కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g16 No. 1 పేజీ 16
  • దెబ్బలు ఎలా తగ్గుతాయి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దెబ్బలు ఎలా తగ్గుతాయి?
  • తేజరిల్లు!—2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • హృద్రోగం ప్రాణానికి ముప్పు
    తేజరిల్లు!—1997
  • మెక్సికో నందు విపత్తుల మధ్య క్రైస్తవ ప్రేమ
    తేజరిల్లు!—1996
  • దేవుని ప్రేమ వల్ల మీరు ప్రయోజనం పొందవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2018
  • యుద్ధ గాయాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
తేజరిల్లు!—2016
g16 No. 1 పేజీ 16
రక్త కణాలను గీసిన చిత్రం

సృష్టిలో అద్భుతాలు

దెబ్బలు ఎలా తగ్గుతాయి?

చేతికి వేసిన బ్యాండేజ్‌

మనం జీవించడానికి అవసరమైన ఎన్నో పనులు మన శరీరంలో జరుగుతుంటాయి. వాటిలో దెబ్బలు తగ్గిపోయి, పాడైన కణజాలాలు లేదా చర్మం మళ్లీ కొత్తగా రావడం ఒకటి. దెబ్బ తగిలిన వెంటనే దెబ్బను తగ్గించే పని శరీరంలో మొదలవుతుంది.

ఆలోచించండి: దెబ్బలు తగ్గేటప్పుడు మన జీవ కణాల్లో వరుసగా చాలా పనులు జరుగుతాయి:

  • దెబ్బ చుట్టూ ఉన్న కణజాలానికి (టిష్యూకి) ప్లేట్‌లెట్‌లు అతుక్కుని రక్తం గడ్డ కట్టేలా చేసి పాడైన రక్త కణాలను అతికిస్తాయి.

  • వాపు వల్ల ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఉంటుంది. దెబ్బ తగిలినప్పుడు అనవసర పదార్థాలు ఏర్పడితే అవి కూడా వాపు వల్ల పోతాయి.

  • కొన్ని రోజుల్లోనే దెబ్బ తగిలిన కణజాలాల స్థానంలో మన శరీరం కొత్త కణజాలాలు వచ్చేలా చేస్తుంది. ఇంకా దెబ్బని తగ్గించి, పాడైన రక్త కణాలను బాగుచేస్తుంది.

  • చివరగా, తంతు కణజాలం (స్కార్‌ టిష్యూ) దెబ్బ తగిలిన చోట మళ్లీ చర్మం వచ్చేలా చేసి ఆ ప్రాంతాన్ని గట్టి పడేలా చేస్తుంది.

ఇలా రక్తం గడ్డ కట్టడాన్ని చూసి పరిశోధకులు కొత్త రకమైన ప్లాస్టిక్‌ పదార్థాలను తయారు చేస్తున్నారు. అవి ఎక్కడైనా పాడైతే వాటంతట అవే మళ్లీ బాగైపోతాయి. ఈ ప్లాస్టిక్‌ పదార్థాల్లో పక్కపక్కన వెళ్లే రెండు చిన్న ట్యూబులు ఉంటాయి. ఈ ట్యూబుల్లో రెండు కెమికల్‌ పదార్థాలు ఉంటాయి. అవి ఆ ప్లాస్టిక్‌ పదార్థం పాడైనప్పుడు ట్యూబుల్లో నుండి బయటకు వస్తాయి. అవి కలిసినప్పుడు ఒక రకమైన జెల్‌ తయారౌతుంది. ఈ జెల్‌ పాడైన ఆ ప్రాంతమంతా వ్యాపించి చిల్లులను, పగుళ్లను మూసేస్తుంది. తర్వాత ఆ జెల్‌ గట్టిపడి ప్లాస్టిక్‌ పదార్థానికున్న బలం తిరిగి వస్తుంది. ఇలాంటి ప్రయత్నాలన్నీ సహజంగా ఉన్న వాటిని “చూసే” చేస్తున్నారని ఒక పరిశోధకుడు ఒప్పుకుంటున్నాడు.

మీరేమంటారు? దెబ్బలు తగ్గిపోయే శక్తి మన శరీరానికి దానికదే వచ్చిందా? లేదా ఎవరైనా అలా చేశారా? ◼ (g15-E 12)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి