మీకిదే మా ఆహ్వానం
మేము ఈ బ్రోషుర్ ద్వారా మీతో మాట్లాడడాన్ని ఆనందించాం. యెహోవాసాక్షుల గురించి అధికంగా తెలుసుకోవడం ద్వారా మీరు కూడా ఆనందించారని మేము ఆశిస్తున్నాం. మా స్థానిక రాజ్యమందిరంలో మమ్మల్ని కలవడానికి మా ఆహ్వానాన్ని దయచేసి అంగీకరించండి. మా కూటాలు ఎలా నిర్వహించబడతాయో చూడండి. క్రీస్తు రాజ్యపరిపాలనలోని పరదైసు భూమిని గురించిన సువార్తను ఇతరులతో పంచుకోవడానికి మేమెలా ప్రయత్నిస్తామో చూడండి.
“మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” ఇది దేవుడు చేసిన వాగ్దానం. (2 పేతురు 3:13) అనేక శతాబ్దాలు గడిచిపోయాయి. ఎదురుచూస్తున్న కాలం పూర్తికావస్తోంది. దాన్ని ప్రపంచ పరిస్థితులు ధృవీకరిస్తున్నాయి.
“ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది” అంటూ అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, “సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, . . . ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:24, 25) మీరు మాతో సమావేశమవ్వడం ద్వారా పౌలు సలహాను స్వీకరించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.