యోవేలు
1 పెతూయేలు కుమారుడైన యోవేలు* దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం:
మీ రోజుల్లో గానీ, మీ పూర్వీకుల రోజుల్లో గానీ
ఇలాంటిది ఏదైనా జరిగిందా?+
3 మీరు దీని గురించి మీ కుమారులకు చెప్పండి,
వాళ్లు వాళ్ల కుమారులకు చెప్పాలి,
వాళ్లు ఆ తర్వాతి తరానికి చెప్పాలి.
4 నాశనకరమైన మిడతలు వదిలేసినదాన్ని మిడతల దండు తినేసింది;+
మిడతల దండు వదిలేసినదాన్ని రెక్కల్లేని మిడతలు తినేశాయి;
రెక్కల్లేని మిడతలు వదిలేసినదాన్ని తిండిబోతు మిడతలు తినేశాయి.+
5 తాగుబోతులారా,+ మేల్కోండి! ఏడ్వండి!
ద్రాక్షారసం తాగేవాళ్లారా, మీరంతా గట్టిగా ఏడ్వండి.
ఎందుకంటే మీ నోటి దగ్గర నుండి తియ్యని ద్రాక్షారసం తీసేయబడింది.+
6 పెద్ద మిడతల దండు ఒక జనంలా నా దేశం మీదికి వచ్చింది.+
వాటి పళ్లు సింహం పళ్లలా,+ వాటి దవడలు సింహం దవడల్లా ఉన్నాయి.
7 అవి నా ద్రాక్షచెట్టును నాశనం చేశాయి, నా అంజూర చెట్టును మోడుగా మార్చాయి,
వాటి బెరడును ఒలిచి వాటిని విసిరిపారేశాయి,
దాంతో చెట్ల రెమ్మలు తెల్లబారాయి.
10 పొలం నాశనం చేయబడింది, నేల విలపిస్తోంది;+
ఎందుకంటే ధాన్యం నాశనమైంది, కొత్త ద్రాక్షారసం ఇక లేదు, నూనె అయిపోయింది.+
11 రైతులు గోధుమల గురించి, బార్లీ గురించి దిగులుపడుతున్నారు,
ద్రాక్షతోట రైతులు ఏడుస్తున్నారు;
ఎందుకంటే పొలంలోని పంట నాశనమైంది.
12 ద్రాక్ష చెట్టు ఎండిపోయింది,
అంజూర చెట్టు వాడిపోయింది.
దానిమ్మ చెట్లు, ఖర్జూర చెట్లు, ఆపిల్ చెట్లు,
పొలంలోని చెట్లన్నీ ఎండిపోయాయి;+
ప్రజల సంతోషం అవమానంగా మారింది.
నా దేవుని పరిచారకులారా, రండి, రాత్రంతా గోనెపట్ట కట్టుకొని ఉండండి;
ఎందుకంటే, మీ దేవుని మందిరంలో ధాన్యార్పణ,+ పానీయార్పణ+ ఆగిపోయాయి.
14 ఉపవాసాన్ని ప్రకటించండి; ప్రత్యేక సమావేశానికి పిలుపునివ్వండి.+
దేశ నివాసులందరితో పాటు పెద్దల్ని
మీ దేవుడైన యెహోవా మందిరం దగ్గర సమావేశపర్చండి,+
సహాయం కోసం యెహోవాకు మొరపెట్టండి.
15 అయ్యో, ఆ రోజు వస్తోంది!
యెహోవా రోజు దగ్గర్లో ఉంది,+
అది సర్వశక్తుని దగ్గర నుండి నాశనంలా వస్తుంది!
16 మన కళ్లముందు నుండి ఆహారం,
మన దేవుని మందిరం నుండి ఆనందం, సంతోషం తీసేయబడ్డాయి.
17 పారల కింద విత్తనాలు* ముడుచుకుపోయాయి.
గోదాములు ఖాళీగా ఉన్నాయి.
ధాన్యం ఎండిపోవడంతో ధాన్యం కొట్లను పడగొట్టారు.
18 చివరికి పశువులు కూడా మూల్గుతున్నాయి!
పచ్చికబయళ్లు లేక పశువుల మందలు అయోమయంగా తిరుగుతున్నాయి!
గొర్రెల మందలు కూడా శిక్షను భరిస్తున్నాయి.
19 యెహోవా, నీకే నేను మొరపెట్టుకుంటున్నాను;+
ఎందుకంటే, ఎడారిలోని* పచ్చికబయళ్లను అగ్ని దహించేసింది.
మంట పొలంలోని చెట్లన్నిటినీ కాల్చేసింది.
20 నీటి ప్రవాహాలు ఎండిపోవడం వల్ల,
ఎడారిలోని పచ్చికబయళ్లను అగ్ని కాల్చేయడం వల్ల
అడవి జంతువులు కూడా నీ వైపు చూస్తున్నాయి.”
నా పవిత్ర పర్వతం మీద యుద్ధకేక వేయండి.
2 అది చీకటి, అంధకారం కమ్ముకునే రోజు,+
మేఘాలు, కటిక చీకటి కమ్ముకునే రోజు.+
అది, ఉదయకాంతి కొండల మీద వ్యాపిస్తున్నట్టు ఉంటుంది.
విస్తారమైన, బలమైన ఒక మిడతల* దండు ఉంది;+
అలాంటిది ముందెప్పుడూ లేదు,
తరతరాలపాటు ఇంకెప్పుడూ అలాంటిది ఉండదు.
3 వాటి ముందు అగ్ని దహించేస్తుంది,
వాటి వెనక మంట కాల్చేస్తుంది.+
వాటికి ముందున్న ప్రాంతం ఏదెను తోటలా ఉంది,+
కానీ వాటి వెనక నిర్మానుష్యమైన ఎడారి ఉంది,
ఏదీ తప్పించుకోలేదు.
4 అవి గుర్రాల్లా కనిపిస్తున్నాయి,
యుద్ధ గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి.+
5 అవి కొండల శిఖరాల పైన గంతులు వేస్తున్నప్పుడు ఆ ధ్వని+
రథాల ధ్వనిలా, కొయ్యకాలు* మంటలో కాలుతున్నప్పుడు వచ్చే చిటపట శబ్దంలా ఉంది.
అవి యుద్ధ పంక్తులు తీరిన బలమైన జనంలా ఉన్నాయి.+
6 వాటి వల్ల ప్రజలు వేదన పడతారు.
ప్రతీ ఒక్కరి ముఖంలో భయం కనిపిస్తుంది.
7 అవి యోధుల్లా దాడి చేస్తాయి,
సైనికుల్లా ప్రాకారాలు ఎక్కుతాయి,
ప్రతీది తన దారిలోనే వెళ్తుంది,
అవి తమ దారి నుండి పక్కకు మళ్లవు.
8 అవి ఒకదాన్ని ఒకటి తోసుకోవు;
ప్రతీ ఒక్కటి తన దారిలో సాగిపోతుంది.
ఆయుధాల* వల్ల కొన్ని పడిపోయినా,
మిగతావి తమ వరుస నుండి పక్కకి వెళ్లవు.
9 అవి నగరంలోకి దూసుకొస్తాయి, ప్రాకారాల మీద పరుగెత్తుతాయి.
ఇళ్ల మీదికి ఎక్కుతాయి, దొంగ దూరినట్టు కిటికీల గుండా దూరతాయి.
10 అవి సాగిపోతున్నప్పుడు దేశం వణుకుతోంది, ఆకాశం కంపిస్తోంది.
సూర్యుడు, చంద్రుడు చీకటయ్యాయి,+
నక్షత్రాలు కాంతిని కోల్పోయాయి.
11 యెహోవా తన సైన్యం ముందు పెద్ద స్వరంతో మాట్లాడతాడు,+ ఎందుకంటే ఆయన దండు ఎంతో విస్తారమైనది.+
ఆయన మాట అమలు చేసే వ్యక్తి బలమైనవాడు;
ఎందుకంటే యెహోవా రోజు గొప్పది, అది సంభ్రమాశ్చర్యాలు పుట్టిస్తుంది.+
దాన్ని ఎవరు తట్టుకోగలరు?”+
12 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఇప్పుడైనా సరే,
మీరు ఉపవాసం ఉండి,+ ఏడుస్తూ, విలపిస్తూ హృదయపూర్వకంగా నా దగ్గరికి తిరిగిరండి.+
13 మీ వస్త్రాల్ని కాదు+ మీ హృదయాల్ని చింపుకొని+
మీ దేవుడైన యెహోవా దగ్గరికి తిరిగిరండి.
ఎందుకంటే ఆయన కనికరం,* కరుణ, ఓర్పు,*+ అపారమైన విశ్వసనీయ ప్రేమ గలవాడు,+
విపత్తు గురించి ఆయన ఇంకోసారి ఆలోచిస్తాడు.*
14 ఆయన తన నిర్ణయం గురించి ఇంకోసారి ఆలోచిస్తాడేమో,*
తన నిర్ణయం మార్చుకుని,+ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడేమో ఎవరికి తెలుసు?
అప్పుడు మీ దేవుడైన యెహోవాకు మీరు ధాన్యార్పణను, పానీయార్పణను అర్పించవచ్చు.
15 సీయోనులో బూర ఊదండి!
ఉపవాసం ప్రకటించండి;* ప్రత్యేక సమావేశం కోసం పిలుపునివ్వండి.+
16 ప్రజల్ని సమకూర్చండి; సమాజాన్ని పవిత్రపర్చండి.+
ముసలివాళ్లను* పోగుచేయండి; పిల్లల్ని, పాలుతాగే పసిబిడ్డల్ని పోగుచేయండి.+
పెళ్లి కుమారుడు తన లోపలి గదిలో నుండి, పెళ్లి కూతురు తన గదిలో నుండి బయటికి రావాలి.
17 యెహోవాకు పరిచారం చేసే యాజకులు
వసారాకు, బలిపీఠానికి మధ్య+ నిలబడి ఏడుస్తూ ఇలా అనాలి:
‘యెహోవా, నీ ప్రజల విషయంలో జాలిపడు;
నీ స్వాస్థ్యాన్ని అవమానాలపాలు చేయకు,
వాళ్ల మీద ఇతర దేశాల్ని పరిపాలించనివ్వకు.
“వాళ్ల దేవుడు ఎక్కడ?” అని ఇతర దేశాలవాళ్లు ఎందుకు అనాలి?’+
19 యెహోవా తన ప్రజలకు ఇలా జవాబిస్తాడు:
‘ఇదిగో నేను మీకు ధాన్యాన్ని, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెను ఇస్తున్నాను,
మీరు పూర్తిగా తృప్తి పొందుతారు;+
దేశాల మధ్య ఇక మిమ్మల్ని నిందలపాలు చేయను.+
20 నేను ఉత్తరం నుండి వచ్చే అతన్ని మీకు దూరంగా వెళ్లగొడతాను;
ఎండిపోయి, నిర్మానుష్యమైన నిర్జన ప్రాంతానికి అతన్ని చెదరగొడతాను.
అతని సైన్యం ముందు భాగాన్ని తూర్పు సముద్రం* వైపుకు,
వెనక భాగాన్ని పడమటి సముద్రం* వైపుకు చెదరగొడతాను.
21 దేశమా, భయపడకు.
ఆనందించు, సంతోషించు,
ఎందుకంటే యెహోవా గొప్ప కార్యాలు చేస్తాడు.
22 పొలంలోని పశువులారా, భయపడకండి,
ఎడారిలోని పచ్చికబయళ్లు పచ్చగా అవుతాయి.+
చెట్లకు పండ్లు కాస్తాయి;+
అంజూర చెట్టు, ద్రాక్ష చెట్టు పూర్తి ఫలాన్ని ఇస్తాయి.+
23 సీయోను కుమారులారా, మీ దేవుడైన యెహోవాను బట్టి ఆనందించండి, సంతోషించండి;+
ఆయన మీకు తగినంత తొలకరి వానను,* వర్షాల్ని కురిపిస్తాడు.
25 నేను మీ మీదికి పంపిన నా గొప్ప సైన్యం,
అంటే మిడతల దండు, రెక్కల్లేని మిడతలు, తిండిబోతు మిడతలు, నాశనకరమైన మిడతలు
తినేసిన+ సంవత్సరాల పంటను మీకు మళ్లీ ఇస్తాను.
26 మీరు తప్పకుండా తృప్తిగా తింటారు,+
మీ తరఫున అద్భుత కార్యాలు చేసిన
మీ దేవుడైన యెహోవా పేరును స్తుతిస్తారు;+
నా ప్రజలు ఇంకెప్పుడూ అవమానానికి గురికారు.+
27 నేను ఇశ్రాయేలు మధ్య ఉన్నానని,+
నేను మీ దేవుడైన యెహోవానని,+ నేను తప్ప ఇంకే దేవుడూ లేడని మీరు తెలుసుకుంటారు!
నా ప్రజలు ఇంకెప్పుడూ అవమానానికి గురికారు.
28 ఆ తర్వాత, నేను నా పవిత్రశక్తిని అన్నిరకాల ప్రజల మీద కుమ్మరిస్తాను,+
మీ కుమారులు, కూతుళ్లు ప్రవచిస్తారు,
మీ వృద్ధులు కలలు కంటారు,
మీ యౌవనులు దర్శనాలు చూస్తారు.+
29 ఆ రోజుల్లో నేను నా దాసులు, దాసురాళ్ల మీద కూడా
నా పవిత్రశక్తిని కుమ్మరిస్తాను.
31 సంభ్రమాశ్చర్యాలు పుట్టించే యెహోవా మహారోజు వచ్చేముందు+
సూర్యుడు చీకటి అవుతాడు, చంద్రుడు రక్తంలా మారతాడు.+
32 అప్పుడు యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు;+
ఎందుకంటే యెహోవా చెప్పినట్టు, సీయోను పర్వతం మీద, యెరూషలేములో తప్పించుకునేవాళ్లు ఉంటారు,+
వాళ్లు యెహోవా పిలిచేవాళ్లు.”
3 “ఇదిగో! ఆ రోజుల్లో, ఆ సమయంలో
నేను యూదా, యెరూషలేము ప్రజల్ని చెరలో నుండి వెనక్కి తీసుకొచ్చినప్పుడు,+
2 సమస్త దేశాల ప్రజల్ని కూడా పోగుచేస్తాను,
వాళ్లను యెహోషాపాతు* లోయలోకి తీసుకొస్తాను.
నా ప్రజల తరఫున, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయుల తరఫున
వాళ్లకు అక్కడ తీర్పు తీరుస్తాను,+
ఎందుకంటే, వాళ్లు నా ప్రజల్ని దేశదేశాలకు చెదరగొట్టారు,
నా దేశాన్ని పంచుకున్నారు.+
3 నా ప్రజల కోసం వాళ్లు చీట్లు* వేసుకుంటారు;+
వేశ్యను తెచ్చుకోవడానికి పిల్లవాణ్ణి,
ద్రాక్షారసం కోసం అమ్మాయిని అమ్మేస్తారు.
4 తూరూ, సీదోనూ, సమస్త ఫిలిష్తియ ప్రాంతాల్లారా, నాతో మీకేంటి?
మీరు ఏ విషయంలోనైనా నా మీద పగ తీర్చుకుంటున్నారా?
అలాగైతే, మీరు చేసినదాన్ని నేను చాలా త్వరగా మీ తలల మీదికి రప్పిస్తాను.+
5 ఎందుకంటే మీరు నా వెండిని, బంగారాన్ని పట్టుకెళ్లారు,+
నా శ్రేష్ఠమైన సంపదల్ని మీ గుళ్లలో పెట్టుకున్నారు;
6 యూదా, యెరూషలేము ప్రజల్ని గ్రీకువాళ్లకు అమ్మేశారు,+
అలా మీరు వాళ్ల ప్రాంతం నుండి వాళ్లను దూరంగా పంపించేశారు;
7 మీరు ఎక్కడైతే వాళ్లను అమ్మేశారో అక్కడి నుండి నేను వాళ్లను తీసుకొస్తాను,+
మీరు చేసినదాన్ని మీ తలల మీదికి రప్పిస్తాను.
8 మీ కుమారుల్ని, కూతుళ్లను యూదా ప్రజలకు అమ్మేస్తాను,+
వాళ్లు దూరంలో ఉన్న షెబావాళ్లకు వాళ్లను అమ్మేస్తారు;
యెహోవాయే స్వయంగా ఈ మాట చెప్పాడు.
9 ఇతర దేశాల ప్రజల మధ్య ఇలా చాటించండి:+
‘యుద్ధానికి సిద్ధంకండి! బలవంతుల్ని పురికొల్పండి!
సైనికులంతా ముందుకుసాగి దాడిచేయాలి!+
10 మీ నాగటి నక్కుల్ని కత్తులుగా, మచ్చుకత్తుల్ని* ఈటెలుగా* సాగగొట్టండి.
బలహీనుడు, “నేను బలవంతుణ్ణి” అని అనాలి.
11 చుట్టుపక్కల దేశాల్లారా, మీరంతా ఒకరికొకరు సహాయం చేసుకోండి, సమకూడండి!’ ”+
యెహోవా, ఆ స్థలానికి నీ బలవంతుల్ని* తీసుకురా.
12 “దేశాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి;
ఎందుకంటే, చుట్టుపక్కల దేశాలన్నిటికీ తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను.+
13 పైరు పండింది, కొడవలితో కోయండి.
ద్రాక్షతొట్టి నిండిపోయింది, వచ్చి తొక్కండి.+
ద్రాక్షతొట్లు పొంగిపొర్లుతున్నాయి, ఎందుకంటే దేశాల చెడుతనం చాలా ఎక్కువగా ఉంది.
15 సూర్యుడు, చంద్రుడు చీకటైపోతాయి,
నక్షత్రాలు కాంతిని కోల్పోతాయి.
16 యెహోవా సీయోనులో నుండి గర్జిస్తాడు,
యెరూషలేములో నుండి పెద్ద స్వరంతో మాట్లాడతాడు.
17 నేను నా పవిత్ర పర్వతమైన సీయోనులో నివసిస్తున్న మీ దేవుడైన యెహోవానని అప్పుడు మీరు తెలుసుకుంటారు.
18 ఆ రోజు పర్వతాల మీద నుండి తియ్యని ద్రాక్షారసం కారుతుంది,+
కొండల నుండి పాలు ప్రవహిస్తాయి,
యూదా వాగులన్నిట్లో నీళ్లు పారతాయి.
19 అయితే ఐగుప్తు* నిర్మానుష్యమౌతుంది,
ఎదోము నిర్జనమైన ఎడారిగా మారుతుంది,+
ఎందుకంటే వాళ్లు యూదా ప్రజలపై దౌర్జన్యం చేశారు,
ఆ దేశంలో అమాయకుల రక్తం చిందించారు.+
20 యూదాలో మాత్రం ఎప్పటికీ నివాసులు ఉంటారు,
యెరూషలేములో తరతరాలపాటు ప్రజలు నివసిస్తారు.+
“యెహోవాయే దేవుడు” అని అర్థం.
లేదా “భూమి.”
లేదా “భర్త.”
లేదా “యువతిలా.”
లేదా “గుండెలు బాదుకోండి.”
లేదా “ఎండు అంజూర పండ్లు” అయ్యుంటుంది.
పదకోశం చూడండి.
అక్ష., “కొమ్ము.”
లేదా “భూమి.”
అక్ష., “ప్రజల.”
పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.
లేదా “విసిరే ఆయుధాల.”
లేదా “దయ.”
లేదా “కోప్పడే విషయంలో నిదానిస్తాడు.”
లేదా “విచారపడతాడు.”
లేదా “విచారపడతాడేమో.”
అక్ష., “ప్రతిష్ఠించండి.”
లేదా “పెద్దల్ని.”
అంటే, మృత సముద్రం.
అంటే, మధ్యధరా సముద్రం.
అక్ష., “ఆయన.”
తొలకరి వానలు దాదాపు అక్టోబరు మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.
కడవరి వానలు దాదాపు ఏప్రిల్ మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.
పదకోశం చూడండి.
లేదా “సూచనల్ని.”
“యెహోవా న్యాయమూర్తి” అని అర్థం.
పదకోశం చూడండి.
అంటే, మొక్కల్ని కత్తిరించే కత్తెరలు.
లేదా “బల్లెములుగా.”
లేదా “నీ యోధుల్ని.”
లేదా “పరదేశులు.”
లేదా “వాగుకు.”
లేదా “ఈజిప్టు.”