పరిచయం
భగ్గుమంటున్న ధరలు మిమ్మల్ని బెంబేలెత్తిస్తున్నాయా? రోజంతా రెక్కలు-ముక్కలు చేసుకుంటే గానీ మీకు ఇల్లు గడవట్లేదా? మీ ఇంట్లోవాళ్లతో నాలుగు మాటలు మాట్లాడాలన్నా తీరిక ఉండట్లేదా? అలాగైతే, ఈ తేజరిల్లు! పత్రిక మీ కోసమే. మీ టెన్షన్స్‌ని తగ్గించుకోవడానికి, సంతోషాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడే సలహాలు ఇందులో ఉన్నాయి. అలాగే, భవిష్యత్తు బాగుంటుందనే ఆశను ఈ పత్రిక మీలో నింపుతుంది. ఇప్పుడున్న కష్టాల మధ్య కూడా ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది.