం చేశారు గానీ రాహాబును, ఆమె కుటుంబాన్ని చంపకుండా వదిలేశారు. తర్వాతి ఆరు సంవత్సరాల్లో వెంటవెంటనే వాగ్దాన దేశంలోని చాలా పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ దేశం ఇశ్రాయేలు గోత్రాలకు పంచిపెట్టబడింది.

కనాను దేశ మ్యాపు[11వ పేజీలోని మ్యాపు]

ఎంతోకాలంపాటు ఇశ్రాయేలీయులను నడిపించిన యెహోషువ ముసలితనంలో ప్రజలను ఒక్కచోట సమకూడమన్నాడు. అప్పుడు ఆయన, యెహోవా తమ పూర్వీకుల కోసం చేసినవాటిని గుర్తుచేసి ఆయనను సేవించమని వాళ్లను ప్రోత్సహించాడు. యెహోషువ, ఆయనతోపాటు సేవచేసిన పెద్దలు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు యెహోవాను విడిచిపెట్టి అబద్ధ దేవుళ్లను ఆరాధించడం మొదలుపెట్టారు. తర్వాత దాదాపు 300 సంవత్సరాల్లో ఇశ్రాయేలీయులు కొన్నిసార్లు దేవుని ఆజ్ఞలకు లోబడ్డారు, కొన్నిసార్లు నిర్లక్ష్యం చేశారు. అప్పుడు, ఫిలిష్తీయుల్లాంటి శత్రువులు వాళ్లను అణచివేయడానికి యెహోవా అనుమతించాడు. కానీ, ఇశ్రాయేలీయులు మొరపెట్టినప్పుడల్లా యెహోవా వాళ్లకు సహాయం చేయడానికి న్యాయాధిపతులను నియమించాడు. అలా మొత్తం 12 మంది న్యాయాధిపతులుగా పనిచేశారు.

ఆ న్యాయాధిపతుల గురించి న్యాయాధిపతుల పుస్తకంలో రాయబడింది. వాళ్లలో ఒత్నీయేలు మొదటివాడు, జీవించినవారిలోకెల్లా బలవంతుడైన సమ్సోను చివరివాడు. ఎంతో ఆసక్తికరమైన సంఘటనలను వివరించిన న్యాయాధిపతుల పుస్తకం ఒక ముఖ్యమైన విషయాన్ని పదేపదే నొక్కిచెప్తోంది: యెహోవాకు లోబడితే ఆశీర్వాదాలు పొందవచ్చు, లోబడకపోతే నాశనమే.

—యెహోషువ; న్యాయాధిపతులు; లేవీయకాండము 18:24, 25.

  • యెహోవా రాహాబును, ఆమె కుటుంబాన్ని నాశనం చేయకుండా ఎందుకు విడిచిపెట్టాడు?

  • యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు ఏమి చేశారు?

  • బైబిల్లోని న్యాయాధిపతుల పుస్తకం ఏ ముఖ్యమైన విషయాన్ని నొక్కిచెప్తోంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి