కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • rq పాఠం 13 పేజీలు 26-27
  • మీరు నిజమైన మతాన్ని ఎలా కనుగొనగలరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు నిజమైన మతాన్ని ఎలా కనుగొనగలరు?
  • దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
  • ఇలాంటి మరితర సమాచారం
  • సరైన ఆరాధనను ఎలా గుర్తుపట్టవచ్చు?
    దేవుడు చెప్తున్న మంచివార్త!
  • సరైన ఆరాధన ఏదో ఎలా తెలుసుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • దేవుడు ఆమోదించే ఆరాధన
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • మీరు సరియైన మతాన్ని కనుగొన్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
rq పాఠం 13 పేజీలు 26-27

పాఠం 13

మీరు నిజమైన మతాన్ని ఎలా కనుగొనగలరు?

మతాలన్నీ దేవునికి ప్రీతికరమైనవేనా, లేక ఒకటి మాత్రమేనా? (1)

క్రైస్తవులని చెప్పుకొనే వారిలో అనేక శాఖలు ఎందుకున్నాయి? (2)

నిజ క్రైస్తవులను మీరెలా గుర్తించవచ్చు? (3-7)

1. యేసు ఒకే నిజమైన క్రైస్తవమతాన్ని ప్రారంభించాడు. కాబట్టి నేడు యెహోవా దేవుని సత్యారాధికుల ఒకే సమూహము లేక గుంపు ఉండాలి. (యోహాను 4:23, 24; ఎఫెసీయులు 4:4, 5) జీవానికి నడిపే ఇరుకు మార్గంలో కేవలం కొద్దిమందే ఉన్నారని బైబిలు బోధిస్తుంది.—మత్తయి 7:13, 14.

2. అపొస్తలుల మరణం తర్వాత తప్పుడు బోధలు, క్రైస్తవేతర ఆచారాలు క్రమేణ క్రైస్తవ సంఘంలోకి ప్రవేశిస్తాయని బైబిలు ముందే తెలియజేసింది. క్రీస్తును అనుసరించే బదులు తమను అనుసరించేలా ఆ మనుష్యులు విశ్వాసులను తప్పుదోవ పట్టిస్తారు. (మత్తయి 7:15, 21-23; అపొస్తలుల కార్యములు 20:29, 30) అందుకే క్రైస్తవులమని చెప్పుకొనే అనేక విభిన్న శాఖలను మనం చూస్తాము. మనం నిజ క్రైస్తవులను ఎలా గుర్తించగలము?

3. నిజ క్రైస్తవులను గూర్చిన అత్యంత విశేషమైన గుర్తు ఏమిటంటే, నిజమైన ప్రేమ వారి మధ్య ఉండడమే. (యోహాను 13:34, 35) ఇతర జాతులు లేక ఇతర శరీర రంగుల ప్రజలకంటే తాము శ్రేష్ఠులమని తలంచేలా వారికి బోధింపబడలేదు. ఇతర దేశాలకు చెందిన ప్రజలను ద్వేషించమనీ వారికి బోధింపబడలేదు. (అపొస్తలుల కార్యములు 10:34, 35) కాబట్టి వారు యుద్ధాల్లో పాల్గొనరు. నిజ క్రైస్తవులు ఒకరినొకరు సహోదర సహోదరీల వలె చూసుకుంటారు.—1 యోహాను 4:20, 21.

4. నిజమైన మతంయొక్క మరో గుర్తు ఏమిటంటే, దాని సభ్యులకు బైబిలు ఎడల ప్రగాఢమైన గౌరవం ఉండడమే. వారు దాన్ని దేవుని వాక్యమని అంగీకరించి, అది చెప్పేదాన్ని నమ్ముతారు. (యోహాను 17:17; 2 తిమోతి 3:16, 17) వారు మానవ ఉద్దేశాలు లేక ఆచారాల కంటే దేవుని వాక్యాన్ని ఎక్కువ ప్రాముఖ్యమైనదిగా పరిగణిస్తారు. (మత్తయి 15:1-3, 7-9) వారు అనుదినం బైబిలు అనుసారంగా జీవించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వారు ఒకటి చెప్పి, మరొకటి చేయరు.—తీతు 1:15, 16.

5. నిజమైన మతం దేవుని నామాన్ని గౌరవించాలి కూడా. (మత్తయి 6:9) యెహోవా అనే దేవుని పేరును యేసు ఇతరులకు తెలియజేశాడు. నిజ క్రైస్తవులు అలాగే చేయాలి. (యోహాను 17:6, 26; రోమీయులు 10:13, 14) మీ ప్రాంతంలో ఉన్న ఎవరు దేవుని పేరు గురించి ఇతరులకు చెబుతున్నారు?

6. నిజ క్రైస్తవులు దేవుని రాజ్యం గురించి ప్రకటించాలి. యేసు అలాగే చేశాడు. ఆయన ఎల్లప్పుడూ ఆ రాజ్యం గురించి మాట్లాడాడు. (లూకా 8:1) ఇదే వర్తమానాన్ని భూవ్యాప్తంగా ప్రకటించమని ఆయన తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. (మత్తయి 24:14; 28:19, 20) కేవలం దేవుని రాజ్యమే ఈ భూమిపైకి నిజమైన శాంతి భద్రతలను తెస్తుందని నిజ క్రైస్తవులు నమ్ముతారు.—కీర్తన 146:3-5.

7. యేసు శిష్యులు ఈ దుష్ట లోకంలో భాగమై ఉండకూడదు. (యోహాను 17:16) వారు ప్రపంచ రాజకీయ, సామాజిక వివాదాల్లో జోక్యం చేసుకోరు. ప్రపంచంలో సర్వసాధారణమైయున్న హానికరమైన ప్రవర్తనను, అలవాట్లను, దృక్పథాలను వారు విసర్జిస్తారు. (యాకోబు 1:27; 4:4) నిజ క్రైస్తవత్వపు ఈ గుర్తులున్న ఒక మత గుంపును మీరు మీ ప్రాంతంలో గుర్తించగలరా?

[27వ పేజీలోని చిత్రం]

నిజ క్రైస్తవులు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, బైబిలును గౌరవిస్తారు, మరియు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి