కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g03 4/8 పేజీ 32
  • అది గాలికి కొట్టుకొచ్చింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అది గాలికి కొట్టుకొచ్చింది
  • తేజరిల్లు!—2003
తేజరిల్లు!—2003
g03 4/8 పేజీ 32

అది గాలికి కొట్టుకొచ్చింది

ఒక వ్యక్తి భారతదేశంలోని ముంబయి వీధుల్లో నడుస్తుండగా, దుమ్ముతోపాటు ఒక ముద్రిత కాగితం గాలికి కొట్టుకువచ్చి ఆయన పాదాల దగ్గర పడింది. అది “నూతన సహస్రాబ్ది​—⁠అది మీకు ఎలాంటి భవిష్యత్తును తీసుకువస్తుంది?” అనే పేరుగల రాజ్యవార్త నెం. 36. ఆ విషయం ఆయనను ఆకట్టుకుంది. ఆయన వెంటనే దాన్ని తీసుకుని మొత్తమంతా చదివేశాడు. ఆయనలో ఆసక్తి అధికమయ్యింది, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే కోరికతో ఆయన బైబిలు, ఇతర ప్రచురణలు కావాలని కోరాడు.

యెహోవాసాక్షులు ప్రచురించిన ఈ కరపత్రంలో విశ్వాసాన్ని బలపరిచే తలంపులున్నాయి. అనారోగ్యం, పేదరికం, యుద్ధం వంటివాటితో సహా మనం ఎదుర్కొంటున్న సమస్యలకు, “ప్రజల మనస్సుల్లో పాతుకుపోయి ఉన్న దురాశ, స్వార్థము, వారి మధ్య ఉన్న అపనమ్మకాలే మూలకారణం. ఈ దుర్లక్షణాల్ని కూకటివేళ్లతో పెకిలించాలంటే అందుకు శాస్త్రవిజ్ఞానమూ, సాంకేతిక పరిజ్ఞానమూ, మానవ రాజకీయ ప్రయత్నాలూ సరిపోవు” అని అది స్పష్టంగా వివరిస్తోంది. సమీప భవిష్యత్తులో దేవుడు ఈ భూమ్మీది నుండి సమస్త దుష్టత్వాన్ని నిర్మూలిస్తాడని కూడా ఆ కరపత్రం చూపిస్తోంది.

భవిష్యత్తు కోసం బైబిలు చేస్తున్న వాగ్దానాల గురించి మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నారా? దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషుర్‌తో సహా బైబిలు ఆధారిత ప్రచురణలను ఉపయోగిస్తూ యెహోవాసాక్షులు లక్షలాది గృహాల్లో బైబిలును బోధిస్తున్నారు. దేవుడెవరు? భూమి ఎడల దేవుని సంకల్పమేమిటి? దేవుని రాజ్యమంటే ఏమిటి? బైబిలు మీ కుటుంబ జీవితాన్ని ఎలా మెరుగుపరచగలదు? వంటి ప్రశ్నలకు ఆ బ్రోషుర్‌ సమాధానమిస్తుంది.

సమీప భవిష్యత్తులో దేవుడేమి చేస్తాడో తెలుసుకోవడానికి మీకు సహాయం చేసేందుకు యెహోవాసాక్షులు మీ ఇంటికి రావాలని మీరు కోరితే వారు సంతోషంగా వచ్చి సహాయం చేస్తారు, దేవుని రాజ్యం గురించి మరింత సమాచారాన్ని అందజేస్తారు. వారలా సహాయం చేయాలంటే దయచేసి ఈ క్రింద ఇవ్వబడిన కూపన్‌ను నింపి 5వ పేజీలోవున్న సముచితమైన చిరునామాకు పంపండి. (g03 1/22)

□ దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషుర్‌ గురించి నాకు మరింత సమాచారం పంపించండి.

□ ఉచిత గృహ బైబిలు అధ్యయనం గురించి దయచేసి నన్ను సంప్రదించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి