హోషేయ
1 ఉజ్జియా,+ యోతాము,+ ఆహాజు,+ హిజ్కియా+ యూదాను పరిపాలించిన+ రోజుల్లో, యోవాషు+ కుమారుడైన యరొబాము+ ఇశ్రాయేలును పరిపాలించిన రోజుల్లో బేయేరీ కుమారుడైన హోషేయ* దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం. 2 హోషేయ ద్వారా యెహోవా తన వాక్యాన్ని తెలియజేయడం మొదలుపెట్టినప్పుడు, యెహోవా హోషేయతో ఇలా అన్నాడు: “నువ్వు వెళ్లి ఒక స్త్రీని పెళ్లి చేసుకో, ఆమె ఆ తర్వాత వ్యభిచారం* చేస్తుంది, ఆమె వ్యభిచారం* వల్ల పుట్టిన పిల్లలు నీకు ఉంటారు. ఎందుకంటే, వ్యభిచారం* వల్ల దేశమంతా యెహోవాను అనుసరించడం మానేసి పూర్తిగా పక్కకు మళ్లింది.”+
3 దాంతో హోషేయ వెళ్లి దిబ్లయీము కూతురైన గోమెరును పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయ్యి అతనికి ఒక కుమారుణ్ణి కన్నది.
4 అప్పుడు యెహోవా అతనితో ఇలా అన్నాడు: “ఆ పిల్లవాడికి యెజ్రెయేలు* అని పేరు పెట్టు. ఎందుకంటే యెజ్రెయేలులో సృష్టించిన రక్తపాతాన్ని బట్టి త్వరలోనే నేను యెహూ+ ఇంటివాళ్లను లెక్క అడుగుతాను, ఇశ్రాయేలు ఇంటివాళ్ల రాజరికానికి ముగింపు పలుకుతాను.+ 5 ఆ రోజు యెజ్రెయేలు లోయలో నేను ఇశ్రాయేలు విల్లు విరుస్తాను.”
6 ఆమె మళ్లీ గర్భవతి అయ్యి ఒక కూతుర్ని కన్నది. అప్పుడు దేవుడు అతనితో ఇలా అన్నాడు: “ఆ పాపకు లోరూహామా* అని పేరు పెట్టు. ఎందుకంటే నేను ఇశ్రాయేలు ఇంటివాళ్ల మీద ఇక ఏమాత్రం కరుణ చూపించను,+ నేను ఖచ్చితంగా వాళ్లను వెళ్లగొడతాను.+ 7 అయితే యూదా ఇంటివాళ్ల మీద నేను కరుణ చూపిస్తాను.+ నేను విల్లు ద్వారానో, ఖడ్గం ద్వారానో, యుద్ధం ద్వారానో, గుర్రాల ద్వారానో, గుర్రపురౌతుల ద్వారానో కాదుగానీ వాళ్ల దేవుడైన యెహోవా శక్తితోనే వాళ్లను కాపాడతాను.”+
8 లోరూహామా పాలు విడిచిన తర్వాత గోమెరు మళ్లీ గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కన్నది. 9 అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: “ఆ పిల్లవాడికి లో-అమ్మీ* అని పేరు పెట్టు. ఎందుకంటే మీరు నా ప్రజలు కాదు, నేను మీకు దేవునిగా ఉండను.
10 “ఇశ్రాయేలు ప్రజల* సంఖ్య సముద్రపు ఇసుక రేణువులంత ఉంటుంది, దాన్ని ఎవరూ కొలవలేరు, లెక్కపెట్టలేరు.+ ‘మీరు నా ప్రజలు కాదు’+ అని ఎక్కడైతే వాళ్లకు చెప్పబడిందో, అక్కడే వాళ్లు ‘జీవంగల దేవుని కుమారులు’ అని పిలవబడతారు.+ 11 యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు సమకూర్చబడి ఐక్యమౌతారు,+ వాళ్లు తమ కోసం ఒక ప్రధానుణ్ణి ఎంచుకుని ఆ దేశం నుండి బయటికి వస్తారు. అది యెజ్రెయేలుకు+ ఘనమైన రోజుగా ఉంటుంది.
2 “మీ సహోదరులతో, ‘మీరు నా ప్రజలు’* అని,+
మీ సహోదరీలతో, ‘మీరు కరుణించబడిన స్త్రీలు’* అని అనండి.+
ఆమె తన వ్యభిచారాన్ని* విడిచిపెట్టాలి,
తన రొమ్ముల మధ్య నుండి వ్యభిచారాన్ని తొలగించాలి.
3 లేదంటే నేను ఆమె బట్టలు తీసేసి, ఆమె పుట్టినప్పుడు ఎలా ఉందో అలా చేస్తాను,
ఆమెను ఎడారిలా* చేస్తాను,
నీళ్లు లేని ప్రదేశంగా మారుస్తాను,
దాహంతో ఆమె చనిపోయేలా చేస్తాను.
4 నేను ఆమె కుమారుల్ని కరుణించను,
ఎందుకంటే వాళ్లు వ్యభిచారం* వల్ల పుట్టిన కుమారులు.
5 వాళ్ల అమ్మ వ్యభిచారం* చేసింది.+
వాళ్లను కడుపున మోసిన ఆమె అవమానకరంగా ప్రవర్తించింది.+ ఆమె ఇలా అనుకుంది:
‘నేను నా ప్రియుల వెంట వెళ్తాను,+
వాళ్లు నాకు ఆహారాన్ని, నీళ్లను,
ఉన్నివస్త్రాన్ని, నారవస్త్రాన్ని, నూనెను, ద్రాక్షారసాన్ని ఇస్తారు.’
6 కాబట్టి నేను నీ దారికి అడ్డంగా ముళ్లకంచె వేస్తాను;
ఆమె తన దారుల్ని కనుక్కోకుండా
ఆమెకు అడ్డంగా ఒక రాతి గోడ కడతాను.
7 ఆమె తన ప్రియుల వెనక పరుగులు తీస్తుంది, కానీ వాళ్లను కలుసుకోలేదు;+
ఆమె వాళ్ల కోసం చూస్తుంది, కానీ వాళ్లను కనుక్కోలేదు.
అప్పుడు ఆమె ఇలా అనుకుంటుంది, ‘నేను నా మొదటి భర్త దగ్గరికి తిరిగెళ్తాను,+
ఇప్పటికన్నా అప్పుడే నా పరిస్థితి బాగుండేది.’+
8 ఆమెకు ధాన్యాన్ని, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెను,
విస్తారమైన వెండిని, బంగారాన్ని ఇచ్చింది నేనే అని ఆమె గుర్తించలేదు,+
9 ‘కాబట్టి, ఇప్పుడు నేను తిరిగొచ్చి
కోత సమయంలో నా ధాన్యాన్ని, సమకూర్చే కాలంలో నా కొత్త ద్రాక్షారసాన్ని తీసేసుకుంటాను.+
అలాగే ఆమె మానాన్ని కప్పే నా ఉన్నివస్త్రాన్ని, నా నారవస్త్రాన్ని లాగేసుకుంటాను.
11 నేను ఆమె సంతోషమంతటికీ,
ఆమె పండుగలకు,+ ఆమె అమావాస్య రోజులకు, ఆమె విశ్రాంతి రోజులకు,* ఆమె ఉత్సవ కాలాలన్నిటికీ ముగింపు పలుకుతాను.
12 ఆమె ద్రాక్షచెట్లను, అంజూర చెట్లను నాశనం చేస్తాను; వాటి గురించి ఆమె,
“ఇవి నా ప్రియులు నాకు ఇచ్చిన జీతం” అని అనుకుంది;
నేను వాటిని అడవిగా మారుస్తాను,
అడవి జంతువులు వాటిని మింగేస్తాయి.
13 ఆమె బయలు విగ్రహాలకు బలులు అర్పించిన రోజుల్ని బట్టి,+
ఉంగరాల్ని, ఆభరణాల్ని పెట్టుకుని తన ప్రియుల వెంట పరుగులు తీసిన రోజుల్ని బట్టి నేను ఆమెను లెక్క అడుగుతాను,
ఆమె నన్ను మర్చిపోయింది’+ అని యెహోవా అంటున్నాడు.
15 అప్పటినుండి నేను ఆమె ద్రాక్షతోటల్ని ఆమెకు తిరిగిస్తాను,+
ఆకోరు లోయను+ నిరీక్షణకు ద్వారంగా చేస్తాను;
ఆమె యువతిగా ఉన్నప్పటిలా అక్కడ నాకు జవాబిస్తుంది,
16 ఆ రోజు నువ్వు నన్ను “నా భర్త” అని అంటావు,
ఇకమీదట నువ్వు నన్ను “నా యజమాని”* అని అనవు’ అని యెహోవా అంటున్నాడు.
17 ‘నేను ఆమె నోటి నుండి బయలు విగ్రహాల పేర్లు రాకుండా చేస్తాను,+
వాటి పేర్లను ఇక ఎవ్వరూ గుర్తు చేసుకోరు.+
18 ఆ రోజు నేను వాళ్ల కోసం అడవి జంతువులతో,
ఆకాశపక్షులతో, నేలమీద పాకే ప్రాణులతో+ ఒక ఒప్పందం* చేస్తాను;+
విల్లు, ఖడ్గం, యుద్ధం అనేవి దేశంలో లేకుండా చేస్తాను,+
19 నువ్వు ఎప్పటికీ నా దానివి అయ్యేలా నేను నిన్ను ప్రధానం చేసుకుంటాను;
నీతితో, న్యాయంతో, విశ్వసనీయ ప్రేమతో, కరుణతో+
నేను నిన్ను ప్రధానం చేసుకుంటాను.
20 నమ్మకత్వంతో నేను నిన్ను ప్రధానం చేసుకుంటాను.
నువ్వు తప్పకుండా యెహోవాను తెలుసుకుంటావు.’+
21 యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఆ రోజు నేను జవాబిస్తాను;
నేను ఆకాశానికి జవాబిస్తాను,
అది భూమికి జవాబిస్తుంది,+
22 భూమి ధాన్యానికి, కొత్త ద్రాక్షారసానికి, నూనెకు జవాబిస్తుంది;
అవి యెజ్రెయేలుకు* జవాబిస్తాయి.
వాళ్లేమో, “నువ్వు మా దేవుడివి” అని అంటారు.’ ”+
3 తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “నువ్వు ఇంకొకసారి వెళ్లి పరాయి పురుషుడు ప్రేమించిన ఆ స్త్రీని, వ్యభిచారం చేస్తున్న ఆ స్త్రీని ప్రేమించు.+ ఎందుకంటే, ఇశ్రాయేలు ప్రజలు వేరే దేవుళ్ల వైపు తిరిగి,+ ఎండుద్రాక్ష రొట్టెల్ని* ప్రేమిస్తున్నా యెహోవా వాళ్లను ప్రేమిస్తున్నాడు.”+
2 దాంతో నేను 15 వెండి రూకలు, ఒకటిన్నర హోమర్ కొలతల* బార్లీ గింజలు ఇచ్చి ఆమెను కొనుక్కున్నాను. 3 తర్వాత నేను ఆమెతో ఇలా అన్నాను: “నువ్వు చాలారోజుల పాటు నా దానివిగా ఉంటావు. నువ్వు వ్యభిచారం* చేయకూడదు, పరాయి పురుషునితో సంబంధాలు పెట్టుకోకూడదు, నేను కూడా నీ విషయంలో అలానే ఉంటాను.”*
4 ఎందుకంటే, ఇశ్రాయేలు ప్రజలు చాలాకాలం* పాటు రాజు లేకుండా,+ అధిపతి లేకుండా, బలులు అర్పించకుండా, పూజా స్తంభం లేకుండా, ఏఫోదు గానీ+ గృహదేవతల విగ్రహాలు+ గానీ లేకుండా ఉంటారు. 5 ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరిగొచ్చి తమ దేవుడైన యెహోవా కోసం, తమ రాజైన దావీదు+ కోసం చూస్తారు.+ ఆ రోజుల చివర్లో వాళ్లు యెహోవా మంచితనం రుచి చూడడానికి వణుకుతూ ఆయన దగ్గరికి వస్తారు.+
4 ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా ఏం చెప్తున్నాడో వినండి,
దేశ నివాసుల మీద యెహోవాకు ఒక వ్యాజ్యం ఉంది,+
ఎందుకంటే దేశంలో సత్యం గానీ, విశ్వసనీయ ప్రేమ గానీ, దేవుని గురించిన జ్ఞానం గానీ లేవు.+
2 అబద్ధ ప్రమాణాలు, అబద్ధాలు,+ హత్యలు,+
దొంగతనాలు, వ్యభిచారం+ దేశంలో పెచ్చుపెరిగిపోయాయి,
రక్తపాతం వెంట రక్తపాతం జరుగుతోంది.+
3 అందుకే దేశం దుఃఖిస్తుంది,+
దానిలోని నివాసులందరూ కృశించిపోతారు;
అడవి జంతువులు, ఆకాశపక్షులు,
సముద్రంలోని చేపలు కూడా నశించిపోతాయి.
4 “అయినా ఏ వ్యక్తీ ఎదురు వాదించకూడదు, గద్దించకూడదు,+
ఎందుకంటే, నీ ప్రజలు యాజకునితో వాదించే వాళ్లలా ఉన్నారు.+
5 కాబట్టి మీరు రాత్రివేళ తడబడినట్టు పట్టపగలే తడబడతారు,
ప్రవక్త కూడా మీతోపాటు తడబడతాడు.
నేను మీ తల్లిని నాశనం చేస్తాను.
6 జ్ఞానం ఏమాత్రం లేనందువల్ల నా ప్రజలు నాశనమౌతారు.
మీరు జ్ఞానాన్ని తిరస్కరించారు కాబట్టి,+
నాకు యాజకునిగా సేవ చేయకుండా నేను కూడా మిమ్మల్ని తిరస్కరిస్తాను;
మీ దేవుని ధర్మశాస్త్రాన్ని* మీరు మర్చిపోయారు కాబట్టి,+
నేను కూడా మీ కుమారుల్ని మర్చిపోతాను.
7 వాళ్ల సంఖ్య ఎక్కువైన కొద్దీ, నాకు వ్యతిరేకంగా వాళ్లు చేసిన పాపాలు కూడా ఎక్కువౌతూ వచ్చాయి.+
నేను వాళ్ల మహిమను అవమానంగా మారుస్తాను.*
8 వాళ్లు* నా ప్రజల పాపాల్ని ఆహారంగా చేసుకుంటున్నారు,
ప్రజలు ఇంకా ఇంకా తప్పులు చేయాలని వాళ్లు కోరుకుంటున్నారు.
9 ప్రజల పరిస్థితి, యాజకుల పరిస్థితి ఒకేలా ఉంటుంది;
నేను వాళ్ల మార్గాల విషయంలో వాళ్లను లెక్క అడుగుతాను,
వాళ్ల పనుల పర్యవసానాల్ని వాళ్ల మీదికి తెస్తాను.+
10 వాళ్లు తింటారు, కానీ తృప్తి ఉండదు.+
విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు,* కానీ వాళ్ల సంఖ్య పెరగదు,+
ఎందుకంటే వాళ్లు యెహోవాను ఏమాత్రం లెక్కచేయలేదు.
12 నా ప్రజలు తమ చెక్క విగ్రహాల్ని సంప్రదిస్తారు,
తమ చేతి కర్ర* చెప్పింది చేస్తారు;
ఎందుకంటే, వ్యభిచార* మనసు వాళ్లను దారితప్పేలా చేస్తుంది,
తమ వ్యభిచారం* వల్ల వాళ్లు తమ దేవునికి లోబడడం లేదు.
13 పర్వత శిఖరాల మీద వాళ్లు బలులు అర్పిస్తారు,+
కొండల మీద తమ బలుల పొగ పైకిలేచేలా చేస్తారు,
సింధూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, ప్రతీ మహా వృక్షం కింద బలులు అర్పిస్తారు.+
వాటి నీడ మంచిదని అలా చేస్తారు.
అందుకే, మీ కూతుళ్లు వేశ్యల్లా ప్రవర్తిస్తున్నారు,
మీ కోడళ్లు వ్యభిచారం చేస్తున్నారు.
14 వేశ్యల్లా ప్రవర్తిస్తున్నందుకు మీ కూతుళ్లను,
వ్యభిచారం చేస్తున్నందుకు మీ కోడళ్లను నేను లెక్క అడగను.
ఎందుకంటే, మగవాళ్లు వేశ్యలతో వెళ్తున్నారు,
ఆలయ వేశ్యలతో కలిసి బలులు అర్పిస్తున్నారు;
అవగాహన లేని అలాంటివాళ్లు+ నాశనమౌతారు.
16 ఎందుకంటే, మొండి ఎద్దులా ఇశ్రాయేలు ప్రజలు మొండిగా తయారయ్యారు.+
పచ్చిక మైదానంలో* మగ గొర్రెపిల్లను మేపినట్టు యెహోవా వాళ్లను మేపాలా?
17 ఎఫ్రాయిము విగ్రహాల్ని హత్తుకున్నాడు.+
అతన్ని అలా వదిలేయండి!
దాని పరిపాలకులు అవమానాన్ని ఎంతగానో ప్రేమిస్తారు.+
19 గాలి తన రెక్కలతో దాన్ని చుట్టేస్తుంది,*
వాళ్లు తమ బలుల్ని బట్టి సిగ్గుపడతారు.”
5 “యాజకులారా,+ ఈ మాటలు వినండి,
ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, ఆలకించండి,
రాజు ఇంటివాళ్లారా, వినండి,
ఎందుకంటే మీకు తీర్పు జరగబోతుంది;
మీరు మిస్పాకు ఉచ్చులా,
తాబోరు+ మీద పరిచిన వలలా ఉన్నారు.
3 ఎఫ్రాయిము నాకు తెలుసు,
ఇశ్రాయేలు నాకు కనిపిస్తూనే ఉంది.
4 వాళ్ల పనులు వాళ్లను దేవుని దగ్గరికి తిరిగి రానివ్వడం లేదు,
ఎందుకంటే వాళ్లది వ్యభిచార* మనసు;+
వాళ్లు యెహోవాను గుర్తించడం లేదు.
5 ఇశ్రాయేలు గర్వం అతని మీద సాక్ష్యం చెప్పింది;+
ఇశ్రాయేలు, ఎఫ్రాయిము ఇద్దరూ తమ తప్పుల వల్ల తడబడ్డారు,
వాళ్లతోపాటు యూదా కూడా తడబడ్డాడు.+
6 వాళ్లు తమ మందను, పశువుల్ని తీసుకొని యెహోవాను వెదకడానికి వెళ్లారు,
కానీ ఆయన వాళ్లకు కనిపించలేదు.
ఆయన వాళ్లకు దూరంగా వెళ్లిపోయాడు.+
7 వాళ్లు యెహోవాకు నమ్మకద్రోహం చేశారు,+
వాళ్లు అక్రమ సంతానానికి తండ్రులయ్యారు.
ఒక నెల వాళ్లను, వాళ్ల స్వాస్థ్యాన్ని* మింగేస్తుంది.*
8 గిబియాలో బూర* ఊదండి,+ రామాలో+ బాకా శబ్దం వినిపించండి!
బేతావెనులో+ యుద్ధకేక వేయండి; బెన్యామీనూ, ముందుండి నడిపించు!
9 ఎఫ్రాయిమూ, శిక్షించే రోజున+ నిన్ను చూసి ప్రజలు భయపడతారు.
ఇశ్రాయేలు గోత్రాల మధ్య ఖచ్చితంగా ఏమి జరగబోతుందో నేను తెలియజేశాను.
10 యూదా అధిపతులు సరిహద్దు రాళ్లను జరిపే వాళ్లలా ఉన్నారు.+
నేను నీళ్లలా నా కోపాన్ని వాళ్ల మీద కుమ్మరిస్తాను.
11 ఎఫ్రాయిము అణచివేయబడ్డాడు, తీర్పు వల్ల నలగ్గొట్టబడ్డాడు,
ఎందుకంటే అతను తన శత్రువు వెంట వెళ్లాలని తీర్మానించుకున్నాడు.+
12 కాబట్టి నేను ఎఫ్రాయిముకు చిమ్మెటలా,
యూదా ఇంటివాళ్లకు కుళ్లులా ఉన్నాను.
13 ఎఫ్రాయిము తన జబ్బును, యూదా తన పుండును చూసుకున్నప్పుడు,
ఎఫ్రాయిము అష్షూరుకు వెళ్లాడు,+ గొప్ప రాజు దగ్గరికి దూతల్ని పంపాడు.
కానీ అతను నిన్ను బాగుచేయలేకపోయాడు,
నీ పుండును నయం చేయలేకపోయాడు.
14 ఎందుకంటే, నేను ఎఫ్రాయిముకు కొదమ సింహంలా,
యూదా ఇంటివాళ్లకు బలమైన సింహంలా ఉంటాను.
స్వయంగా నేనే వాళ్లను ముక్కలుముక్కలుగా చీల్చేసి వెళ్లిపోతాను;+
నేనే వాళ్లను తీసుకెళ్లిపోతాను, వాళ్లను విడిపించేవాళ్లు ఎవ్వరూ ఉండరు.+
15 నేను నా చోటికి తిరిగెళ్లిపోతాను, వాళ్లు తమ దోషశిక్షను అనుభవించే వరకు అక్కడే ఉంటాను,
కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను వెదుకుతారు.”+
6 “రండి, మనం యెహోవా దగ్గరికి తిరిగెళ్దాం,
ఆయన మనల్ని ముక్కలుముక్కలుగా చీల్చేశాడు,+ ఆయనే మనల్ని బాగుచేస్తాడు.
ఆయన మనల్ని కొట్టాడు, ఆయనే మన గాయాలకు కట్టు కడతాడు.
2 రెండు రోజుల తర్వాత ఆయన మనల్ని బలపరుస్తాడు.
మూడో రోజున మనల్ని పైకి లేపుతాడు,
మనం ఆయన ముందు జీవిస్తాం.
3 మనం యెహోవాను తెలుసుకుందాం, ఆయన్ని తెలుసుకోవడానికి తీవ్రంగా కృషిచేద్దాం.
సూర్యుడు ఉదయించడం ఎంత ఖచ్చితమో, ఆయన రావడం కూడా అంతే ఖచ్చితం;
కురిసే వర్షంలా, భూమిని తడిపే కడవరి వానలా*
ఆయన మన దగ్గరికి వస్తాడు.”
4 “ఎఫ్రాయిమూ, నేను నిన్ను ఏం చేయాలి?
యూదా, నిన్ను నేనేం చేయాలి?
నీ విశ్వసనీయ ప్రేమ ఉదయకాల మేఘాల లాంటిది,
త్వరగా మాయమైపోయే మంచు బిందువుల లాంటిది.
నీ మీదికి వచ్చే తీర్పులు వెలుగులా ప్రకాశిస్తాయి.+
6 ఎందుకంటే నేను విశ్వసనీయ ప్రేమను* ఇష్టపడతాను, బలుల్ని కాదు;
దేవుని గురించిన జ్ఞానాన్ని ఇష్టపడతాను, సంపూర్ణ దహనబలుల్ని కాదు.+
7 కానీ వాళ్లు, కేవలం మనుషుల్లా నా ఒప్పందాన్ని మీరారు.+
తమ దేశంలో నాకు నమ్మకద్రోహం చేశారు.
9 యాజకుల సమూహం, మనిషి మీద దాడిచేయడానికి మాటువేసే దోపిడీ ముఠాల్లా ఉంది.
షెకెము+ దగ్గరున్న దారిలో వాళ్లు హత్య చేస్తారు,
వాళ్లది అవమానకరమైన ప్రవర్తన.
10 నేను ఇశ్రాయేలు ఇంటివాళ్లలో ఘోరమైనదాన్ని చూశాను.
11 అయితే యూదా, నీ కోసం కోతకాలం నిర్ణయించబడింది,
బందీలుగా ఉన్న నా ప్రజల్ని నేను తిరిగి సమకూర్చినప్పుడు అది జరుగుతుంది.”+
ఎందుకంటే, వాళ్లు మోసపూరితంగా ప్రవర్తిస్తున్నారు;+
దొంగలు లోపలికి చొరబడుతున్నారు, బయట దోపిడీ ముఠాలు దోచుకుంటున్నాయి.+
2 కానీ నేను వాళ్ల దుష్టత్వమంతటినీ గుర్తు చేసుకుంటానని వాళ్లు తమ హృదయాల్లో అనుకోవడం లేదు.+
వాళ్ల చెడ్డపనులు వాళ్లను చుట్టుముట్టాయి;
అవి సరిగ్గా నా కళ్ల ముందే ఉన్నాయి.
3 వాళ్లు తమ దుష్టత్వంతో రాజును,
మోసంతో అధిపతుల్ని సంతోషపెడుతున్నారు.
4 వాళ్లంతా వ్యభిచారులు,
వంటవాడు అంటించిన పొయ్యిలా మండుతున్నారు;
పిండి పిసికి, ముద్ద పులిసే వరకు అతను ఆ మంటను రేపడు.
5 మన రాజు ఉత్సవ రోజున అధిపతులు జబ్బుపడ్డారు,
ద్రాక్షారసం వల్ల వాళ్లు కోపంగా ఉన్నారు.+
రాజు అపహాసకులతో చేతులు కలిపాడు.
6 పొయ్యిలా మండుతున్న హృదయాలతో వాళ్లు దగ్గరికి వస్తారు.*
వంటవాడు రాత్రంతా నిద్రపోతాడు;
ఉదయం పెద్దపెద్ద మంటలతో పొయ్యి మండుతుంది.
7 వాళ్లంతా పొయ్యిలా వేడిగా ఉన్నారు,
వాళ్లు తమ పరిపాలకుల్ని* మింగేస్తారు.
8 ఎఫ్రాయిము దేశాలతో కలిసిపోయాడు.+
ఎఫ్రాయిము ఒకవైపే కాలిన గుండ్రటి రొట్టెలా ఉన్నాడు.
9 అపరిచితులు అతని శక్తిని దోచుకున్నారు,+ కానీ ఆ విషయం అతనికి తెలియడం లేదు.
అతని వెంట్రుకలు తెల్లబడ్డాయి, కానీ అతను దాన్ని గమనించుకోవడం లేదు.
10 ఇశ్రాయేలు గర్వం అతని మీద సాక్ష్యం చెప్పింది,+
ఇంత జరిగినా, వాళ్లు తమ దేవుడైన యెహోవా దగ్గరికి తిరిగి రాలేదు,+
ఆయన కోసం వెదకలేదు.
11 ఎఫ్రాయిము తెలివి గానీ, వివేచన* గానీ లేని+ పావురంలా ఉన్నాడు.
వాళ్లు ఐగుప్తును పిలిచారు;+ అష్షూరు దగ్గరికి వెళ్లారు.+
12 వాళ్లు ఎక్కడికి వెళ్లినా, నేను నా వలను వాళ్లమీద పరుస్తాను.
ఆకాశపక్షుల్లా వాళ్లను కిందికి పడేస్తాను.
వాళ్ల సమాజానికి ఇచ్చిన హెచ్చరిక ప్రకారం వాళ్లకు క్రమశిక్షణ ఇస్తాను.+
13 వాళ్లకు శ్రమ! ఎందుకంటే, వాళ్లు నా నుండి పారిపోయారు.
వాళ్లకు నాశనం తప్పదు! ఎందుకంటే, వాళ్లు నాకు వ్యతిరేకంగా పాపం చేశారు.
వాళ్లను విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ వాళ్లు నామీద అబద్ధాలు చెప్పారు.+
14 వాళ్లు తమ పరుపుల మీద పడుకుని ఏడుస్తూ ఉంటారు,
కానీ తమ హృదయాల్లో నాకు మొరపెట్టరు.+
వాళ్లు ధాన్యం కోసం, కొత్త ద్రాక్షారసం కోసం తమ శరీరాల్ని కోసుకుంటారు;
వాళ్లు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు.
15 నేను వాళ్లకు క్రమశిక్షణ ఇచ్చినా, వాళ్ల బాహువుల్ని బలపర్చినా,
వాళ్లు చెడు చేయడానికి కుట్ర పన్నుతూ నాకు విరోధులుగా ఉన్నారు.
16 వాళ్లు తమ ప్రవర్తన మార్చుకున్నారు, కానీ ఉన్నతమైనదాని* వైపు తిరగలేదు;
వదులుగా ఉన్న విల్లులా వాళ్లు నమ్మదగినవాళ్లు కాదు.+
వాళ్ల అధిపతులు తమ తిరుగుబాటు మాటల వల్ల ఖడ్గంతో చంపబడతారు.
అందుకే వాళ్లు ఐగుప్తు దేశంలో ఎగతాళికి గురౌతారు.”+
8 “నీ నోటి దగ్గర బూర* పెట్టుకో!+
శత్రువు గద్దలా యెహోవా మందిరం మీదికి వస్తున్నాడు,+
ఎందుకంటే వాళ్లు నా ఒప్పందాన్ని మీరారు,+ నా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపం చేశారు.+
2 వాళ్లు, ‘మా దేవా, ఇశ్రాయేలీయులమైన మాకు నువ్వు తెలుసు!’ అంటూ నాకు మొరపెడతారు.+
3 ఇశ్రాయేలు మంచిని తిరస్కరించాడు.+
శత్రువు అతన్ని వెంటాడాలి.
4 వాళ్లు రాజుల్ని నియమించుకున్నారు, కానీ నా ద్వారా కాదు.
అధిపతుల్ని నియమించుకున్నారు, కానీ నా అనుమతితో కాదు.
5 సమరయా, నీ దూడ తిరస్కరించబడింది.
నా కోపం వాళ్ల మీద రగులుకుంటుంది.+
ఈ దోషం నుండి శుద్ధులవ్వడానికి వాళ్లకు ఇంకా ఎంతకాలం పడుతుంది?
6 అది ఇశ్రాయేలు నుండి వచ్చింది.
ఒక చేతిపనివాడు దాన్ని చేశాడు, అది దేవుడు కాదు;
సమరయలోని దూడ ముక్కలుముక్కలు చేయబడుతుంది.
ఏ దంటుకూ కంకులు రావు;+
మొలకెత్తినవి పిండిని ఇవ్వవు.
ఒకవేళ ఇచ్చినా, పరదేశులు* దాన్ని మింగేస్తారు.+
8 ఇశ్రాయేలు మింగేయబడుతుంది.+
వాళ్లు ఎవరికీ ఇష్టంలేని పాత్రలా
దేశాల మధ్య ఉంటారు.+
9 ఒంటరిగా తిరిగే అడవి గాడిదలా వాళ్లు అష్షూరు దగ్గరికి వెళ్లారు.+
ఎఫ్రాయిము డబ్బిచ్చి వేశ్యల్ని పిలిపించుకున్నాడు.+
10 వాళ్లను దేశాల మధ్య నుండి పిలిపించుకున్నా,
ఇప్పుడు నేను వాళ్లను సమకూరుస్తాను;
రాజు, అధిపతులు విధించిన భారాల వల్ల వాళ్లకు కష్టాలు మొదలౌతాయి.+
11 ఎందుకంటే, ఎఫ్రాయిము ఎన్నో బలిపీఠాల్ని కట్టి పాపం చేశాడు.+
ఆ బలిపీఠాల వల్ల అతని పాపం ఎక్కువైంది.+
13 వాళ్లు బలుల్ని నాకు కానుకగా అర్పిస్తారు, వాటి మాంసం తింటారు,
కానీ యెహోవా వాటిని ఏమాత్రం ఇష్టపడడు.+
ఇప్పుడు ఆయన వాళ్ల తప్పును గుర్తుచేసుకుంటాడు, వాళ్ల పాపాల్ని బట్టి వాళ్లను శిక్షిస్తాడు.+
వాళ్లు ఐగుప్తు వైపుకు తిరిగారు.*+
14 ఇశ్రాయేలు తనను చేసిన వ్యక్తిని మర్చిపోయి,+ గుళ్లను కట్టించాడు;+
యూదా, ప్రాకారాలుగల ఎన్నో నగరాల్ని కట్టించాడు.+
కానీ నేను అతని నగరాల్లోకి అగ్నిని పంపిస్తాను,
అది ప్రతీ బురుజును దహించేస్తుంది.”+
9 “ఇశ్రాయేలూ, సంతోషించకు,
జనాల్లా ఆనందించకు.
వ్యభిచారం* వల్ల నువ్వు నీ దేవునికి దూరంగా వెళ్లావు.+
ప్రతీ ధాన్యపు కళ్లం* దగ్గర నువ్వు పడుపుసొమ్మును ప్రేమించావు.+
3 వాళ్లు ఇక యెహోవా దేశంలో నివసించరు;+
బదులుగా ఎఫ్రాయిము ఐగుప్తుకు తిరిగెళ్లిపోతాడు,
వాళ్లు అష్షూరులో అపవిత్రమైన వాటిని తింటారు.+
అవి దుఃఖపు రొట్టెల్లాంటివి.
వాటిని తినే వాళ్లందరూ అపవిత్రులౌతారు.
వాళ్ల రొట్టె వాళ్ల కోసమే;
అది యెహోవా మందిరంలోకి రాదు.
5 సమావేశ* రోజున మీరేం చేస్తారు?
యెహోవా పండుగ రోజున మీరేం చేస్తారు?
6 ఎందుకంటే ఇదిగో! నాశనం వల్ల వాళ్లు పారిపోవాల్సి వస్తుంది.
ఐగుప్తు వాళ్లను సమకూరుస్తుంది,+ మెంఫిస్ వాళ్లను పాతిపెడుతుంది.+
వాళ్ల ప్రశస్తమైన వెండి వస్తువుల్ని దురదగొండి మొక్కలు ఆక్రమిస్తాయి,
వాళ్ల డేరాల్లో ముళ్లపొదలు పెరుగుతాయి.
వాళ్ల ప్రవక్త బుద్ధిలేని వాడని, దేవుని సందేశం చెప్తున్నాను అనే వ్యక్తి పిచ్చివాడని తేలిపోతుంది;
నీ తప్పులు విస్తారంగా ఉన్నాయి కాబట్టి నీ పట్ల విరోధం కూడా ఎక్కువగా ఉంది.”
8 ఎఫ్రాయిము కావలివాడు+ నా దేవునితో+ ఉండేవాడు.
కానీ ఇప్పుడు అతని ప్రవక్తల+ మార్గాలన్నీ వేటగాడి ఉచ్చుల్లా ఉన్నాయి;
అతని దేవుని మందిరంలో విరోధం ఉంది.
9 గిబియా రోజుల్లోలా,+ వాళ్లు నాశనంలో లోతుగా కూరుకుపోయారు.
ఆయన వాళ్ల తప్పుల్ని గుర్తు చేసుకుంటాడు, వాళ్ల పాపాల్ని బట్టి వాళ్లను శిక్షిస్తాడు.
10 “ఎడారిలో ద్రాక్షపండ్లు దొరికినట్టు ఇశ్రాయేలు నాకు దొరికాడు.+
అంజూర చెట్టుకు కాసిన తొలి అంజూర పండ్లలా నేను మీ పూర్వీకుల్ని కనుగొన్నాను.
కానీ వాళ్లు పెయోరులోని బయలు దగ్గరికి వెళ్లారు;+
అవమానకరమైన దానికి* తమను తాము సమర్పించుకున్నారు,+
తాము ప్రేమించిన వస్తువులా అసహ్యంగా తయారయ్యారు.
11 ఎఫ్రాయిము మహిమ పక్షిలా ఎగిరిపోతుంది;
వాళ్లు గర్భం ధరించరు, పిల్లల్ని కనరు.+
12 ఒకవేళ వాళ్లు పిల్లల్ని పెంచినా,
వాళ్లలో ఒక్కరు కూడా మిగలకుండా పోయేవరకు వాళ్లను నిర్మూలిస్తాను;+
అవును, నేను వాళ్లకు దూరంగా వెళ్లినప్పుడు వాళ్లకు శ్రమ!+
13 పచ్చిక మైదానంలో నాటబడిన ఎఫ్రాయిము, నాకు తూరులా కనిపించాడు;+
ఇప్పుడు ఎఫ్రాయిము వధ కోసం తన కుమారుల్ని బయటికి తీసుకురావాలి.”
14 యెహోవా, నువ్వు వాళ్లకు ఇవ్వాల్సింది వాళ్లకు ఇవ్వు;
వాళ్ల స్త్రీలకు గర్భస్రావం కలిగించు, వాళ్లను చనుపాలు లేనివాళ్లుగా చేయి.
15 “వాళ్ల దుష్టత్వమంతా గిల్గాలులో ఉంది;+ అందుకే, అక్కడ నేను వాళ్లను ద్వేషించడం మొదలుపెట్టాను.
వాళ్ల చెడ్డపనుల్ని బట్టి నేను వాళ్లను నా మందిరంలో నుండి వెళ్లగొడతాను.+
నేను ఇక వాళ్లను ప్రేమించను;+
వాళ్ల అధిపతులందరూ మొండివాళ్లు.
16 ఎఫ్రాయిము చెట్టులా నరికేయబడుతుంది.+
వాళ్ల వేరు ఎండిపోతుంది, వాళ్లు ఏమాత్రం ఫలించరు.
వాళ్లు ఒకవేళ పిల్లల్ని కన్నా, వాళ్లు ఎంతో ప్రేమించే వాళ్ల సంతానాన్ని నేను చంపేస్తాను.”
17 నా దేవుడు వాళ్లను తిరస్కరిస్తాడు,
ఎందుకంటే, వాళ్లు ఆయన మాట వినలేదు,+
వాళ్లు దేశాల మధ్య దేశదిమ్మరులుగా తిరుగుతారు.+
10 “ఇశ్రాయేలు దిగజారిపోతున్న* ఫలించే ద్రాక్షచెట్టు.+
అతని పండ్లు ఎక్కువయ్యే కొద్దీ, అతని బలిపీఠాలు కూడా ఎక్కువౌతున్నాయి;+
అతని నేల పంట ఎక్కువయ్యే కొద్దీ, అతని పూజా స్తంభాల వైభవం కూడా ఎక్కువౌతోంది.+
2 వాళ్ల హృదయం కపటమైనది;
ఇప్పుడు వాళ్లు అపరాధులుగా ఎంచబడతారు.
ఆయన వాళ్ల బలిపీఠాల్ని కూలగొట్టి, వాళ్ల పూజా స్తంభాల్ని నాశనం చేస్తాడు.
3 ఇప్పుడు వాళ్లు, ‘మనకు రాజు లేడు,+ ఎందుకంటే మనం యెహోవాకు భయపడలేదు.
ఒకవేళ రాజు ఉన్నా అతను మనకేం చేస్తాడు?’ అని చెప్పుకుంటారు.
4 వాళ్లు వ్యర్థమైన మాటలు మాట్లాడతారు, అబద్ధ ప్రమాణాలు చేస్తారు,+ ఒప్పందాలు చేసుకుంటారు;
కాబట్టి వాళ్ల తీర్పులు, దున్నబడిన చేనులో మొలిచే విషపు మొక్కల్లా ఉన్నాయి.+
5 సమరయ నివాసులు బేతావెనులోని దూడ విగ్రహం+ విషయంలో భయపడతారు.
దాని ప్రజలు దాని గురించి దుఃఖిస్తారు,
దాన్ని, దాని వైభవాన్ని చూసి ఆనందించిన అన్యదేవుళ్ల పూజారులు కూడా వాళ్లతోపాటు దుఃఖిస్తారు,
ఎందుకంటే, అది వాళ్లకు దూరంగా చెరలోకి వెళ్తుంది.
6 అది గొప్ప రాజుకు కానుకగా అష్షూరుకు తీసుకెళ్లబడుతుంది.+
ఎఫ్రాయిము అవమానాలపాలు అవుతుంది,
ఇశ్రాయేలు తాను పాటించిన సలహాను బట్టి సిగ్గుపడాల్సి వస్తుంది.+
8 ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణమైన+ బేతావెను+ ఉన్నత స్థలాలు సమూలంగా నాశనమౌతాయి.+
వాళ్ల బలిపీఠాల మీద ముళ్లచెట్లు, గచ్చపొదలు పెరుగుతాయి.+
అప్పుడు ప్రజలు, ‘మమ్మల్ని కప్పేయండి!’ అని పర్వతాలతో,
‘మా మీద పడండి!’ అని కొండలతో అంటారు.+
9 ఇశ్రాయేలూ, గిబియా రోజుల నుండి నువ్వు పాపం చేస్తూ వచ్చావు.+
వాళ్లు అక్కడ అదేపనిగా పాపం చేశారు.
యుద్ధం గిబియాలో దుష్టుల్ని సమూలంగా నాశనం చేయలేదు.
10 నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను వాళ్లకు క్రమశిక్షణ ఇస్తాను.
వాళ్ల రెండు తప్పుల్ని వాళ్ల మీద మోపినప్పుడు*
జనాలు వాళ్లకు వ్యతిరేకంగా సమకూడతారు.
11 ఎఫ్రాయిము శిక్షణ పొందిన పెయ్య, దానికి నూర్చడం ఇష్టం,
అందుకే, నేను దాని అందమైన మెడ మీద ఏ భారమూ మోపలేదు.
అయితే ఇప్పుడు నేను ఎఫ్రాయిముతో పొలం దున్నిస్తాను.+
యూదా దున్నుతాడు; యాకోబు అతని కోసం చదును చేస్తాడు.
12 మీ కోసం నీతి అనే విత్తనాలు విత్తండి, విశ్వసనీయ ప్రేమ అనే పంట కోయండి.
13 కానీ మీరు దుష్టత్వాన్ని విత్తారు,
అవినీతిని కోశారు,+
వంచన ఫలాలు తిన్నారు;
ఎందుకంటే మీరు మీ సొంత దారిని,
అధిక సంఖ్యలో ఉన్న మీ యోధుల్ని నమ్ముకున్నారు.
14 నీ ప్రజల మీదికి అల్లరి చెలరేగుతుంది,
ప్రాకారాలుగల నీ నగరాలన్నీ నాశనమౌతాయి,+
అది షల్మాను బేతర్బేలును నాశనం చేసినప్పటిలా,
యుద్ధ రోజున తల్లుల్ని, పిల్లల్ని నేలకేసి కొట్టినప్పటిలా ఉంటుంది.
15 బేతేలూ, నీ ఘోరమైన దుష్టత్వాన్ని బట్టి నీకు ఇలా జరుగుతుంది.+
ఉదయం ఇశ్రాయేలు రాజు ఖచ్చితంగా చంపబడతాడు.”+
3 ఎఫ్రాయిముకు నడక నేర్పింది నేనే;+ నేనే వాళ్లను నా చేతుల్లోకి తీసుకున్నాను;+
కానీ వాళ్లను బాగుచేసింది నేనే అని వాళ్లు గుర్తించలేదు.
4 నేను మనుషుల తాళ్లతో,* ప్రేమ అనే తాళ్లతో వాళ్లను నడిపిస్తూ వచ్చాను,+
వాళ్ల మెడల మీద నుండి కాడిని తీసేశాను,
ఆప్యాయంగా ప్రతీ ఒక్కరికి భోజనం పెట్టాను.
5 అతను ఐగుప్తు దేశానికి తిరిగెళ్లడు, అయితే అష్షూరు అతనికి రాజుగా ఉంటాడు,+
ఎందుకంటే, అతను నా దగ్గరికి తిరిగి రావడానికి ఒప్పుకోలేదు.+
6 అతని నగరాల మీద ఖడ్గం తిరుగుతుంది,+
అది అతని ద్వారాల అడ్డగడియల్ని నాశనం చేస్తుంది, వాళ్ల కుట్రల్ని బట్టి వాళ్లను మింగేస్తుంది.+
7 నా ప్రజలు నా పట్ల నమ్మకద్రోహంగా ప్రవర్తించాలని నిశ్చయించుకున్నారు.+
ఉన్నతమైనదాని* వైపు పిలిచినా, ఎవ్వరూ లేవట్లేదు.
8 ఎఫ్రాయిమూ, నేను నిన్ను ఎలా వదిలేయగలను?
ఇశ్రాయేలూ, నేను నిన్ను ఎలా అప్పగించగలను?
నిన్ను అద్మాలా ఎలా చూడగలను?
నిన్ను సెబోయీములా ఎలా చేయగలను?+
నీ విషయంలో నా మనసు మారింది;
నీ మీద నాకు కనికరం కలిగింది.+
9 నేను నా కోపాగ్నిని వెళ్లగక్కను.
నేను మళ్లీ ఎఫ్రాయిమును నాశనం చేయను,+
ఎందుకంటే నేను మనిషిని కాదు దేవుణ్ణి,
మీ మధ్య ఉన్న పవిత్ర దేవుణ్ణి;
నేను కోపంతో మీ మీద విరుచుకుపడను.
10 వాళ్లు యెహోవాను అనుసరిస్తారు, ఆయన సింహంలా గర్జిస్తాడు;+
ఆయన గర్జించినప్పుడు, ఆయన పిల్లలు పడమటి నుండి వణుకుతూ వస్తారు.+
11 వాళ్లు పక్షిలా వణుకుతూ ఐగుప్తు నుండి బయటికి వస్తారు,
పావురంలా అష్షూరు దేశం నుండి బయటికి వస్తారు;+
నేను వాళ్లను తమ ఇళ్లలో స్థిరపడేలా చేస్తాను” అని యెహోవా అంటున్నాడు.+
12 “ఎఫ్రాయిము అబద్ధాలతో నన్ను చుట్టుముట్టాడు,
ఎక్కడ చూసినా ఇశ్రాయేలు ఇంటివాళ్ల మోసమే కనిపిస్తుంది.+
కానీ యూదా ఇంకా దేవునితోనే నడుస్తున్నాడు,
అతి పవిత్రుడైన దేవునికి నమ్మకంగా ఉన్నాడు.”+
12 “ఎఫ్రాయిము గాలిని తింటున్నాడు.
రోజంతా తూర్పు గాలి వెంట పరుగులు తీస్తున్నాడు.
అతని అబద్ధాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి.
వాళ్లు అష్షూరుతో ఒప్పందం చేసుకున్నారు,+ ఐగుప్తుకు తైలం తీసుకెళ్లారు.+
2 యెహోవాకు యూదా మీద ఒక వ్యాజ్యం ఉంది;+
యాకోబు మార్గాల్ని బట్టి ఆయన అతన్ని లెక్క అడుగుతాడు,
అతని పనుల్ని బట్టి అతనికి ప్రతిఫలం ఇస్తాడు.+
4 అతను దేవదూతతో పోరాడి, చివరికి గెలిచాడు.
అనుగ్రహం కోసం అతను ఏడుస్తూ బ్రతిమాలాడు.”+
ఆయన అతన్ని బేతేలు దగ్గర కనుగొన్నాడు, అక్కడ ఆయన మన గురించి* మాట్లాడాడు,+
5 ఆయనే సైన్యాలకు దేవుడైన యెహోవా,+
6 “కాబట్టి మీ దేవుని దగ్గరికి తిరిగిరండి,+
విశ్వసనీయ ప్రేమ చూపిస్తూ ఉండండి, న్యాయంగా ప్రవర్తిస్తూ ఉండండి,+
ఎల్లప్పుడూ మీ దేవుని మీద ఆశపెట్టుకోండి.
నా చేతుల కష్టమంతట్లో వాళ్లు ఏ తప్పునూ, పాపాన్నీ కనుక్కోలేరు.’
9 కానీ నేను యెహోవాను, ఐగుప్తు దేశంలో ఉన్నప్పటి నుండి* నీ దేవుణ్ణి.+
నియమిత కాలంలోని* రోజుల్లోలా
నిన్ను మళ్లీ డేరాల్లో నివసించేలా చేస్తాను.
11 గిలాదులో మోసం,* అబద్ధం ఉన్నాయి.
వాళ్లు గిల్గాలులో ఎద్దుల్ని బలి అర్పించారు,+
వాళ్ల బలిపీఠాలు, పొలం చాళ్లల్లో ఉన్న రాళ్లకుప్పల్లా ఉన్నాయి.+
12 యాకోబు అరాము* ప్రాంతానికి పారిపోయాడు;+
భార్య కోసం ఇశ్రాయేలు+ అక్కడ సేవచేశాడు,+
భార్య కోసం గొర్రెలు కాశాడు.+
13 ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు,+
ఒక ప్రవక్త ద్వారా అతన్ని సంరక్షించాడు.+
14 ఎఫ్రాయిము ఘోరమైన తప్పు చేశాడు;+
అతని రక్తాపరాధం అతని మీద నిలిచివుంది;
అతను తన ప్రభువు మీదికి తెచ్చిన అవమానాన్ని బట్టి ఆయన అతనికి ప్రతీకారం చేస్తాడు.”+
13 “ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు, ప్రజలు భయంతో వణికిపోయేవాళ్లు;
అతను ఇశ్రాయేలులో ప్రముఖుడు.+
కానీ అతను బయలును పూజించడం ద్వారా పాపం చేసి,+ చనిపోయాడు.
2 ఇప్పుడు వాళ్ల పాపాలు ఇంకా పెరిగిపోతున్నాయి.
వాళ్లు తమ వెండితో పోత* విగ్రహాలు చేసుకుంటున్నారు;+
చేతిపనివాళ్లు నైపుణ్యంగా విగ్రహాలు తయారు చేస్తున్నారు.
‘బలులు అర్పించేవాళ్లు ఆ దూడల్ని ముద్దు పెట్టుకోవాలి’ అని వాటి గురించి అంటున్నారు.+
3 కాబట్టి వాళ్లు ఉదయకాల మేఘాల్లా,
పొద్దున్నే త్వరగా మాయమైపోయే మంచు బిందువుల్లా,
కళ్లం దగ్గర గాలికి ఎగిరిపోయే ధాన్యపు పొట్టులా,
పొగ గొట్టం నుండి బయటికి పోయే పొగలా ఉంటారు.
4 కానీ నేను యెహోవాను, ఐగుప్తు దేశంలో ఉన్నప్పటి నుండి* నీ దేవుణ్ణి;+
నేను తప్ప వేరే ఏ దేవుడూ నీకు తెలీదు,
నేను తప్ప వేరే రక్షకుడు లేడు.+
5 ఎడారిలో, ఎండిపోయిన దేశంలో నేను నిన్ను చూసుకున్నాను.+
దాంతో వాళ్లు నన్ను మర్చిపోయారు.+
7 నేను వాళ్లకు కొదమ సింహంలా,+
దారిలో నక్కి ఉండే చిరుతపులిలా అవుతాను.
8 పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటిలా నేను వాళ్ల మీద పడి,
వాళ్ల ఛాతిని చీల్చేస్తాను.
సింహంలా నేను అక్కడ వాళ్లను మింగేస్తాను;
అడవి మృగం వాళ్లను ముక్కలుముక్కలుగా చీల్చేస్తుంది.
9 ఇశ్రాయేలూ, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది,
ఎందుకంటే, మీకు అండగా ఉన్న నా మీదే మీరు తిరుగుబాటు చేశారు.
10 ‘మాకు రాజును, అధిపతుల్ని’ ఇవ్వు అని మీరు అడిగారు కదా.+
మీ నగరాలన్నిట్లో మిమ్మల్ని కాపాడే మీ రాజు ఎక్కడ?+
మీ పరిపాలకులు* ఎక్కడ?
12 ఎఫ్రాయిము దోషం చుట్టబడింది;*
అతని పాపం నిల్వచేయబడింది.
13 పురిటినొప్పుల లాంటి వేదనలు అతనికి వస్తాయి.
కానీ అతను తెలివిలేని పిల్లవాడు;
పుట్టే సమయం వచ్చినప్పుడు అతను బయటికి రావాలనుకోడు.
మరణమా, నీ విషపు కొండ్లు* ఎక్కడ?+
నాశనం చేసే సమాధీ, నువ్వు ఎక్కడ?+
నేను కనికరం చూపించను.
15 ఒకవేళ అతను జమ్ముగడ్డి మధ్య వర్ధిల్లినా,
తూర్పు గాలి, అంటే యెహోవా గాలి వస్తుంది,
అది ఎడారి నుండి వచ్చి అతని బావిని ఎండిపోజేస్తుంది, అతని ఊటను ఇంకిపోజేస్తుంది.
అతని ప్రశస్తమైన వస్తువుల ఖజానా అంతటినీ అది దోచుకెళ్తుంది.+
16 సమరయ అపరాధిగా ఎంచబడుతుంది,+ ఎందుకంటే అది తన దేవునికి ఎదురుతిరిగింది.+
వాళ్లు ఖడ్గం వల్ల చనిపోతారు,+
వాళ్ల పిల్లల్ని ముక్కలుముక్కలు చేస్తారు,
వాళ్ల గర్భిణీ స్త్రీల కడుపుల్ని చీల్చేస్తారు.”
14 “ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవా దగ్గరికి తిరిగి రా,+
ఎందుకంటే, నీ తప్పుల వల్ల నువ్వు తడబడ్డావు.
2 ఈ మాటలతో యెహోవా దగ్గరికి తిరిగిరండి,
ఆయనతో ఇలా అనండి: ‘దయచేసి మా తప్పుల్ని మన్నించి,+ మా నుండి మంచిని స్వీకరించు,
అప్పుడు మేము కోడెదూడల్ని అర్పించినట్టు, మా పెదాల స్తుతిని* అర్పిస్తాం.+
3 అష్షూరు మమ్మల్ని రక్షించదు.+
మేము గుర్రాల మీద స్వారీ చేయం,+
మా చేతులతో చేసినదానితో, “మా దేవా!” అని ఇక అనం,
ఎందుకంటే, నీ వల్లే తండ్రిలేని పిల్లవాడికి కరుణ చూపించబడుతుంది.’+
4 నేను వాళ్లను బాగుచేస్తాను, ఇకమీదట వాళ్లు నమ్మకద్రోహం చేయరు.+
5 నేను ఇశ్రాయేలుకు మంచులా అవుతాను;
అతను లిల్లీ పువ్వులా వికసిస్తాడు,
లెబానోను చెట్లలా వేళ్లూనుకుంటాడు.
6 అతని కొమ్మలు వ్యాపిస్తాయి,
అతని వైభవం ఒలీవ చెట్టు వైభవంలా ఉంటుంది,
అతని సువాసన లెబానోను సువాసనలా ఉంటుంది.
7 వాళ్లు మళ్లీ ఆయన నీడలో నివసిస్తారు.
వాళ్లు ధాన్యం పండిస్తారు, ద్రాక్షతీగలా వికసిస్తారు.+
ఆయన కీర్తి* లెబానోను ద్రాక్షారసంలా ఉంటుంది.
8 ఎఫ్రాయిము, ‘నాకు ఇక ఈ విగ్రహాలతో పనేంటి?’ అని అంటాడు.+
నేను అతనికి జవాబిస్తాను, అతన్ని కనిపెట్టుకొని ఉంటాను.+
నేను పచ్చని సరళవృక్షంలా* ఉంటాను.
నా దగ్గర ఖచ్చితంగా నీకు పండ్లు దొరుకుతాయి.”
9 తెలివిగల వాళ్లు ఎవరు? వాళ్లు ఈ విషయాల్ని అర్థం చేసుకోవాలి.
బుద్ధిగల వాళ్లు ఎవరు? వాళ్లు వీటిని తెలుసుకోవాలి.
ఇది హోషాయాకు సంక్షిప్త రూపం. దీనికి, “‘యా’ చేత రక్షించబడినవాడు; ‘యా’ రక్షించాడు” అని అర్థం. “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
లేదా “అనైతికత; విచ్చలవిడి అక్రమ సంబంధాలు.”
లేదా “అనైతికత; విచ్చలవిడి అక్రమ సంబంధాల.”
లేదా “అనైతికత; విచ్చలవిడి అక్రమ సంబంధాల.”
“దేవుడు విత్తనం విత్తుతాడు” అని అర్థం.
“కరుణించబడలేదు” అని అర్థం.
“నా ప్రజలు కాదు” అని అర్థం.
అక్ష., “కుమారుల.”
హోషేయ 1:9 అధస్సూచి చూడండి.
హోషేయ 1:6 అధస్సూచి చూడండి.
లేదా “అనైతికతను; విచ్చలవిడి అక్రమ సంబంధాల్ని.”
పదకోశం చూడండి.
లేదా “అనైతికత; విచ్చలవిడి అక్రమ సంబంధాల.”
లేదా “అనైతికత; విచ్చలవిడి అక్రమ సంబంధాలు.”
అక్ష., “వాళ్లు.”
అక్ష., “ఆమె మర్మాంగాలు కనబడేలా చేస్తాను.”
లేదా “సబ్బాతు రోజులకు.”
లేదా “ఈజిప్టు.”
లేదా “నా బయలు.”
లేదా “నిబంధన.”
లేదా “జీవించేలా.”
“దేవుడు విత్తనం విత్తుతాడు” అని అర్థం.
హోషేయ 1:6 అధస్సూచి చూడండి.
హోషేయ 1:9 అధస్సూచి చూడండి.
అంటే, అబద్ధ ఆరాధనలో వాడేవి.
అప్పట్లో ఒక హోమర్ 220 లీటర్లతో (దాదాపు 130 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “అనైతికత; విచ్చలవిడి అక్రమ సంబంధాలు.”
లేదా “నేను కూడా నీతో లైంగిక సంబంధం పెట్టుకోను.”
అక్ష., “చాలా రోజుల.”
లేదా “ఉపదేశాన్ని.”
లేదా “వాళ్లు నన్ను మహిమపర్చే బదులు అవమానిస్తున్నారు” అయ్యుంటుంది.
అంటే, యాజకులు.
లేదా “ఘోరమైన అనైతికతకు పాల్పడతారు; వ్యభిచారం చేస్తారు.”
లేదా “అనైతికత; విచ్చలవిడి అక్రమ సంబంధాలు.”
అక్ష., “హృదయాన్ని.”
లేదా “సోదె చెప్పేవాళ్ల కర్ర.”
లేదా “అనైతిక; విచ్చలవిడి అక్రమ సంబంధాల.”
లేదా “అనైతికత; విచ్చలవిడి అక్రమ సంబంధాల.”
లేదా “అనైతికత; విచ్చలవిడి అక్రమ సంబంధాలు.”
అక్ష., “విశాలమైన చోట.”
లేదా “గోధుమలతో తయారైన మద్యం.”
లేదా “ఘోరమైన అనైతికతకు పాల్పడతారు; వ్యభిచారం చేస్తారు.”
లేదా “ఊడ్చేస్తుంది.”
అక్ష., “పడిపోతున్నవాళ్లు.”
లేదా “క్రమశిక్షణ ఇస్తాను.”
లేదా “అనైతికతకు పాల్పడ్డావు; వ్యభిచారం చేశావు.”
లేదా “అనైతిక; విచ్చలవిడి అక్రమ సంబంధాల.”
లేదా “పొలాల్ని.”
లేదా “ఒక నెలలో వాళ్లు, వాళ్ల స్వాస్థ్యం మింగేయబడుతుంది” అయ్యుంటుంది.
అక్ష., “కొమ్ము.”
అక్ష., “ముఖాన్ని.”
కడవరి వానలు దాదాపు ఏప్రిల్ మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.
లేదా “కరుణను.”
లేదా “వాళ్లు తమ కుతంత్రాలతో దగ్గరికి వస్తున్నప్పుడు, వాళ్ల హృదయాలు పొయ్యిలా ఉన్నాయి” అయ్యుంటుంది.
అక్ష., “న్యాయమూర్తుల్ని.”
అక్ష., “హృదయం.”
అంటే, ఉన్నతమైన ఆరాధన.
అక్ష., “కొమ్ము.”
లేదా “అపరిచితులు.”
లేదా “ఉపదేశంలోని.”
లేదా “తిరిగెళ్తారు” అయ్యుంటుంది.
లేదా “అనైతికత; విచ్చలవిడి అక్రమ సంబంధాల.”
పదకోశం చూడండి.
అక్ష., “ఆమెకు.”
లేదా “మీ నియామక విందు.”
లేదా “అవమానకరమైన దేవునికి.”
లేదా “విస్తరిస్తున్న” అయ్యుంటుంది.
అంటే, వాళ్లు తమ శిక్షను కాడిలా మోసినప్పుడు.
అంటే, ప్రవక్తలూ ఇశ్రాయేలు ప్రజలకు ఉపదేశించడానికి పంపబడిన ఇతరులూ వాళ్లను పిలిచినకొద్దీ.
లేదా “దయ అనే తాళ్లతో.” ఇవి పిల్లలకు నడక నేర్పించడానికి తల్లిదండ్రులు ఉపయోగించే తాళ్లు అని తెలుస్తోంది.
అంటే, ఉన్నతమైన ఆరాధన.
అక్ష., “మనతో.”
లేదా “అనే పేరుతో ఆయన గుర్తుచేసుకోబడతాడు.”
లేదా “వ్యాపారి.”
అక్ష., “దేశం నుండి.”
లేదా “పండుగ” అయ్యుంటుంది.
లేదా “ఉపమానాలు.”
లేదా “దుష్టశక్తుల నుండి వచ్చినవి; అంతుచిక్కనివి.”
లేదా “సిరియా.”
లేదా “లోహపు.”
అక్ష., “దేశం నుండి.”
అక్ష., “న్యాయమూర్తులు.”
లేదా “భద్రం చేయబడింది.”
లేదా “షియోల్,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.
లేదా “ముళ్లు.”
అక్ష., “మా పెదవులు అనే కోడెదూడల్ని.”
లేదా “నేనే నా ఇష్టానుసారంగా.”
అక్ష., “జ్ఞాపకార్థం.”
అంటే, జూనిపర్ చెట్టు.