నేడు యౌవనస్థులకు అవసరమైనది
అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఒక 14 సంవత్సరాల బాలిక తాను ఈ సంవత్సరం తొలిభాగంలో “విద్యార్థులు పరీక్షల్లో ఎందుకు కాపీ కొడతారు” అనే దానిపై నివేదిక వ్రాయవలసి ఉందని తెలియజేసింది. పరిశోధన చేయడానికి ఆమె యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణయోగ్యమైన సమాధానాలు (ఆంగ్లం) అనే తన పుస్తకాన్ని పాఠశాలకు తీసుకువచ్చింది. తన తోటి విద్యార్థుల్లో ఒక బాలిక దాన్ని తీసుకుని, విషయ సూచికలోని “లైంగిక సంబంధం మరియు నైతికతలు,” “డేటింగ్, ప్రేమ మరియు వ్యతిరేకలింగ వ్యక్తులు” వంటి భాగాల శీర్షికలను చదవడం ప్రారంభించింది.
“నేను ఈ పుస్తకం తీసుకోవచ్చా?” అని తోటి విద్యార్థిని అడిగింది.
“ఇది నా ప్రతి అని, కాని తన కొరకు ఒకటి తీసుకుని వస్తానని నేను వివరించాను. నేను తీసుకువెళ్లినప్పుడు, మరో విద్యార్థిని ఆ పుస్తకాన్ని చూసి తన కొరకు కూడా ఒక పుస్తకం తీసుకురమ్మని కోరింది. ఆ తర్వాత కొంతకాలానికి, నేను ఆ ప్రతి కావాలని కోరిన విద్యార్థుల కొరకు యౌవనస్థులు అడిగే ప్రశ్నలు అనే పది పుస్తకాలను తీసుకు వెళ్లాను” అని ఆ విద్యార్థిని తెలియజేసింది.
ఈ పుస్తకం కలిగివుండవలసినంత విలువ గలదని ఆ 14 సంవత్సరాల విద్యార్థిని భావిస్తోంది. ఆమె ఇలా చెప్పింది: “యౌవనస్థులకు ఈ రోజులు కష్టతరంగా ఉంటాయి గనుక మాకు నిజంగా ఈ పుస్తకం అవసరం.”
యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణయోగ్యమైన సమాధానాలు అనే పుస్తక ప్రతిని మీరు పొందాలనుకుంటే లేక ఎవరైనా మీ ఇంటికి వచ్చి బైబిలు విద్య యొక్క విలువ గురించి చర్చించాలని మీరు ఇష్టపడితే దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India, లేక 5వ పేజీలోని తగిన చిరునామాకు వ్రాయండి.