కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jt పేజీలు 12-14
  • వారి నమ్మకాలు ఏమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వారి నమ్మకాలు ఏమిటి?
  • యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి?
  • ఇలాంటి మరితర సమాచారం
  • వారు విశ్వసించేదేమిటి?
    ఇరవయ్యో శతాబ్దమందలి యెహోవాసాక్షులు
  • మనం బోధించడానికి ఇష్టపడే సత్యాలు
    ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
  • 1వ భాగం: క్రైస్తవ నమ్మకాలు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • మనం ప్రకటించాల్సిన సందేశం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
మరిన్ని
యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి?
jt పేజీలు 12-14

వారి నమ్మకాలు ఏమిటి?

యెహోవాసాక్షులు భూమ్యాకాశములను సృష్టించిన సర్వశక్తిగల దేవుడైన యెహోవాను నమ్ముతారు. మన చుట్టూవున్న విశ్వంలో సంక్లిష్టమైన రీతిలో రూపొందించబడిన అద్భుతాల ఉనికి, సర్వోన్నత జ్ఞానవంతుడూ శక్తిమంతుడూ అయిన సృష్టికర్త వాటన్నింటినీ సృష్టించాడని సూచిస్తున్నాయి. మనుషులు చేసిన పనులు వారి లక్షణాలను ఎలాగైతే వ్యక్తం చేస్తాయో అదేవిధంగా యెహోవా దేవుడు చేసిన పనులు కూడా ఆయన లక్షణాలను వ్యక్తం చేస్తాయి. బైబిలు “ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి” అని మనకు చెబుతోంది. అంతేకాదు పలుకకుండా లేదా మాట్లాడకుండానే, “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి.”​—⁠రోమీయులు 1:​20; కీర్తన 19:​1-4.

ప్రజలు వంటపాత్రలను లేదా టెలివిజన్లను, కంప్యూటర్లను ఒక ఉద్దేశమంటూ లేకుండా తయారుచేయరు. భూమి, దానిలోని వృక్షాలు, జంతువుల సృష్టి వాటికంటే ఎంతో అద్భుతమైనవి. లక్షల కోట్ల అణువులతో ఉన్న మానవుని శరీరాకృతి మన అవగాహనకు అందనిది​—⁠మనం దేనితో ఆలోచిస్తున్నామో ఆ మెదడైతే ఊహకందని అద్భుతం! మానవుడు కనుగొన్న అతి స్వల్పమైనవాటికి కూడా ఒక సంకల్పం ఉన్నట్లయితే, యెహోవా దేవునికి కూడా తన అసాధారణ కృతులపట్ల తప్పకుండా ఒక సంకల్పం ఉంటుంది! సామెతలు 16:4 సంకల్పం ఉందనే చెబుతోంది: “యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను.”

యెహోవా మొదటి మానవ జంటతో “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి . . . సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని” చెప్పినట్లుగా భూమిని ఒక సంకల్పంతో సృష్టించాడు. (ఆదికాండము 1:​28) వారు అవిధేయత చూపడం వల్ల, భూమినీ దానిపైనున్న మొక్కలనూ జంతువులనూ సంరక్షించే నీతిమంతమైన కుటుంబాలతో భూమిని నింపే పనిలో ఆ జంట విఫలమయ్యింది. కానీ వారి వైఫల్యం యెహోవా సంకల్పం విఫలమయ్యేలా అడ్డుకోలేదు. వేల సంవత్సరాల తర్వాత ఇలా వ్రాయబడింది: ‘దేవుడు భూమిని కలుగజేసెను . . . నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింపలేదు.’ ఆయన ‘నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను.’ భూమి నాశనం కాదుగానీ “నిరంతరం నిలుస్తుంది.” (యెషయా 45:​18; ప్రసంగి 1:⁠4, ద న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) భూమి విషయంలో యెహోవా సంకల్పం నిజమవుతుంది: ‘నా ఆలోచన నిలుచును నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదను.’​—⁠యెషయా 46:​10.

ఆ కారణంగా, భూమి నిరంతరం ఉంటుందనీ దాన్ని అందంగా నివాసయోగ్యంగా తయారుచేయాలనే యెహోవా సంకల్పానికి అనుగుణంగా ఉన్నవారు​—⁠జీవిస్తున్నవారైనా, మరణించినవారైనా​—⁠దానిపై నిరంతరం జీవిస్తారనీ యెహోవాసాక్షులు నమ్ముతారు. ఆదాము హవ్వల నుండి అపరిపూర్ణతను వారసత్వంగా పొందడం వల్ల మానవాళి అంతా పాపులయ్యారు. (రోమీయులు 5:​12) బైబిలు మనకిలా చెబుతోంది: “పాపమువలన వచ్చు జీతము మరణము.” “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు.” “పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును.” (రోమీయులు 6:​23; ప్రసంగి 9:⁠5; యెహెజ్కేలు 18:​4, 20) మరలాంటప్పుడు భూమిపై ఆశీర్వాదాలను అనుభవించేందుకు వారు మళ్ళీ ఎలా బ్రతకగలరు? కేవలం యేసుక్రీస్తు ఇచ్చిన విమోచన క్రయధన బలి ద్వారా మాత్రమే, అందుకే ఆయనిలా అన్నాడు: “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును.” ‘సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని బయటికి వచ్చెదరు.’​—⁠యోహాను 5:​28, 29; 11:​25; మత్తయి 20:​28.

ఇది ఎలా జరుగుతుంది? ఇది యేసు భూమ్మీద ఉన్నప్పుడు ప్రకటించడం ప్రారంభించిన “రాజ్యమును గూర్చిన సువార్త”లో వివరించబడింది. (మత్తయి 4:​17-23) కానీ నేడు యెహోవాసాక్షులు సువార్తను చాలా ప్రత్యేక తరహాలో ప్రకటిస్తున్నారు.

[13వ పేజీలోని చార్టు]

యెహోవాసాక్షుల నమ్మకాలు

నమ్మకం లేఖనాధారిత హేతువు

బైబిలు దేవుని వాక్యం సత్యమైనది 2 తిమో. 3:​16, 17;

2 పేతు. 1:​20, 21; యోహా. 17:⁠17

సంప్రదాయం కంటే ఎక్కువగా బైబిలే నమ్మదగినది మత్త. 15:⁠3; కొలొ. 2:⁠8

దేవుని పేరు యెహోవా కీర్త. 83:​18; యెష. 26:⁠4; 42:⁠8;

నిర్గ. 6:⁠3

క్రీస్తు దేవుని కుమారుడు దేవుని కంటే కిందిస్థాయిలో ఉన్నవాడు మత్త. 3:​17; యోహా. 8:​42;

14:28; 20:17;1 కొరిం. 11:⁠3; 15:⁠28

దేవుని సృష్టిలో క్రీస్తు మొదటివాడు కొలొ. 1:​15; ప్రక. 3:⁠14

క్రీస్తు ఒక మ్రాను మీద మరణించాడు, సిలువ మీద కాదు గల. 3:​13, 14; అపొ. 5:⁠30

క్రీస్తు మానవ జీవితం విధేయులైన మానవులకు

విమోచన క్రయధనముగా చెల్లించబడింది మత్త. 20:​28; 1 తిమో. 2:​5, 6;

1 పేతు. 2:⁠24

క్రీస్తు బలి ఒక్కటే చాలు రోమా. 6:​10; హెబ్రీ. 9:​25-28

క్రీస్తు అమర్త్యుడైన ఆత్మ వ్యక్తిగా మృతులలో నుండి లేపబడ్డాడు 1 పేతు. 3:​18; రోమా. 6:⁠8, 9;

ప్రక. 1:​17, 18

క్రీస్తు ప్రత్యక్షత అదృశ్యమైనదిగా ఉంది యోహా. 14:​18, 19; మత్త. 24:⁠3, NW;

2 కొరిం. 5:​16; కీర్త. 110:​1, 2

మనం ఇప్పుడు “అంత్యదినములలో” ఉన్నాము మత్త. 24:​3-14; 2 తిమో. 3:1-5;

లూకా 17:​26-30

క్రీస్తు తన రాజ్యాన్ని నీతియుక్తంగానూ

శాంతియుతంగానూ పరిపాలిస్తాడు యెష. 9:​6, 7; 11:​1-5; దాని. 7:​13, 14;

మత్త. 6:​9, 10

ఆ రాజ్యం భూమిపైన సంపూర్ణమైన జీవన పరిస్థితులను

తీసుకువస్తుంది కీర్త. 72:​1-4; ప్రక. 7:⁠9, 10, 13-17; 21:3, 4

భూమి ఎన్నడూ నాశనం చేయబడదు లేదా నివాసులు లేకుండా

వదిలివేయబడదు ప్రసం. 1:⁠4; యెష. 45:​18; కీర్త. 78:​69

దేవుడు హార్‌మెగిద్దోను యుద్ధంలో ప్రస్తుత విధానాన్ని

నాశనం చేస్తాడు ప్రక. 16:​14-16; జెఫ. 3:⁠8; దాని. 2:​44;

యెష. 34:⁠2; 55:​10, 11

దుష్టులు శాశ్వతంగా నాశనం చేయబడతారు మత్త. 25:​41-46; 2 థెస్స. 1:​6-10

దేవుని ఆమోదం పొందిన ప్రజలు నిత్యజీవాన్ని

పొందుతారు యోహా. 3:​16; 10:​27, 28; 17:⁠3;

మార్కు 10:​29, 30

జీవానికి వెళ్ళే మార్గం ఒక్కటే ఉంది మత్త. 7:​13, 14; ఎఫె. 4:​4, 5

ఆదాము చేసిన పాపం కారణంగా మానవునికి మరణం

సంభవిస్తోంది రోమా. 5:​12; 6:​23

మరణించిన తర్వాత శరీరాన్ని తప్పించుకొని

సజీవంగా ఉండేదేదీ లేదు ప్రసం. 9:​10; కీర్త. 6:⁠5; 146:⁠4;

యోహా. 11:​11-15

మరణం తర్వాత ఎలాంటి హింసలూ ఉండవు యోబు 14:​13; ప్రక. 20:​13, 14

మృతులకు నిరీక్షణ పునరుత్థానమే 1 కొరిం. 15:​20-22;

యోహా. 5:​28, 29; 11:​25, 26

ఆదాము కారణంగా కలిగే మరణం

ఇక ఉండదు 1 కొరిం. 15:​26, 54; ప్రక. 21:⁠4; యెష. 25:⁠8

కేవలం 1,44,000 మంది ఉన్న ఒక చిన్న మంద మాత్రమే పరలోకానికి వెళుతుంది

క్రీస్తుతోపాటు పరిపాలిస్తుంది లూకా 12:​32; ప్రక. 14:​1, 3;

1 కొరిం. 15:​40-53; ప్రక. 5:​9, 10

1,44,000 మంది దేవుని ఆత్మ కుమారులుగా

మళ్ళీ జన్మించారు 1 పేతు. 1:​22, 23; యోహా. 3:⁠3; ప్రక. 7:​3, 4

ఆధ్యాత్మిక ఇశ్రాయేలుతో క్రొత్త నిబంధన

చేయబడింది యిర్మీ. 31:​31; హెబ్రీ. 8:​10-13

క్రీస్తు సంఘం ఆయనపైనే నిర్మించబడింది ఎఫె. 2:​20; యెష. 28:​16; మత్త. 21:⁠42

ప్రార్థనలు క్రీస్తు ద్వారా కేవలం యెహోవాకు మాత్రమే

చేయాలి యోహా. 14:​6, 13, 14; 1 తిమో. 2:⁠5

ఆరాధనలో ప్రతిమలను ఉపయోగించకూడదు నిర్గ. 20:​4, 5; లేవీ. 26:⁠1;

1 కొరిం. 10:​14; కీర్త. 115:​4-8

అభిచారానికి దూరంగా ఉండాలి ద్వితీ. 18:​10-12; గల. 5:​19-21; లేవీ. 19:​31

సాతాను ఈ లోకానికి అదృశ్య పాలకుడు 1 యోహా. 5:​19; 2 కొరిం. 4:⁠4; యోహా. 12:​31

ఇతర మతాల కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండడం

ఒక క్రైస్తవుని విధి 2 కొరిం. 6:​14-18; 11:​13-15; గల. 5:⁠9; ద్వితీ. 7:​1-5

ఒక క్రైస్తవుడు ఈ లోకం నుండి

వేరుగా ఉండాలి యాకో. 4:⁠4; 1 యోహా. 2:​15; యోహా. 15:​19; 17:​16

దేవుని నియమాలకు విరుద్ధం కాని మానవ చట్టాలకు

లోబడి ఉండాలి మత్త. 22:​20, 21; 1 పేతు. 2:​12; 4:​15

రక్తాన్ని నోటి ద్వారానైనా నరాల ద్వారానైనా శరీరంలోకి తీసుకోవడం దేవుని నియమాలను ఉల్లంఘించడం అవుతుంది ఆది. 9:​3, 4; లేవీ. 17:​14; అపొ. 15:​28, 29

నైతిక విషయాల్లో బైబిలు నియమాలు పాటించాలి 1 కొరిం. 6:​9, 10; హెబ్రీ. 13:⁠4;

1 తిమో. 3:⁠2, 3; సామె. 5:​1-23

విశ్రాంతి దినాచరణ యూదులకు మాత్రమే ఇవ్వబడింది

అది మోషే ధర్మశాస్త్రంతోపాటే అంతమయ్యింది ద్వితీ. 5:​15; నిర్గ. 31:​12, 13; రోమా. 10:⁠4;

గల. 4:​9, 10; కొలొ. 2:​16, 17

పాదిరివర్గ వ్యవస్థ, ప్రత్యేక బిరుదులు సరైనవి కావు మత్త. 23:​8-12; 20:​25-27; యోబు 32:​21, 22

మానవుడు పరిణామం చెందలేదు కానీ సృష్టించబడ్డాడు యెష. 45:​12; ఆది. 1:​27; మత్త. 19:⁠4

దేవుని సేవించడంలో క్రీస్తు చూపిన మాదిరిని అనుకరించాలి 1 పేతు. 2:​21; హెబ్రీ. 10:⁠7;

యోహా. 4:​34; 6:​38

నీటిలో పూర్తిగా మునిగి తీసుకునే బాప్తిస్మం

సమర్పణను సూచిస్తుంది మార్కు 1:​9, 10; యోహా. 3:​23; అపొ. 19:​4, 5

క్రైస్తవులు లేఖనాధారిత సత్యాన్ని సంతోషంగా

బహిరంగ సాక్ష్యమిస్తారు రోమా. 10:​10; హెబ్రీ. 13:​15; యెష. 43:​10-12

[12వ పేజీలోని చిత్రం]

భూమి . . . యెహోవా చేత సృష్టించబడింది . . . మనుష్యులచే సంరక్షించబడుతుంది . . . నిరంతరం నివాసస్థలంగా ఉంటుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి