పాట 30
యెహోవా పరిపాలన ఆరంభమైంది
1. దేవుడు స్థాపించెను మెస్సీయ రాజ్యమును
క్రీస్తుకిచ్చాడు బలాధిక్యము.
రాజ్యాన్ని ఏర్పర్చిన యెహోవా స్తోత్రార్హుడు
ఏకస్వరంతో ఆయన్ను స్తుతిద్దాము.
(పల్లవి)
ఏమౌతుంది దైవరాజ్యంలో?
నీతి సత్యాలు ఉంటాయి.
నిత్యజీవం సొంతమౌతుంది.
సంతోషముంటుంది నిత్యం.
సర్వోన్నతాధికారికి
చేయండి స్తుతి గానం.
2. క్రీస్తు దైవశక్తితో సాతాను లోకమును
హార్మెగిద్దోన్లో నిర్మూలిస్తాడు.
యెహోవా పక్షానుంటే సాధ్యము రక్షణని
చాటించడానికి ఇదే సమయము.
(పల్లవి)
ఏమౌతుంది దైవరాజ్యంలో?
నీతి సత్యాలు ఉంటాయి.
నిత్యజీవం సొంతమౌతుంది.
సంతోషముంటుంది నిత్యం.
సర్వోన్నతాధికారికి
చేయండి స్తుతి గానం.
3. దేవుని నామమున పాలించును ప్రభువు
ఆయనకు మనమాధీనులం.
యెహోవా మందిరంలో సేవచేస్తూ నిత్యము
క్రీస్తేసు భూపాలనకు సిద్ధమౌదాం.
(పల్లవి)
ఏమౌతుంది దైవరాజ్యంలో?
నీతి సత్యాలు ఉంటాయి.
నిత్యజీవం సొంతమౌతుంది.
సంతోషముంటుంది నిత్యం.
సర్వోన్నతాధికారికి
చేయండి స్తుతి గానం.
(2 సమూ. 7:22; దాని. 2:44; ప్రక. 7:15 కూడా చూడండి.)