పరిచయం
భూమి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవడానికి మనం సైంటిస్ట్‌లు అయ్యుండాల్సిన అవసరంలేదు. తాగునీరు, సముద్రాలు, అడవులు, గాలి ఇలా అన్నీ పాడైపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూమి పూర్తిగా నాశనమైపోతుందా? ఈ సందేహం రావడంలో ఆశ్చర్యంలేదు. కానీ అలా జరగదు అనడానికి సరైన కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.