“అవి చాలా అద్భుతంగా ఉండినవి!”
“నేనెల్లప్పుడూ కావలికోట మరియు తేజరిల్లు! చదవడంలో ఆనందించాను, కానీ ఈ మధ్య సంవత్సరాలలో అవి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే వాటిని వర్ణించడానికి విశేషణాలు కనుగొనడం కష్టంగా ఉంది. “మతం యుద్ధంలో ఒక పక్షాన ఉన్నప్పుడు” మరియు “సారజివో—1914 నుండి 1994 వరకు” శీర్షికలతో నవంబరు 8, 1994 మరియు నవంబరు 8, 1994 (ఆంగ్లం) తేజరిల్లు! సంచికల్లో అందించబడిన సమాచారానికి నా మెప్పుదలను వ్యక్తం చేయాలనుకుంటున్నాను. బోస్నియా-సెర్బియా-క్రోయేషియా అంతర్యుద్ధం ఒక సంక్లిష్టమైన విషాదకరమైన పరిస్థితియై ఉంది, అయినా ఒక క్రోయేషియన్‌గా అది నా హృదయానికి చాలా దగ్గరైనది. నేను ప్రత్యేకంగా 1054కు చెందిన సంఘర్షణ చరిత్ర జాడను, దాని కూకటి వేళ్లను వెలికి తీసిన విధానాన్ని మెచ్చుకున్నాను. ఇది మతం పాత్రను, జాతీయ గుంపుల మధ్య మరింత విభజనలకు, మరింత ద్వేషానికి నడిపిన దాని అవిశ్రాంత ప్రయత్నాలను ప్రకాశింపజేశాయి. అభాగ్యకరంగా, నేడు ప్రపంచం ఈ స్వతస్సిద్ధ మంచి మానవులలో మిక్కిలి చెడ్డదానినే చూడగలదు. గ్రహింపశక్యం కాని పరిస్థితిని అర్ధం చేసుకునేలా చేసినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు. [సంతకం] ఎమ్.కె.”
తేజరిల్లు! శ్రద్ధాపూర్వక పరిశోధన, వస్తుపరమైన నివేదిక అందించడం విషయంలో ఖ్యాతి స్థాపించింది. కానీ భూమిని తన రాజ్య పరిపాలన క్రిందికి తేవాలన్న దేవుని వాగ్దానంపై ఆధారపడిన శాంతియుత భవిష్యత్తు కొరకైన నిరీక్షణ ఇచ్చే పత్రిక కూడా అయివుంది.
మీరు ఈ పత్రికను క్రమంగా చదవాలనుకుంటే, దయచేసి మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులను కలవండి, లేదా ఈ సంచికలోని 5వ పేజీలో ఇవ్వబడిన సరైన చిరునామాకు వ్రాయండి.
[Picture Credit Line on page 32]
Right: Culver Pictures