కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 1/8 పేజీలు 20-22
  • ఎగిరే శిలలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎగిరే శిలలు
  • తేజరిల్లు!—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • దూసుకుపోయే నక్షత్రాలు ఎక్కడినుండి వస్తాయి?
    తేజరిల్లు!—1993
  • మన అమూల్యమైన వాతావరణం
    తేజరిల్లు!—1995
  • అంతరిక్ష దుర్ఘటన మన ప్రపంచాన్ని నాశనం చేస్తుందా?
    తేజరిల్లు!—1999
  • సాటిలేని మన సౌరకుటుంబం ఎలా ఉనికిలోకి వచ్చింది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
తేజరిల్లు!—1996
g96 1/8 పేజీలు 20-22

ఎగిరే శిలలు

ఒక నిర్మలమైన రాత్రి దూసుకుపోయే తార ఆకాశ మధ్యంలో ప్రకాశించడం మీరెప్పుడైనా చూశారా? త్వరలోనే మీరు దాన్ని చూడవచ్చు. విజ్ఞానశాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం, ఈ ప్రాకృతిక బాణాసంచా భూమి యొక్క ఆకాశమండలాన్ని ప్రతి రోజు దాదాపు 20,00,00,000 సార్లు చుట్టివస్తాయి!

అవేమిటి? అవి ఉల్కలని పిలువబడే రాతి లేక ఖనిజ ద్రవ్యరాశులు. అవి భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు శ్వేతతాపంలో నుండి వెలువడతాయి. భూమిపై నుండి చూసినప్పుడు ఆకాశంలో అవి వెలువర్చే ప్రకాశమానమైన వెలుగు రేఖ తోకచుక్క అని పిలువబడుతుంది.

ఉల్కల్లో అనేకం, భూమిని చేరకముందే పూర్తిగా మండిపోతాయి, కాని కొన్ని మాత్రం తీవ్రమైన వేడిని తప్పించుకొని, భూ పరిధిని చేరుతాయి. ఇవి ఉల్కాశకలాలని పిలువబడుతున్నాయి. ఈ ఎగిరే శిల ప్రతి రోజు దాదాపు 1,000 టన్నుల వరకు భూమిపై వచ్చిపడుతున్నాయని కొందరు విజ్ఞానశాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.a

ప్రాముఖ్యంగా ఈ ఎగిరే శిలల చిన్న పరిమాణాన్ని బట్టి, అవి ఇలా వచ్చిపడడం మానవులకు ఎంతమాత్రం ప్రమాదకరమైంది కాదు. వాస్తవానికి అనేక తోకచుక్కలు, ఇసుక రేణువంత పరిమాణం గల ఉల్కాశకలాల వల్ల ఏర్పడుతాయి. (“బయటి అంతరిక్షం నుండి శిలలు” అనే బాక్సు చూడండి.) కాని అంతరిక్షంలో ఎగురుతున్న వేలాది పెద్ద శిలల సంగతేమిటి? ఉదాహరణకు, సిరిస్‌ అని పిలువబడే దాన్ని తీసుకుందాము, దాని వ్యాసం దాదాపు 1,000 కిలోమీటర్లు! 190 కంటే ఎక్కువ కిలోమీటర్ల వ్యాసమున్నట్లు తెలిసిన దాదాపు 30 ఇతర శిలలు ఉన్నాయి. ఈ పెద్ద శిలలు వాస్తవానికి చిన్న గ్రహాలు. విజ్ఞానశాస్త్రవేత్తలు వాటిని ఆస్టరాయిడ్లని పిలుస్తారు.

ఈ ఆస్టరాయిడ్లలో ఒకటి భూమిపైకి వచ్చిపడితే అప్పుడేమిటి? సంభవించగల ఈ విపత్తే ఈ ఆస్టరాయిడ్ల గురించి విజ్ఞానశాస్త్రవేత్తలు అధ్యయనం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం. ఆస్టరాయిడ్లనేకం అంగారక మరియు బృహస్పతి మధ్య బెల్ట్‌లో పరిభ్రమిస్తున్నప్పటికీ, కొన్ని భూ కక్ష్యను దాటినట్లు ఖగోళశాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అమెరికా నందలి ఆరిజోనాలోని ఫ్లాగ్‌స్టాఫ్‌ వద్ద తోకచుక్క క్రేటర్‌ (బ్యారింగర్‌ క్రేటర్‌ అని కూడా పిలువబడుతుంది) వంటి పెద్ద క్రేటర్ల ఉనికిని బట్టి అభిఘాతాన్ని గూర్చిన భయం అధికమౌతుంది. డైనాసర్లు అంతరించిపోవడానికి కారణమైన సిద్ధాంతాలలో ఒకటేమిటంటే, ఒక పెద్ద అభిఘాతము వాతావరణాన్ని మార్చివేసి భూమి దీర్ఘకాలం చల్లని వాతావరణంలోకి ప్రవేశించేలా చేసింది, దాన్ని డైనాసర్లు తప్పించుకుని బ్రదుకలేక పోయాయి.

అలాంటి విపత్కరమైన అభిఘాతం నేడు మానవజాతిని నాశనం చేయగలదు. అయితే, “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు” అని బైబిలు సూచిస్తుంది.—కీర్తన 37:29.

[అధస్సూచి]

a అంచనాలు భిన్నంగా ఉన్నాయి.

[20వ పేజీలోని బాక్సు]

వీడియో టేపులో అగ్నిగోళం

కొన్ని తోకచుక్కలు అసాధారణమైన విధంగా ప్రకాశమానంగా, పెద్దగా ఉంటాయి. అవి అగ్నిగోళాలని పిలువబడతాయి. 1992 అక్టోబరు 9 న, పైనున్న చిత్రంలో చూపబడిన అగ్నిగోళం అమెరికాలోని వివిధ రాష్ట్రాలపైని ఆకాశంలో దూసుకుపోయింది. అగ్నిగోళం ముందు తూర్పు వర్జీన్యానందు 700 కిలోమీటర్ల విస్తీర్ణంగల భూభాగంలో కనిపించింది. దాదాపు 12 కిలోల బరువున్న ఒక తునక న్యూయార్క్‌ నందలి పీక్స్‌కిల్‌లో నిలిపివున్న కారుపై పడింది.

ఈ సంఘటనను గురించిన విశేషమేమిటంటే, ఉల్క వాతావరణంలోకి ప్రవేశించిన కోణరాపిడిని బట్టి 40 సెకండ్లకుపైగా నిలిచిన ఒక ప్రకాశవంతమైన అగ్నిగోళం ఉత్పన్నం కావడమే. దాదాపు 14 విభిన్నమైన కోణాల నుండి దాన్ని వీడియోలో రికార్డు చేయడానికి అది ఒక మహత్తరమైన అవకాశాన్ని కలిగించింది. నేచర్‌ అనే పత్రిక ప్రకారం, “ఇవి ఉల్కాశకలం కనుగొనబడిన అగ్నిగోళం యొక్క మొట్టమొదటి చలనచిత్రాలు.”

అగ్నిగోళం కనీసం 70 ముక్కలుగా విరిగిపోయింది, అవి వీడియో టేపుల్లో ఒక్కొక్కటి ప్రకాశమానమైన లంభాకృతులుగా కనిపిస్తాయి. ఈ సంఘటన నుండి కేవలం ఒకే ఉల్కాశకలం కనుగొనబడినప్పటికీ, ఒకటి లేక అంతకంటే ఎక్కువ ముక్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించి నేలపైకి దూసుకువచ్చి ఉంటాయని విజ్ఞానశాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. మునుపు 20 టన్నుల బరువున్న పెద్ద ఉల్కలో నుండి మిగిలిన భాగం అది మాత్రమే అయ్యుండవచ్చు.

[21వ పేజీలోని బాక్సు]

బయటి అంతరిక్షం నుండి శిలలు

ఆస్టరాయిడ్‌: అల్పగ్రహం లేక చిన్న గ్రహం అని కూడా పిలువబడుతుంది. అతి చిన్నవైన ఈ గ్రహాలు సూర్యుని చుట్టూ ఒక కక్ష్యలో ప్రయాణిస్తాయి. వాటికి ఎక్కువగా, ఒకప్పుడు పెద్ద వస్తువులుగా ఉన్న వాటి తునకలని సూచించగల అస్తవ్యస్తమైన ఆకారాలు ఉన్నాయి.

ఉల్క: అంతరిక్షంలో తేలుతున్న లేక వాతావరణంలో నుండి పడుతున్న ఎంతో చిన్నదైన ఖనిజ లేక రాతి ద్రవ్యరాశి. ఉల్కలలో అనేకం, అభిఘాతాల ద్వారా లేక చల్లారిన ధూమకేతువుల నుండి వచ్చిన శిలలకు సంబంధించిన చెత్తాచెదారం ద్వారా ఉత్పన్నమైన ఆస్టరాయిడ్స్‌ నుండి వచ్చిన ముక్కలని కొంతమంది విజ్ఞానశాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

తోకచుక్క: ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు, వాయు ప్రసరణ తీవ్రమైన వేడిని, ప్రకాశమానమైన వెలుగును ఉత్పన్నం చేస్తుంది. ఈ ప్రకాశిస్తున్న వేడి వాయువుల తోకవంటిది ఆకాశంలో క్షణకాలం ఒక వెలుగు రేఖలా కనిపిస్తుంది. ఆ వెలుగు రేఖ తోకచుక్క అని పిలువబడుతుంది. అనేకులు దాన్ని దూసుకొనివచ్చే నక్షత్రమని లేక రాలుతున్న నక్షత్రమని పిలుస్తారు. తోకచుక్కలలో అనేకం భూ పరిధి నుండి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడే మొదటగా కనిపిస్తాయి.

ఉల్కాశకలం: ఒక్కొక్కసారి ఉల్క ఎంత పెద్దగా ఉంటుందంటే అది మన వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు పూర్తిగా మండిపోకుండా భూమిని ఢీకొంటుంది. అలాంటి ఉల్కనే ఉల్కాశకలం అంటారు. కొన్ని మరీ పెద్దగా, బరువుగా ఉంటాయి. ఆఫ్రికా నందలి నమీబియాలో గల ఒక ఉల్కాశకలం 60 టన్నుల కంటే ఎక్కువ బరువుంటుంది. 15 టన్నులు లేక అంతకంటే ఎక్కువ బరువున్న ఇతర పెద్ద ఉల్కాశకలాలు గ్రీన్‌లాండు, మెక్సికో మరియు అమెరికాలలో కనుగొనబడ్డాయి.

[21వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఐడా మరియు దాని చిన్న ఉపగ్రహం

ఐడా అనే ఆస్టరాయిడ్‌ను ఫోటో తీసేటప్పుడు, గెలిలియో అంతరిక్ష నౌక బృహస్పతికి వెళ్లే తన మార్గంలో, అపేక్షించని ఒక విషయాన్ని కనుగొన్నది—ఒక ఆస్టరాయిడ్‌ చుట్టూ ఒక ఉపగ్రహం పరిభ్రమిస్తుండడం యొక్క మొదటి డాక్యుమెంటరీ ఉదాహరణ. స్కై అండ్‌ టెలిస్కోప్‌ నందు నివేదించబడినట్లుగా, డాక్టీల్‌ అని పిలువబడే గ్రుడ్డు ఆకారం గల ఈ ఉపగ్రహం, 1.6 కిలోమీటర్లు మరియు 1.2 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగివున్నట్లు విజ్ఞానశాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 56 కిలోమీటర్లు మరియు 21 కిలోమీటర్ల విస్తీర్ణంగల అస్టరాయిడ్‌ అయిన ఐడా కేంద్రం నుండి 100 కిలోమీటర్ల దూరంలో దాని కక్ష్యలో ఉంది. ఐడా మరియు దాని ఉపగ్రహం అంతరిక్షంలో జరిగిన ఒక అభిఘాతం వల్ల చెల్లాచెదరైన ఒకే ఒక్క పెద్ద శిల యొక్క ముక్కలని భావించబడుతున్న కొరొనిస్‌ ఆస్టరాయిడ్‌ కుటుంబంలో ఒక భాగమని వాటి పరారుణ వికరణ రంగుల లక్షణాలు సూచిస్తున్నాయి.

[క్రెడిట్‌ లైను]

NASA photo/JPL

[33వ పేజీలోని చిత్రం]

అమెరికాలోని అరిజోనా నందలి ఫ్లాగ్‌స్టాఫ్‌ వద్దనున్న తోకచుక్క క్రేటర్‌ 1,200 మీటర్ల విస్తీర్ణం మరియు 200 మీటర్ల లోతు గలది

[క్రెడిట్‌ లైను]

Photo by D. J. Roddy and K. Zeller, U.S. Geological Survey

[Picture Credit Line on page 20]

Sara Eichmiller Ruck

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి