వెనకాలి కవరు
యెహోవా దేవుని గురించి యెషయా 40:11 ఇలా చెప్తుంది: “గొర్రెల కాపరిలా ఆయన తన మంద బాగోగులు చూసుకుంటాడు. గొర్రెపిల్లల్ని ఆయన తన బాహువుతో సమకూరుస్తాడు, వాటిని తన గుండెల మీద మోస్తాడు.” కాపరి గుండెల మీదున్న గొర్రెపిల్లను చూస్తుంటే, మీకు కూడా మీ పరలోక తండ్రికి అంతే దగ్గరగా ఉండాలని అనిపిస్తుందా? ఇంతకీ మీరు యెహోవాకు ఎలా దగ్గరవ్వవచ్చు?