కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 1/8 పేజీ 32
  • అమ్మనాన్నకు ఉత్తరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అమ్మనాన్నకు ఉత్తరం
  • తేజరిల్లు!—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • అరుదైన క్రైస్తవ వారసత్వం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • దుఃఖంలో మునిగిపోయిన పిల్లలు
    తేజరిల్లు!—2017
  • దేవునితో, మా అమ్మతో సమాధానంగా ఉండగలిగాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • మా నాన్న లేదా అమ్మ ఆరోగ్యం బాగోకపోతే?
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 1/8 పేజీ 32

అమ్మనాన్నకు ఉత్తరం

మంచి తలిదండ్రులు ఎంత ప్రాముఖ్యం? ఒక ఎదిగిన కుమారుడు తన తలిదండ్రులకు వ్రాసిన ఉత్తరం వారి విలువను ప్రదర్శిస్తుంది:

“ప్రియమైన అమ్మనాన్నలకు:

“నేను ఇల్లు వదిలిపెట్టి ఇప్పటికి 16 సంవత్సరాలపైనే అయ్యింది, కాబట్టి ఇప్పుడు నానుండి ఈ విధమైన ఉత్తరం మీకు రావటం కొంచెం విచిత్రంగా ఆనిపించవచ్చు. కాని చాల అలోచించిన తరువాత యీ ఉత్తరం వ్రాయటం అవసరమని నేను భావించాను. సంవత్సరాల క్రితం, నేను ఇల్లు వదిలి పెట్టి వెళ్లేటప్పుడు మీ అనుమతి లేకుండా చాలా వస్తువులను మీ వద్దనుండి తీసుకుని వెళ్లాను. అవి పోయాయని అసలు మీరెప్పుడూ గమనించే వుండరు. వాటిని నేనెంత ఉపాయంగా తీసుకున్నానంటే చాల సంవత్సరాల వరకు అవి నా దగ్గరేవున్నాయనే విషయాన్నే నేను గ్రహించుకోలేదు. నేను వాటిని ఈ క్రింది విధంగా వర్గీకరించాను:

“యథార్థమైన దానియెడల ప్రేమ: ఇది నన్నెలా కాపాడిందో, వర్ణనాతీతం!

“మనుష్యుల ఎడల ప్రేమ: మనుష్యుల పరిమాణములు, ఆకారములు, రంగులు ప్రాముఖ్యమైనవి కావు, కాని మనుష్యులలోని అంతర్గత లక్షణాలే ముఖ్యం.

“నిజాయితీ: నాకున్నది నాదే, వీలుంటే దాన్ని పంచుకొనుటకు ఉపయోగించాలి. ఇతరులకున్నది వారికే వదిలేయాలి.

“దృఢ సంకల్పం: అనేక కష్ట సమయాల్లో ఇది నన్ను గట్టెక్కించింది.

ఓర్పు: మీరు నాతో ఎంతో దయ, ప్రేమ మరియు ఓర్పు కలిగి ఉండేవారు. మీరెప్పుడూ నన్ను విడిచిపెట్టలేదు.

క్రమశిక్షణ: మీరెప్పుడు చాలా కఠోరంగా గాని అలుసుగా గానీ ఉండలేదు. కాని అప్పుడు నాకది తెలియదు. మీరు నన్ను క్షమిస్తారా?

స్వాతంత్ర్యము: పిల్లలను దుర్వినియోగముచేసే తలిదండ్రులు పెట్టే భావోద్రేక బాధ అనుభవిస్తూ పెరిగిన చాలామంది ఇతర పిల్లలవంటి బాధను నేను అనుభవించలేదు. నా క్షేమాన్నే మీరు కోరారు, నాకే హాని కలుగకుండ మీరు నన్ను కాపాడారు. మీరు చేసిన దానిని నేనెప్పటికి మరచిపోను.

“స్వల్పమైన వాటియెడల ప్రేమ: పర్వతాలు, నదులు, నీలాకాశం, సరదాగా నడవడం, బసచేయడం మొదలగు వాటితో మీరు జీవితాన్ని సరదాగాచేశారు. ఏ అమ్మానాన్నలు ఎప్పుడు ఇంతకంటె ఎక్కువ చేసి ఉండరు. మరి, మీరెప్పుడు దాన్ని శ్రమ అని అనుకోలేదు.

హెచ్చరిక: నీవు వినే ప్రతిదాన్ని నమ్మటానికి తొందర పడవద్దు నీవు నమ్మినట్లైతే అది ఏమైనప్పటికి దాన్ని హత్తుకొని వుండాలి.

దేవుని వాక్యములోని సత్యము: అన్నిటికన్నా అతి ప్రాముఖ్యమైనది, అది నా స్వాస్థ్యము. దానితో డబ్బును, పడవలను ఇల్లు లేక సంపదలను పోల్చలేము. అది నాకు అతి ప్రాముఖ్యమైన దానిని అనగా నిత్యజీవము నిస్తుంది.

“ఈ పై వస్తువులన్నిటికి వెలకట్టడం కష్టం. అవి అమూల్యమైనవి. నేను వాటి నెంతగానో ఉపయోగించుకున్నాను. వాటిని తిరిగి ఇవ్వవలసిన అవసరం లేనట్లైతే వాటిని యింకను ఉపయోగించాలని ఇష్టపడుతున్నాను. మీకేమి అభ్యంతరం లేకపోతే వాటిని నా చిన్న కుమారులకు ఇస్తూనే వుండాలని అనుకుంటున్నాను. అవి నా యెడల పనిచేసినట్లే, నా కుమారుల యెడల కూడ పనిచేయునని నాకు తెలుసు. అవి అమ్మమ్మ మరియు తాతయ్య దగ్గరనుండి వచ్చాయని నేను వారికి చెప్తాను.

ఇట్లు,

“మీ కుమారుడు,”

(విన్నపం మేరకు పేరు తెలియజేయుట లేదు.) (g92 10/8)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి