కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • dg భాగం 1 పేజీలు 2-3
  • దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
  • దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఏం చెప్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • ఏ బాధలేని లోకం
    దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
  • బాధ ఇక ఎంతమాత్రం ఉండనప్పుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
dg భాగం 1 పేజీలు 2-3

భాగం 1

దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?

1, 2. దేవుని గూర్చి ప్రజలు ఏమని ప్రశ్నిస్తారు, ఎందుకు?

నీ జీవితములో ఎప్పుడో ఒకప్పుడు నీవిలా అడిగియుండవచ్చు: ‘మన యెడల నిజంగా శ్రద్ధగల దేవుడొకడున్నట్లయితే, ఆయన ఎందుకింతటి బాధను అనుమతిస్తాడు?’ మనమంతా బాధను అనుభవించాము లేదా బాధను అనుభవిస్తున్న ఎవరినైనా మనమెరిగి యుండవచ్చును.

2 నిజమే, చరిత్రంతటిలో ప్రజలు యుద్ధం, క్రూరత్వం, నేరం, అన్యాయం, పేదరికం, రోగం మరియు వారి ప్రియుల మరణం మూలంగా కల్గిన బాధను, హృదయవేదనను అనుభవించారు. మన 20 వ శతాబ్దములోనే, యుద్ధాలు 10కోట్ల కంటె ఎక్కువ మందిని హతమార్చాయి. కోట్లాదిమంది యితరులు గాయపర్చబడ్డారు లేక తమ గృహాలను, ఆస్తిపాస్తులను కోల్పోయారు. మన కాలంలో యింకా అనేక భయంకరమైన సంఘటనలు సంభవించాయి. అందుమూలంగా అసంఖ్యాకులైన ప్రజలకు గొప్ప దుఃఖం, విస్తారమైన కన్నీళ్లు, నిరాశ నిస్పృహలు కలిగాయి.

3, 4. దేవుడు బాధను అనుమతించినందుకు అనేకులు ఎట్లు భావిస్తున్నారు?

3 కొందరు కోపోద్రేకులై ఒకవేళ దేవుడే ఉంటే, నిజంగా అతనికి మనయెడల శ్రద్ధ లేదని భావిస్తారు. దృష్టాంతానికి, మొదటి ప్రపంచ యుద్ధంలో జాతివివక్షతా హింస మూలంగా తన కుటుంబాన్ని, స్నేహితులను పోగొట్టుకొని మానసిక క్షోభను అనుభవించిన ఒక వ్యక్తి యిలా అడిగాడు: “మాకు అవసరమైనప్పుడు దేవుడెక్కడ ఉండెనో మరి?” రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలు లక్షలాదిమందిని హత్యచేసినప్పుడు తప్పించుకొనిన మరోవ్యక్తి తాను చవిచూచిన బాధను బట్టి ఎంతగానో ప్రలాపించి యిట్లన్నాడు: “నీవు నా గుండెను తాకగల్గితే, అది నిన్ను విషమయం చేస్తుంది.”

4 ఆవిధంగా, మంచి దేవుడు, చెడు సంగతులు సంభవించడానికి ఎందుకు అనుమతిస్తున్నాడో అనేకులు అర్థం చేసుకోలేక పోతున్నారు. ఆయన మన విషయమై నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా, అసలు ఆయన ఉన్నాడా అని వారు ప్రశ్నిస్తుంటారు. మానవుని జీవితంలో బాధ అనేది ఎల్లవేళల ఉండేదేనని వారిలో అనేకులు తలస్తుంటారు. ప్రత్యేకముగా సూచించబడని లేఖనములు, బైబిల్‌ సొసైటి ఆఫ్‌ ఇండియా బెంగుళూరు వారి తెలుగు బైబిలు నుండి వ్రాయబడినవి.

[2, 3 వ పేజీలోని చిత్రాలు]

ఏ బాధ లేని నూతన లోకం సమీపంగా ఉందా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి