మతాలన్నీ దేవుని వైపుకే నడిపిస్తాయా?
మతాలన్నీ కూడా ఒకే చోటికి నడిపే వేర్వేరు మార్గాలని కోట్లాదిమంది ప్రజలు విశ్వసిస్తారు. వాస్తవమేమంటే, అన్ని రకాల మత బోధలూ, ఆచారాలూ మరియు దేవతల మధ్య సమాంతరం ఉంది. ఉదాహరణకు, హిందూ పురాణ పాత్ర యొక్క ఎనిమిదవ శతాబ్దంనాటి, భారతదేశం నందలి కేరళకు చెందిన ఈ విగ్రహాన్ని చూడండి.
అనేక ప్రాచీన మతాల్లో ఎద్దులు ఆరాధించబడేవన్నది గమనించదగిన విషయం. ఉదాహరణకు, మొదటిశతాబ్దం నాటి గ్రీకు చరిత్రకారుడైన డియోడోరస్ సికులస్ చెబుతున్న విధంగా అమ్మోనీయుల దేవుడైన మోలేకుకు మానవ ఆకారం మరియు ఎద్దు తల ఉండేది.
ప్రపంచంలోని అనేక విభిన్న మతాల్లో గమనించదగిన సమాంతరాలు ఎందుకున్నాయి? ఈ మతాలన్నీ కూడా ఒకే మూలం నుండి వచ్చాయా? ఇవన్నీ కూడా వాస్తవంగా ఒకే స్థలానికి నడిపే వేర్వేరు మార్గాలా? దేవుడు వాటినన్నిటినీ అంగీకరిస్తున్నాడా?
దేవుని కొరకు మానవజాతి అన్వేషణ (ఆంగ్లం) అనే పుస్తకంలోగల ప్రపంచంలోని ముఖ్య మతాల మూలం మరియు వాటి అభివృద్ధిని గురించిన ఆసక్తికరమైన కథనం అలాంటి ప్రశ్నలకు సమాధానాలను అందిస్తుంది. మీరు ఈ పుస్తకాన్ని పొందాలనుకుంటే లేక ఈ విషయాలను గురించి బైబిలు చెబుతున్న దాన్ని ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీతో చర్చించాలని మీరు అనుకుంటే దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India, అనే చిరునామాకు లేదా 5వ పేజీలో ఉన్న మరో సముచితమైన చిరునామాకు వ్రాయండి.