కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lr అధ్యా. 48 పేజీలు 250-256
  • దేవుని శాంతియుతమైన క్రొత్త లోకం —అందులో జీవించాలంటే మీరు ఏంచేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని శాంతియుతమైన క్రొత్త లోకం —అందులో జీవించాలంటే మీరు ఏంచేయాలి?
  • గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • శాంతియుతమైన నూతనలోకంలో జీవితము
    శాంతియుతమైన నూతనలోకంలో జీవితము
  • శాశ్వతకాలం జీవించాలంటే ఏమి చేయాలి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • కొత్తలోకం దగ్గర్లో ఉంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • భూమి ఎడల దేవుని సంకల్పమేమిటి?
    దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
మరిన్ని
గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
lr అధ్యా. 48 పేజీలు 250-256

48వ అధ్యాయం

దేవుని శాంతియుతమైన క్రొత్త లోకం —అందులో జీవించాలంటే మీరు ఏంచేయాలి?

దేవుడు ఆదాముకు, హవ్వకు ఏదెను తోటను ఇచ్చాడు. వాళ్లు తన మాట వినకుండా చనిపోయినా, వాళ్ల పిల్లలందరూ పరదైసులో ఎప్పటికీ జీవించే అవకాశం దేవుడు కల్పించాడు. ఆ పిల్లల్లో ఇప్పుడు జీవిస్తున్న మనం కూడా ఉన్నాం. ‘నీతిమంతులకు భూమి సొంతమవుతుంది. వాళ్లు అందులో నిత్యం నివసిస్తారు’ అని బైబిలు మాట ఇస్తోంది.—కీర్తన 37:29.

బైబిలు, “క్రొత్త ఆకాశము,” “క్రొత్త భూమి” గురించి మాట్లాడుతోంది. (యెషయా 65:17; 2 పేతురు 3:13) ఇప్పుడున్న “ఆకాశము” నేడున్న మనుషుల ప్రభుత్వాలను సూచిస్తుంది. అయితే, “క్రొత్త ఆకాశము” పరలోకం నుండి యేసుక్రీస్తు, ఆయన తోటి రాజులు చేసే పరిపాలనను సూచిస్తుంది. శాంతిని తీసుకొచ్చే, దేవుని నీతియుక్త ప్రభుత్వమైన ఈ క్రొత్త ఆకాశం, భూమిని పరిపాలించినప్పుడు ఎంత బావుంటుందో!

“క్రొత్త భూమి” అంటే ఏమిటి?— యెహోవాను ప్రేమించే మంచి ప్రజలు అందరూ కలిపి క్రొత్త భూమి అవుతారు. బైబిలు “భూమి” అని చెప్పినప్పుడు, అది ఎప్పుడూ నేలను ఉద్ధేశించే కాదుగానీ కొన్నిసార్లు మనుషులను ఉద్దేశించి అలా మాట్లాడుతుంది. (ఆదికాండము 11:1; కీర్తన 66:4; 96:1) కాబట్టి, క్రొత్త భూమి ఎవరిని సూచిస్తుందో ఆ ప్రజలు ఇదే భూమ్మీద జీవిస్తారు.

ఇప్పుడున్న చెడ్డ లోకం అప్పుడిక ఉండదు. గుర్తుందా, నోవహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు ఒక చెడ్డ లోకం పూర్తిగా నాశనమైపోయింది. మనం ముందు తెలుసుకున్నట్లు, ఇప్పుడున్న చెడ్డ లోకం అర్మగిద్దోనులో నాశనం చేయబడుతుంది. అర్మగిద్దోను ముగిసిన తర్వాత దేవుని క్రొత్త లోకంలో జీవించడం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

పరదైసులో, అంటే దేవుని శాంతియుతమైన క్రొత్త లోకంలో ఎప్పటికీ జీవించివుండాలని మీరు కోరుకుంటున్నారా?— అయితే, మనం ఎప్పటికీ జీవించేలా వైద్యులెవ్వరూ చేయలేరు. మనం చనిపోకుండా చేయగల మందు ఏదీ లేదు. మనం ఎప్పటికీ జీవించాలంటే దేవునికి దగ్గరవ్వడం ఒక్కటే మార్గం. మనం దేవునికి ఎలా దగ్గరవ్వవచ్చో మన గొప్ప బోధకుడు చెప్పాడు.

మనం బైబిళ్లు తీసి యోహాను 17వ అధ్యాయం, 3వ వచనం చదువుదాం. అక్కడ మన గొప్ప బోధకుడు ఇలా చెప్పాడు, “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”

కాబట్టి, మనం ఎప్పటికీ జీవించివుండాలంటే ఏమి చేయాలని యేసు చెప్పాడు?— ముందుగా మనం, మన పరలోక తండ్రియైన యెహోవా గురించి, మనకోసం ప్రాణమిచ్చిన ఆయన కుమారుని గురించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అంటే బైబిలు ఏంచెప్తుందో మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి, గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి అనే ఈ పుస్తకం మనకు సహాయం చేస్తుంది.

కానీ, యెహోవా గురించి తెలుసుకోవడానికీ మనం ఎప్పుడూ జీవించి ఉండడానికీ సంబంధం ఏమిటి?— మనకు ప్రతిరోజూ ఆహారం అవసరమైనట్లే, మనం ప్రతిరోజూ యెహోవా గురించి తెలుసుకోవడం అవసరం. ‘మనుషులు రొట్టెవల్ల మాత్రమే కాదుగానీ యెహోవా నోటి నుండి వచ్చే ప్రతిమాట వల్లా జీవిస్తారు’ అని బైబిలు చెప్తోంది.—మత్తయి 4:4.

మన పాపాన్ని తీసివేయడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు కాబట్టి, మనం ఆయన గురించి కూడా జ్ఞానం సంపాదించుకోవాలి. ‘మరి ఎవరివల్లా రక్షణ కలగదు’ అని బైబిలు చెప్తోంది. ‘కుమారుని మీద విశ్వాసం ఉంచేవాళ్లే నిత్యజీవం కలవాళ్లు’ అని కూడా బైబిలు చెప్తోంది. (అపొస్తలుల కార్యములు 4:12; యోహాను 3:36) యేసు మీద ‘విశ్వాసం ఉంచడం’ అంటే ఏమిటి?— అంటే మనం యేసు మీద నిజంగా నమ్మకం ఉంచాలి, ఆయన లేనిదే మనం ఎప్పటికీ జీవించివుండడం సాధ్యం కాదని తెలుసుకోవాలి. మనం అది నమ్ముతున్నామా?— మనం నమ్మితే, మన గొప్ప బోధకుని నుండి ప్రతిరోజూ నేర్చుకుంటూ ఆయన చెప్పినవి చేస్తాం.

గొప్ప బోధకుని దగ్గర నేర్చుకోవడానికి ఒక పద్ధతి ఏమిటంటే, ఈ పుస్తకాన్ని మళ్లీ మళ్లీ చదవాలి, దీనిలోవున్న చిత్రాలన్నీ చూసి వాటి గురించి ఆలోచించాలి. ఈ చిత్రాల పక్కనున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించండి. ఈ పుస్తకాన్ని మీ అమ్మతోగానీ, మీ నాన్నతోగానీ కలిసి చదవండి. మీ అమ్మానాన్నలు మీ దగ్గర లేకపోతే వేరే పెద్దవాళ్లతో కలిసి చదవండి. వేరే పిల్లలతో కూడా కలిసి చదవండి. దేవుని క్రొత్త లోకంలో ఎప్పటికీ జీవించి ఉండాలంటే ఏంచేయాలో, మన గొప్ప బోధకుని నుండి నేర్చుకోవడానికి వేరేవాళ్లకు సహాయం చేయడం చాలా బాగుంటుంది, అవునా?—

‘లోకం గతించిపోతుంది’ అని బైబిలు చెప్తోంది. అయితే, దేవుని క్రొత్త లోకంలో ఎప్పటికీ జీవించి ఉండాలంటే మనం ఏంచేయాలో బైబిలు వివరిస్తోంది. అది, ‘దేవుని చిత్తం చేసేవాళ్లు నిరంతరం నిలుస్తారు’ అని చెప్తోంది. (1 యోహాను 2:17) కాబట్టి, దేవుని క్రొత్త లోకంలో ఎప్పటికీ జీవించి ఉండాలంటే మనం ఏంచేయాలి?— సరిగ్గా చెప్పారు, యెహోవా గురించి, ఆయన ప్రియ కుమారుడైన యేసు గురించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అంతేకాదు, మనం నేర్చుకున్న వాటిని పాటించాలి. అలా చేయడానికి మీకు ఈ పుస్తకం సహాయం చేస్తుందని ఆశిస్తున్నాం.

జంతువులన్నీ కలిసిమెలిసి జీవిస్తాయని యెషయా 11:6-9; 65:25 వచనాల్లో చదువుతాం. ఈ చిత్రంవైపు చూడండి. ఇక్కడ గొర్రెపిల్ల, మేకపిల్ల, చిరుతపులి, దూడ, పెద్ద సింహం ఉన్నాయి. వాటితోపాటు పిల్లలు కూడా ఉన్నారు. బైబిలు చెప్తున్న వేరే ఏ జంతువులు ఇక్కడ ఉన్నాయి?— నాగుపాముతో ఆడుకుంటున్న బాబును చూడండి! క్రొత్త లోకంలో భయమనేదే ఉండదు. (హోషేయ 2:18) దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు?—

చూశారా, అన్నిజాతుల ప్రజలు కలిసిమెలిసి ఉన్నారు. వాళ్లందరూ ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగివున్నారు. తన అనుచరులు అలాగే ఉంటారని యేసు చెప్పాడు. (యోహాను 13:34, 35) యుద్ధాల్లో వాడే ఆయుధాలను, భూమిని సేద్యం చేయడానికి ఉపయోగపడే పనిముట్లుగా చేస్తున్నారు. దేవుని క్రొత్త లోకంలో చక్కని శాంతిభద్రతలు ఉంటాయనీ బైబిలు చెప్తోంది. ఈ విషయాల గురించి, కీర్తన 72:7; యెషయా 2:4; 32:16-18; యెహెజ్కేలు 34:25 వంటి వచనాల్లో చదువవచ్చు.

ఈ చిత్రంలో ఉన్నవాళ్లను చూడండి. వాళ్లు భూమిని సాగు చేసి, దాన్ని అందంగా తయారుచేస్తున్నారు. చూడండి వాళ్లు చక్కని ఇల్లు కడుతున్నారు. అక్కడ ఎంత మంచి మంచి పళ్లు, కూరగాయలు ఉన్నాయో చూడండి. భూమి ఏదెను తోటలా అందంగా తయారైంది. ఈ అద్భుతమైన విషయాల గురించి, కీర్తన 67:6; 72:16; యెషయా 25:6; 65:21-24; యెహెజ్కేలు 36:35 వచనాల్లో చదువుతాం.

ఇక్కడ చూశారా అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారు. వాళ్లు లేడిపిల్లల్లా గంతులు వేస్తున్నారు. ఎవ్వరూ కుంటివాళ్లలా, గుడ్డివాళ్లలా, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లలా లేరు. చూశారా, చనిపోయి తిరిగి లేచినవాళ్లు ఇక్కడ ఉన్నారు! ఈ విషయాల గురించి, యెషయా 25:8; 33:24; 35:5, 6; అపొస్తలుల కార్యములు 24:14, 15; ప్రకటన 21:3, 4 వచనాల్లో ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి