కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lr అధ్యా. 16 పేజీలు 87-91
  • నిజంగా ముఖ్యమైనది ఏమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిజంగా ముఖ్యమైనది ఏమిటి?
  • గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు ‘దేవునియెడల ధనవంతులై’ ఉన్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • డబ్బు అన్ని రకాల చెడుకు కారణమా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ధనవంతుడు మరియు లాజరు
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • యేసు మరియు ధనవంతుడైన ఒక యువ అధికారి
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
మరిన్ని
గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
lr అధ్యా. 16 పేజీలు 87-91

16వ అధ్యాయం

నిజంగా ముఖ్యమైనది ఏమిటి?

[87వ పేజీలోని చిత్రం]

ఇతని సమస్య ఏమిటి?

ఒకరోజు యేసును కలవడానికి ఒకతను వచ్చాడు. అతనికి యేసు చాలా తెలివైనవాడని తెలుసు. అందుకే అతను యేసుతో, ‘బోధకుడా, నా సహోదరుని దగ్గర ఉన్నవాటిలో కొన్ని నాకు ఇవ్వమని అతనితో చెప్పు’ అన్నాడు. అతను, తన సహోదరుని దగ్గర ఉన్నవాటిలో కొన్ని తనకు కావాలనుకున్నాడు.

మీరే యేసు అయ్యుంటే ఏమి చెప్పివుండేవాళ్లు?— ఆ వచ్చిన మనిషికి సమస్య ఉందని యేసుకు అర్థమైంది. కానీ ఆ సమస్య, అతని సహోదరుని దగ్గర ఉన్నవి తనకు కావాలని అనుకోవడం కాదు. అసలు అతని సమస్య ఏమిటంటే జీవితంలో నిజంగా ముఖ్యమైనది ఏమిటో అతనికి తెలీదు.

ఒకసారి దీని గురించి ఆలోచించండి. మనకు అన్నిటికన్నా ఏది ముఖ్యమైనదిగా ఉండాలి? మంచి బొమ్మలు, కొత్త బట్టలు లాంటివి ఉండడమే ముఖ్యమైనదా?— కాదు, వాటికన్నా ఎంతో ముఖ్యమైనది మరొకటి ఉంది. అదే యేసు నేర్పించాలని అనుకున్నాడు. అందుకే, ఆయన దేవుణ్ణి మర్చిపోయిన ఒక మనిషి కథ చెప్పాడు. మీకు ఆ కథ వినాలని ఉందా?—

ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు ఎన్నో భూములు ఉండేవి. ఎన్నో కొట్లు ఉండేవి, అంటే పండించింది దాచుకునే పెద్ద పెద్ద గదులు ఉండేవి. ఆయన భూముల్లో పంటలు చాలా బాగా పండాయి. పండిన దానంతటిని దాచిపెట్టడానికి ఆయన కొట్లలో స్థలం సరిపోలేదు. మరి అప్పుడు ఆయన ఏమి చేశాడు? ఆయన మనసులో ఇలా అనుకున్నాడు, ‘నా కొట్లు పడగొట్టి ఇంతకన్నా పెద్ద కొట్లు కట్టిస్తాను. ఆ కొత్త కొట్లలో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని దాచిపెడతాను.’

అలా చేయడం చాలా తెలివైనపని అని ఆ ధనవంతుడు అనుకున్నాడు. తను ఎంతో తెలివిగా ముందే చాలా దాచిపెట్టుకున్నానని అనుకున్నాడు. ఆయన తనలో తాను మాట్లాడుకుంటూ, ‘నేను చాలా సంపాదించి దాచిపెట్టుకున్నాను. అవి ఎన్నో సంవత్సరాల వరకు నాకు సరిపోతాయి. ఇప్పుడు నేనిక దేని గురించి ఆలోచించాల్సిన పనిలేదు. నేను తింటూ, తాగుతూ, సుఖంగా ఉంటాను’ అనుకున్నాడు. కానీ ఆ ధనవంతుడు తప్పుగా ఆలోచించాడు. ఆయన ఆలోచన ఎందుకు తప్పో మీకు తెలుసా?— ఆయన తన గురించి, తన సుఖం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఆయన దేవుణ్ణి మర్చిపోయాడు.

[88వ పేజీలోని చిత్రం]

ఈ ధనవంతుడు దేని గురించి ఆలోచిస్తున్నాడు?

అప్పుడు దేవుడు ఆ ధనవంతునితో మాట్లాడాడు. ‘వెర్రివాడా, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావు. అప్పుడు నువ్వు దాచిపెట్టినదంతా ఎవరికి వెళ్తుంది?’ అని దేవుడు ఆయనను అడిగాడు. ఆ ధనవంతుడు తాను చనిపోయిన తర్వాత అవన్నీ వాడుకోగలడా?— లేదు, వాటిని ఇంకెవరో తీసుకుంటారు. ‘దేవుని విషయంలో ధనవంతులు కాకుండా, తమ కోసమే సంపద కూర్చుకునే వాళ్ల పరిస్థితి అలాగే ఉంటుంది’ అని యేసు అన్నాడు.—లూకా 12:13-21.

మీరు ఆ ధనవంతునిలా ఉండాలని అనుకోరు, అవునా?— ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం గురించే ఆయన ఎక్కువగా ఆలోచించేవాడు. అది మంచిది కాదు. ఆయన ఎప్పుడూ ఇంకాయింకా కావాలనుకునేవాడు. కానీ ఆయన ‘దేవుని దృష్టిలో ధనవంతునిగా ఉండాలి’ అనుకోలేదు.

చాలామంది ఆ ధనవంతునిలానే ఉంటారు. వాళ్లు ఎప్పుడూ ఇంకాయింకా కావాలనుకుంటారు. కానీ దానివల్ల పెద్దపెద్ద సమస్యలు వస్తాయి. ఒక విషయం ఆలోచించండి, మీ దగ్గర ఆటవస్తువులు ఉన్నాయా?— ఏమేమి ఉన్నాయి?— మీ దగ్గర లేని ఆటవస్తువు ఏదైనా మీ స్నేహితుల దగ్గర ఉందనుకోండి, అప్పుడేం చేస్తారు? మీకు కూడా అలాంటిది కొనిపెట్టమని పేచీ పెట్టవచ్చా?—

కొన్నిసార్లు ఏదైనా ఒక ఆటవస్తువు చాలా ఇష్టం అనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత దానికి ఏమవుతుంది?— అది పాతదైపోతుంది. అది విరిగిపోవచ్చు, అప్పుడు అది మీకు అస్సలు ఇష్టం ఉండదు. ఆటవస్తువుల కంటే ఎంతో విలువైనది మీ దగ్గర ఉంది. అదేమిటో మీకు తెలుసా?—

[89వ పేజీలోని చిత్రం]

ఆటవస్తువులకన్నా విలువైనది మీ దగ్గర ఏముంది?

అది మీ ప్రాణం. మీరు ప్రాణంతో ఉండడం ఎంతో ముఖ్యం, లేకపోతే మీరు ఏమీ చేయలేరు. అయితే మనం ప్రాణంతో ఉండాలంటే దేవునికి ఇష్టమైనవి చేయాలి, అవునా?— కాబట్టి మనం, దేవుణ్ణి మర్చిపోయిన ఆ వెర్రి ధనవంతునిలా ఉండకుండా చూసుకోవాలి.

ఆ ధనవంతునిలా తెలివితక్కువ పనులు చేసేది పిల్లలు మత్రమే కాదు. చాలామంది పెద్దవాళ్లు కూడా అలాగే చేస్తుంటారు. కొంతమంది ఎప్పుడూ తమకు ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ కావాలనుకుంటారు. వాళ్ల దగ్గర ఆ రోజుకు తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు ఉంటాయి. అయినా వాళ్లకు ఇంకా ఎక్కువ కావాలి. వాళ్లకు చాలా బట్టలు కావాలి. ఇంకా పెద్ద ఇళ్లు కావాలి. అవన్నీ ఉండాలంటే డబ్బులు కావాలి. కాబట్టి చాలా డబ్బు సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడి పనిచేస్తారు. ఎంత ఎక్కువ డబ్బు వస్తుంటే అంత ఎక్కువ కావాలనుకుంటారు.

కొంతమంది పెద్దవాళ్లు డబ్బు సంపాదించడంలో ఎంతగా మునిగిపోతారంటే ఇంట్లో వాళ్లతో గడపడానికి వాళ్లకు తీరిక ఉండదు. దేవుడు ఇష్టపడేవి చేయడానికి కూడా వాళ్లకు సమయం ఉండదు. వాళ్ల డబ్బు వాళ్ల ప్రాణాన్ని కాపాడుతుందా?— లేదు, కాపాడలేదు. వాళ్లు చనిపోయిన తర్వాత ఆ డబ్బు వాడుకోగలరా?— లేదు. ఎందుకంటే, చనిపోయిన వాళ్లు ఏమీ చేయలేరు.—ప్రసంగి 9:5, 10.

అంటే మన దగ్గర డబ్బు ఉండడం తప్పా?— తప్పు కాదు. డబ్బుతో మనం ఆహారం, బట్టలు కొనుక్కోవచ్చు. డబ్బు భద్రతనిస్తుందని బైబిలు చెప్తోంది. (ప్రసంగి 7:12) కానీ మనం డబ్బును ప్రేమిస్తే సమస్యల్లో పడతాం. దేవుని దృష్టిలో ధనవంతుడు కాకుండా, తన కోసం ఆస్తి కూర్చుకున్న ఆ వెర్రి ధనవంతునిలా ఉంటాం.

దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉండడం అంటే ఏమిటి?— మన జీవితాల్లో అన్నిటికన్నా ఎక్కువగా దేవునికే ప్రాముఖ్యతనివ్వాలి. కొంతమంది దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్తారు. నమ్మితే చాలు ఇంకేమీ చేయనక్కరలేదని వాళ్లు అనుకుంటారు. కానీ వాళ్లు దేవుని దృష్టిలో నిజంగా ధనవంతులేనా?— కాదు, వాళ్లు దేవుణ్ణి మర్చిపోయిన ఆ ధనవంతునిలానే ఉన్నారు.

యేసు ఎప్పుడూ పరలోకంలో ఉన్న తన తండ్రిని మర్చిపోలేదు. ఆయన ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నించలేదు. ఆయన దగ్గర ఎక్కువ వస్తువులు కూడా ఉండేవి కావు. జీవితంలో నిజంగా ముఖ్యమైనది ఏమిటో యేసుకు తెలుసు. అదేమిటో మీకు తెలుసా?— దేవుని దృష్టిలో ధనవంతలుగా ఉండడమే నిజంగా ముఖ్యమైనది.

[91వ పేజీలోని చిత్రాలు]

ఈ పాప నిజంగా ముఖ్యమైన ఏయే పనులు చేస్తోంది?

మరి, దేవుని దృష్టిలో ధనవంతలుగా ఉండాలంటే ఏం చేయాలి?— దేవునికి ఇష్టమైనవి చేస్తే ఆయన దృష్టిలో ధనవంతులుగా ఉంటాం. ‘నేనెప్పుడూ ఆయనకు ఇష్టమైన పనులే చేస్తాను’ అని యేసు అన్నాడు. (యోహాను 8:29) మనం దేవుడు చెప్పినవి చేస్తే, ఆయన మనల్ని ఇష్టపడతాడు. సరే ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని ఇష్టపడాలంటే మనం ఏమేమి చేయాలి?— అవును, బైబిలు చదువవచ్చు, క్రైస్తవ కూటాలకు వెళ్లవచ్చు, దేవునికి ప్రార్థన చేయవచ్చు, ఆయన గురించి తెలుసుకోవడానికి వేరేవాళ్లకు సహాయం చేయవచ్చు. నిజంగా ఇవన్నీ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనవి.

యేసు, యెహోవా దేవుని దృష్టిలో ధనవంతునిగా ఉన్నాడు కాబట్టే ఆయన యేసును కాపాడాడు. యేసు ఎప్పటికీ జీవించి ఉండేలా ఆయన దీవించాడు. మనం కూడా యేసులావుంటే, యెహోవా మనల్ని కూడా ప్రేమిస్తాడు, కాపాడతాడు. కాబట్టి మనం యేసులా ఉండాలి, దేవుణ్ణి మర్చిపోయిన ఆ ధనవంతునిలా ఎప్పటికీ ఉండకూడదు.

ఆస్తిపాస్తుల గురించి ఎలా ఆలోచించడం సరైనదో, సామెతలు 23:4; 28:20; 1 తిమోతి 6:6-10; హెబ్రీయులు 13:5 వచనాలు వివరిస్తున్నాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి