కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 4/8 పేజీలు 15-18
  • చోబీ నదిలో పడవ ప్రయాణానికి మాతోరండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • చోబీ నదిలో పడవ ప్రయాణానికి మాతోరండి
  • తేజరిల్లు!—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఏనుగులు—మిత్రులా లేక శత్రువులా?
    తేజరిల్లు!—1994
  • మందమైన చర్మంగల శాంతియుత ఏనుగులను సంరక్షించుట
    తేజరిల్లు!—1993
  • ద్వీపం దగ్గర ఓడ బద్దలు కావడం
    నా బైబిలు కథల పుస్తకము
తేజరిల్లు!—1992
g92 4/8 పేజీలు 15-18

చోబీ నదిలో పడవ ప్రయాణానికి మాతోరండి

దక్షిణాఫ్రికాలోని మేల్కొలుపు! ప్రతినిధి ద్వారా

మేము ఆఫ్రికా దక్షిణప్రాంతంలోని నడిబొడ్డునవున్న చోబీ నదిలో ఒక పడవలో కూర్చున్నాము. మా సెలవుదినముల ముఖ్య సంబరమిది. పడవలోనికి ఇతరులు ఎక్కేటప్పుడు నీళ్లు మృదువుగా పడవను తాకుచుండుట మేము విన్నాము. నది ఒడ్డున రెల్లులు ఇదే మీకాహ్వానమన్నట్లు మలయమారుతాన్ని వీస్తున్నవి. ఆఫ్రికా ఉష్ణతాండవం నుండి మమ్మల్ని రక్షిస్తున్న నీలిమేఘాల క్రీనీడలకు కృతజ్ఞులం.

“ఏనుగులు సాధారణంగా మధ్యాహ్నాపు నీటికొరకు వస్తాయని నేననుకుంటానని” ఈ ప్రయాణ ఏర్పాట్లు చేసిన హోటల్‌ యొక్క పబ్లిక్‌ రిలేషన్స్‌ అధికారిణి, జిల్‌ అన్నది. మేము కూడా అలాగే నిరీక్షిస్తున్నాం. చోబీ నది ఏనుగులకు ప్రసిద్ధి. చోబీనదికి పొలిమేరలో నున్న బోట్సువానాకు ఉత్తరాన 45,000 ఏనుగులున్నట్లు అంచనా—ఆఫ్రికా దక్షిణప్రాంతములోనే ఇది పెద్దగుంపు. “ఇటీవల కురిసిన వర్షాలమూలంగా మూడు రోజులనుండి మేము ఏనుగులను చూడలేదని” జిల్‌ హెచ్చరించింది.

అయిననూ, చోబీ నదికి ఇతర ఆకర్షణలున్నవి. పడవలోని ఒక పల్లెంలో నాలుగు చచ్చిన చేపలను చూస్తున్నాం. “చేపలను తినే గద్దలు నీళ్లలో మేము చేపలను పడవేయాలని ఎప్పుడూ ఎదురు చూస్తూనేవుంటవని” బోట్సువానా పడవనాయకుడు రెయిన్‌ఫోర్డ్‌ అంటున్నాడు. ఆహారంకొరకు ఎగిరే ఈ పక్షుల్లో ఒకదానినైనా మేము ఫోటో తీయగలమా? ది ఫిష్‌ ఈగల్‌ అనే పేరున్న మరో ప్రయాణ పడవ అటుగా వచ్చినపుడు మా ఉత్సాహము పెల్లుబుకుతుంది. మా పడవ పేరు మోసి-ఓ-టూన్యా అంటే విక్టోరియా జలపాతములకు ఆఫ్రికాలో పిలిచే పేరన్నమాట. ఇక్కడనుండి ఒక గంట ప్రయాణమంత దూరంలోను ఆ ప్రసిద్ధి చెందిన జలపాతములో కలిసిపోవుటకు ఈ చోబీనది పెద్ద జాబెజీనదితో సంగమమౌతుంది.

నమ్మండి నమ్మకపోండి, మోసి పడవ కదిలిన వెంటనే మేము బైనాకులర్స్‌ ద్వారా ఏనుగులను చూశాం. కానీ మేము ఇంకా చాలా దూరంలో వున్నపుడే అవి పొదల మాటుకు వెళ్లిపోయినవి. “మొన్నటి మూడు వారాల క్రితంవరకు మేము వాటిని గుంపులుగుంపులుగా చూసేవారమని” మా ప్రయాణ గైడ్‌ సాండీ జ్ఞాపకం చేసుకుంటున్నది. తర్వాత మేము ఆ ఒడ్డునుండి మావైపు బిత్తర చూపులు చూస్తున్న ఆరు లేడిజింకల ఆకర్షణలో పడ్డాము. మోటారు వాహనం సమీపిస్తే ఈ హరిణములు సాధారణంగా పారిపోతాయి. “నదిలో పడవను చూస్తే ఎక్కువ భయపడవు,” అని సాండీ అన్నది.

పావురముల కూనిరాగములు ఒక కర్ణకఠోర అరుపుకు బద్దలైనవి. ఏమిటా పక్షి? “చోబీనదిలో ఆఫ్రికా చేపలను పట్టే డేగ చేసే కలకలరావం నిత్యం వినిపించేదేనని,” డా. ఆంథోని హాల్‌-మార్టిన్‌, ఎలిఫెంట్స్‌ ఆఫ్‌ ఆఫ్రికా అనే పుస్తకంలో వివరిస్తున్నాడు. నది ఒడ్డునున్న చెట్లమీదనుండి ఈ మనోజ్ఞమైన పక్షులు మమ్మల్ని పరిశీలిస్తున్నవి. సాండీ ఒక చేపను విసరగా వెంటనే మేము మా కెమెరాలను సరిచేసుకున్నాం. వరుసలో మొదటిది కొమ్మను వదలి రివ్వున మావైపు ఎగిరి వచ్చింది. వెంటనే పక్షి తనగోళ్లకు చేపను తగిలించుకొని గట్టిగా పట్టుకొనుచుండగా కెమెరా క్లిక్‌ అనుట మేము విన్నాము. తర్వాత అది దాని అందమైన రెక్కలతో నీళ్లపైనుండి లేచి, విజయోత్సవ కూతలతో—హూవ్‌ వ్యావ్‌ క్వావ్‌ అంటూ ఎగిరింది. ఆ డేగ బుల్లిమెదడులోనుండి దాని నేత్రములు, కాలి గోళ్లు, కూత, రెక్కలకు వెలువడే సమన్వయ పద్దతిని చూచి మేము ఆశ్చర్యచకితులమయ్యాము. పడవ మీద కూర్చున్నవారిలో నిశ్శబ్దం తాండవించింది, ఒక్క కెమెరాల శబ్దం తప్ప, ఎందుకంటే మరోమూడు సార్లు డేగలు ఈ వింతను ప్రదర్శించాయి.

పడవ కదులుచుండగా, 26 ఏనుగులు, వాటి పిల్లలతో సహా గుంపుగా నీళ్లలో ఆడుకుంటుండగా గమనించాము. వాటిని తిలకిస్తూ వున్నంతసేపు ది లయన్స్‌ అండ్‌ ఎలిఫెంట్స్‌ ఆఫ్‌ ది చోబీ అను తన పుస్తకంలో బ్రూక్‌ ఎయికన్‌ చెప్పిన మాటలు గురుతుకు వచ్చాయి: “ఒక సారి వాటి దాహం తీరిన తర్వాత పెద్దవి వాటి తొండములతో చల్లని నీటిని వాటి శరీరాల మీద నెమ్మదిగా చల్లుకుంటవి. కొన్ని ముఖ్యంగా మధ్యవయస్సు గలవి, బలమైనవి నదిలో దూకి అటుఇటు తిరుగుతూ ఆటలాడును, గాలి పీల్చుకునేందుకు వీలుగా వాటి తొండము కొనను మాత్రం బయట పెట్టి నీళ్లలో మునుగును. అయిననూ వాటిలో బుల్లి ఏనుగులు ఆడుకున్నంత చక్కగా ఏమి ఆడవు. ఇదే వాటికి ఆట సమయం, ఒకదాన్నొకటి తరుముతూ, కేరింతలు కొడుతునే వుంటవి . . . దాహం తీరింది, ఇక ఆ తర్వాత వాటి కెంతో ఇష్టమైన పని బురదలో స్నానం చేయుటే . . . ఆ వెంటనే వేటి మాటైతే చట్టమో ఆ ఆటను-పాడుచేయు ఆడ ఏనుగులు ఇక వెళ్లే సమయమైందని నిర్ణయించును.”

విచారమేమంటే, మాపెద్ద రెండంతస్థుల పడవ సమీపించగా ఆటను-పాడుచేయు ఏనుగులు ఎంతో ఇబ్బంది పడి మేము వాటి ఫోటోలు తీసిన వెంటనే గుంపుగా వెళ్లుట కారంభించినవి.

ఇంకా ఆరోజు అయిపోలేదు, మరి ఆ చోబీ నదిలో ఇంకెన్నో అద్భుతాలున్నవి. ఆచుట్టున్న కాలాహరి ఎడారి ధూళి మూలముగా నది ఆవలి వైపున సూర్యాస్తమయములు కనులవిందుగా వుండును. రాత్రిపూట ఆహారాన్ని వెదకుచూ నీళ్లలోనుండి వెళ్లుటకు సిద్ధంగావున్న సోమరి నీటి గుర్రాలు బయటికి వచ్చేది సాయంకాలంపూటే. మా పెద్ద పడవకున్న భద్రతా ఏర్పాటు మాకు మంచి వుపయోగకరంగా వుంది. “దానిలో భయపడకుండానే నీవు నీటి గుర్రానికి దగ్గరగా వెళ్లవచ్చును,” అని రెయిన్‌ఫోర్డ్‌ అంటున్నాడు.

నదిలోనున్న ఒక ద్వీపము ప్రక్కనే నిర్మించబడిన నీటి మడుగు దగ్గరకు మేము సమీపిస్తున్నామని మా రాకను గూర్చి ఖడ్గమృగము పెద్దగా గుర్రుగుర్రుమనే అరుపుతో సైగలు చేస్తుంది. ఒకదాని వెంట మరొకటి మునిగియున్న నీటిగుర్రాలన్నీ మాకిరువైపులా ప్రత్యక్షమైనవి. అకస్మాత్తుగా రెండు నీటిగుర్రాలు పెద్దగా వాటి చేటంత నోరు విప్పుకొని ఎదురెదురుగా పొడుచుకొనుటకు వస్తున్నవి—వాటి నోళ్లలో ఒక మనిషి పద్మాసనమేసి కూర్చోవచ్చును. తర్వాత, ద్వీపము దగ్గర్లో లోతులేని గుంటలోనుంచి మరోనీటిగుర్రము మావైపే చక్కగా ఎదురుగా వస్తుంది—ఎంత దగ్గరకి వస్తుందంటే కెమెరాలోని అద్దమంతా నిండిపోయేంత దూరం. నీళ్లు పైకివచ్చేకొలది దాని తల మునుగుతుంది, వెనుకభాగం మాత్రం బయటికి కనబడుతుంది. తదుపరి, నడుమును వంచుతూ ఆ పెద్ద ఆకారమంతా లోపలికి దిగజారును.

నీటిగుర్రం నాలుగు టన్నుల వరకు బరువున్నప్పటికీ అది నీళ్లలో చంగున లేచే గొప్ప లాగువంగలది. “కొండంత శరీరాకారముగలదైనను అది అనేక చేపలకంటే వేగంగా ఈదగలదు మరియు నీటి ఉపరితలానికి కొంచెం క్రిందనే పరిశుభ్రమైన నీళ్లలో వేగంగా ఈదుట తరచూ చూడగలం” అని బ్రాడ్లి స్మిత్‌, దిలైఫ్‌ ఆఫ్‌ హిప్పోపొటామస్‌ అను తన పుస్తకంలో తెలియజేస్తున్నాడు. లేక అవి కావాలనుకుంటే, నీటిగుర్రాలు లోతైన నదిలో నీటికి ఎదురీదుటకు వాటి బలమైన కాళ్లనుపయోగించగలవు.

“నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచియున్నావు గదా. ఎద్దులవలె అది గడ్డిమేయును. దాని శక్తి దాని నడుములో వున్నది. దాని బలము దాని కడుపు నరములలో వున్నది. నదీ ప్రవాహము పొంగిపొర్లినను అది భయపడదు. యొర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు.” (యోబు 40:15, 16, 23) మేము బలముగల ఈ మూడు భయంకర జంతువుల మధ్య వున్నపుడు వాటిని సృజించినవానికి అధిక ఘనత చెల్లించవలసిన అవసరాన్ని గుర్తిస్తున్నాము. “అది చూచుచుండగా ఎవరైనాదాని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా?” అని మనకున్న మానవ హద్దులను మనకు జ్ఞాపకం చేస్తున్న యెహోవా దేవుడు ఇలా అడుగుచున్నాడు.—యోబు 40:24.

కనులవిందుగా నున్న సుర్యాస్తమయమును ఈ నీటిగుర్రాన్ని తిలకిస్తున్న మాకు పడవ వెనక్కి వెళ్లవలసిన సమయం వచ్చినప్పటికి వెళ్లబుద్ధికావడంలేదు. ఆ పిదప, నది ప్రక్కనే వున్న మా గుడిసెలోనుండి నీలాకాశం గులాబి, ఎరుపు రంగుల మేలుకలయికలతో, నీళ్లలో మనోహరంగా దాని ప్రతిబింబాన్ని ప్రదర్శిస్తూవుంటే మేము ఆ అద్భుత దృశ్యాన్ని చూచి ఆనందిస్తున్నాం. మేము వినిన, కన్నులార చూచిన వాటిని తలంచుకొని ఉల్లాసంతో ఉప్పొంగిపోతున్నాము. “మీరు నిజంగా అడవి ప్రాణులను దగ్గరగా చూడవలెనంటే మీరు మోటారు పడవనుపయోగించాలని” సాండీ సలహా ఇచ్చింది. ఆమె సలహా ప్రకారమే మరుసటి రోజు మధ్యాహాన్న ప్రయాణం కొరకు మోటారు పడవనే అద్దెకు తీసుకోవాలని నిర్ణయించుకున్నాము.

ఈ సారి మేము నిజంగా అడవి ప్రాణులను దగ్గరిగా చూడగల్గుతున్నాము, ఒక భయంకరమైన నీటిగుర్రాన్ని తప్ప, అడవి రెల్లును, నీటి కలువపూలను స్పర్శించగలిగాము. చిన్న చేపల కొరకు నిశ్శబ్దముగా నీటిమీద ఎగురుచున్న చిత్రవర్ణ లకుముకి పక్షులను చూశాము. మాచుట్టూ ఇతర పలువర్ణముల పక్షులు ఎగురుతున్నవి, అంటే కపిలవర్ణ ముక్కున్న లకుముకి పక్షులు, ముందు ధవళవర్ణం కలిగి ఈగలను తినే పక్షులు, సన్నని చారల పిట్టలు మొదలైనవి. ఇక పోతే నదిలోని ద్వీప ప్రాంతములందు సంచరిస్తున్న పెద్ద పక్షులున్నవి—కొన్నిటి పేర్లు చెప్పాలంటే, ఐగుప్తీయ జాతి పెద్దబాతులు, పొడవాటి కాళ్లు, గోళ్లున్న నీటి కొంగలు, పెద్దగూడ కొంగలు, మరియు బకములున్నవి. ఈ పక్షులలో కొన్ని కూర్చుని వున్నసగంనీళ్లలో మునిగిన చెట్టును దాటి వెళ్లాము.

చిట్ట చివరకు మేము అంతకుముందు రోజు ఏనుగుల గుంపును చూచిన స్థలందగ్గరకు వచ్చాము. ఈ సారి మేము ఒకేఒక పెద్ద ఏనుగును చూస్తున్నాం, అది మమ్మల్ని లెక్క చేయకుండ తింటూ త్రాగుతుంది. ఇక మేము కదిలివెళ్లుటకారంభించగా అకస్మాత్తుగా మరొక ఏనుగు తన పిల్లలతో కలిసి పొదల్లోంచి వచ్చింది. అది మమ్మల్ని చూచి వెనక్కి వెళ్తుందేమో. మేము ఆశతో ఊపిరి పీల్చుకుంటున్నాము. అది మరల వస్తుందా రాదా? అది మా ఎదుటికి పిల్లలను పంపుటకే నిర్ణయించుకున్నందుకు కృతజ్ఞులం. తల్లి, కొంచెం పెరిగిన పిల్ల, మరియు బుల్లిది మావైపే పరుగెత్తుతూ వస్తుంటే చూడటానికి ఎంతో మనోహరంగా ఉంది!

ఎయికెన్‌ సింహాలు, ఏనుగులను గూర్చి వ్యాఖ్యానించిన పుస్తకములో ఇలా అంటున్నాడు: “ప్రతిరోజు ఈ పెద్దజంతువులు నదివరకు అంతదూరం మండుటెండలో ప్రయాణం చేసి వచ్చినపుడు వాటికి ఎంత దాహం వేస్తుందో మనం సులభంగా ఊహించవచ్చును. వీలున్నంత వేగంగా ఆశతో నడుస్తు ఒక గుంపు పొదల్లోనుంచి బయటికి వచ్చి సరాసరి నీళ్లు త్రాగేస్థలం వరకు పోతాయి, తరచూ అవి, జీవమిచ్చే నీళ్ల వాసన పట్టి వాటికొరకు చివరి యాభైలేక వంద మీటర్ల దూరము ప్రాణంతెగించి పరుగెత్తుతవి.” నిజానికి, ఆ మూడు వరుసగా నిలబడి, పిల్లను మధ్యలో పెట్టుకొని, నీళ్లు త్రాగుట మేము అబ్బురంగా తిలకించాము. మరి ఆలస్యమౌతుంది, చీకటి కాకముందే మేము తిరిగి వెళ్లాలి గదా.

ఏనుగులతో పాటు మేము అడవిగేదె, మొసళ్లు, పకూస్‌ అనే జంతువు, హరిణము, గండుకోతి, మరియు పొడువాటి కోరలుగల పందులను చూస్తున్నాము. ఇటువంటి విస్మయమొందించు వివిధ వన్యప్రాణులను సృజించి వాటిని అనుకూల అందమైన ప్రదేశములందు నివసించునట్లు చేసిన ఆయనను ఎంతో గొప్పగా అభినందించకుండా ఉండలేక పోతున్నాం. ఉష్ణకాలములో పక్షులు, జంతువులు గుంపులు గుంపులుగా వచ్చి నది ప్రాంతమున ఒకేచోట చేరుకుంటవి, సింహాలు, చిరుతలు, ఖడ్గమృగాలు సహితం కనబడును.

ఆఫ్రికాలోని ఈ భూభాగానికి నీవెంతో దూరంలో నివసిస్తూ వుండవచ్చును, గానీ మా ప్రయాణంలో మీరు కలిసి నందువలన, చోబీ నది వరకు ప్రయాణం చేయువారి నిమిత్తము వేచియున్న మనోహరదృశ్యాలను గూర్చి కొంత అవగాహనకు వచ్చియుందురని మేము ఆశిస్తున్నాము. (g90 7/22)

[Picture Credit Line on page 18]

All wood engravings: Animals: 1419 Copyright-Free Illustrations of Mammals, Birds, Fish, Insects, etc. by Jim Harter

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి