కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • bm భాగం 1 పేజీ 4
  • సృష్టికర్త మనిషిని పరదైసులో ఉంచాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సృష్టికర్త మనిషిని పరదైసులో ఉంచాడు
  • బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిన్ను సృష్టించిన దెవరు?
    భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!
  • నరుడు పరదైసులో జీవితమును ఆనందించవలెనని దేవుడు సంకల్పిస్తున్నాడు.
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • మొదటి మానవ దంపతుల నుంచి మనం నేర్చుకోవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • ఏదెను తోటలో జీవితం ఎలా ఉండేది?
    దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
మరిన్ని
బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
bm భాగం 1 పేజీ 4
ఏదెను తోటలో ఆదాముహవ్వలు, జంతువులు

భాగం 1

సృష్టికర్త మనిషిని పరదైసులో ఉంచాడు

దేవుడు విశ్వాన్ని, భూమ్మీద జీవంతోవున్న ప్రతీదాన్ని సృష్టించాడు. తర్వాత, పరిపూర్ణమైన పురుషుణ్ణి, స్త్రీని సృష్టించి, వారిని ఓ అందమైన తోటలో ఉంచి, వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు

ఏదెను తోటలో సింహాలు, పక్షులు, లేడి

“ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” (ఆదికాండము 1:1) సుపరిచితమైన ఈ పరిచయ మాటలు చాలా ప్రత్యేకమైనవి. పరిశుద్ధ లేఖనాల్లో ఎంతో ఘనత ఆపాదించబడిన సర్వశక్తిగల దేవుడైన యెహోవాను, స్పష్టమైన ఆ ఒక్క వాక్యంతో బైబిలు పరిచయం చేస్తోంది. మనం జీవిస్తున్న భూగ్రహంతోసహా ఈ విశ్వాన్నంతా దేవుడే సృష్టించాడని బైబిల్లోని ఆ మొదటి వచనం తెలియజేస్తోంది. బైబిలు కొన్నిసార్లు దినములు అని ప్రస్తావించినప్పుడు అది వేల సంవత్సరాలను సూచిస్తుంది. అలా కొన్ని వేల సంవత్సరాల కాలవ్యవధిలో దేవుడు మన నివాసగృహమైన భూమిని ప్రకృతి సౌందర్యాలతో ఎలా తీర్చిదిద్దాడో ఆ తర్వాతి వచనాలు తెలియజేస్తాయి.

యెహోవా దేవుడు భూమ్మీద చేసినవాటన్నిటిలో మానవుని సృష్టి అత్యద్భుతమైనది. ఎందుకంటే ఆయన మనిషిని తన స్వరూపంలో అంటే ప్రేమ, జ్ఞానంలాంటి తన లక్షణాలను చూపించే సామర్థ్యంతో సృష్టించాడు. యెహోవా దేవుడు మనిషిని మట్టితో చేసి, అతనికి ఆదాము అని పేరుపెట్టి, పరదైసులో అంటే ఏదెను అనే అందమైన తోటలో ఉంచాడు. అంతేకాక, ఆ తోటలో మంచి కాపునిచ్చే అందమైన చెట్లను మొలిపించాడు.

మనిషికి ఒక తోడు అవసరమని దేవునికి అనిపించింది. అందుకే, దేవుడు ఆదాముకు గాఢనిద్ర వచ్చేలా చేసి ఆయన పక్కటెముకల్లో ఒకదాన్ని తీసి దానితో స్త్రీని చేశాడు. ఆమెను ఆయనకు భార్యగా ఇచ్చాడు. ఆదాము ఆనందంతో పరవశించిపోయి, “నా యెముకలలో ఒక యెముక, నా మాంసములో మాంసము” అంటూ కవిత్వం చెప్పాడు. ఆ తర్వాత ఆమెకు హవ్వ అనే పేరు పెట్టాడు. దేవుడు ఇలా వివరించాడు: “కాబట్టి, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.”—ఆదికాండము 2:22-24; 3:20.

దేవుడు ఆదాము హవ్వలకు రెండు ఆజ్ఞలిచ్చాడు. మొదటిగా, భూమిని సాగుచేసి దాన్ని జాగ్రత్తగా చూసుకోమని, పిల్లల్ని కని భూమ్మీద విస్తరించమని చెప్పాడు. రెండవదిగా, విస్తారమైన ఆ తోటలోవున్న చెట్లన్నిటిలో ఒక చెట్టు పండ్లను, అంటే “మంచి చెడ్డల తెలివినిచ్చు” చెట్టు పండ్లను తినకూడదని చెప్పాడు. (ఆదికాండము 2:17) వాళ్లు ఆయన మాట వినకపోతే చనిపోతారు. ఆ ఆజ్ఞలను పాటించి, ఆయనను తమ పరిపాలకునిగా అంగీకరిస్తున్నామని చూపించే అవకాశాన్ని దేవుడు వాళ్లకిచ్చాడు. అంతేకాదు, వాళ్లు ఆయన మాట వింటే తమకు ఆయనపట్ల ప్రేమా కృతజ్ఞతా ఉన్నాయని కూడా చూపిస్తారు. దయగల ఆయన పరిపాలనను కాదనడానికి వాళ్లకు ఏ కారణమూ లేదు. పరిపూర్ణులైన ఆదాము, హవ్వల్లో ఎలాంటి లోపమూ లేదు. ‘దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలమంచిదిగ ఉండెను’ అని బైబిలు చెప్తోంది.—ఆదికాండము 1:31.

—ఆదికాండము 1, 2 అధ్యాయాలు.

  • మనుషులను, వారి నివాసగృహమైన భూమిని సృష్టించడాన్ని బైబిలు ఎలా వర్ణిస్తోంది?

  • దేవుడు మొదటి స్త్రీపురుషులకు ఎలాంటి జీవితాన్నిచ్చాడు?

  • మొదటి మానవ జంటకు దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడు?

దేవుని పేరు

పరిశుద్ధ లేఖనాలు దేవుని గురించి చెప్పేటప్పుడు సృష్టికర్త, సర్వశక్తివంతుడు వంటి అనేక బిరుదులను ఉపయోగిస్తోంది. వాటిలో కొన్ని ఆయన పరిశుద్ధతను, ఆయనకున్న శక్తి, న్యాయం, జ్ఞానం, ప్రేమ వంటి లక్షణాలను నొక్కి చెప్తాయి. అయితే, దేవుడు తనకు తానే ఒక ప్రత్యేకమైన పేరు పెట్టుకున్నాడు. అదే యెహోవా. బైబిలు మొదట ఏ భాషల్లోనైతే రాయబడిందో ఆ భాషల్లోని బైబిల్లో ఈ పేరు దాదాపు 7,000 సార్లు ఉంది. ఆదికాండము 2:4లో ఇది మొదటిసారి కనిపిస్తుంది. యెహోవా అనే పేరుకు “తానే కర్త అవుతాడు” అని అర్థం. అంటే దేవుడు తాను చేయాలనుకున్న దేన్నైనా చేయగలడు, తాను చేసిన ఏ వాగ్దానాన్నైనా నెరవేర్చగలడు. ఈ విషయం తెలుసుకోవడం ఎంతో ఓదార్పునిస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి