ఒక విలువైన పత్రిక
తేజరిల్లు! ప్రకాశకులకు లండన్ నుండి ఒక నర్సు ఈ క్రింది వ్యాఖ్యానాలను వ్రాసింది:
“మా ఇరుగుపొరుగున క్రొత్తగా వచ్చిన జాకీతో నేను పెద్దవయస్కులతో చేసే పనిని గూర్చి ఒక రోజు మాట్లాడుతున్నాను. ‘నా దగ్గర కొన్ని పత్రికలున్నాయి, వాళ్లు వాటిని చదవడానికి ఇష్టపడవచ్చు’ అని ఆమె నాతో చెప్పింది. నేను ఆమె ఇచ్చిన పత్రికలను నేను పని చేసే చోటికి తీసుకువెళ్ళి టీపాయ్ మీద పెట్టి వెళ్ళాను. నేను తరువాత అక్కడికి వెళ్ళినప్పుడు పత్రికల్లోని పేజీలు బాగా తిరగవేయబడివుండడం గమనించాను, అంటే ప్రజలు వాటిని చదువుతున్నారన్నమాట.
“తరువాత నేను ఉద్యోగం మారి, ఒక ఆసుపత్రిలో పనిచేయనారంభించాను. నా పొరుగున ఉన్న స్త్రీ ఇచ్చిన పత్రికలను కొన్నింటిని తీసుకువెళ్ళి వెయిటింగ్ రూమ్‌లో వేశాను. అవి చదవబడి ఉండడాన్ని మరొకసారి చూశాను. ఒకరోజు ఉదయం, నేను పెద్ద వయస్కురాలైన ఒక స్త్రీ చెయ్యిపట్టుకుని చూస్తుండగా, “మీ వెయిటింగ్ రూమ్ నుండి ఈ పత్రికను తీసుకున్నానండీ. తీసుకోవచ్చనే అనుకుంటున్నానండీ. ఇందులో ఒక మంచి శీర్షిక ఉందండీ, నేను నా కుమారునికి చూపించాలని అనుకుంటున్నానండీ’ అని ఆమె భర్త అన్నాడు.
“ఆ పత్రికలు నాకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. నేను నర్సింగ్‌లో ఇప్పటికీ తర్ఫీదు పొందుతున్నాను కనుక, నేను రిసర్చ్ పేపర్లకు ఈ శీర్షికల్లోని సమాచారాన్ని ఉపయోగిస్తున్నాను. మా టీచర్ల దగ్గర నుండి మంచి ప్రతిస్పందన వస్తోంది.
“నా పొరుగున ఉండే జాకీ యెహోవాసాక్షుల్లో ఒకరు, నేను మాట్లాడుతున్నది తేజరిల్లు! పత్రికను గురించే. ఈ పత్రికలో నేను చదివిన సమాచారం నా గురించి, మానవజాతి కొరకైన భవిష్యత్తును గురించి మరెక్కువగా తెలుసుకోవడానికి నాకు సహాయపడింది.”
తేజరిల్లు! పత్రిక యొక్క భావి ప్రతులు కావాలని మీరు కోరుకుంటున్నట్లయితే, దయచేసి స్థానికంగా ఉన్న యెహోవాసాక్షులను సంప్రదించండి లేదా 5వ పేజీలో ఇవ్వబడిన చిరునామాల్లో మీకు సమీపంగా ఉన్నదానికి వ్రాయండి.