దేవుని చిత్తాన్ని చేయుటలో ఏకమైయున్నారు
యెహోవాసాక్షుల పరిచర్య, కూటములు, మరియు సంస్థను గూర్చి యీ బ్రోషూర్ నందివ్వబడిన సమాచారం పాఠకుడవైన నీవు దేవుని ఆరాధించుటలో వారితో ఎక్కువ సహవాసం కల్గియుండుటకై నిన్ను ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాము. నీవు స్వయంగా యెహోవాసాక్షుల సంఘంతో సహవసిస్తూ, వారి సమావేశాలకు హాజరవుతూ సాక్షులను గూర్చి నీవే స్వయంగా తెలిసికోవాలని మేము నిన్నాహ్వానిస్తున్నాం. ఇలా చేస్తే ఇప్పుడు నీవు దేవుని చిత్తాన్ని గ్రహించుటకెంతో బాగుగా దోహదపడుతుంది.—తీతు 2:11-14.
నీ జీవితాన్ని బైబిలు నందలి సత్క్రియలకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటే, యెహోవాసాక్షుల కార్యక్రమాలలో భాగం వహించే ఆధిక్యత కూడ నీకు లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగావున్న సహోదరుల ఆప్యాయతతో కూడిన సహవాసాన్ని అనుభవించుటయేగాక, ప్రస్తుత విధానాన్ని తప్పించుకొని నీతి సమాధానములుండబోవు నూతన విధానం లోనికి ప్రవేశించే నిరీక్షణ నీవు కల్గియుండగలవు.—2 పేతురు 3:13.
[30, 31వ పేజీలోని చిత్రం]
యెహోవాసాక్షులు ఐక్యంగాకూడి 200 కంటె ఎక్కువ దేశాల్లో దేవుని చిత్తాన్ని చేస్తున్నట్లు చూపబడుచున్న 18 దేశాల దృశ్యాలు
నైజీరియా
ఆస్ట్రియా
బ్రెజిల్
జపాన్
కెనడా
గ్వాటిమాల
అర్జెంటీనా
జర్మనీ
తైవాన్
ఫిన్లాండ్
దక్షిణాఫ్రికా
ఇండియా
అమెరికా
ఫిజీ
చిలీ
ఇటలీ
బొలీవియా
ఫిలిప్పీన్స్
[32వ పేజీలోని చిత్రం]
“ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును.”—మత్తయి 24:14.