“తేజరిల్లు! సంపూర్ణ సమాచారాన్ని కల్గివుంది”
ఆఫ్రికాలోని నైజీరియా దేశంలోని బెనిన్ నగరం నుండి 16 సంవత్సరాల ముస్లిం యౌవనుడు పై విధంగా వ్యాఖ్యానించాడు. ఆయన యెహోవాసాక్షుల నైజీరియా బ్రాంచి ఆఫీసుకు వ్రాసిన ఒక ఉత్తరంలో ఇలా వివరించాడు:
నా స్నేహితుడి ఇంట్లో తేజరిల్లు! చూశాను, తర్వాత తొమ్మిది సంచికలను తీసుకున్నాను. నేను వాటినన్నిటిని మొదటిపేజీ నుండి చివరిపేజీ వరకు ఒక్కరోజులోనే చదివేశాను! తేజరిల్లు! వెనుకనున్నవారి మేధాశక్తిని—యెహోవాతోసహా—మెచ్చుకోవడానికి ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నాను. మీరు చేస్తున్నది అత్యుత్తమమైన పని! పర్యావరణ విషయాలకు, బైబిలు మరియు దేవునితోగల సంబంధాన్ని మీరు చూపిన విధానం నన్ను ప్రాముఖ్యంగా ప్రభావితం చేసింది. నైజీరియా కన్జర్వేషన్ ఫౌండేషన్లో సభ్యుడిగా నా స్వంత పర్యావరణ/ప్రకృతి గ్రంథాలయాన్ని పెంపొందించుకోవడానికి పుస్తకాలకోసం వెదుకుతున్నాను. తేజరిల్లు! సంపూర్ణ సమాచారాన్ని కల్గివుంది అని గ్రహించాను. ప్రతినెలా రెండేసి ప్రతుల చొప్పున తేజరిల్లు!ను మీ నుండి ఎలా పొందవచ్చునో దయచేసి తెలియజేయండి.”
బహుశా ఈ పత్రికను చూడక మునుపు మీరు తేజరిల్లు!ను ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. మీకు మరొక కాపీ కావాలనుకుంటే, Praharidurg Prakashan Society, plot A/35, Nr. Industrial Estate, Nangargaon, Lonavla 410 401, Mah. India అడ్రసును లేదా 5వ పేజీలోని తగిన అడ్రసును సంప్రదించండి. మీకు మరొక కాపీని పోస్టు ద్వారా పంపడానికి ఇష్టపడుతున్నాము. మనం ఏ కాలంలో జీవిస్తున్నామో గుర్తించడానికి మీ యింటికి వచ్చి సహాయం చేసేందుకు కూడా మేము ఇష్టపడతాము.
◻ తేజరిల్లు! ఇటీవలి పత్రికను పంపండి.
◻ ఉచిత గృహ బైబిలు పఠనం విషయమై దయచేసి నన్ను సంప్రదించండి
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
Globe: Courtesy of Replogle Globes, Inc.