లక్షలాదిమంది వెళ్తున్నారు మీరూ వెళ్తారా?
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎనభై లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు యెహోవాసాక్షుల వార్షిక జిల్లా సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సంవత్సరం ఇండియాలో 27 చోట్ల “దేవుని ప్రవచన వాక్యము” అనే జిల్లాసమావేశాన్ని నిర్వహించడానికి ప్రణాళిక వేయడం జరిగింది. బహుశా, మీరు నివసిస్తున్న ప్రాంతానికి దగ్గర్లో ఒక సమావేశం జరుగవచ్చు. శుక్రవారం ఉదయం 9:30కు, సంగీతంతో ప్రారంభమయ్యే ఆ కార్యక్రమానికి హాజరుకమ్మని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.
ఉదయకాల కార్యక్రమంలో, ఆహ్వాన ప్రసంగమూ అలాగే “దేవుని ప్రవచన వ్యాక్యానికి అవధానాన్ని ఇవ్వండి” అనే ముఖ్యాంశ ప్రసంగమూ ఉంటాయి. మధ్యాహ్న కార్యక్రమంలో, “దేవుని వాక్యాన్ని చదవడంలో ఆనందించండి” అనే గోష్ఠి, బైబిలును చదవడాన్ని ప్రయోజనకరమైనదిగానూ, ఆహ్లాదకరమైనదిగానూ చేసుకోవడం ఎలాగనే దానిపై ఆచరణాత్మక సలహాలను అందిస్తుంది. “దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోరాడేవారు విజయాన్ని పొందలేరు” అన్నది ఆ రోజు ముగింపు ప్రసంగం. అది, ఆధునిక కాలాల్లో దేవుని రాజ్య ప్రచారకులపై జరుగుతున్న దాడిని పునఃసమీక్షిస్తుంది.
శనివారం ఉదయకాల కార్యక్రమంలో, బాప్తిస్మాన్ని గూర్చిన ఒక చర్చా, బాప్తిస్మం తీసుకోవడానికి యోగ్యులైన వ్యక్తులకు బాప్తిస్మం తీసుకొనే అవకాశాన్నివ్వడమూ జరుగుతాయి. మధ్యాహ్న కార్యక్రమంలోని, “‘కోరదగిన వస్తువుల’తో యెహోవా మందిరం నింపబడుతోంది.” అనే ఒక భాగంలో, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, తూర్పు ఐరోపాలలోని కొన్ని దేశాల్లో, అలాగే పెద్ద ఆసియా దేశమైన కాఝాఖస్తాన్లో బైబిలు సత్యానికి ప్రజలు చూపించిన అద్భుతమైన ప్రతిస్పందనను గూర్చిన ప్రోత్సాహకరమైన నివేదికలు సమర్పించబడతాయి. “ప్రవచన లేఖనాలు, మెలకువగా ఉండేలా మనలను అప్రమత్తులను చేస్తున్నాయి,” “అంత్యకాలాల్లో ప్రవచన వాక్యము” అనే రెండు ప్రసంగాలతో శనివారం కార్యక్రమం ముగుస్తుంది. చివరి ప్రసంగం, బైబిలు పుస్తకమైన దానియేలుపై కేంద్రీకరించి, దానిలోని ప్రవచనాలపై అవధానాన్ని నిలపవలసినదానికి గల కారణాలను అందిస్తుంది.
ఆదివారం ఉదయాన ఒక గంటపాటు “నియమిత కాలం కొరకైన ప్రవచన మాటలు” అన్న మూడు భాగాల గోష్ఠి, హబక్కూకు ప్రవచనాన్ని చర్చిస్తుంది. నేటి క్రైస్తవులకు ఆ చిన్న బైబిలు పుస్తకం ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో మీరు చూడగల్గుతారు. యాకోబు, ఏశావుల బైబిలు వృత్తాంతాన్ని చూపే, ఆ కాలంలోనివారు ధరించినటువంటి వస్త్రాలను వేసుకుని చేసే ఒక నాటకం, “మన ఆధ్యాత్మిక వారసత్వం పట్ల మెప్పుదల కనబరచడం” అన్న అంశాన్ని ఉన్నతపరుస్తుంది. ఆదివారం ఉదయ కార్యక్రమం, “మన అమూల్యమైన వారసత్వం మీకు ఎలాంటి భావాన్ని ఇస్తుంది?” అనే ప్రేరణాత్మకమైన ప్రసంగంతో ముగుస్తుంది. తర్వాత మధ్యాహ్నం, “ముందుగా చెప్పబడినట్లుగా—సమస్తమును నూతనమైనవిగా చేయడం” అనే బహిరంగ ప్రసంగాన్ని మీరు ఆస్వాదిస్తారు.
హాజరయ్యేందుకు ఇప్పుడే పథకాలు వేసుకోండి. ఈ సమావేశం, మీకు దగ్గర్లో ఎక్కడ జరుగుతుందో తెలుసుకునేందుకు స్థానిక యెహోవాసాక్షుల రాజ్యమందిరాన్ని సంప్రదించండి, లేక ఈ పత్రిక ప్రకాశకులకు వ్రాసి తెలుసుకోండి.