కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lv పేజీ 254-పేజీ 255 పేరా 3
  • వ్యాపార విషయాల్లో తగాదాలొస్తే ఎలా పరిష్కరించుకోవాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వ్యాపార విషయాల్లో తగాదాలొస్తే ఎలా పరిష్కరించుకోవాలి?
  • ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమాధానంగా ఉండడానికి కృషి చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • విభేదాలను మీరు ఎలా పరిష్కరిస్తారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • అభిప్రాయభేదాల్ని ప్రేమతో పరిష్కరించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • మీరు మీ సహోదరుని సంపాదించుకోవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
lv పేజీ 254-పేజీ 255 పేరా 3

అనుబంధం

వ్యాపార విషయాల్లో తగాదాలొస్తే ఎలా పరిష్కరించుకోవాలి?

అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 6:1-8 వచనాల్లో, తోటి విశ్వాసుల మధ్య తలెత్తిన వివాదాల గురించి మాట్లాడాడు. కొరింథులోని కొందరు క్రైస్తవులు ‘అనీతిమంతులముందు వ్యాజ్యెం చేయడానికి తెగించినందుకు’ బాధను వ్యక్తం చేశాడు. (1వ వచనం) క్రైస్తవులు కోర్టుల్లో కాదుగానీ సంఘంలోనే తమ వివాదాలను పరిష్కరించుకోవడం ఎందుకు మంచిదో పౌలు చెప్పాడు. దైవప్రేరణతో ఆయన అలా చెప్పడానికి కొన్ని కారణాలేమిటో పరిశీలించి, అవి ఎలాంటి సందర్భాలకు వర్తించవో చూద్దాం.

వ్యాపార విషయాల్లో తోటి విశ్వాసితో ఏదైనా వివాదం తలెత్తితే మనం దానిని మన సొంత తెలివితో కాదుగానీ యెహోవా ఇచ్చిన నిర్దేశాల ప్రకారం పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. (సామెతలు 14:12) వివాదం ముదరకముందే పరిష్కరించుకోవడం మంచిదని యేసు చెప్పాడు. (మత్తయి 5:23-26) విచారకరంగా కొందరు క్రైస్తవులు గొడవల్ని పెద్దగా చేసుకొని చివరికి కోర్టుకు కూడా వెళ్ళారు. ‘ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో లోపముగా ఉంది’ అని పౌలు అన్నాడు. ఎందుకు? ప్రాముఖ్యమైన కారణమేమిటంటే, అది సంఘానికి, మనమారాధించే దేవునికి చెడ్డపేరు తీసుకొస్తుంది. అందుకే మనం, “అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా?” అని పౌలు వేసిన ప్రశ్న గురించి ఆలోచించాలి.—7వ వచనం.

వివాదాలను పరిష్కరించుకోవడానికి దేవుడు సంఘంలోనే చక్కని ఏర్పాటు చేశాడని కూడా పౌలు చెప్పాడు. క్రైస్తవ పెద్దలు బైబిలు నుండి జ్ఞానం సంపాదించుకున్నారు కాబట్టి, వారు మన ‘జీవన సంబంధమైన సంగతులను గూర్చి సహోదరుల మధ్య వ్యాజ్యెం తీర్చగలరని’ పౌలు అన్నాడు. (3-5 వచనాలు) అపనిందలు వేయడం, మోసం చేయడం వంటి ఘోర అపరాధాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకోవడానికి తీసుకోవాల్సిన మూడు చర్యల గురించి యేసు వివరించాడు. (1) స్వయంగా వెళ్లి గొడవ పడిన వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. (2) మొదటి ప్రయత్నం ఫలించకపోతే, ఒకరిద్దరు సాక్షులను వెంట తీసుకెళ్లి మాట్లాడాలి. (3) ఆ ప్రయత్నం కూడా విఫలమైతే, సంఘ ప్రతినిధులైన పెద్దలకు ఆ విషయాన్ని చెప్పాలి.—మత్తయి 18:15-17.

వ్యాజ్యెం తీర్చడానికి క్రైస్తవ పెద్దలు న్యాయవాదులు, వ్యాపారవేత్తలు కానవసరంలేదు. అందుకే వారు అలాంటి విషయాల్లో సలహాలు ఇవ్వకూడదు. ఆ ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి వాళ్ల కోసం వీరు షరతులు విధించరు. కానీ, వారిద్దరూ బైబిలు లేఖనాలను అన్వయించుకొని, శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవడానికి సహాయం చేస్తారు. వివాదం విషయంలో పెద్దలు ఎటూ తేల్చుకోలేకపోతే ప్రాంతీయ పర్యవేక్షకుణ్ణి లేదా యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అయితే, పౌలు ఇచ్చిన నిర్దేశం వర్తించని పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.

కొన్ని సందర్భాల్లో నిస్వార్థంగా, శాంతియుతంగా సమస్యను పరిష్కరించడానికి కోర్టుకు వెళ్లడం న్యాయపరంగా అవసరం కావచ్చు. ఉదాహరణకు, విడాకుల కోసం, పిల్లల సంరక్షణ కోసం, జీవనభృతి నిర్ణయించడానికి, భీమా పరిహారం పొందడానికి, దివాలా తీసిన బ్యాంకులో ఖాతాదారులమైతే, వీలునామా ధృవీకరించడానికి లేదా అలాంటి విషయాల్లో కోర్టుకు వెళ్లడమే పరిష్కారమై ఉండవచ్చు. కొన్నిసార్లు, ఒక సహోదరుడు తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి ఎదురు కేసు వేయాలనుకోవచ్చు.a

గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో కోర్టుకెళ్లరు కాబట్టి అలాంటి సందర్భాల్లో పౌలు ఇచ్చిన ప్రేరేపిత ఉపదేశం ఉల్లంఘించినట్లు కాదు.b అయితే, ఒక క్రైస్తవుడు యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చేందుకు, సంఘ సమాధానాన్ని, ఐక్యతను కాపాడేందుకు ప్రాముఖ్యతనివ్వాలి. “ప్రేమ . . . స్వప్రయోజనమును విచారించుకొనదు.” క్రీస్తు అనుచరులు అలాంటి ప్రేమనుబట్టే గుర్తించబడతారు.—1 కొరింథీయులు 13:4, 5; యోహాను 13:34, 35.

a ఒక క్రైస్తవుడు అత్యాచారం, దాడి, హత్య లేదా దోపిడి వంటి ఘోరమైన పాపం చేసి ఉండవచ్చు. అలాంటి సందర్భాలు చాలా అరుదు. మనం వెంటనే అధికారులకు తెలపాలి. ఆ తర్వాత ఆ విషయం కోర్టుదాకా వెళ్లినా, అతనికి న్యాయ విచారణ జరిగినా మనం మాత్రం క్రైస్తవులుగా మన బాధ్యత నెరవేర్చినట్లే అవుతుంది.

b మరింత సమాచారం కోసం కావలికోట మార్చి 15, 1997, 17-22 పేజీలు, నవంబరు 15, 1998, 24-7 పేజీలు చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి