దినవృత్తాంతాలు మొదటి గ్రంథం
1 ఆదాము,
షేతు,+
ఎనోషు,
2 కేయినాను,
మహలలేలు,+
యెరెదు,
3 హనోకు,+
మెతూషెల,
లెమెకు,+
4 నోవహు,+
షేము,+ హాము, యాపెతు.
5 యాపెతు కుమారులు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు,+ మెషెకు, తీరసు.
6 గోమెరు కుమారులు: అష్కనజు, రీఫతు, తోగర్మా.+
7 యావాను కుమారులు: ఎలీషా, తర్షీషు, కిత్తీము, రోదానీము.
8 హాము కుమారులు: కూషు, మిస్రాయిము, పూతు, కనాను.
9 కూషు కుమారులు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా.
రాయమా కుమారులు: షేబ, దెదాను.+
10 కూషు నిమ్రోదును కన్నాడు. భూమ్మీద మొట్టమొదటి పరాక్రమశాలి ఇతనే.
11 మిస్రాయిము కుమారులు: లూదు,+ అనాము, లెహాబు, నప్తుహు, 12 పత్రుసు,+ కస్లూహు (ఇతని నుండే ఫిలిష్తీయులు వచ్చారు), కఫ్తోరు.+
13 కనాను కుమారులు: మొదటి కుమారుడు సీదోను, హేతు; 14 అలాగే యెబూసీయులు, అమోరీయులు,+ గిర్గాషీయులు,+ 15 హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, 16 అర్వదీయులు,+ సెమారీయులు, హమాతీయులు.
17 షేము కుమారులు: ఏలాము,+ అస్సూరు,+ అర్పక్షదు, లూదు, అరాము;
అలాగే* ఊజు, హూలు, గెతెరు, మాష.+
18 అర్పక్షదు షేలహును+ కన్నాడు, షేలహు ఏబెరును కన్నాడు.
19 ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు. ఒకతని పేరు పెలెగు.*+ అతని జీవితకాలంలోనే ప్రపంచ జనాభా చెదిరిపోయింది* కాబట్టి అతనికి ఆ పేరు పెట్టారు. అతని సహోదరుని పేరు యొక్తాను.
20 యొక్తాను కుమారులు: అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,+ 21 హదోరము, ఊజాలు, దిక్లాను, 22 ఓబాలు, అబీమాయేలు, షేబ, 23 ఓఫీరు,+ హవీలా,+ యోబాబు; వీళ్లంతా యొక్తాను కుమారులు.
24 షేము,
అర్పక్షదు,
షేలహు,
25 ఏబెరు,
పెలెగు,+
రయూ,+
26 సెరూగు,+
నాహోరు,+
తెరహు,+
27 అబ్రాము, అంటే అబ్రాహాము.+
28 అబ్రాహాము కుమారులు: ఇస్సాకు,+ ఇష్మాయేలు.+
29 వాళ్ల వంశస్థులు: ఇష్మాయేలు పెద్ద కుమారుడు నెబాయోతు,+ తర్వాత కేదారు,+ అద్బయేలు, మిబ్శాము,+ 30 మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా, 31 యెతూరు, నాపీషు, కెదెమా. వీళ్లు ఇష్మాయేలు కుమారులు.
32 అబ్రాహాము ఉపపత్ని కెతూరా+ జిమ్రానును, యొక్షానును, మెదానును, మిద్యానును,+ ఇష్బాకును, షూవహును+ కన్నది.
యొక్షాను కుమారులు: షేబ, దెదాను.+
33 మిద్యాను కుమారులు: ఏయిఫా,+ ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా.
వీళ్లంతా కెతూరా మనవళ్లు.
34 అబ్రాహాము ఇస్సాకును కన్నాడు.+ ఇస్సాకు కుమారులు: ఏశావు,+ ఇశ్రాయేలు.+
35 ఏశావు కుమారులు: ఎలీఫజు, రగూయేలు, యూషు, యాలాము, కోరహు.+
36 ఎలీఫజు కుమారులు: తేమాను,+ ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా, అమాలేకు.+
37 రగూయేలు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ.+
38 శేయీరు+ కుమారులు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దీషాను.+
39 లోతాను కుమారులు: హోరీ, హోమాము. లోతాను సహోదరి తిమ్నా.+
40 శోబాలు కుమారులు: అల్వాను, మానహతు, ఏబాలు, షెపో, ఓనాము.
సిబ్యోను కుమారులు: అయ్యా, అనా.+
41 అనా కుమారుడు* దిషోను.
దిషోను కుమారులు: హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.+
42 ఏసెరు+ కుమారులు: బిల్హాను, జవాను, అకాను.
దీషాను కుమారులు: ఊజు, అరాను.+
43 ఇశ్రాయేలీయుల్ని* ఏ రాజూ పరిపాలించక ముందు, ఎదోము దేశంలో+ పరిపాలించిన రాజులు వీళ్లే:+ బెయోరు కుమారుడు బెల; అతని నగరం పేరు దిన్హాబా. 44 బెల చనిపోయాక, అతని స్థానంలో బొస్రాకు+ చెందిన జెరహు కుమారుడు యోబాబు రాజయ్యాడు. 45 యోబాబు చనిపోయాక, అతని స్థానంలో తేమానీయుల దేశానికి చెందిన హుషాము రాజయ్యాడు. 46 హుషాము చనిపోయాక, అతని స్థానంలో బెదెదు కుమారుడైన హదదు రాజయ్యాడు. అతను మోయాబు ప్రాంతంలో మిద్యానును ఓడించాడు. అతని నగరం పేరు అవీతు. 47 హదదు చనిపోయాక, అతని స్థానంలో మశ్రేకాకు చెందిన శమ్లా రాజయ్యాడు. 48 శమ్లా చనిపోయాక, నది తీరాన ఉన్న రహెబోతుకు చెందిన షావూలు అతని స్థానంలో రాజయ్యాడు. 49 షావూలు చనిపోయాక, అతని స్థానంలో అక్బోరు కుమారుడైన బయల్-హానాను రాజయ్యాడు. 50 బయల్-హానాను చనిపోయాక, అతని స్థానంలో హదదు* రాజయ్యాడు. అతని నగరం పేరు పాయు, అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మత్రేదు కూతురు. మత్రేదు మేజాహాబు కూతురు. 51 తర్వాత హదదు చనిపోయాడు.
ఎదోము షేక్‌లు:* షేక్ తిమ్నా, షేక్ అల్వా, షేక్ యతేతు, 52 షేక్ అహోలీబామా, షేక్ ఏలా, షేక్ పీనోను, 53 షేక్ కనజు, షేక్ తేమాను, షేక్ మిబ్సారు, 54 షేక్ మగ్దీయేలు, షేక్ ఈరాము. వీళ్లు ఎదోము షేక్‌లు.
2 ఇశ్రాయేలు కుమారులు: రూబేను,+ షిమ్యోను, లేవి,+ యూదా,+ ఇశ్శాఖారు,+ జెబూలూను,+ 2 దాను,+ యోసేపు,+ బెన్యామీను,+ నఫ్తాలి,+ గాదు,+ ఆషేరు.+
3 యూదా కుమారులు: ఏరు, ఓనాను, షేలహు. వీళ్లు షూయ కూతురు ద్వారా యూదాకు పుట్టారు, ఆమె కనానీయురాలు.+ యూదా పెద్ద కుమారుడైన ఏరు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు కాబట్టి ఆయన అతన్ని చంపాడు. 4 యూదా కోడలు తామారు యూదాకు పెరెసును,+ జెరహును కన్నది. యూదాకు మొత్తం ఐదుగురు కుమారులు.
5 పెరెసు కుమారులు: ఎస్రోను, హామూలు.
6 జెరహు కుమారులు: జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దార. మొత్తం ఐదుగురు.
7 కర్మీ కుమారుడు* ఆకారు;* ఇతను, నాశనం చేయబడాల్సినవాటి విషయంలో నమ్మకద్రోహానికి పాల్పడి ఇశ్రాయేలీయుల మీదికి విపత్తు* తీసుకొచ్చాడు.+
8 ఏతాను కుమారుడు* అజర్యా.
9 ఎస్రోను కుమారులు: యెరహ్మెయేలు, రాము,+ కెలూబై.*
10 రాము అమ్మీనాదాబును కన్నాడు. అమ్మీనాదాబు నయస్సోనును కన్నాడు. నయస్సోను+ యూదా వంశస్థులకు ప్రధానుడు. 11 నయస్సోను శల్మాను కన్నాడు.+ శల్మా బోయజును కన్నాడు. 12 బోయజు ఓబేదును కన్నాడు. ఓబేదు యెష్షయిని+ కన్నాడు. 13 యెష్షయి తన పెద్ద కుమారుడు ఏలీయాబును, రెండో కుమారుడు అబీనాదాబును, మూడో కుమారుడు షిమ్యాను,+ 14 నాలుగో కుమారుడు నెతనేలును, ఐదో కుమారుడు రద్దయిని, 15 ఆరో కుమారుడు ఓజెమును, ఏడో కుమారుడు దావీదును+ కన్నాడు. 16 వాళ్ల సహోదరీలు సెరూయా, అబీగయీలు.+ సెరూయా ముగ్గురు కుమారుల పేర్లు అబీషై,+ యోవాబు,+ అశాహేలు.+ 17 అబీగయీలు అమాశాను+ కన్నది. అమాశా తండ్రి ఇష్మాయేలీయుడైన యెతెరు.
18 ఎస్రోను కుమారుడైన కాలేబు* తన భార్య అజూబా ద్వారా, యెరీయోతు ద్వారా యేషెరును, షోబాబును, అర్దోనును కన్నాడు. 19 అజూబా చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రాత్‌ను+ పెళ్లి చేసుకున్నాడు; ఆమె అతనికి హూరును+ కన్నది. 20 హూరు ఊరిని కన్నాడు. ఊరి బెసలేలును+ కన్నాడు.
21 తర్వాత ఎస్రోను, గిలాదు తండ్రైన మాకీరు+ కూతుర్ని పెళ్లి చేసుకుని ఆమెతో కలిశాడు. అప్పుడు అతనికి 60 ఏళ్లు. ఆమె అతనికి సెగూబును కన్నది. 22 సెగూబు యాయీరును+ కన్నాడు; యాయీరుకు గిలాదు ప్రాంతంలో+ 23 నగరాలు ఉండేవి. 23 తర్వాత గెషూరువాళ్లు,+ సిరియావాళ్లు+ వీళ్ల దగ్గర నుండి హవోత్-యాయీరును,+ కెనాతును,+ దాని చుట్టుపక్కల పట్టణాల్ని, అలా మొత్తం 60 నగరాల్ని తీసుకున్నారు. వీళ్లందరూ గిలాదు తండ్రైన మాకీరు వంశస్థులు.
24 కాలేబు-ఎఫ్రాతాలో ఎస్రోను+ చనిపోయిన తర్వాత, ఎస్రోను భార్య అబీయా అతనికి అష్షూరును+ కన్నది. అష్షూరు తెకోవకు+ తండ్రి.*
25 ఎస్రోను మొదటి కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు: మొదటి కుమారుడైన రాము అలాగే బూనా, ఓరెను, ఓజెము, అహీయా. 26 యెరహ్మెయేలుకు ఇంకో భార్య ఉండేది, ఆమె పేరు అటారా. ఆమె ఓనాముకు తల్లి. 27 యెరహ్మెయేలు మొదటి కుమారుడైన రాము కుమారులు: మయజు, యామీను, ఏకెరు. 28 ఓనాము కుమారులు: షమ్మయి, యాదా. షమ్మయి కుమారులు: నాదాబు, అబీషూరు. 29 అబీషూరు భార్య పేరు అబీహాయిలు; ఆమె అతనికి అహ్బానును, మొలీదును కన్నది. 30 నాదాబు కుమారులు: సెలెదు, అప్పయీము. అయితే సెలెదు పిల్లలు లేకుండా చనిపోయాడు. 31 అప్పయీము కుమారుడు* ఇషీ. ఇషీ కుమారుడు* షేషాను, షేషాను కుమారుడు* అహ్లయి. 32 షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు: యెతెరు, యోనాతాను. అయితే యెతెరు పిల్లలు లేకుండా చనిపోయాడు. 33 యోనాతాను కుమారులు: పేలెతు, జాజా. వీళ్లు యెరహ్మెయేలు వంశస్థులు.
34 షేషానుకు కూతుళ్లే గానీ కుమారులు లేరు. షేషానుకు యర్హా అనే సేవకుడు ఉన్నాడు, అతను ఐగుప్తీయుడు. 35 షేషాను తన సేవకుడైన యర్హాకు తన కూతుర్ని ఇచ్చి పెళ్లిచేశాడు. ఆమె అతనికి అత్తయిని కన్నది. 36 అత్తయి నాతానును కన్నాడు. నాతాను జాబాదును కన్నాడు. 37 జాబాదు ఎప్లాలును కన్నాడు. ఎప్లాలు ఓబేదును కన్నాడు. 38 ఓబేదు యెహూను కన్నాడు. యెహూ అజర్యాను కన్నాడు. 39 అజర్యా హేలెస్సును కన్నాడు. హేలెస్సు ఎలాశాను కన్నాడు. 40 ఎలాశా సిస్మాయీని కన్నాడు. సిస్మాయీ షల్లూమును కన్నాడు. 41 షల్లూము యెకమ్యాను కన్నాడు. యెకమ్యా ఎలీషామాను కన్నాడు.
42 యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు*+ కుమారులు: జీఫుకు తండ్రైన మేషా కాలేబు మొదటి కుమారుడు; అలాగే హెబ్రోనుకు తండ్రైన మారేషా కుమారులు. 43 హెబ్రోను కుమారులు: కోరహు, తప్పూయ, రేకెము, షెమ. 44 షెమ యోర్కెయాము తండ్రైన రహమును కన్నాడు. రేకెము షమ్మయిని కన్నాడు. 45 షమ్మయి కుమారుడు మాయోను. మాయోను బేత్సూరుకు+ తండ్రి. 46 కాలేబు ఉపపత్ని అయిన ఏయిఫా హారానును, మోజాను, గాజేజును కన్నది. హారాను గాజేజును కన్నాడు. 47 యెహ్దయి కుమారులు: రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా, షయపు. 48 కాలేబు ఉపపత్ని మయకా షెబెరును, తిర్హనాను కన్నది. 49 కొంతకాలం తర్వాత ఆమె షయపును కన్నది. షయపు మద్మన్నాకు+ తండ్రి; ఆమె షెవాను కూడా కన్నది. షెవా మక్బేనాకు, గిబ్యాకు+ తండ్రి. కాలేబు కూతురి పేరు అక్సా.+ 50 వీళ్లు కాలేబు వంశస్థులు.
ఎఫ్రాతా+ మొదటి కుమారుడైన హూరు+ కుమారులు: కిర్యత్యారీము+ తండ్రైన శోబాలు, 51 బేత్లెహేము+ తండ్రైన శల్మా, బేత్గాదేరు తండ్రైన హారేపు. 52 కిర్యత్యారీము తండ్రైన శోబాలు కుమారులు: హారోయే, మనుహోతు ప్రజల్లో సగంమంది. 53 కిర్యత్యారీము కుటుంబాలు ఇవి: ఇత్రీయులు,+ పూతీయులు, షుమ్మాతీయులు, మిష్రాయీయులు. వాళ్ల నుండే సొరాతీయులు,+ ఎష్తాయులీయులు+ వచ్చారు. 54 శల్మా కుమారులు: బేత్లెహేము వాళ్లు,+ నెటోపాతీయులు, అతారోతు-బేత్-యోవాబు వాళ్లు, మానహతు వాళ్లలో సగంమంది, జారీయులు. 55 యబ్బేజులోని శాస్త్రుల కుటుంబాలు ఇవి: తిరాతీయులు, షిమ్యాతీయులు, శూకోతీయులు. వీళ్లు కేనీయులు,+ రేకాబు ఇంటివాళ్లకు+ తండ్రైన హమాతు వంశస్థులు.
3 హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారులు: మొదటి కుమారుడు అమ్నోను, అతని తల్లి యెజ్రెయేలుకు చెందిన అహీనోయము; రెండో కుమారుడు దానియేలు, అతని తల్లి కర్మెలీయురాలైన అబీగయీలు;+ 2 మూడో కుమారుడు అబ్షాలోము,+ అతను గెషూరు రాజైన తల్మయి కూతురైన మయకా ద్వారా పుట్టాడు; నాలుగో కుమారుడు అదోనీయా,+ అతను హగ్గీతు ద్వారా పుట్టాడు; 3 ఐదో కుమారుడు షెఫట్య, అతని తల్లి అబీటలు; ఆరో కుమారుడు ఇత్రెయాము, అతను దావీదు భార్య ఎగ్లా ద్వారా పుట్టాడు. 4 ఈ ఆరుగురు హెబ్రోనులో దావీదుకు పుట్టారు; అతను హెబ్రోనులో ఏడున్నర సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు పరిపాలించాడు.
5 యెరూషలేములో దావీదుకు పుట్టినవాళ్లు:+ షిమ్యా, షోబాబు, నాతాను,+ సొలొమోను;+ ఈ నలుగురు అమ్మీయేలు కూతురైన బత్షెబ ద్వారా పుట్టారు. 6 దావీదుకు మరో తొమ్మిది మంది కుమారులు ఉన్నారు, వాళ్లు: ఇభారు, ఎలీషామా, ఎలీపేలెటు, 7 నోగహు, నెపెగు, యాఫీయ, 8 ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు. 9 ఉపపత్నుల కుమారులు కాకుండా వాళ్లంతా దావీదు కుమారులు; తామారు వాళ్ల సహోదరి.
10 సొలొమోను కుమారుడు రెహబాము; రెహబాము కుమారుడు అబీయా, అబీయా కుమారుడు ఆసా, ఆసా కుమారుడు యెహోషాపాతు, 11 యెహోషాపాతు కుమారుడు యెహోరాము, యెహోరాము కుమారుడు అహజ్యా, అహజ్యా కుమారుడు యెహోయాషు, 12 యెహోయాషు కుమారుడు అమజ్యా, అమజ్యా కుమారుడు అజర్యా, అజర్యా కుమారుడు యోతాము, 13 యోతాము కుమారుడు ఆహాజు, ఆహాజు కుమారుడు హిజ్కియా, హిజ్కియా కుమారుడు మనష్షే, 14 మనష్షే కుమారుడు ఆమోను, ఆమోను కుమారుడు యోషీయా. 15 యోషీయా కుమారులు: మొదటి కుమారుడు యోహానాను, రెండో కుమారుడు యెహోయాకీము,+ మూడో కుమారుడు సిద్కియా,+ నాలుగో కుమారుడు షల్లూము. 16 యెహోయాకీము కుమారుడు యెకొన్యా,+ యెకొన్యా కుమారుడు సిద్కియా. 17 ఖైదీ అయిన యెకొన్యా కుమారులు: షయల్తీయేలు, 18 మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా. 19 పెదాయా కుమారులు జెరుబ్బాబెలు,+ షిమీ; జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము, హనన్యా (షెలోమీతు వాళ్ల సహోదరి); 20 అతనికి హషుబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా, యూషబెస్హెదు అనే మరో ఐదుగురు కుమారులు కూడా ఉన్నారు. 21 హనన్యా కుమారులు పెలట్యా, యెషాయా; యెషాయా కుమారుడు* రెఫాయా; రెఫాయా కుమారుడు* అర్నాను; అర్నాను కుమారుడు* ఓబద్యా; ఓబద్యా కుమారుడు* షెకన్యా; 22 షెకన్యాకు ఒక కుమారుడు, మనవళ్లు ఉన్నారు: అతని కుమారుడు షెమయా, అలాగే షెమయా కుమారులు హట్టూషు, ఇగాలు, బారియహు, నెయర్యా, షాపాతు; మొత్తం ఆరుగురు. 23 నెయర్యా కుమారులు: ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము; మొత్తం ముగ్గురు. 24 ఎల్యోయేనై కుమారులు: హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయ్యా, అనాని; మొత్తం ఏడుగురు.
4 యూదా కుమారులు: పెరెసు,+ ఎస్రోను,+ కర్మీ, హూరు,+ శోబాలు.+ 2 శోబాలు కుమారుడైన రెవాయా యహతును కన్నాడు; యహతు అహూమైని, లహదును కన్నాడు. ఇవి సొరాతీయుల+ కుటుంబాలు. 3 ఏతాము+ తండ్రి* కుమారులు: యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు (వీళ్ల సహోదరి పేరు హజ్జెలెల్పోని), 4 గెదోరు తండ్రైన పెనూయేలు, హూషా తండ్రైన ఏసెరు. వీళ్లు ఎఫ్రాతా మొదటి కుమారుడూ బేత్లెహేము+ తండ్రీ అయిన హూరు+ కుమారులు. 5 తెకోవ+ తండ్రైన అష్షూరుకు+ హెలా, నయరా అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. 6 నయరా అతనికి అహుజామును, హెపెరును, తేమనీని, హయహష్తారీని కన్నది. వీళ్లు నయరా కుమారులు. 7 హెలా కుమారులు: జెరెతు, ఇస్హారు, ఎత్నాను. 8 కోజు ఆనూబుకు, జోబేబాకు, హారుము కుమారుడైన అహర్హేలు కుటుంబాలకు తండ్రి అయ్యాడు.
9 యబ్బేజు తన సహోదరులకన్నా ఘనుడయ్యాడు; అతని తల్లి, “వేదనతో ఇతన్ని కన్నాను” అంటూ అతనికి యబ్బేజు* అని పేరు పెట్టింది. 10 యబ్బేజు ఇశ్రాయేలు దేవుణ్ణి, “నువ్వు నన్ను ఆశీర్వదించి, నా ప్రాంతం విస్తరించేలా చేయి. నాకు ఎలాంటి హానీ జరగకుండా నాకు ఎప్పుడూ తోడుగా ఉండి, నన్ను విపత్తు నుండి రక్షించు!” అని వేడుకున్నాడు. దేవుడు అతను కోరినట్టు చేశాడు.
11 షూవహు సహోదరుడైన కెలూబు మెహీరును కన్నాడు; మెహీరు ఎష్తోనును కన్నాడు. 12 ఎష్తోను బేత్రఫాను, పాసెయను, ఈర్నాహాషు తండ్రైన తెహిన్నాను కన్నాడు. వీళ్లు రేకావాళ్లు. 13 కనజు కుమారులు: ఒత్నీయేలు,+ శెరాయా; ఒత్నీయేలు కుమారుడు* హతతు. 14 మెయానొతై ఒఫ్రాను కన్నాడు. శెరాయా యోవాబును కన్నాడు, ఇతను గెహరాషీము* నివాసుల తండ్రి, వాళ్లకు చేతిపనుల్లో నైపుణ్యం ఉండేది కాబట్టి ఆ పేరు వచ్చింది.
15 యెఫున్నె కుమారుడైన కాలేబు+ కుమారులు: ఈరూ, ఏలా, నయము; ఏలా కుమారుడు* కనజు. 16 యెహల్లెలేలు కుమారులు: జీఫు, జీఫా, తీర్యా, అశర్యేలు. 17 ఎజ్రా కుమారులు: యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను; ఆమె* మిర్యామును, షమ్మయిని, ఎష్టెమోయకు తండ్రైన ఇష్బాహును కన్నది. 18 (యూదురాలైన అతని భార్య, గెదోరు తండ్రైన యెరెదును, శోకో తండ్రైన హెబెరును, జానోహ తండ్రైన యెకూతీయేలును కన్నది.) వీళ్లు ఫరో కూతురైన బిత్యా కుమారులు, ఈమె మెరెదు భార్య.
19 హోదీయా భార్యకు, అంటే నహము సహోదరికి పుట్టిన కుమారులు గర్మీయుడైన కెయీలాను, మాయకాతీయుడైన ఎష్టెమోయను కన్నారు. 20 షీమోను కుమారులు: అమ్నోను, రిన్నా, బెన్హానాను, తీలోను. ఇషీ కుమారులు: జోహేతు, బెన్జోహేతు.
21 యూదా కుమారుడైన షేలహు+ కుమారులు: లేకా తండ్రైన ఏరు, మారేషా తండ్రైన లద్దాయి, నాణ్యమైన బట్టలు తయారుచేసే అష్బేయ వంశస్థులు, 22 మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్న యోకీమీ, కోజేబా మనుషులు, యోవాషు, శారాపు; అలాగే యాషూబిలెహెము. ఈ వివరాలు ప్రాచీనమైనవి. 23 వీళ్లు నెతాయీములో, గెదేరాలో నివసించిన కుమ్మరులు. వాళ్లు అక్కడ నివసిస్తూ రాజు కోసం పనిచేశారు.
24 షిమ్యోను కుమారులు:+ నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు.+ 25 షావూలు కుమారుడు షల్లూము, షల్లూము కుమారుడు మిబ్శాము, మిబ్శాము కుమారుడు మిష్మా. 26 మిష్మా వంశస్థులు: అతని కుమారుడు హమ్మూయేలు, హమ్మూయేలు కుమారుడు జక్కూరు, జక్కూరు కుమారుడు షిమీ. 27 షిమీకి 16 మంది కుమారులు, ఆరుగురు కూతుళ్లు; అయితే అతని సహోదరులకు ఎక్కువమంది కుమారులు లేరు; వాళ్ల కుటుంబాల్లో ఎవరికీ యూదా మనుషులకు ఉన్నంతమంది కుమారులు లేరు.+ 28 వాళ్లు నివాసమున్న నగరాలు: బెయేర్షెబా, మోలాదా,+ హజర్షువలు,+ 29 బిల్హా, ఎజెము,+ తోలాదు, 30 బెతూయేలు,+ హోర్మా,+ సిక్లగు,+ 31 బేత్-మర్కాబోతు, హాజర్సూసా, బేత్బీరీ, షరాయిము. దావీదు పరిపాలన మొదలుపెట్టేంత వరకు వాళ్లు ఆ నగరాల్లోనే నివసించారు.
32 వాళ్లు నివసించిన నగరాలు: ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను, ఆషాను;+ మొత్తం ఐదు నగరాలు, 33 అలాగే బయలు వరకున్న వాటి చుట్టుపక్కల పల్లెలు. ఇవి వాళ్ల వంశావళి పట్టికల్లో నమోదైన పేర్లు, వాళ్లు నివసించిన ప్రాంతాలు. 34 ఇంకా మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కుమారుడైన యోషా, 35 యోవేలు, అశీయేలు మునిమనవడూ శెరాయా మనవడూ యోషిబ్యా కుమారుడూ అయిన యెహూ, 36 అలాగే ఎల్యోయేనై, యహకోబా, యెషోహాయా, అశాయా, అదీయేలు, యెశీమీయేలు, బెనాయా, 37 అలాగే జీజా; ఇతను షిపి కుమారుడు, షిపి అల్లోను కుమారుడు, అల్లోను యెదాయా కుమారుడు, యెదాయా షిమ్రీ కుమారుడు, షిమ్రీ షెమయా కుమారుడు; 38 వంశావళిలో పేర్లతో ప్రస్తావించబడిన వీళ్లు తమ కుటుంబాలకు ప్రధానులు; వాళ్ల పూర్వీకుల కుటుంబాలు వృద్ధి అయ్యాయి. 39 వాళ్లు తమ మందల కోసం పచ్చికబయళ్లను వెదకడానికి లోయకు తూర్పు వైపున్న గెదోరు ద్వారం దగ్గరికి వెళ్లారు. 40 చివరికి వాళ్లకు సారవంతమైన, మంచి పచ్చికబయళ్లు కనిపించాయి. ఆ ప్రాంతం విశాలంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంది. అంతకుముందు అక్కడ హాము వంశస్థులు+ నివసించేవాళ్లు. 41 వంశావళి పట్టికలో పేర్లు నమోదైన వీళ్లు, యూదా రాజైన హిజ్కియా+ రోజుల్లో అక్కడికి వచ్చి అక్కడ నివసిస్తున్న హాము వంశస్థుల, మెయోనీయుల డేరాల్ని పడగొట్టారు. వాళ్లను పూర్తిగా నాశనం చేశారు; అక్కడ తమ మందలకు పచ్చికబయళ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారు.
42 షిమ్యోనీయుల్లో కొంతమంది, అంటే 500 మంది, ఇషీ కుమారులైన పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు నాయకత్వం కింద శేయీరు పర్వతం+ దగ్గరికి వెళ్లారు. 43 వాళ్లు అక్కడికి తప్పించుకొని పారిపోయిన మిగతా అమాలేకీయుల్ని చంపి,+ ఈ రోజు వరకు అక్కడే నివసిస్తున్నారు.
5 ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను+ కుమారుల వివరాలు కింద నమోదు చేయబడ్డాయి. అతను మొదటి కుమారుడే అయినా, అతను తన తండ్రి పడకను అపవిత్రపర్చాడు*+ కాబట్టి, అతని జ్యేష్ఠత్వపు హక్కు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడింది.+ కాబట్టి ఇశ్రాయేలు కుటుంబ వంశావళి పట్టికలో రూబేను మొదటి కుమారుడిగా నమోదు చేయబడలేదు. 2 యూదా+ తన సహోదరుల కన్నా గొప్పవాడే అయినా, నాయకుడు కాబోయే వ్యక్తి అతని నుండే వచ్చినా,+ జ్యేష్ఠత్వపు హక్కు మాత్రం యోసేపుకు వచ్చింది. 3 ఇశ్రాయేలు పెద్ద కుమారుడైన రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.+ 4 యోవేలు వంశస్థులు: అతని కుమారుడు షెమయా, షెమయా కుమారుడు గోగు, గోగు కుమారుడు షిమీ, 5 షిమీ కుమారుడు మీకా, మీకా కుమారుడు రెవాయా, రెవాయా కుమారుడు బయలు, 6 బయలు కుమారుడు బెయేర; ఇతన్ని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు+ బందీగా తీసుకెళ్లాడు; బెయేర రూబేనీయులకు ప్రధానుడు. 7 వాళ్ల కుటుంబాల వంశావళి పట్టిక ప్రకారం అతని సహోదరులు: నాయకుడైన యెహీయేలు, జెకర్యా, 8 బెల; ఇతను ఆజాజు కుమారుడు; ఆజాజు షెమ కుమారుడు; షెమ యోవేలు కుమారుడు; బెల ఇంటివాళ్లు అరోయేరులో,+ అలాగే నెబో, బయల్మెయోను+ వరకు నివసించారు. 9 వాళ్ల పశువుల సంఖ్య గిలాదు ప్రాంతంలో+ వృద్ధి అయ్యింది కాబట్టి, వాళ్లు తూర్పున యూఫ్రటీసు నది+ దగ్గరి ఎడారి* సరిహద్దు వరకు స్థిరపడ్డారు. 10 సౌలు రోజుల్లో, వాళ్లు హగ్రీయీలతో యుద్ధం చేసి వాళ్లను ఓడించారు. దాంతో గిలాదుకు తూర్పున ఉన్న ప్రాంతమంతట్లో వాళ్లు తమ డేరాల్లో నివసించారు.
11 గాదు వంశస్థులు వాళ్లకు పక్కనే, బాషాను దేశంలో సల్కా+ వరకు నివసించారు. 12 బాషానులో యోవేలు నాయకుడు, రెండో నాయకుడు షాపాము. వాళ్లతోపాటు యహనై, షాపాతు కూడా నాయకులుగా ఉన్నారు. 13 వాళ్ల పూర్వీకుల కుటుంబాలకు చెందిన వాళ్ల సహోదరులు: మిఖాయేలు, మెషుల్లాము, షేబ, యోరై, యకాను, జీయ, ఏబెరు; మొత్తం ఏడుగురు. 14 వీళ్లు హూరీ కుమారుడైన అబీహాయిలు కుమారులు. హూరీ యారోయ కుమారుడు; యారోయ గిలాదు కుమారుడు; గిలాదు మిఖాయేలు కుమారుడు; మిఖాయేలు యెషీషై కుమారుడు; యెషీషై యహదో కుమారుడు. యహదో బూజు కుమారుడు. 15 గూనీ మనవడూ అబ్దీయేలు కుమారుడూ అయిన అహీ వాళ్ల పూర్వీకుల కుటుంబానికి పెద్ద. 16 వాళ్లు గిలాదులో, బాషానులో,+ వాటి చుట్టుపక్కల పట్టణాల్లో, షారోనులో పచ్చికబయళ్లు విస్తరించివున్న ప్రాంతం వరకు నివసించారు. 17 యూదా రాజైన యోతాము+ రోజుల్లో, ఇశ్రాయేలు రాజైన యరొబాము* రోజుల్లో వాళ్లందరూ వంశావళి పట్టికలో నమోదు చేయబడ్డారు.
18 రూబేనీయుల, గాదీయుల, మనష్షే అర్ధగోత్రం వాళ్ల సైన్యంలో డాళ్లు, కత్తులు, విల్లులు ధరించిన 44,760 మంది బలమైన యోధులు ఉన్నారు. వాళ్లు యుద్ధంలో శిక్షణ పొందినవాళ్లు. 19 వాళ్లు హగ్రీయీలతో, యెతూరు, నాపీషు,+ నోదాబు వంశస్థులతో యుద్ధం చేశారు.+ 20 ఆ యుద్ధంలో దేవుడు వాళ్లకు సహాయం చేసి హగ్రీయీలను, వాళ్లతోపాటు ఉన్నవాళ్లందర్నీ అప్పగించాడు. ఎందుకంటే యుద్ధంలో సహాయం చేయమని వాళ్లు దేవుణ్ణి వేడుకున్నారు; అంతేకాదు వాళ్లు ఆయనమీద నమ్మకం ఉంచారు కాబట్టి ఆయన వాళ్ల మొర విన్నాడు.+ 21 వాళ్లు వాళ్ల పశువుల్ని, అంటే 50,000 ఒంటెల్ని, 2,50,000 గొర్రెల్ని, 2,000 గాడిదల్ని, అలాగే 1,00,000 మంది ప్రజల్ని పట్టుకున్నారు. 22 యుద్ధం చేసింది సత్యదేవుడే+ కాబట్టి శత్రువులు చాలామంది చనిపోయారు. వాళ్లు బందీలుగా తీసుకెళ్లబడేంత వరకు ఆ ప్రజల దేశంలోనే నివసించారు.+
23 మనష్షే అర్ధగోత్రం వాళ్లు బాషాను నుండి బయల్హెర్మోను, శెనీరు, హెర్మోను పర్వతం+ వరకు ఉన్న ప్రాంతంలో నివసించారు. వాళ్లు చాలామంది ఉన్నారు. 24 వాళ్ల పూర్వీకుల కుటుంబాల పెద్దలు: ఏఫెరు, ఇషీ, ఎలీయేలు, అజ్రీయేలు, యిర్మీయా, హోదవ్యా, యహదీయేలు; వాళ్లు బలమైన యోధులు, పేరు పొందినవాళ్లు, తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు. 25 అయితే వాళ్లు తమ పూర్వీకుల దేవునికి నమ్మకద్రోహం చేసి, వాళ్ల ఎదుట నుండి ఆయన నిర్మూలించిన దేశ ప్రజల దేవుళ్లను పూజించారు.*+ 26 కాబట్టి ఇశ్రాయేలు దేవుడు అష్షూరు రాజైన పూలు (అంటే, అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు)+ మనసును రేపాడు.+ దాంతో అతను రూబేనీయుల్ని, గాదీయుల్ని, మనష్షే అర్ధగోత్రం వాళ్లను బందీలుగా తీసుకెళ్లాడు. వాళ్లను హాలహు, హాబోరు, హారా, గోజాను నది దగ్గరికి తీసుకెళ్లాడు.+ వాళ్లు ఈ రోజు వరకు అక్కడే ఉన్నారు.
6 లేవి కుమారులు: గెర్షోను, కహాతు,+ మెరారి.+ 2 కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు,+ హెబ్రోను, ఉజ్జీయేలు.+ 3 అమ్రాము పిల్లలు:* అహరోను,+ మోషే,+ మిర్యాము.+ అహరోను కుమారులు: నాదాబు, అబీహు,+ ఎలియాజరు,+ ఈతామారు.+ 4 ఎలియాజరు ఫీనెహాసును కన్నాడు;+ ఫీనెహాసు అబీషూవను కన్నాడు. 5 అబీషూవ బుక్కీని కన్నాడు; బుక్కీ ఉజ్జీని కన్నాడు. 6 ఉజ్జీ జెరహ్యాను కన్నాడు; జెరహ్యా మెరాయోతును కన్నాడు. 7 మెరాయోతు అమర్యాను కన్నాడు; అమర్యా అహీటూబును+ కన్నాడు. 8 అహీటూబు సాదోకును+ కన్నాడు; సాదోకు అహిమయస్సును+ కన్నాడు. 9 అహిమయస్సు అజర్యాను కన్నాడు; అజర్యా యోహానానును కన్నాడు. 10 యోహానాను అజర్యాను కన్నాడు. అతను యెరూషలేములో సొలొమోను కట్టిన మందిరంలో యాజకునిగా సేవచేశాడు.
11 అజర్యా అమర్యాను కన్నాడు; అమర్యా అహీటూబును కన్నాడు. 12 అహీటూబు సాదోకును+ కన్నాడు; సాదోకు షల్లూమును కన్నాడు. 13 షల్లూము హిల్కీయాను+ కన్నాడు; హిల్కీయా అజర్యాను కన్నాడు. 14 అజర్యా శెరాయాను+ కన్నాడు; శెరాయా యెహోజాదాకును+ కన్నాడు. 15 యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదావాళ్లను, యెరూషలేమువాళ్లను బందీలుగా తీసుకెళ్లినప్పుడు ఈ యెహోజాదాకు బందీగా వెళ్లాడు.
16 లేవి కుమారులు: గెర్షోము,* కహాతు, మెరారి. 17 గెర్షోము కుమారులు: లిబ్నీ, షిమీ.+ 18 కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.+ 19 మెరారి కుమారులు: మహలి, మూషి.
తమ పూర్వీకుల పేర్ల ప్రకారం లేవీయుల కుటుంబాలు ఇవి:+ 20 గెర్షోము+ కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా, 21 జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరయి. 22 కహాతు వంశస్థులు:* అతని కుమారుడు అమ్మీనాదాబు, అమ్మీనాదాబు కుమారుడు కోరహు,+ కోరహు కుమారుడు అస్సీరు, 23 అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు,+ ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు, 24 అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు. 25 ఎల్కానా కుమారులు: అమాశై, అహీమోతు. 26 ఇంకో ఎల్కానా వంశస్థులు: అతని కుమారుడు జోపై, జోపై కుమారుడు నహతు, 27 నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరోహాము కుమారుడు ఎల్కానా.+ 28 సమూయేలు+ కుమారులు: మొదటి కుమారుడు యోవేలు, రెండో కుమారుడు అబీయా.+ 29 మెరారి వంశస్థులు:* మహలి,+ మహలి కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు షిమీ, షిమీ కుమారుడు ఉజ్జా, 30 ఉజ్జా కుమారుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా.
31 మందసం* యెహోవా మందిరంలోకి వచ్చిన తర్వాత పాటలు పాడే విషయంలో నాయకత్వం వహించడానికి దావీదు వీళ్లను నియమించాడు.+ 32 సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టేంతవరకు,+ గుడారం దగ్గర అంటే ప్రత్యక్ష గుడారం దగ్గర పాటలు పాడే బాధ్యత వాళ్లకు ఉండేది; వాళ్లకు నిర్దేశించబడినట్టు వాళ్లు సేవచేశారు.+ 33 తమ కుమారులతో కలిసి అలా సేవచేసినవాళ్లు: కహాతీయుల్లో గాయకుడైన హేమాను;+ ఇతను యోవేలు+ కుమారుడు, యోవేలు సమూయేలు కుమారుడు, 34 సమూయేలు ఎల్కానా+ కుమారుడు, ఎల్కానా యెరోహాము కుమారుడు, యెరోహాము ఎలీయేలు కుమారుడు, ఎలీయేలు తోయహు కుమారుడు, 35 తోయహు సూపు కుమారుడు, సూపు ఎల్కానా కుమారుడు, ఎల్కానా మహతు కుమారుడు, మహతు అమాశై కుమారుడు, 36 అమాశై ఎల్కానా కుమారుడు, ఎల్కానా యోవేలు కుమారుడు, యోవేలు అజర్యా కుమారుడు, అజర్యా జెఫన్యా కుమారుడు, 37 జెఫన్యా తాహతు కుమారుడు, తాహతు అస్సీరు కుమారుడు, అస్సీరు ఎబ్యాసాపు కుమారుడు, ఎబ్యాసాపు కోరహు కుమారుడు, 38 కోరహు ఇస్హారు కుమారుడు, ఇస్హారు కహాతు కుమారుడు, కహాతు లేవి కుమారుడు, లేవి ఇశ్రాయేలు కుమారుడు.
39 హేమాను కుడిపక్కన అతని సహోదరుడైన ఆసాపు+ నిలబడి సేవచేశాడు; ఆసాపు బెరెక్యా కుమారుడు, బెరెక్యా షిమ్యా కుమారుడు, 40 షిమ్యా మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు బయశేయా కుమారుడు, బయశేయా మల్కీయా కుమారుడు, 41 మల్కీయా ఎత్నీ కుమారుడు, ఎత్నీ జెరహు కుమారుడు, జెరహు అదాయా కుమారుడు, 42 అదాయా ఏతాను కుమారుడు, ఏతాను జిమ్మా కుమారుడు, జిమ్మా షిమీ కుమారుడు, 43 షిమీ యహతు కుమారుడు, యహతు గెర్షోము కుమారుడు, గెర్షోము లేవి కుమారుడు.
44 వాళ్ల సహోదరులైన మెరారి వంశస్థులు+ హేమాను ఎడమపక్కన నిలబడేవాళ్లు; వాళ్లలో ఏతాను+ ఒకడు; అతను కీషీ కుమారుడు, కీషీ అబ్దీ కుమారుడు, అబ్దీ మల్లూకు కుమారుడు, 45 మల్లూకు హషబ్యా కుమారుడు, హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కీయా కుమారుడు, 46 హిల్కీయా అమ్జీ కుమారుడు, అమ్జీ బానీ కుమారుడు, బానీ షెమెరు కుమారుడు, 47 షెమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు.
48 వాళ్ల సహోదరులైన లేవీయులు గుడారంలో, అంటే సత్యదేవుని మందిరంలో చేసే సేవ అంతటి కోసం నియమించబడ్డారు.*+ 49 అహరోను, అతని కుమారులు+ సత్యదేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి+ దహనబలుల్ని అర్పించే బలిపీఠం+ మీద బలులు అర్పిస్తూ, ధూపవేదిక మీద ధూపద్రవ్యం కాలుస్తూ పొగ పైకిలేచేలా చేసేవాళ్లు,+ అతి పవిత్రమైన విషయాలకు సంబంధించిన విధులు నిర్వర్తించేవాళ్లు. 50 అహరోను+ వంశస్థులు: అతని కుమారుడు ఎలియాజరు;+ ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ, 51 అబీషూవ కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్యా, 52 జెరహ్యా కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు,+ 53 అహీటూబు కుమారుడు సాదోకు,+ సాదోకు కుమారుడు అహిమయస్సు.
54 వాళ్లు తమ ప్రాంతంలో ఈ స్థలాల్లో శిబిరాలు* వేసుకున్నారు: కహాతీయుల కుటుంబానికి చెందిన అహరోను వంశస్థులకు మొదటి చీటి* పడింది కాబట్టి, 55 వాళ్లకు యూదా ప్రాంతంలో హెబ్రోను, దాని చుట్టుపక్కల పచ్చికబయళ్లు ఇచ్చారు.+ 56 అయితే ఆ నగర పొలాల్ని, దాని పల్లెల్ని యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇచ్చారు.+ 57 అహరోను వంశస్థులకు ఆశ్రయపురాలైన*+ హెబ్రోను;+ లిబ్నా,+ దాని పచ్చికబయళ్లు; యత్తీరు;+ ఎష్టెమోయ, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు;+ 58 అలాగే హీలేను, దాని పచ్చికబయళ్లు; దెబీరు,+ దాని పచ్చికబయళ్లు; 59 ఆషాను,+ దాని పచ్చికబయళ్లు; బేత్షెమెషు,+ దాని పచ్చికబయళ్లు; 60 బెన్యామీను గోత్రంలో నుండి గెబా,+ దాని పచ్చికబయళ్లు; ఆలెమెతు, దాని పచ్చికబయళ్లు; అనాతోతు,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు. వాళ్ల వంశస్థులకు మొత్తం 13 నగరాలు ఇచ్చారు.+
61 మిగతా కహాతీయులకు వేరే గోత్రాలకు చెందిన కుటుంబాల నుండి, మనష్షే అర్ధగోత్రం నుండి పది నగరాలు కేటాయించారు.*+
62 గెర్షోమీయులకు, వాళ్ల కుటుంబాలకు ఇశ్శాఖారు గోత్రంలో నుండి, ఆషేరు గోత్రంలో నుండి, నఫ్తాలి గోత్రంలో నుండి, బాషానులో మనష్షే గోత్రంలో నుండి 13 నగరాలు కేటాయించారు.+
63 మెరారీయులకు, వాళ్ల కుటుంబాలకు రూబేను గోత్రంలో నుండి, గాదు గోత్రంలో నుండి, జెబూలూను గోత్రంలో నుండి 12 నగరాల్ని చీటి వేసి కేటాయించారు.+
64 అలా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఆ నగరాలు, వాటి పచ్చికబయళ్లు ఇచ్చారు.+ 65 అంతేకాదు వాళ్లు చీటి వేసి, యూదా గోత్రంలో నుండి, షిమ్యోను గోత్రంలో నుండి, బెన్యామీను గోత్రంలో నుండి నగరాల్ని ఇచ్చారు; ఆ నగరాల పేర్లు ప్రస్తావించబడ్డాయి.
66 కహాతీయుల కుటుంబాలు కొన్ని, ఎఫ్రాయిము గోత్రంలో నుండి నగరాల్ని తమ ప్రాంతంగా పొందాయి.+ 67 ఆ కుటుంబాలకు ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలో ఉన్న ఆశ్రయపురాలైన* షెకెము, దాని పచ్చికబయళ్లు; గెజెరు,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు, 68 అలాగే యొక్మెయాము, దాని పచ్చికబయళ్లు; బేత్-హోరోను,+ దాని పచ్చికబయళ్లు; 69 అయ్యాలోను,+ దాని పచ్చికబయళ్లు; గత్రిమ్మోను,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; 70 కహాతీయుల మిగతా కుటుంబాలకు మనష్షే అర్ధగోత్రంలో నుండి ఆనేరు, దాని పచ్చికబయళ్లు; బిలియాము, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు.
71 వాళ్లు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రపు కుటుంబం నుండి బాషానులోని గోలాను,+ దాని పచ్చికబయళ్లు; అష్తారోతు, దాని పచ్చికబయళ్లు కేటాయించారు;+ 72 ఇశ్శాఖారు గోత్రంలో నుండి కెదెషు, దాని పచ్చికబయళ్లు; దాబెరతు,+ దాని పచ్చికబయళ్లు;+ 73 రామోతు, దాని పచ్చికబయళ్లు; ఆనేము, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; 74 ఆషేరు గోత్రంలో నుండి మాషాలు, దాని పచ్చికబయళ్లు; అబ్దోను, దాని పచ్చికబయళ్లు;+ 75 హుక్కోకు, దాని పచ్చికబయళ్లు; రెహోబు,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; 76 నఫ్తాలి గోత్రంలో నుండి గలిలయలోని+ కెదెషు,+ దాని పచ్చికబయళ్లు; హమ్మోను, దాని పచ్చికబయళ్లు; కిర్యతాయిము, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు.
77 వాళ్లు మెరారీయుల్లో మిగతావాళ్లకు జెబూలూను గోత్రంలో+ నుండి రిమ్మోనో, దాని పచ్చికబయళ్లు; తాబోరు, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; 78 యెరికో దగ్గర యొర్దాను ప్రాంతంలో, యొర్దానుకు తూర్పున ఉన్న ప్రాంతంలో, రూబేను గోత్రంలో నుండి వాళ్లకు ఎడారిలో ఉన్న బేసెరు, దాని పచ్చికబయళ్లు; యాహజు,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు, 79 కెదేమోతు,+ దాని పచ్చికబయళ్లు; మేఫాతు, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; 80 గాదు గోత్రంలో నుండి గిలాదులోని రామోతు, దాని పచ్చికబయళ్లు; మహనయీము,+ దాని పచ్చికబయళ్లు; 81 హెష్బోను,+ దాని పచ్చికబయళ్లు; యాజెరు,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు.
7 ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువ్వా, యాషూబు, షిమ్రోను;+ మొత్తం నలుగురు. 2 తోలా కుమారులు: ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మయి, యిబ్శాము, షెమూయేలు. వీళ్లు తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు. తోలా నుండి బలమైన యోధులు వచ్చారు; దావీదు రోజుల్లో వాళ్ల సంఖ్య 22,600. 3 ఉజ్జీ వంశస్థులు:* ఇజ్రహయా, ఇజ్రహయా కుమారులైన మిఖాయేలు, ఓబద్యా, యోవేలు, ఇష్షీయా. ఈ ఐదుగురు తమ కుటుంబాలకు పెద్దలు.* 4 వాళ్లకు చాలామంది భార్యలు, కుమారులు ఉన్నారు, కాబట్టి తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం వాళ్ల వంశస్థుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికులు 36,000 మంది ఉన్నారు. 5 ఇశ్శాఖారు కుటుంబాలన్నిట్లో ఉన్న వాళ్ల సహోదరులు బలమైన యోధులు; వంశావళి పట్టికలో నమోదు చేయబడినదాని ప్రకారం వాళ్ల సంఖ్య 87,000.+
6 బెన్యామీను కుమారులు:+ బెల,+ బేకెరు,+ యెదీయవేలు;+ మొత్తం ముగ్గురు. 7 బెల కుమారులు: ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు, ఈరీ; మొత్తం ఐదుగురు. వీళ్లు తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు, బలమైన యోధులు. వాళ్ల వంశావళి పట్టికలో నమోదైనవాళ్లు 22,034 మంది.+ 8 బేకెరు కుమారులు: జెమీరా, యోవాషు, ఎలీయెజెరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరేమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు. వీళ్లందరూ బేకెరు కుమారులు. 9 వాళ్ల పూర్వీకుల కుటుంబాల పెద్దల ప్రకారం, వాళ్ల వంశావళి పట్టికలో 20,200 మంది బలమైన యోధులు ఉన్నారు. 10 యెదీయవేలు+ వంశస్థులు బిల్హాను, బిల్హాను కుమారులు; బిల్హాను కుమారులు: యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్షీషు, అహీషహరు. 11 వీళ్లందరూ యెదీయవేలు కుమారులు; వాళ్ల పూర్వీకుల కుటుంబాల పెద్దల ప్రకారం, వాళ్లలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న బలమైన యోధులు 17,200 మంది ఉన్నారు.
12 షుప్పీమువాళ్లు, హుప్పీమువాళ్లు ఈరు+ కుమారులు; హుషీమువాళ్లు అహేరు కుమారులు.
13 నఫ్తాలి కుమారులు:+ యహసయేలు, గూనీ, యేసెరు, షల్లూము. వీళ్లు బిల్హా వంశస్థులు.*+
14 మనష్షే+ వంశస్థులు: అశ్రీయేలు, ఇతన్ని సిరియాకు చెందిన మనష్షే ఉపపత్ని కన్నది. (ఆమె గిలాదు తండ్రైన మాకీరును+ కన్నది. 15 మాకీరు హుప్పీముకు, షుప్పీముకు పెళ్లిళ్లు చేశాడు. వాళ్ల సహోదరి పేరు మయకా.) రెండోవాడి పేరు సెలోపెహాదు;+ అయితే సెలోపెహాదుకు కూతుళ్లు మాత్రమే ఉన్నారు.+ 16 మాకీరు భార్య మయకా ఒక కుమారుణ్ణి కని అతనికి పెరెషు అని పేరు పెట్టింది; అతని తమ్ముడి పేరు షెరెషు; షెరెషు కుమారులు: ఊలాము, రేకెము. 17 ఊలాము కుమారుడు* బెదాను. వీళ్లందరూ, మనష్షే మనవడూ మాకీరు కుమారుడూ అయిన గిలాదు వంశస్థులు. 18 అతని సహోదరి హమ్మోలెకెతు. ఆమె ఇషోదును, అబీయెజరును, మహలాను కన్నది. 19 షెమీదా కుమారులు: అహెయాను, షెకెము, లికీ, అనీయాము.
20 ఎఫ్రాయిము వంశస్థులు:+ షూతలహు,+ అతని కుమారుడు బెరెదు, బెరెదు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఎలాదా, ఎలాదా కుమారుడు తాహతు, 21 తాహతు కుమారుడు జాబాదు, జాబాదు కుమారుడు షూతలహు, ఏసెరు, ఎల్యాదు. ఆ దేశంలో పుట్టిన గాతు+ మనుషులు ఎఫ్రాయిము వంశస్థుల పశువుల్ని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు ఏసెరును, ఎల్యాదును చంపారు. 22 అప్పుడు వాళ్ల తండ్రి ఎఫ్రాయిము చాలా రోజులపాటు దుఃఖించాడు, అతని సహోదరులు అతని దగ్గరికి వచ్చి ఓదార్చేవాళ్లు. 23 తర్వాత ఎఫ్రాయిము తన భార్యతో కలిశాడు, ఆమె గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కన్నది. తన కుటుంబం మీదికి విపత్తు వచ్చిన సమయంలో ఆమె అతన్ని కన్నది కాబట్టి ఎఫ్రాయిము అతనికి బెరీయా* అని పేరు పెట్టాడు. 24 అతని కూతురు షెయెరా; ఆమె దిగువ బేత్-హోరోనును,+ ఎగువ బేత్-హోరోనును+ అలాగే ఉజ్జెన్షెయెరాను కట్టించింది. 25 రెపహు, రెషెపు ఎఫ్రాయిము వంశస్థులు. రెషెపు కుమారుడు తెలహు, తెలహు కుమారుడు తహను, 26 తహను కుమారుడు లద్దాను, లద్దాను కుమారుడు అమీహూదు, అమీహూదు కుమారుడు ఎలీషామా, 27 ఎలీషామా కుమారుడు నూను, నూను కుమారుడు యెహోషువ.*+
28 ఎఫ్రాయిము వంశస్థులు స్థిరపడిన ప్రాంతాలు ఇవి: బేతేలు,+ దాని చుట్టుపక్కల పట్టణాలు; తూర్పు వైపు నహరా, పడమటి వైపు గెజెరు, దాని చుట్టుపక్కల పట్టణాలు; షెకెము, దాని చుట్టుపక్కల పట్టణాలు; అయ్యా,* దాని చుట్టుపక్కల పట్టణాల వరకు; 29 మనష్షే వంశస్థుల పక్కన బేత్షెయాను,+ దాని చుట్టుపక్కల పట్టణాలు; తానాకు,+ దాని చుట్టుపక్కల పట్టణాలు; మెగిద్దో+ దాని చుట్టుపక్కల పట్టణాలు; దోరు,+ దాని చుట్టుపక్కల పట్టణాలు. ఈ ప్రాంతాల్లో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు వంశస్థులు నివసించారు.
30 ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా.+ వాళ్ల సహోదరి శెరహు.+ 31 బెరీయా కుమారులు: హెబెరు, మల్కీయేలు. మల్కీయేలు బిర్జాయీతుకు తండ్రి. 32 హెబెరుకు యప్లేటు, షోమేరు, హోతాము, వాళ్ల సహోదరి షూయ పుట్టారు. 33 యప్లేటు కుమారులు: పాసకు, బింహాలు, అష్వాతు. వీళ్లు యప్లేటు కుమారులు. 34 షెమెరు* కుమారులు: అహీ, రోగా, యెహుబ్బా, అరాము. 35 అతని సహోదరుడైన హేలెము* కుమారులు: జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు. 36 జోపహు కుమారులు: సూయ, హర్నెపెరు, షూయాలు, బేరీ, ఇమ్రా, 37 బేసెరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బెయేర. 38 యెతెరు కుమారులు: యెఫున్నె, పిస్పా, అరా. 39 ఉల్లా కుమారులు: ఆరహు, హన్నీయేలు, రిజెయా. 40 వీళ్లందరూ ఆషేరు వంశస్థులు; వీళ్లు తమ పూర్వీకుల కుటుంబాల పెద్దలు, ఎంపిక చేయబడినవాళ్లు, బలమైన యోధులు, ప్రధానుల పెద్దలు; వాళ్ల వంశావళి పట్టిక ప్రకారం+ వాళ్లలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్లు 26,000 మంది ఉన్నారు.+
8 బెన్యామీను+ తన మొదటి కుమారుడైన బెలను,+ రెండో కుమారుడైన అష్బేలును,+ మూడో కుమారుడైన అహరహును, 2 నాలుగో కుమారుడైన నోహాను, ఐదో కుమారుడైన రాపాను కన్నాడు. 3 బెల కుమారులు: అద్దారు, గెరా,+ అబీహూదు, 4 అబీషూవ, నయమాను, అహోయహు, 5 గెరా, షెపూపాను, హూరాము. 6 గెబా+ నివాసుల పూర్వీకుల కుటుంబాలకు పెద్దలైన ఏహూదు కుమారులు మానహతుకు బందీలుగా తీసుకెళ్లబడ్డారు. వాళ్లు: 7 నయమాను, అహీయా, గెరా; వాళ్లు బందీలుగా తీసుకెళ్లబడినప్పుడు గెరా వాళ్లకు నాయకత్వం వహించాడు. అతను ఉజ్జాను, అహీహూదును కన్నాడు. 8 మోయాబీయుల్ని పంపించేసిన తర్వాత షహరయీము మోయాబు ప్రాంతంలో పిల్లల్ని కన్నాడు. అతని భార్యలు హుషీము, బయరా.* 9 అతను తన భార్య హోదెషు ద్వారా యోబాబును, జిబ్యాను, మేషాను, మల్కామును, 10 యెవూజును, షాక్యాను, మిర్మాను కన్నాడు. వీళ్లు అతని కుమారులు, పూర్వీకుల కుటుంబాల పెద్దలు.
11 షహరయీము హుషీము ద్వారా అబీటూబును, ఎల్పయలును కన్నాడు. 12 ఎల్పయలు కుమారులు: ఏబెరు, మిషాము, షెమెదు (ఇతను ఓనోను,+ లోదును,+ దాని చుట్టుపక్కల పట్టణాల్ని కట్టించాడు), 13 బెరీయా, షెమ. వీళ్లు అయ్యాలోను+ నివాసుల పూర్వీకుల కుటుంబాల పెద్దలు. వీళ్లు గాతు నివాసుల్ని వెళ్లగొట్టారు. 14 అలాగే అహ్యో, షాషకు, యెరేమోతు, 15 జెబద్యా, అరాదు, ఏదెరు, 16 మిఖాయేలు, ఇష్పా, యోహా; వీళ్లు బెరీయా కుమారులు; 17 జెబద్యా, మెషుల్లాము, హిజికి, హెబెరు, 18 ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు; వీళ్లు ఎల్పయలు కుమారులు; 19 అలాగే యాకీము, జిఖ్రీ, జబ్ది, 20 ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు, 21 అదాయా, బెరాయా, షిమ్రాతు; వీళ్లు షిమీ కుమారులు; 22 ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు, 23 అబ్దోను, జిఖ్రీ, హానాను, 24 హనన్యా, ఏలాము, అంతోతీయా, 25 ఇపెదయా, పెనూయేలు; వీళ్లు షాషకు కుమారులు; 26 షంషెరై, షెహర్యా, అతల్యా, 27 యహరెష్యా, ఏలీయా, జిఖ్రీ; వీళ్లు యెరోహాము కుమారులు. 28 వీళ్లు వంశాల ప్రకారం పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు. ఈ పెద్దలు యెరూషలేములో నివసించారు.
29 గిబియోనుకు తండ్రైన యెహీయేలు గిబియోనులో+ నివసించాడు. అతని భార్య పేరు మయకా.+ 30 అతని మొదటి కుమారుడు అబ్దోను, మిగతావాళ్లు సూరు, కీషు, బయలు, నాదాబు, 31 గెదోరు, అహ్యో, జెకెరు. 32 మిక్లోతు షిమ్యాను కన్నాడు. వాళ్లందరూ యెరూషలేములో తమ సహోదరుల* దగ్గర నివసించారు.
33 నేరు+ కీషును కన్నాడు; కీషు సౌలును కన్నాడు;+ సౌలు యోనాతానును,+ మెల్కీషూవను,+ అబీనాదాబును,+ ఎష్బయలును* కన్నాడు.+ 34 యోనాతాను మెరీబ్బయలును*+ కన్నాడు. మెరీబ్బయలు మీకాను కన్నాడు.+ 35 మీకా కుమారులు: పీతోను, మెలెకు, తరేయ, ఆహాజు. 36 ఆహాజు యెహోయాదాను కన్నాడు; యెహోయాదా ఆలెమెతును, అజ్మావెతును, జిమ్రీని కన్నాడు. జిమ్రీ మోజాను కన్నాడు. 37 మోజా బిన్యాను కన్నాడు, బిన్యా రాపాను కన్నాడు, రాపా ఎలాశాను కన్నాడు, ఎలాశా ఆజేలును కన్నాడు. 38 ఆజేలుకు ఆరుగురు కుమారులు; వాళ్ల పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీళ్లందరూ ఆజేలు కుమారులు. 39 అతని సహోదరుడైన ఏషెకు కుమారులు వీళ్లు: మొదటి కుమారుడు ఊలాము, రెండో కుమారుడు యూషు, మూడో కుమారుడు ఎలీపేలెటు. 40 ఊలాము కుమారులు బలమైన యోధులు, విల్లును ఉపయోగించడంలో నేర్పరులు; వాళ్లకు చాలామంది కుమారులు, మనవళ్లు ఉన్నారు. వాళ్లు మొత్తం 150 మంది. వీళ్లందరూ బెన్యామీను వంశస్థులు.
9 ఇశ్రాయేలీయులందరూ వంశాల ప్రకారం నమోదు చేయబడ్డారు, వాళ్ల పేర్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాయబడ్డాయి. యూదావాళ్లు నమ్మకద్రోహానికి పాల్పడ్డారు కాబట్టి వాళ్లు బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడ్డారు.+ 2 తమ నగరాల్లోని తమ ప్రాంతాలకు మొదట తిరిగొచ్చిన వాళ్లలో కొంతమంది ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు* ఉన్నారు.+ 3 యూదా,+ బెన్యామీను,+ ఎఫ్రాయిము, మనష్షే వంశస్థుల్లో కొంతమంది యెరూషలేములో స్థిరపడ్డారు. వాళ్లు: 4 యూదా కుమారుడైన పెరెసు+ వంశస్థుల్లో అమీహూదు కుమారుడైన ఊతై; అమీహూదు ఒమ్రీ కుమారుడు, ఒమ్రీ ఇమ్రీ కుమారుడు, ఇమ్రీ బానీ కుమారుడు. 5 షిలోనీయుల్లో, తన తండ్రి ఇంట్లో పెద్ద కుమారుడైన అశాయా, అతని కుమారులు. 6 అలాగే జెరహు కుమారుల్లో+ యెవుయేలు, వాళ్ల 690 మంది సహోదరులు.
7 బెన్యామీను వంశస్థుల్లో: హాసెనూయా మునిమనవడూ హోదవ్యా మనవడూ మెషుల్లాము కుమారుడూ అయిన సల్లు; 8 యెరోహాము కుమారుడైన ఇబ్నెయా; మిక్రి మనవడూ ఉజ్జీ కుమారుడూ అయిన ఏలా; ఇబ్నీయా మునిమనవడూ రగూయేలు మనవడూ షెఫట్య కుమారుడూ అయిన మెషుల్లాము. 9 అలాగే వంశావళి పట్టికలో నమోదైన వాళ్ల సహోదరులు 956 మంది. వీళ్లందరూ తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు.
10 యాజకుల్లో: యెదాయా, యెహోయారీబు, యాకీను,+ 11 హిల్కీయా కుమారుడైన అజర్యా; హిల్కీయా మెషుల్లాము కుమారుడు, మెషుల్లాము సాదోకు కుమారుడు, సాదోకు మెరాయోతు కుమారుడు, మెరాయోతు సత్యదేవుని మందిర* అధిపతైన అహీటూబు కుమారుడు; 12 మల్కీయా మునిమనవడూ పషూరు మనవడూ యెరోహాము కుమారుడూ అయిన అదాయా; అదీయేలు కుమారుడైన మశై; అదీయేలు యహజేరా కుమారుడు, యహజేరా మెషుల్లాము కుమారుడు, మెషుల్లాము మెషిల్లేమీతు కుమారుడు, మెషిల్లేమీతు ఇమ్మేరు కుమారుడు; 13 అలాగే తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలైన వాళ్ల సహోదరులు 1,760 మంది; వాళ్లు బలవంతులు, సత్యదేవుని మందిరంలో సేవ చేయడానికి అందుబాటులో ఉన్న సమర్థులు.
14 లేవీయుల్లో: మెరారి వంశస్థుడైన హషబ్యా మునిమనవడూ అజ్రీకాము మనవడూ హష్షూబు కుమారుడూ అయిన షెమయా;+ 15 బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు మునిమనవడూ జిఖ్రీ మనవడూ మీకా కుమారుడూ అయిన మత్తన్యా; 16 యెదూతూను మునిమనవడూ గాలాలు మనవడూ షెమయా కుమారుడూ అయిన ఓబద్యా; ఎల్కానా మనవడూ ఆసా కుమారుడూ అయిన బెరెక్యా; ఇతను నెటోపాతీయుల+ పల్లెల్లో నివసించేవాడు.
17 ద్వారపాలకుల్లో:+ షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను; వాళ్ల సహోదరుడైన షల్లూము వాళ్లకు నాయకుడు. 18 అతను అంతకుముందు తూర్పు వైపున రాజ ద్వారం+ దగ్గర ఉండేవాడు. వీళ్లు లేవీయుల పాలెములకు ద్వారపాలకులు. 19 కోరహు మునిమనవడూ ఎబ్యాసాపు మనవడూ కోరే కుమారుడూ అయిన షల్లూము, అతని పూర్వీకుల కుటుంబాలకు చెందిన కహాతీయులైన అతని సహోదరులు గుడారం ద్వారపాలకులుగా ఉంటూ సేవకు సంబంధించిన పనులు చూసుకునేవాళ్లు. వాళ్ల తండ్రులు ప్రవేశమార్గం దగ్గర కాపలా కాస్తూ యెహోవా పాలెమును చూసుకునేవాళ్లు. 20 ఎలియాజరు+ కుమారుడైన ఫీనెహాసు+ అంతకుముందు వాళ్లకు నాయకుడు; యెహోవా అతనికి తోడుగా ఉండేవాడు. 21 మెషెలెమ్యా కుమారుడైన జెకర్యా+ ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర ద్వారపాలకుడు.
22 గడపల దగ్గర ద్వారపాలకులుగా ఎంపిక చేయబడిన వాళ్లందరూ 212 మంది. వాళ్లు తమ వంశావళి పట్టిక ప్రకారం+ తమ పల్లెల్లో ఉండేవాళ్లు. వాళ్లు నమ్మదగినవాళ్లు కాబట్టి దావీదు, దీర్ఘదర్శి+ సమూయేలు వాళ్లను ఆ పనుల్లో నియమించారు. 23 వాళ్లూ, వాళ్ల కుమారులూ యెహోవా మందిరం ద్వారాలకు అంటే గుడారం ద్వారాలకు కాపలా కాసేవాళ్లు.+ 24 ద్వారపాలకులు నాలుగు దిక్కుల్లో అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఉండేవాళ్లు.+ 25 అప్పుడప్పుడు, వాళ్లతో కలిసి ఏడురోజులు సేవచేయడానికి వాళ్ల సహోదరులు తమ పల్లెల నుండి రావాల్సి ఉంటుంది. 26 లేవీయులైన నలుగురు ప్రధాన* ద్వారపాలకులు సత్యదేవుని మందిరంలోని గదుల* మీద, ఖజానాల మీద అధికారులుగా నియమించబడ్డారు,+ ఎందుకంటే వాళ్లందరూ నమ్మకస్థులు. 27 వాళ్లు సత్యదేవుని మందిరం చుట్టూ తమతమ స్థానాల్లో నిలబడి, రాత్రంతా కాపలా కాసేవాళ్లు. ఎందుకంటే కాపలా కాసే బాధ్యత వాళ్లది, అంతేకాదు వాళ్ల దగ్గర తాళంచెవి ఉండేది; వాళ్లు ప్రతీరోజు ఉదయం మందిర తలుపులు తెరిచేవాళ్లు.
28 వాళ్లలో కొందరు సేవా పాత్రల్ని చూసుకునేవాళ్లు;+ ఆ పాత్రల్ని లోపలికి తీసుకొచ్చినప్పుడు, బయటికి తీసుకెళ్లినప్పుడు వాటిని లెక్కపెట్టేవాళ్లు. 29 వాళ్లలో కొంతమంది ఇతర పాత్రల మీద, పవిత్ర పాత్రలన్నిటి+ మీద, మెత్తని పిండి,+ ద్రాక్షారసం,+ నూనె,+ సాంబ్రాణి,+ సాంబ్రాణి తైలాల+ మీద నియమించబడ్డారు. 30 యాజకుల కుమారుల్లో కొంతమంది సాంబ్రాణి తైలంతో లేపనాన్ని తయారుచేసేవాళ్లు. 31 లేవీయుల్లో మత్తిత్యా నమ్మకస్థుడు కాబట్టి అతను పెనం మీద కాల్చేవాటి+ మీద అధికారిగా ఉండేవాడు. అతను కోరహు వంశస్థుడైన షల్లూము మొదటి కుమారుడు. 32 కహాతీయులైన వాళ్ల సహోదరుల్లో కొంతమంది సముఖపు రొట్టెల*+ మీద నియమించబడ్డారు, వాళ్లు ప్రతీ విశ్రాంతి రోజున* వాటిని తయారుచేసేవాళ్లు.+
33 లేవీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలైన వీళ్లు గాయకులు. వీళ్లు గదుల్లో* ఉండేవాళ్లు; వీళ్లు రాత్రింబగళ్లు తమ పనిలో నిమగ్నమై ఉండాలి కాబట్టి వేరే పనులు చేయాల్సిన అవసరం లేదు. 34 వంశావళి పట్టికల్లో నమోదుచేయబడిన ప్రకారం, వీళ్లు లేవీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలు, నాయకులు. వీళ్లు యెరూషలేములో నివసించారు.
35 గిబియోనుకు తండ్రైన యెహీయేలు గిబియోనులో+ నివసించాడు. అతని భార్య పేరు మయకా. 36 అతని మొదటి కుమారుడు అబ్దోను, మిగతావాళ్లు సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, 37 గెదోరు, అహ్యో, జెకర్యా, మిక్లోతు. 38 మిక్లోతు షిమ్యాను* కన్నాడు. వాళ్లందరూ యెరూషలేములో తమ సహోదరుల* దగ్గర నివసించారు. 39 నేరు+ కీషును కన్నాడు; కీషు సౌలును కన్నాడు;+ సౌలు యోనాతానును,+ మెల్కీషూవను,+ అబీనాదాబును,+ ఎష్బయలును కన్నాడు. 40 యోనాతాను మెరీబ్బయలును+ కన్నాడు. మెరీబ్బయలు మీకాను కన్నాడు.+ 41 మీకా కుమారులు: పీతోను, మెలెకు, తహ్రేయ, ఆహాజు. 42 ఆహాజు యరాను కన్నాడు; యరా ఆలెమెతును, అజ్మావెతును, జిమ్రీని కన్నాడు. జిమ్రీ మోజాను కన్నాడు. 43 మోజా బిన్యాను కన్నాడు, బిన్యా రెఫాయాను కన్నాడు, రెఫాయా ఎలాశాను కన్నాడు, ఎలాశా ఆజేలును కన్నాడు. 44 ఆజేలుకు ఆరుగురు కుమారులు; వాళ్ల పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీళ్లు ఆజేలు కుమారులు.
10 ఒకసారి ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయారు; వాళ్లలో చాలామంది గిల్బోవ పర్వతం మీద చంపబడ్డారు.+ 2 ఫిలిష్తీయులు సౌలును, అతని కుమారుల్ని తరుముతూ వాళ్ల దగ్గరికి వచ్చి, సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును, మెల్కీషూవను+ చంపారు. 3 ఫిలిష్తీయులు సౌలుతో తీవ్రంగా పోరాడుతున్నారు, బాణాలు వేసేవాళ్లు అతన్ని చూసి అతన్ని గాయపర్చారు.+ 4 అప్పుడు సౌలు తన ఆయుధాలు మోసే వ్యక్తితో, “నువ్వు నీ కత్తి దూసి నన్ను పొడువు, లేకపోతే సున్నతిలేని ఈ మనుషులు నాతో క్రూరంగా* వ్యవహరించి నన్ను చంపుతారు”+ అన్నాడు. కానీ అతను చాలా భయపడిపోయి అలా చేయడానికి ఒప్పుకోలేదు. దాంతో సౌలు తన కత్తిని తీసుకొని దాని మీద పడ్డాడు.+ 5 సౌలు చనిపోయాడని అతని ఆయుధాలు మోసేవాడు చూసినప్పుడు, అతను కూడా తన కత్తి మీద పడి చనిపోయాడు. 6 ఆ విధంగా సౌలు, అతని ముగ్గురు కుమారులు చనిపోయారు; అతని ఇంటివాళ్లందరూ అతనితోపాటు చనిపోయారు.+ 7 సైన్యం పారిపోవడం, సౌలు, అతని కుమారులు చనిపోవడం లోయలో ఉన్న ఇశ్రాయేలీయులందరూ చూసినప్పుడు, వాళ్లు తమ నగరాల్ని విడిచిపెట్టి పారిపోయారు; అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి వాటిని ఆక్రమించుకున్నారు.
8 తర్వాతి రోజు, చనిపోయినవాళ్ల వస్తువుల్ని దోచుకోవడానికి ఫిలిష్తీయులు వచ్చారు; సౌలు, అతని కుమారులు గిల్బోవ పర్వతం మీద పడివుండడం వాళ్లు చూశారు.+ 9 వాళ్లు అతన్ని దోచుకొని, అతని తల నరికి, అతని యుద్ధ కవచాన్ని తీసుకెళ్లారు; ఆ వార్తను తమ విగ్రహాల గుళ్లలో,+ ప్రజల మధ్య చాటించమని ఫిలిష్తీయుల దేశమంతటికీ కబురు పంపించారు. 10 తర్వాత వాళ్లు సౌలు కవచాన్ని తమ దేవుని గుడిలో పెట్టి, అతని తలను దాగోను గుడిలో వేలాడదీశారు.+
11 ఫిలిష్తీయులు సౌలుకు చేసినదంతా గిలాదులోని యాబేషువాళ్లందరూ+ విన్నప్పుడు,+ 12 వాళ్లలో యోధులందరూ లేచి సౌలు, అతని కుమారుల శవాల్ని తెచ్చారు. వాటిని యాబేషుకు తీసుకొచ్చి, వాళ్ల ఎముకల్ని యాబేషులోని ఒక వృక్షం కింద పాతిపెట్టారు.+ వాళ్లు ఏడురోజులు ఉపవాసం ఉన్నారు.
13 అలా, సౌలు యెహోవాకు నమ్మకద్రోహం చేశాడు కాబట్టి చనిపోయాడు. అతను యెహోవా మాటకు లోబడలేదు,+ అంతేకాదు అతను చనిపోయినవాళ్లను సంప్రదించే స్త్రీ దగ్గరికి వెళ్లాడు;+ 14 అతను యెహోవా దగ్గర విచారణ చేసే బదులు అలా చేశాడు. అందుకే ఆయన సౌలును చంపి, యెష్షయి కుమారుడైన దావీదుకు రాజరికాన్ని అప్పగించాడు.+
11 కొంతకాలానికి ఇశ్రాయేలీయులందరూ హెబ్రోనులో+ ఉన్న దావీదు దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “ఇదిగో! మేము నీ రక్తసంబంధులం.*+ 2 గతంలో సౌలు రాజుగా ఉన్నప్పుడు, నువ్వే యుద్ధాల్లో ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించావు.+ అంతేకాదు నీ దేవుడైన యెహోవా నీతో ఇలా అన్నాడు: ‘నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని కాస్తావు, నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలు మీద నాయకుడివి అవుతావు.’ ”+ 3 ఇశ్రాయేలు పెద్దలందరూ హెబ్రోనులో ఉన్న దావీదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు, అతను అక్కడ యెహోవా ఎదుట వాళ్లతో ఒప్పందం* చేశాడు. తర్వాత వాళ్లు, సమూయేలు ద్వారా యెహోవా చెప్పిన మాట ప్రకారం+ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించారు.+
4 ఆ తర్వాత దావీదు, అలాగే ఇశ్రాయేలీయులందరూ యెబూసీయులు+ నివసిస్తున్న యెరూషలేముకు, అంటే యెబూసుకు+ బయల్దేరారు. 5 యెబూసీయులు దావీదును, “నువ్వు ఎప్పటికీ ఇక్కడికి రాలేవు!” అని హేళన చేశారు.+ అయితే దావీదు సీయోను కోటను+ స్వాధీనం చేసుకున్నాడు, దాన్ని ఇప్పుడు దావీదు నగరం+ అని పిలుస్తున్నారు. 6 దావీదు ఇలా అన్నాడు: “యెబూసీయుల మీద మొదట ఎవరు దాడి చేస్తారో అతను సైన్యాధిపతి అవుతాడు.” అప్పుడు సెరూయా కుమారుడైన యోవాబు+ మొదట దాని మీదికి వెళ్లాడు, అతను సైన్యాధిపతి అయ్యాడు. 7 తర్వాత దావీదు ఆ కోటలో నివసించడం మొదలుపెట్టాడు. అందుకే దానికి దావీదు నగరం అనే పేరు వచ్చింది. 8 అతను మిల్లో* దగ్గర నుండి దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లో గోడల్ని, మిగతా భవనాల్ని కట్టించడం మొదలుపెట్టాడు, యోవాబు మిగతా నగరాన్ని తిరిగి కట్టించాడు. 9 అలా దావీదు అంతకంతకూ గొప్పవాడౌతూ ఉన్నాడు,+ సైన్యాలకు అధిపతైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.
10 దావీదు దగ్గరున్న బలమైన యోధుల్లో అధిపతులు వీళ్లే. యెహోవా ఇశ్రాయేలుకు వాగ్దానం చేసినట్టు, దావీదును రాజుగా చేసే విషయంలో వీళ్లు ఇశ్రాయేలీయులందరితో పాటు పూర్తి మద్దతు ఇచ్చారు.+ 11 దావీదు దగ్గరున్న బలమైన యోధుల పట్టిక ఇది: హక్మోనీయుడి కుమారుడైన యాషాబాము,+ అతను ముగ్గురు బలమైన యోధుల్లో అధిపతి.+ యాషాబాము ఒకసారి తన ఈటెతో 300 మందిని చంపాడు.+ 12 అతని తర్వాతివాడు ఎలియాజరు,+ అతను అహోహీయుడైన+ దోదో కుమారుడు. ముగ్గురు బలమైన యోధుల్లో ఎలియాజరు ఒకడు. 13 ఒకసారి ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి పస్దమ్మీములో సమకూడినప్పుడు అతను దావీదుతో పాటు ఉన్నాడు.+ అక్కడ ఒక బార్లీ* చేను ఉంది; ప్రజలు ఫిలిష్తీయుల్ని చూసి పారిపోయారు. 14 కానీ అతను ఆ చేను మధ్యలో నిలబడి దాన్ని కాపాడాడు, అతను ఫిలిష్తీయుల్ని హతం చేస్తూ వెళ్లాడు. అలా యెహోవా తన ప్రజలకు గొప్ప విజయాన్ని* ఇచ్చాడు.+
15 ఒకసారి 30 మంది అధిపతుల్లో ముగ్గురు దావీదు దగ్గరికి వచ్చారు, అప్పుడు దావీదు బండ దగ్గర, అంటే అదుల్లాము గుహ దగ్గర ఉన్నాడు;+ ఫిలిష్తీయుల సైన్యం రెఫాయీము లోయలో మకాం వేసి ఉంది.+ 16 ఆ సమయంలో దావీదు అక్కడ ఒక సురక్షితమైన స్థలంలో ఉన్నాడు, ఫిలిష్తీయుల సైనిక స్థావరం ఒకటి బేత్లెహేములో ఉంది. 17 అప్పుడు దావీదు, “నేను బేత్లెహేము+ ద్వారం దగ్గరున్న బావి నీళ్లు తాగితే ఎంత బాగుంటుంది!” అంటూ తన కోరికను తెలియజేశాడు. 18 దాంతో ఆ ముగ్గురు ఫిలిష్తీయుల శిబిరంలోకి చొరబడి, బేత్లెహేము ద్వారం దగ్గరున్న బావిలో నుండి నీళ్లు తోడి దావీదు దగ్గరికి తీసుకొచ్చారు; కానీ దావీదు ఆ నీళ్లు తాగడానికి ఒప్పుకోకుండా వాటిని యెహోవా ముందు పారబోశాడు. 19 అతను ఇలా అన్నాడు: “నా దేవుడంటే నాకు గౌరవం ఉంది కాబట్టి నేను ఈ పని చేయడం నా ఊహకందని విషయం! తమ ప్రాణాలకు తెగించిన ఈ మనుషుల రక్తాన్ని నేను తాగాలా?+ వాళ్లు ప్రాణాలకు తెగించి మరీ ఈ నీళ్లు తీసుకొచ్చారు.” అలా దావీదు ఆ నీళ్లు తాగడానికి ఒప్పుకోలేదు. అతని దగ్గరున్న ముగ్గురు బలమైన యోధులు చేసిన పనులు ఇవి.
20 యోవాబు సహోదరుడైన+ అబీషై+ మరో ముగ్గురిలో అధిపతి అయ్యాడు; అతను ఒకసారి ఈటెతో 300 మందిని చంపాడు. అతనికి ఆ మొదటి ముగ్గురికి ఉన్నలాంటి పేరే ఉంది.+ 21 అతను ఆ మరో ముగ్గురిలో మిగతా ఇద్దరి కన్నా ఎంతో ప్రసిద్ధి చెందాడు, అతను వాళ్ల అధిపతి; అయినా అతను మొదటి ముగ్గురికి సమానుడు కాలేదు.
22 యెహోయాదా కుమారుడైన బెనాయా+ ఎంతో ధైర్యం గలవాడు.* అతను కబ్సెయేలులో+ ఎన్నో సాహస కార్యాలు చేశాడు. అతను మోయాబుకు చెందిన అరీయేలు ఇద్దరు కుమారుల్ని చంపాడు. మంచు కురుస్తున్న ఒకరోజు అతను నీటి గుంటలోకి దిగి ఒక సింహాన్ని చంపాడు.+ 23 అతను చాలా ఎత్తుగా ఉన్న, అంటే ఐదు మూరల* ఎత్తున్న ఒక ఐగుప్తీయుణ్ణి+ కూడా చంపాడు. ఆ ఐగుప్తీయుడి చేతిలో నేత నేసేవాళ్ల కర్ర లాంటి ఈటె+ ఉన్నా, అతను ఆ ఐగుప్తీయుడి మీదికి ఒక కర్రతో వెళ్లి అతని చేతిలో నుండి ఈటెను లాక్కొని దానితోనే అతన్ని చంపాడు.+ 24 ఈ పనులు యెహోయాదా కుమారుడైన బెనాయా చేశాడు, అతనికి ఆ ముగ్గురు బలమైన యోధులకున్నంత పేరు ఉంది. 25 అతను ఆ ముప్పై మంది కన్నా ఎక్కువ ప్రసిద్ధి చెందినా, ఆ ముగ్గురికి సమానుడు కాలేదు.+ అయితే, దావీదు అతన్ని తన అంగరక్షకుల మీద నియమించాడు.
26 సైన్యంలో ఉన్న బలమైన యోధులు ఎవరంటే: యోవాబు సహోదరుడైన అశాహేలు,+ బేత్లెహేముకు చెందిన దోదో కుమారుడైన ఎల్హానాను,+ 27 హరోరీయుడైన షమ్మా, పెలోనీయుడైన హేలెస్సు, 28 తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడు ఈరా,+ అనాతోతీయుడైన అబీయెజరు,+ 29 హూషాతీయుడైన సిబ్బెకై,+ అహోహీయుడైన ఈలై, 30 నెటోపాతీయుడైన మహరై,+ నెటోపాతీయుడైన బయనా కుమారుడు హేలెదు,+ 31 బెన్యామీనీయుల+ గిబియాకు చెందిన రీబై కుమారుడు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా, 32 గాయషు+ వాగుల* ప్రాంతానికి చెందిన హూరై, అర్బాతీయుడైన అబీయేలు, 33 బహూరీమీయుడైన అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యాహ్బా, 34 గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడు యోనాతాను, 35 హరారీయుడైన శాకారు కుమారుడు అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు, 36 మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా, 37 కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై, 38 నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీ కుమారుడైన మిబ్హారు, 39 అమ్మోనీయుడైన జెలెకు, బెరోతీయుడైన నహరై; ఇతను సెరూయా కుమారుడైన యోవాబు ఆయుధాలు మోసేవాడు, 40 ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, 41 హిత్తీయుడైన ఊరియా,+ అహ్లయి కుమారుడైన జాబాదు, 42 రూబేనీయుడైన షీజా కుమారుడు అదీనా, అతను రూబేనీయుల్లో ఒక అధిపతి, అలాగే అతనితో ఉన్న 30 మందికి అధిపతి; 43 మయకా కుమారుడైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు, 44 అష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరోయేరీయుడైన హోతాము కుమారులు షామా, యెహీయేలు; 45 షిమ్రీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన అతని సహోదరుడు యోహా; 46 మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై, యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా; 47 ఎలీయేలు, ఓబేదు, మెజోబాయావాడైన యహశీయేలు.
12 కీషు కుమారుడైన సౌలు కారణంగా దావీదు స్వేచ్ఛగా తిరగలేకపోతున్న సమయంలో,+ సిక్లగులో+ ఉన్న దావీదు దగ్గరికి వచ్చినవాళ్లు వీళ్లు; యుద్ధంలో దావీదుకు మద్దతిచ్చిన బలమైన యోధుల్లో వీళ్లు ఉన్నారు.+ 2 వాళ్ల దగ్గర విల్లులు ఉండేవి; వాళ్లు కుడిచేతితోనూ ఎడమచేతితోనూ+ వడిసెల విసరగలరు,+ విల్లుతో బాణాలు వేయగలరు. వాళ్లు బెన్యామీనుకు+ చెందిన సౌలు సహోదరులు. 3 అహీయెజెరు వాళ్ల అధిపతి, అతని తర్వాతివాడు యోవాషు; వీళ్లిద్దరూ గిబియాతీయుడైన+ షెమాయా కుమారులు; అజ్మావెతు+ కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనాతోతీయుడైన యెహూ, 4 గిబియోనీయుడైన+ ఇష్మయా; బలమైన యోధుడైన ఇతను ఆ ముప్పై మందిలో+ ఒకడు, ముప్పై మందికి అధిపతి; అలాగే యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు, 5 ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హారీపీయుడైన షెఫట్య, 6 కోరహీయులైన ఎల్కానా, ఇష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము,+ 7 గెదోరువాడైన యెరోహాము కుమారులు యోహేలా, జెబద్యా.
8 కొంతమంది గాదీయులు ఎడారిలో తలదాచుకున్న+ దావీదు పక్షాన చేరారు; వాళ్లు బలమైన యోధులు, యుద్ధ నైపుణ్యం ఉన్న సైనికులు; వాళ్లు పెద్ద డాలు, బల్లెం పట్టుకుని ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు; వాళ్ల ముఖాలు సింహాల ముఖాల్లా ఉంటాయి, వాళ్లు పర్వతాల మీద కొండజింకల అంత వేగంగా పరుగెత్తుతారు. 9 వాళ్లలో ఏసెరు అధిపతి, రెండోవాడు ఓబద్యా, మూడోవాడు ఏలీయాబు, 10 నాలుగోవాడు మిష్మన్నా, ఐదోవాడు యిర్మీయా, 11 ఆరోవాడు అత్తయి, ఏడోవాడు ఎలీయేలు, 12 ఎనిమిదోవాడు యోహానాను, తొమ్మిదోవాడు ఎల్జాబాదు, 13 పదోవాడు యిర్మీయా, పదకొండోవాడు మక్బన్నయి. 14 వీళ్లు గాదీయులు,+ సైన్యంలో అధిపతులు. వాళ్లలో అత్యంత బలహీనుడు 100 మందితో సమానం, అత్యంత బలవంతుడు 1,000 మందితో సమానం.+ 15 మొదటి నెలలో యొర్దాను నది గట్ల మీదుగా పొంగిపొర్లుతున్నప్పుడు వీళ్లు నది దాటారు. వాళ్లు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లందర్నీ తూర్పు వైపుకు, పడమటి వైపుకు తరిమేశారు.
16 కొంతమంది బెన్యామీనీయులు, యూదావాళ్లు కూడా దావీదు దాక్కున్న చోటికి+ వచ్చారు. 17 అప్పుడు దావీదు బయటికి వచ్చి వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు నాకు సహాయం చేయడానికి నా దగ్గరికి శాంతిగా వచ్చివుంటే, మనం స్నేహితులం అవుతాం. కానీ నేను ఏ తప్పూ చేయకపోయినా నన్ను నా శత్రువులకు అప్పగించడానికి మీరు వచ్చివుంటే, మన పూర్వీకుల దేవుడు అది చూసి తీర్పు తీర్చాలి.”+ 18 అప్పుడు ఆ ముప్పై మందికి అధిపతైన అమాశై మీదికి పవిత్రశక్తి వచ్చింది,*+ అతను ఇలా అన్నాడు:
“దావీదూ, మేము నీ వాళ్లం; యెష్షయి కుమారుడా, మేము నీతో ఉన్నాం.+
నీకు శాంతి కలగాలి, నీకు సహాయం చేసేవాళ్లకు శాంతి కలగాలి,
ఎందుకంటే నీ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు.”+
దావీదు వాళ్లను ఆహ్వానించి, వాళ్లను కూడా సైన్యాల్లో అధిపతులుగా నియమించాడు.
19 మనష్షేవాళ్లలో నుండి కూడా కొంతమంది సౌలును విడిచిపెట్టి దావీదు దగ్గరికి వచ్చారు, ఆ సమయంలో దావీదు సౌలుతో యుద్ధం చేయడానికి ఫిలిష్తీయులతో పాటు వచ్చాడు; అయితే దావీదు ఫిలిష్తీయులకు సహాయం చేయలేదు, ఎందుకంటే ఫిలిష్తీయుల పాలకులు+ ఒకరితో ఒకరు మాట్లాడుకుని, “ఇతను తన ప్రభువు సౌలు దగ్గరికి వెళ్లిపోతాడు, అది మన ప్రాణాలకే ప్రమాదం” అని చెప్పి దావీదును పంపించేశారు.+ 20 దావీదు సిక్లగుకు+ వెళ్లినప్పుడు, అతని దగ్గరికి వెళ్లిన మనష్షేవాళ్లు ఎవరంటే: అద్నా, యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై; వీళ్లు వేలమంది మనష్షేవాళ్ల మీద అధిపతులు.+ 21 వాళ్లు దోపిడీ ముఠాను ఎదిరించడంలో దావీదుకు సహాయం చేశారు, ఎందుకంటే వాళ్లందరూ బలమైన యోధులు, ధైర్యవంతులు;+ వాళ్లు సైన్యంలో అధిపతులు అయ్యారు. 22 ప్రజలు దావీదుకు సహాయం చేయడానికి రోజూ అతని దగ్గరికి వస్తూ ఉన్నారు,+ చివరికి ఆ సైన్యం దేవుని సైన్యమంత గొప్ప సైన్యం అయ్యింది.+
23 యెహోవా ఆదేశం ప్రకారం సౌలు రాజరికాన్ని దావీదుకు ఇవ్వడానికి, హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చినవాళ్ల+ సంఖ్య ఇది, వీళ్లు యుద్ధం కోసం సిద్ధంగా ఉన్న యోధులు.+ 24 పెద్ద డాళ్లు, ఈటెలు ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉన్న యూదావాళ్లు 6,800 మంది. 25 షిమ్యోనీయుల్లో నుండి బలమైన, ధైర్యంగల సైనికులు 7,100 మంది.
26 లేవీయుల్లో నుండి 4,600 మంది. 27 అహరోను కుమారులకు+ నాయకుడైన యెహోయాదా,+ అతనితో పాటు 3,700 మంది, 28 అలాగే బలం, ధైర్యం ఉన్న యువకుడైన సాదోకు,+ అతనితో పాటు అతని పూర్వీకుల కుటుంబానికి చెందిన 22 మంది అధిపతులు.
29 సౌలు సహోదరులైన బెన్యామీనీయుల్లో+ నుండి 3,000 మంది; వాళ్లలో చాలామంది అప్పటివరకు సౌలుకు, అతని కుటుంబానికి నమ్మకంగా ఉన్నారు. 30 ఎఫ్రాయిమీయుల్లో నుండి బలం, ధైర్యం ఉన్న 20,800 మంది; వాళ్లు తమ పూర్వీకుల కుటుంబాల్లో పేరున్న వాళ్లు.
31 దావీదును రాజుగా చేయడానికి, మనష్షే అర్ధగోత్రంలో నుండి పేర్లతో ఎంపిక చేయబడిన 18,000 మంది. 32 ఇశ్శాఖారు గోత్రంలో నుండి 200 మంది అధిపతులు, అలాగే వాళ్ల కింద ఉన్న వాళ్ల సహోదరులందరూ. ఆ అధిపతులు పరిస్థితుల్ని అర్థం చేసుకొని, ఇశ్రాయేలీయులు ఏం చేయాలో గ్రహించినవాళ్లు. 33 జెబూలూను గోత్రంలో నుండి అన్నిరకాల ఆయుధాలు ధరించి, యుద్ధానికి సిద్ధంగా ఉన్న 50,000 మంది సైనికులు; వాళ్లందరూ పూర్తి విశ్వసనీయతతో దావీదు దగ్గరికి వచ్చారు.* 34 నఫ్తాలి గోత్రంలో నుండి 1,000 మంది అధిపతులు, వాళ్లతో పాటు పెద్ద డాళ్లు, ఈటెలు ధరించిన 37,000 మంది. 35 దాను గోత్రంలో నుండి యుద్ధానికి సిద్ధంగా ఉన్న 28,600 మంది. 36 ఆషేరు గోత్రంలో నుండి యుద్ధానికి సిద్ధంగా ఉన్న 40,000 మంది సైనికులు.
37 యొర్దాను అవతలి వైపు ఉన్న+ రూబేనీయుల్లో, గాదీయుల్లో, మనష్షే అర్ధగోత్రం వాళ్లలో నుండి అన్నిరకాల యుద్ధ ఆయుధాలు ధరించిన 1,20,000 మంది సైనికులు. 38 వాళ్లందరూ యుద్ధ పంక్తులు తీరగలవాళ్లు; వాళ్లు దావీదును ఇశ్రాయేలు అంతటి మీద రాజుగా చేయడానికి సంపూర్ణ హృదయంతో హెబ్రోనుకు వచ్చారు, మిగతా ఇశ్రాయేలీయులు కూడా దావీదును రాజుగా చేయాలని ఐక్యంగా* కోరుకున్నారు.+ 39 వాళ్ల సహోదరులు వాళ్ల కోసం ఏర్పాట్లు చేయడంతో వాళ్లు తింటూ, తాగుతూ దావీదుతోపాటు అక్కడే మూడు రోజులు ఉన్నారు. 40 అంతేకాదు దగ్గర్లో ఉన్నవాళ్లు, అలాగే ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి అంత దూరంలో ఉన్నవాళ్లు కూడా గాడిదల మీద, ఒంటెల మీద, కంచర గాడిదల మీద, పశువుల మీద ఆహారాన్ని తెస్తూ ఉన్నారు; వాళ్లు పెద్ద మొత్తంలో పిండిని, అంజూర రొట్టెల్ని, ఎండుద్రాక్ష రొట్టెల్ని, ద్రాక్షారసాన్ని, నూనెను, పశువుల్ని, గొర్రెల్ని తెస్తూ ఉన్నారు; ఎందుకంటే ఇశ్రాయేలులో సంతోషం వెల్లివిరిసింది.
13 దావీదు సహస్రాధిపతులతో,* శతాధిపతులతో,* ఇతర నాయకులందరితో మాట్లాడాడు.+ 2 తర్వాత దావీదు ఇశ్రాయేలు సమాజమంతటితో ఇలా అన్నాడు: “మీ దృష్టికి మంచిదనిపిస్తే, మన దేవుడైన యెహోవాకు అంగీకారమైతే, వచ్చి మనతో కలవమని ఇశ్రాయేలు ప్రాంతాలన్నిట్లో ఉన్న మన మిగతా సహోదరులకు, పచ్చికబయళ్లు గల తమ నగరాల్లో నివసిస్తున్న యాజకులకు, లేవీయులకు+ కబురు పంపిద్దాం. 3 మన దేవుని మందసాన్ని వెనక్కి తీసుకొద్దాం.”+ వాళ్లు సౌలు రోజుల్లో దాన్ని నిర్లక్ష్యం చేశారు.+ 4 ఆ మాట ప్రజలందరికీ సరైనదిగా అనిపించింది కాబట్టి సమాజమంతా అలా చేయడానికి ఒప్పుకుంది. 5 కాబట్టి దావీదు కిర్యత్యారీము నుండి సత్యదేవుని మందసాన్ని తీసుకురావడానికి, ఐగుప్తు* నది నుండి* లెబో-హమాతు*+ వరకు ఉన్న ఇశ్రాయేలీయులందర్నీ సమావేశపర్చాడు.+
6 కెరూబుల పైన* సింహాసనంలో కూర్చున్న+ సత్యదేవుని మందసాన్ని తీసుకురావడానికి దావీదు, ఇశ్రాయేలీయులందరూ యూదాకు చెందిన బాలాకు,+ అంటే కిర్యత్యారీముకు వెళ్లారు. ఆ మందసం దగ్గర ప్రజలు యెహోవా పేరున ప్రార్థించేవాళ్లు. 7 అయితే వాళ్లు సత్యదేవుని మందసాన్ని ఒక కొత్త బండిమీద పెట్టి+ అబీనాదాబు ఇంటి నుండి తీసుకొచ్చారు; ఉజ్జా, అహ్యో ఆ బండి ముందు నడుస్తున్నారు.+ 8 దావీదు, ఇశ్రాయేలీయులందరూ పాటలు పాడుతూ, వీణలూ* ఇతర తంతివాద్యాలూ కంజీరలూ*+ తాళాలూ వాయిస్తూ,+ బాకాలు ఊదుతూ+ తమ పూర్తి శక్తితో సత్యదేవుని ఎదుట వేడుక జరుపుకుంటున్నారు. 9 అయితే వాళ్లు కీదోను కళ్లం* దగ్గరికి వచ్చేసరికి, బండిని లాగుతున్న ఎద్దులు మందసాన్ని దాదాపు పడేయబోయాయి. అప్పుడు ఉజ్జా తన చెయ్యి చాపి మందసాన్ని పట్టుకున్నాడు. 10 మందసం వైపు చెయ్యి చాపినందుకు యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకుంది. ఆయన ఉజ్జాను చంపాడు,+ అతను అక్కడే దేవుని ఎదుట చనిపోయాడు.+ 11 యెహోవా ఆగ్రహం ఉజ్జా మీద రగులుకుంది కాబట్టి దావీదుకు కోపం వచ్చింది;* అందుకే ఈ రోజు వరకు ఆ స్థలాన్ని పెరెజ్-ఉజ్జా* అని పిలుస్తున్నారు.
12 ఆ రోజు దావీదు సత్యదేవునికి భయపడి, “సత్యదేవుని మందసాన్ని నా దగ్గరికి ఎలా తీసుకురావాలి?” అన్నాడు.+ 13 కాబట్టి దావీదు, మందసాన్ని దావీదు నగరంలో తాను ఉన్న చోటికి తీసుకురాకుండా గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటికి తీసుకెళ్లే ఏర్పాటు చేశాడు. 14 సత్యదేవుని మందసం ఓబేదెదోము ఇంటివాళ్ల దగ్గర ఉంది; అది మూడు నెలలు అతని ఇంట్లో ఉంది. దానివల్ల యెహోవా ఓబేదెదోము ఇంటివాళ్లను, అతనికి ఉన్నవాటన్నిటినీ దీవిస్తూ వచ్చాడు.+
14 తూరు రాజైన హీరాము+ దావీదు దగ్గరికి సందేశకుల్ని పంపించాడు; దావీదు కోసం ఒక రాజభవనాన్ని కట్టడానికి అతను దేవదారు మ్రానుల్ని, తాపీ పనివాళ్లను,* వడ్రంగుల్ని పంపించాడు.+ 2 యెహోవా తనను ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపర్చాడని,+ తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం తన రాజరికాన్ని గొప్ప చేశాడని దావీదుకు అర్థమైంది.+
3 దావీదు యెరూషలేములో ఇంకొంతమందిని పెళ్లిచేసుకున్నాడు,+ అతనికి ఇంకొంతమంది కుమారులు, కూతుళ్లు పుట్టారు.+ 4 యెరూషలేములో దావీదుకు పుట్టినవాళ్ల పేర్లు+ ఇవి: షమ్మూయ, షోబాబు, నాతాను,+ సొలొమోను,+ 5 ఇభారు, ఏలీషూవ, ఎల్పాలెటు, 6 నోగహు, నెపెగు, యాఫీయ, 7 ఎలీషామా, బెయెల్యెదా, ఎలీపేలెటు.
8 దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకించబడ్డాడని విన్నప్పుడు,+ ఫిలిష్తీయులందరూ అతనితో యుద్ధం చేయడానికి వచ్చారు.+ దావీదు దాని గురించి విని, వాళ్ల మీదికి వెళ్లాడు. 9 ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో+ నివసిస్తున్నవాళ్ల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. 10 అప్పుడు దావీదు, “నేను ఫిలిష్తీయుల మీదికి వెళ్లనా? వాళ్లను నా చేతికి అప్పగిస్తావా?” అని దేవుని దగ్గర విచారణ చేశాడు. దానికి యెహోవా అతనితో, “వెళ్లు, నేను వాళ్లను తప్పకుండా నీ చేతికి అప్పగిస్తాను” అన్నాడు.+ 11 దాంతో దావీదు బయల్పెరాజీముకు+ వెళ్లి, అక్కడ ఫిలిష్తీయుల్ని హతం చేశాడు. అప్పుడు దావీదు, “నీళ్లు గోడను కూల్చినట్టు, సత్యదేవుడు నా శత్రువుల్ని నా చేత ఓడించాడు” అన్నాడు. అందుకే ఆ స్థలానికి బయల్పెరాజీము* అనే పేరు వచ్చింది. 12 ఫిలిష్తీయులు తమ దేవుళ్ల విగ్రహాల్ని అక్కడ వదిలేసి పారిపోయారు; దావీదు ఆజ్ఞాపించడంతో వాటిని మంటల్లో కాల్చేశారు.+
13 తర్వాత ఫిలిష్తీయులు మళ్లీ లోయలో దాడి చేశారు.+ 14 దావీదు మళ్లీ దేవుని దగ్గర విచారణ చేశాడు; అయితే సత్యదేవుడు ఇలా చెప్పాడు: “నువ్వు నేరుగా వాళ్ల మీదికి వెళ్లొద్దు. బదులుగా, వాళ్ల వెనకాల నుండి చుట్టూ తిరిగి, కంబళి చెట్ల ఎదురుగా వాళ్ల మీదికి వెళ్లు.+ 15 కంబళి చెట్ల కొనల్లో ప్రజలు వస్తున్న శబ్దం వినబడగానే దాడిచేయి. ఎందుకంటే ఫిలిష్తీయుల సైన్యాన్ని హతం చేయడానికి సత్యదేవుడు అప్పటికే నీకు ముందుగా వెళ్లివుంటాడు.”+ 16 దావీదు సత్యదేవుడు ఆజ్ఞాపించినట్టే చేశాడు.+ దావీదు, అతని మనుషులు ఫిలిష్తీయుల సైన్యాన్ని గిబియోను నుండి గెజెరు+ వరకు తరుముతూ హతం చేశారు. 17 దావీదు ఖ్యాతి అన్నిదేశాల్లో వ్యాపించింది, దేశాలన్నీ దావీదుకు భయపడేలా యెహోవా చేశాడు.+
15 దావీదు తన కోసం దావీదు నగరంలో ఇళ్లు కట్టించుకుంటూ ఉన్నాడు; అలాగే అతను సత్యదేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేసి, దానికోసం ఒక డేరా వేయించాడు.+ 2 అప్పుడు దావీదు ఇలా చెప్పాడు: “సత్యదేవుని మందసాన్ని లేవీయులు తప్ప ఎవ్వరూ మోయకూడదు; యెహోవా మందసాన్ని మోయడానికి, ఎల్లప్పుడూ తనకు సేవచేయడానికి యెహోవా లేవీయుల్ని ఎంచుకున్నాడు.”+ 3 తర్వాత, దావీదు తాను సిద్ధం చేసిన స్థలానికి యెహోవా మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలీయులందర్నీ యెరూషలేములో సమావేశపర్చాడు.+
4 అతను అహరోను వంశస్థుల్ని,+ లేవి వంశస్థుల్ని+ సమకూర్చాడు; వాళ్లు ఎవరంటే: 5 కహాతీయుల నుండి అధిపతైన ఊరియేలు, అతని సహోదరులు 120 మంది; 6 మెరారీయుల నుండి అధిపతైన అశాయా,+ అతని సహోదరులు 220 మంది; 7 గెర్షోమీయుల నుండి అధిపతైన యోవేలు,+ అతని సహోదరులు 130 మంది; 8 ఎలీషాపాను+ వంశస్థుల నుండి అధిపతైన షెమయా, అతని సహోదరులు 200 మంది; 9 హెబ్రోను వంశస్థుల నుండి అధిపతైన ఎలీయేలు, అతని సహోదరులు 80 మంది; 10 ఉజ్జీయేలు+ వంశస్థుల నుండి అధిపతైన అమ్మీనాదాబు, అతని సహోదరులు 112 మంది. 11 అంతేకాదు, అతను యాజకులైన సాదోకును,+ అబ్యాతారును;+ లేవీయులైన ఊరియేలును, అశాయాను, యోవేలును, షెమయాను, ఎలీయేలును, అమ్మీనాదాబును పిలిపించి, 12 వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు లేవీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలు. మీరూ, మీ సహోదరులూ మిమ్మల్ని మీరు పవిత్రపర్చుకొని, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసాన్ని నేను సిద్ధం చేసిన స్థలానికి తీసుకురండి. 13 మొదటిసారి మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు మీరు దాన్ని మోయలేదు,+ మనం సరైన పద్ధతి+ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు; అందుకే మన దేవుడైన యెహోవా కోపం మనమీద రగులుకొంది.”+ 14 కాబట్టి యాజకులు, లేవీయులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసాన్ని తీసుకురావడానికి తమను తాము పవిత్రపర్చుకున్నారు.
15 అప్పుడు లేవీయులు, యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టు, సత్యదేవుని మందసాన్ని కర్రలతో+ భుజాల మీద పెట్టుకొని మోశారు. 16 తర్వాత దావీదు, సంగీత వాద్యాలతో అంటే తంతివాద్యాలతో, వీణలతో,*+ తాళాలతో+ సంతోషంగా పాటలు పాడడానికి గాయకులైన తమ సహోదరుల్ని నియమించమని లేవీయుల అధిపతులకు చెప్పాడు.
17 కాబట్టి లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును,+ అతని సహోదరుల్లో నుండి బెరెక్యా కుమారుడైన ఆసాపును,+ తమ సహోదరులైన మెరారీయుల్లో నుండి కూషాయాహు కుమారుడైన ఏతానును+ నియమించారు. 18 వాళ్లతోపాటు రెండో విభాగానికి+ చెందిన వాళ్ల సహోదరులైన జెకర్యా, బేను, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీపెలేహు, మిక్నేయాహు అలాగే ద్వారపాలకులైన ఓబేదెదోము, యెహీయేలు ఉన్నారు. 19 గాయకులైన హేమాను,+ ఆసాపు,+ ఏతాను రాగి తాళాలు+ వాయించాలి; 20 జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయా అలమోతు* స్వరంలో+ తంతివాద్యాలు వాయించారు. 21 మత్తిత్యా,+ ఎలీపెలేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు, అజజ్యా షెమినీతు* స్వరంలో+ వీణలు వాయిస్తూ సంగీత నిర్దేశకులుగా పని చేశారు. 22 లేవీయుల అధిపతైన కెనన్యా+ సామాన్లు మోసే పనిని చూసుకునేవాడు, ఎందుకంటే అతను నిపుణుడు. 23 బెరెక్యా, ఎల్కానా మందసానికి కాపలాదారులు. 24 యాజకులైన షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు సత్యదేవుని మందసం ముందు పెద్దగా బాకాలు ఊదారు;+ ఓబేదెదోము, యెహీయా మందసానికి కాపలాదారులుగా కూడా సేవ చేశారు.
25 అప్పుడు దావీదు, ఇశ్రాయేలు పెద్దలు, సహస్రాధిపతులు* ఓబేదెదోము+ ఇంటి నుండి యెహోవా ఒప్పంద మందసాన్ని తీసుకురావడానికి సంతోషంగా వెళ్లారు.+ 26 యెహోవా ఒప్పంద మందసాన్ని మోస్తున్న లేవీయులకు సత్యదేవుడు సహాయం చేశాడు కాబట్టి వాళ్లు ఏడు కోడెదూడల్ని, ఏడు పొట్టేళ్లను బలి అర్పించారు.+ 27 మందసాన్ని మోస్తున్న లేవీయులందరి లాగే, గాయకుల్లాగే, సామాన్లు మోస్తున్న గాయకుల మీద అధికారైన కెనన్యాలాగే దావీదు నాణ్యమైన వస్త్రంతో చేయబడిన చేతుల్లేని నిలువుటంగీని వేసుకున్నాడు; అలాగే నార ఏఫోదును కూడా వేసుకున్నాడు.+ 28 ఇశ్రాయేలీయులందరూ సంతోషంగా కేకలు వేస్తూ,+ బూరలూ* బాకాలూ ఊదుతూ,+ తాళాల్ని వాయిస్తూ, తంతివాద్యాల్నీ వీణల్నీ బిగ్గరగా వాయిస్తూ+ యెహోవా ఒప్పంద మందసాన్ని తీసుకొచ్చారు.
29 అయితే యెహోవా ఒప్పంద మందసం దావీదు నగరానికి వచ్చినప్పుడు,+ సౌలు కూతురైన మీకాలు+ కిటికీలో నుండి కిందికి చూసింది. దావీదు రాజు గంతులు వేస్తూ, సంబరాలు చేసుకుంటూ ఉండడం ఆమెకు కనిపించింది; దాంతో ఆమె తన హృదయంలో అతన్ని నీచంగా చూసింది.+
16 అలా వాళ్లు సత్యదేవుని మందసాన్ని తీసుకొచ్చి, దాని కోసం దావీదు వేయించిన డేరాలో ఉంచారు;+ వాళ్లు సత్యదేవుని ఎదుట దహనబలుల్ని, సమాధాన బలుల్ని అర్పించారు.+ 2 దావీదు దహనబలుల్ని,+ సమాధాన బలుల్ని+ అర్పించాక, యెహోవా పేరున ప్రజల్ని దీవించాడు. 3 అంతేకాదు, దావీదు ఇశ్రాయేలీయులందరికీ అంటే ప్రతీ పురుషునికి, స్త్రీకి ఒక గుండ్రటి రొట్టె, ఒక ఖర్జూర రొట్టె, ఒక ఎండుద్రాక్ష రొట్టె పంచిపెట్టాడు. 4 తర్వాత అతను యెహోవా ఒప్పంద మందసం ముందు సేవ చేయడానికి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఘనపర్చడానికి,* ఆయనకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించడానికి లేవీయుల్లో కొంతమందిని నియమించాడు.+ 5 వాళ్లలో ఆసాపు+ అధిపతి, అతని తర్వాతివాడు జెకర్యా; అలాగే యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము, యెహీయేలు+ తంతివాద్యాలు, వీణలు*+ వాయించారు. ఆసాపు తాళాలు వాయించాడు.+ 6 యాజకులైన బెనాయా, యహజీయేలు సత్యదేవుని ఒప్పంద మందసం ముందు బాకాలు ఊదుతూ ఉన్నారు.
7 దావీదు ఆ రోజే మొదటిసారి యెహోవాకు ఒక కృతజ్ఞతా గీతాన్ని రచించి, దాన్ని పాడమని ఆసాపును,+ అతని సహోదరుల్ని నిర్దేశించాడు. ఆ గీతం ఇది:
8 “యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి,+ ఆయన పేరున ప్రార్థించండి,
దేశదేశాల ప్రజల మధ్య ఆయన కార్యాలు తెలియజేయండి!+
10 ఆయన పవిత్రమైన పేరు గురించి గొప్పలు చెప్పుకోండి.+
యెహోవాను వెతికేవాళ్ల హృదయాలు ఉల్లసించాలి.+
11 యెహోవాను, ఆయన బలాన్ని వెతకండి.+
12 ఆయన చేసిన ఆశ్చర్యకార్యాల్ని,* అద్భుతాల్ని,
ఆయన ప్రకటించిన తీర్పుల్ని గుర్తుచేసుకోండి.+
13 ఆయన సేవకుడైన ఇశ్రాయేలు సంతానమా,*+
ఆయన ఎంచుకున్న యాకోబు వంశస్థులారా,+ గుర్తుచేసుకోండి.
14 ఆయనే మన దేవుడైన యెహోవా.+
ఆయన తీర్పులు లోకమంతటా అమలులో ఉన్నాయి.+
15 ఆయన ఒప్పందాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి,
ఆయన చేసిన వాగ్దానాన్ని* వెయ్యి తరాల వరకు గుర్తుపెట్టుకోండి,+
16 అది ఆయన అబ్రాహాముతో చేసిన ఒప్పందం,+
ఇస్సాకుకు ఒట్టేసి చేసిన ప్రమాణం,+
17 ఆయన దాన్ని యాకోబుకు ఒక ఆదేశంలా,+
ఇశ్రాయేలుకు శాశ్వత ఒప్పందంలా స్థిరపరుస్తూ
18 ఇలా అన్నాడు: ‘నేను కనాను దేశాన్ని నీకు ఇస్తాను,+
వారసత్వ ఆస్తిగా దాన్ని మీకు పంచి ఇస్తాను.’+
19 ఆయన ఈ మాట అన్నప్పుడు మీరు కొద్దిమందే ఉన్నారు,
అవును, చాలా తక్కువమంది ఉన్నారు, ఆ దేశంలో పరదేశులుగా ఉన్నారు.+
20 వాళ్లు ఒక దేశం నుండి ఇంకో దేశానికి,
ఒక రాజ్యం నుండి ఇంకో రాజ్యానికి తిరుగుతూ ఉన్నారు.+
21 ఆయన ఏ మనిషినీ వాళ్లకు హాని చేయనివ్వలేదు,+
బదులుగా వాళ్ల కోసం రాజుల్ని గద్దించాడు,+
22 ‘నా అభిషిక్తుల్ని ముట్టకండి,
నా ప్రవక్తలకు ఏ హానీ చేయకండి’ అని వాళ్లతో అన్నాడు.+
23 భూమ్మీదున్న సమస్త ప్రజలారా, యెహోవాకు పాటలు పాడండి!
ప్రతీరోజు ఆయన రక్షణను ప్రకటించండి!+
24 దేశాల మధ్య ఆయన మహిమను,
దేశదేశాల ప్రజలందరి మధ్య ఆయన అద్భుతమైన పనుల్ని చాటించండి.
25 యెహోవా గొప్పవాడు, అత్యంత స్తుతిపాత్రుడు.
26 దేశదేశాల ప్రజలు పూజించే దేవుళ్లందరూ వ్యర్థమైన దేవుళ్లు,+
కానీ యెహోవా ఆకాశాన్ని తయారుచేసిన దేవుడు.+
28 దేశదేశాల కుటుంబాల్లారా, యెహోవాకు తగిన ఘనత ఆయనకు ఇవ్వండి;
యెహోవా మహిమను బట్టి, బలాన్ని బట్టి ఆయనకు తగిన ఘనత ఇవ్వండి.+
పవిత్రమైన బట్టలు వేసుకుని* యెహోవాకు వంగి నమస్కారం చేయండి.*+
30 భూమ్మీదున్న సమస్త ప్రజలారా, ఆయన ముందు వణకండి!
భూమి* స్థిరంగా స్థాపించబడింది; దాన్ని కదిలించలేరు.*+
32 సముద్రం, దానిలో ఉన్నవన్నీ సంతోషంతో ఘోషించాలి;
పొలాలు, వాటిలో ఉన్నవన్నీ ఉల్లసించాలి.
33 అడవిలో ఉన్న చెట్లు యెహోవా ముందు సంతోషంతో కేకలు వేయాలి,
ఎందుకంటే ఆయన, భూమికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు.*
35 ఇలా చెప్పండి: ‘మా రక్షకుడివైన దేవా, మమ్మల్ని కాపాడు,+
మమ్మల్ని సమకూర్చి, దేశాల నుండి మమ్మల్ని రక్షించు,
అప్పుడు మేము నీ పవిత్రమైన పేరుకు కృతజ్ఞతలు చెల్లిస్తాం,+
36 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వతకాలం* స్తుతించబడాలి.’ ”
అప్పుడు ప్రజలంతా “ఆమేన్!”* అన్నారు; వాళ్లు యెహోవాను స్తుతించారు.
37 తర్వాత దావీదు ఆసాపును,+ అతని సహోదరుల్ని యెహోవా ఒప్పంద మందసం దగ్గర ఉంచాడు. ప్రతీరోజు జరగాల్సిన సేవ ప్రకారం,+ వాళ్లు మందసం ముందు ఎప్పుడూ సేవ చేయడానికి అలా ఉంచాడు.+ 38 అలాగే ఓబేదెదోమును, అతని సహోదరులు 68 మందిని, యెదూతూను కుమారుడైన ఓబేదెదోమును, హోసాను కాపలాదారులుగా ఉంచాడు; 39 యాజకుడైన సాదోకును,+ అతని తోటి యాజకుల్ని గిబియోను దగ్గర ఉన్నత స్థలం+ మీదున్న యెహోవా గుడారం ముందు ఉంచాడు. 40 దహనబలులు అర్పించే బలిపీఠం మీద యెహోవాకు క్రమంగా ఉదయం, సాయంత్రం దహనబలుల్ని అర్పించడానికి, యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రంలో రాయబడిన వాటన్నిటిని చేయడానికి+ దావీదు వాళ్లను అక్కడ ఉంచాడు. 41 వాళ్లతోపాటు హేమాను, యెదూతూను,+ ఎంపిక చేయబడిన పురుషుల్లో మిగిలినవాళ్లు ఉన్నారు; వాళ్లు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించేవాళ్లు,+ ఎందుకంటే “ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.”+ 42 బాకాలు ఊదడం కోసం, తాళాలు వాయించడం కోసం, సత్యదేవుణ్ణి స్తుతించేందుకు* ఉపయోగించే ఇతర వాద్యాల్ని వాయించడం కోసం వాళ్ల దగ్గర హేమాను,+ యెదూతూను ఉన్నారు; యెదూతూను కుమారులు+ ద్వారం దగ్గర అధికారులు. 43 తర్వాత ప్రజలందరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు, దావీదు తన ఇంటివాళ్లను దీవించడానికి వెళ్లాడు.
17 దావీదు తన రాజభవనంలో స్థిరపడిన తర్వాత నాతాను+ ప్రవక్తతో ఇలా అన్నాడు: “నేను ఇక్కడ దేవదారు మ్రానులతో చేసిన ఇంట్లో నివసిస్తుంటే+ యెహోవా ఒప్పంద మందసమేమో డేరాలో ఉంది.”+ 2 దానికి నాతాను, “సత్యదేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, నీ మనసులో ఏముంటే అది చేయి” అని దావీదుతో అన్నాడు.
3 ఆ రాత్రే దేవుని వాక్యం నాతాను దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 4 “నువ్వు వెళ్లి నా సేవకుడైన దావీదుకు ఇలా చెప్పు, ‘యెహోవా ఏమంటున్నాడంటే: “నేను నివసించడానికి నా కోసం ఒక మందిరాన్ని కట్టేది నువ్వు కాదు.+ 5 ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు నేను ఒక మందిరంలో నివసించలేదు; నేను ఒక డేరా నుండి ఇంకో డేరాకు, ఒక గుడారం నుండి ఇంకో గుడారానికి* వెళ్తూ ఉన్నాను.+ 6 నేను ఇశ్రాయేలీయులందరితో ప్రయాణించిన కాలమంతటిలో, నా ప్రజల్ని కాయడానికి నేను నియమించిన ఇశ్రాయేలు న్యాయాధిపతుల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా, ‘మీరు నా కోసం దేవదారు మ్రానులతో మందిరం ఎందుకు కట్టలేదు?’ అని ఒక్కమాటైనా అన్నానా?” ’
7 “ఇప్పుడు నా సేవకుడైన దావీదుకు ఇలా చెప్పు, ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను గొర్రెల్ని కాసే నిన్ను పచ్చికబయళ్లలో నుండి తీసుకొచ్చి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నాయకుణ్ణి చేశాను.+ 8 నువ్వు ఎక్కడికి వెళ్లినా నేను నీకు తోడు ఉంటాను,+ నీ ఎదుట నుండి నీ శత్రువులందర్నీ నాశనం చేస్తాను;+ నేను నీ పేరును గొప్ప చేస్తాను, నువ్వు భూమ్మీదున్న గొప్పవాళ్లలో ఒకడివి అవుతావు.+ 9 నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒక స్థలం నియమించి వాళ్లు అందులో స్థిరపడేలా చేస్తాను; వాళ్లు ఏ ఇబ్బందీ లేకుండా అక్కడ నివసిస్తారు; గతంలో జరిగినట్టుగా దుష్టులు ఇక వాళ్లను అణచివేయరు. 10 నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతుల్ని నియమించిన రోజు నుండి దుష్టులు వాళ్లను అణచివేస్తూ వచ్చారు. నేను నీ శత్రువులందర్నీ ఓడిస్తాను. అంతేకాదు నేను చెప్తున్నాను, ‘యెహోవా నీ కోసం ఒక రాజవంశాన్ని కడతాడు.’
11 “ ‘ “నీ రోజులు ముగిసిపోయి నువ్వు చనిపోయాక,* నీ సంతానాన్ని,* అంటే నీ కుమారుల్లో ఒకర్ని రాజును చేసి+ అతని రాజరికాన్ని స్థిరపరుస్తాను.+ 12 అతనే నా కోసం ఒక మందిరాన్ని కడతాడు,+ నేను అతని సింహాసనాన్ని ఎప్పటికీ స్థిరపరుస్తాను.+ 13 నేను అతనికి తండ్రిని అవుతాను, అతను నాకు కుమారుడు అవుతాడు.+ నీకు ముందున్న వ్యక్తి నుండి దూరం చేసినట్టు,+ అతని నుండి నా విశ్వసనీయ ప్రేమను దూరం చేయను.+ 14 అతను నా సింహాసనం మీద ఎప్పటికీ కూర్చునేలా చేస్తాను;+ అతని పరిపాలన, అతని రాజవంశం శాశ్వతంగా ఉంటాయి.” ’ ”+
15 నాతాను ఆ మాటలన్నిటినీ, ఆ దర్శనమంతటినీ దావీదుకు చెప్పాడు.
16 అప్పుడు దావీదు రాజు వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చొని ఇలా అన్నాడు: “యెహోవా దేవా, నువ్వు నా కోసం ఇంత చేయడానికి నేను ఎంతటివాణ్ణి? నా కుటుంబం ఎంతటిది?+ 17 దేవా, అది చాలదన్నట్టు, నీ సేవకుని రాజవంశం సుదూర భవిష్యత్తు వరకు నిలుస్తుందని+ కూడా చెప్పావు; యెహోవా దేవా, నేను ఇంకా హెచ్చించబడాల్సిన వ్యక్తిని* అన్నట్టు నన్ను చూశావు. 18 నువ్వు నాకు ఇచ్చిన ఘనత విషయంలో నీ సేవకుడైన దావీదు నీతో ఇంకేమి అనగలడు? నీ దాసుడు నీకు బాగా తెలుసు. 19 యెహోవా, నువ్వు నీ సేవకుడి కోసం నీ ఇష్టప్రకారం* ఈ గొప్ప పనులన్నిటినీ చేసి, నీ గొప్పతనాన్ని తెలియజేసుకున్నావు.+ 20 యెహోవా, నీలాంటివాళ్లు ఎవ్వరూ లేరు,+ నువ్వు తప్ప వేరే దేవుడు లేడు;+ మా చెవులతో విన్నవన్నీ ఆ విషయాన్ని బలపరుస్తున్నాయి. 21 నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లా భూమ్మీద ఇంకే ప్రజలు ఉన్నారు?+ సత్యదేవుడివైన నువ్వు వాళ్లను విడిపించి నీ ప్రజలుగా చేసుకున్నావు.+ ఐగుప్తు నుండి నువ్వు విడిపించిన నీ ప్రజల ఎదుట నుండి జనాల్ని వెళ్లగొట్టి,+ ఎంతో ఆశ్చర్యకరమైన గొప్ప పనులు చేసి నీ కోసం ఒక పేరు సంపాదించుకున్నావు.+ 22 నువ్వు ఇశ్రాయేలీయుల్ని శాశ్వతంగా నీ ప్రజలుగా చేసుకున్నావు;+ యెహోవా, నువ్వు వాళ్లకు దేవుడివి అయ్యావు.+ 23 ఇప్పుడు యెహోవా, నీ సేవకుని విషయంలో, అతని రాజవంశం విషయంలో నువ్వు చేసిన వాగ్దానం శాశ్వతకాలం నమ్మదగినదిగా ఉండాలి. నువ్వు మాటిచ్చినట్టే చేయి. 24 ‘ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా నిజంగా ఇశ్రాయేలీయులకు దేవుడు’ అని ప్రజలు అనేలా నీ పేరు శాశ్వతంగా ఉండాలి,* అది ఎప్పటికీ హెచ్చించబడాలి;+ నీ సేవకుడైన దావీదు రాజవంశం నీ ఎదుట స్థిరపర్చబడాలి.+ 25 నా దేవా, నీ సేవకుని కోసం ఒక రాజవంశాన్ని కట్టాలనుకుంటున్నావని నువ్వే నీ సేవకునికి తెలియజేశావు. అందుకే నీ సేవకుడు నీకు ఇలా ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నాడు. 26 యెహోవా, నువ్వే సత్యదేవుడివి, నువ్వు నీ సేవకుడి గురించి ఈ మంచి విషయాల్ని వాగ్దానం చేశావు. 27 కాబట్టి నీ సేవకుని రాజవంశం ఎప్పటికీ నీ ఎదుట ఉండేలా నువ్వు దాన్ని దీవిస్తూ ఉండాలి; ఎందుకంటే యెహోవా, నువ్వే దాన్ని దీవించావు, అది ఎప్పటికీ దీవించబడినదిగా ఉంటుంది.”
18 కొంతకాలం తర్వాత దావీదు ఫిలిష్తీయుల్ని ఓడించి, వాళ్లను లోబర్చుకున్నాడు; అతను ఫిలిష్తీయుల చేతుల్లో నుండి గాతును,+ దాని చుట్టుపక్కల పట్టణాల్ని స్వాధీనం చేసుకున్నాడు.+ 2 తర్వాత దావీదు మోయాబును ఓడించాడు;+ మోయాబీయులు దావీదుకు సేవకులై, అతనికి కప్పం కట్టారు.+
3 దావీదు సోబా+ రాజైన హదదెజరును+ హమాతు+ దగ్గర ఓడించాడు. హదదెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేయడానికి వెళ్తున్నప్పుడు దావీదు అతన్ని ఓడించాడు.+ 4 దావీదు అతని దగ్గర నుండి 1,000 రథాల్ని, 7,000 మంది గుర్రపురౌతుల్ని, 20,000 మంది సైనికుల్ని పట్టుకున్నాడు.+ తర్వాత, రథాల్ని లాగే 100 గుర్రాల్ని తప్ప మిగతా వాటన్నిటినీ కుంటివాటిగా చేశాడు.+ 5 దమస్కుకు చెందిన సిరియన్లు సోబా రాజైన హదదెజరుకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు, దావీదు 22,000 మంది సిరియన్లను చంపాడు. 6 తర్వాత దావీదు దమస్కుకు చెందిన సిరియాలో సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేశాడు; సిరియన్లు దావీదుకు సేవకులై అతనికి కప్పం కట్టారు. దావీదు వెళ్లిన చోటల్లా యెహోవా అతనికి విజయాన్ని* ఇచ్చాడు.+ 7 అంతేకాదు, దావీదు హదదెజరు సేవకుల దగ్గర నుండి బంగారంతో చేసిన గుండ్రటి డాళ్లను తీసుకుని, వాటిని యెరూషలేముకు తెచ్చాడు. 8 హదదెజరు నగరాలైన టిబ్హతు నుండి, కూను నుండి దావీదు పెద్ద మొత్తంలో రాగిని తీసుకొచ్చాడు. ఆ రాగితో సొలొమోను రాగి సముద్రాన్ని,+ స్తంభాల్ని, రాగి పాత్రల్ని చేయించాడు.+
9 దావీదు సోబా రాజైన హదదెజరు సైన్యాన్నంతటినీ ఓడించాడని హమాతు రాజైన తోయి విన్నప్పుడు,+ 10 అతను వెంటనే దావీదు బాగోగుల గురించి అడగడానికి, శుభాకాంక్షలు చెప్పడానికి తన కుమారుడైన హదోరమును దావీదు రాజు దగ్గరికి పంపించాడు; దావీదు హదదెజరుతో పోరాడి, అతన్ని ఓడించాడు కాబట్టి తోయి అలా చేశాడు (ఎందుకంటే హదదెజరుకు, తోయికి మధ్య చాలా యుద్ధాలు జరిగాయి); హదోరము అన్నిరకాల వెండి, బంగారు, రాగి వస్తువుల్ని తీసుకొని దావీదు దగ్గరికి వచ్చాడు. 11 దావీదు రాజు దేశాలన్నిటి నుండి, అంటే ఎదోము నుండి, మోయాబు నుండి, అలాగే అమ్మోనీయుల+ నుండి, ఫిలిష్తీయుల+ నుండి, అమాలేకీయుల+ నుండి కొల్లగొట్టిన వెండిబంగారాలతో పాటు వాటిని కూడా యెహోవాకు ప్రతిష్ఠించాడు.*+
12 సెరూయా+ కుమారుడైన అబీషై+ ఉప్పులోయలో 18,000 మంది ఎదోమీయుల్ని హతం చేశాడు.+ 13 అతను ఎదోములో సైనిక స్థావరాల్ని స్థాపించాడు. ఎదోమీయులందరూ దావీదు సేవకులయ్యారు.+ దావీదు వెళ్లిన చోటల్లా యెహోవా అతనికి విజయాన్ని* ఇచ్చాడు.+ 14 దావీదు ఇశ్రాయేలు అంతటి మీద పరిపాలిస్తూ+ తన ప్రజలందరికీ నీతిన్యాయాలు జరిగిస్తూ ఉన్నాడు.+ 15 సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతిగా,+ అహీలూదు కుమారుడైన యెహోషాపాతు+ వివరాలు నమోదు చేసేవాడిగా ఉన్నాడు. 16 అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులుగా, షవ్షా కార్యదర్శిగా ఉన్నారు. 17 యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయుల+ మీద, పెలేతీయుల+ మీద అధికారిగా ఉన్నాడు. దావీదు కుమారులు రాజు తర్వాతి స్థానంలో ముఖ్య అధికారులుగా ఉన్నారు.
19 తర్వాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోయాడు, అతని స్థానంలో అతని కుమారుడు రాజయ్యాడు.+ 2 అప్పుడు దావీదు, “నాహాషు నా మీద విశ్వసనీయ ప్రేమ చూపించాడు కాబట్టి, నేను అతని కుమారుడైన హానూను మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తాను” అన్నాడు.+ తండ్రిని కోల్పోయిన హానూనును ఓదార్చడానికి దావీదు సందేశకుల్ని పంపించాడు. దావీదు సేవకులు హానూనును ఓదార్చడానికి అమ్మోనీయుల+ దేశానికి వచ్చినప్పుడు, 3 అమ్మోనీయుల అధిపతులు హానూనుతో, “దావీదు నిన్ను ఓదార్చడానికి మనుషుల్ని పంపించి నీ తండ్రి మీద గౌరవం చూపిస్తున్నాడని అనుకుంటున్నావా? అతని సేవకులు నీ దగ్గరికి వచ్చింది అంతా పరిశీలించి, నిన్ను పడగొట్టడానికి, దేశాన్ని వేగుచూడడానికి కాదా?” అని అన్నారు. 4 దాంతో హానూను దావీదు సేవకుల్ని పట్టుకొని వాళ్ల గడ్డాలు గీయించి,+ వాళ్ల బట్టల్ని పిరుదుల వరకు కోయించి పంపించాడు. 5 వాళ్లు ఘోరంగా అవమానించబడ్డారు కాబట్టి దావీదుకు వాళ్ల గురించి తెలియగానే, వాళ్లను కలవడానికి వేరే మనుషుల్ని పంపించాడు; దావీదు రాజు వాళ్లకు ఈ సందేశం పంపించాడు: “మీ గడ్డాలు పెరిగే వరకు యెరికోలోనే+ ఉండి, ఆ తర్వాత రండి.”
6 కొంతకాలానికి, తాము దావీదు దృష్టిలో అసహ్యులమయ్యామని అమ్మోనీయులకు అర్థమైంది. దాంతో హానూను, అమ్మోనీయులు 1,000 తలాంతుల* వెండి ఇచ్చి మెసొపొతమియ* నుండి, అరాము-మయకా నుండి, సోబా నుండి రథాల్ని, గుర్రపురౌతుల్ని కిరాయికి తెచ్చుకున్నారు.+ 7 అలా వాళ్లు 32,000 రథాల్ని, మయకా రాజును, అతని ప్రజల్ని కిరాయికి తెచ్చుకున్నారు. తర్వాత వాళ్లు వచ్చి మేదెబా+ ఎదుట మకాం వేశారు. అమ్మోనీయులు తమ నగరాల నుండి పోగై యుద్ధం చేయడానికి వచ్చారు.
8 దావీదు దాని గురించి విన్నప్పుడు యోవాబును,+ అత్యంత బలవంతులైన తన శూరుల్ని, వాళ్లతోపాటు సైన్యాన్నంతటినీ పంపించాడు.+ 9 అప్పుడు అమ్మోనీయులు వచ్చి, నగర ప్రవేశ ద్వారం దగ్గర యుద్ధ పంక్తులు తీరారు. అక్కడికి వచ్చిన రాజులు వేరుగా మైదానంలో ఉన్నారు.
10 ముందు నుండి, వెనక నుండి సైన్యాలు తనమీదికి దూసుకురావడం యోవాబు చూశాడు. దాంతో అతను సిరియన్లను ఎదుర్కోవడానికి ఇశ్రాయేలులో శ్రేష్ఠులైన కొంతమంది సైనికుల్ని ఎంచుకొని వాళ్లను యుద్ధ పంక్తులు తీర్చాడు.+ 11 అతను మిగతావాళ్లను తన సహోదరుడైన అబీషై+ కింద ఉంచాడు. వాళ్లు యుద్ధ పంక్తులు తీరి అమ్మోనీయుల్ని ఎదుర్కోవడానికి అతను అలా చేశాడు. 12 తర్వాత అతను ఇలా అన్నాడు: “సిరియన్లను+ ఎదుర్కోవడం నాకు కష్టంగా ఉంటే, నువ్వు వచ్చి సహాయం చేయి; అమ్మోనీయుల్ని ఎదుర్కోవడం నీకు కష్టంగా ఉంటే, నేను వచ్చి సహాయం చేస్తాను. 13 మన ప్రజల కోసం, మన దేవుని నగరాల కోసం మనం నిబ్బరంగా, ధైర్యంగా ఉండాలి,+ అప్పుడు యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేస్తాడు.”
14 తర్వాత యోవాబు, అతని మనుషులు సిరియన్లతో యుద్ధం చేయడానికి ముందుకెళ్లారు, సిరియన్లు అతని ఎదుట నుండి పారిపోయారు.+ 15 సిరియన్లు పారిపోవడం చూసి అమ్మోనీయులు కూడా అబీషై ఎదుట నుండి పారిపోయి, నగరంలోకి వెళ్లారు. తర్వాత యోవాబు యెరూషలేముకు తిరిగొచ్చాడు.
16 తాము ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయామని గమనించిన సిరియన్లు సందేశకుల్ని పంపించి, నది* ప్రాంతంలోని+ సిరియన్లను పిలిపించారు. హదదెజరు సైన్యాధిపతైన షోపకు వాళ్లకు నాయకునిగా ఉన్నాడు.+
17 దావీదుకు ఆ విషయం తెలియగానే ఇశ్రాయేలీయులందర్నీ సమకూర్చి యొర్దాను నదిని దాటి, వాళ్లకు ఎదురుగా తన సైన్యాన్ని యుద్ధ పంక్తులు తీర్చాడు. దావీదు సిరియన్లను ఎదుర్కోవడానికి యుద్ధ పంక్తులు తీర్చినప్పుడు, వాళ్లు అతనితో యుద్ధం చేశారు.+ 18 కానీ వాళ్లు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోయారు; దావీదు సిరియన్లకు చెందిన 7,000 మంది రథసారథుల్ని, 40,000 మంది సైనికుల్ని చంపాడు. వాళ్ల సైన్యాధిపతైన షోపకును కూడా చంపాడు. 19 ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయామని+ హదదెజరు సేవకులు గమనించినప్పుడు, వాళ్లు వెంటనే దావీదుతో సంధి చేసుకొని అతనికి సేవకులయ్యారు;+ అప్పటినుండి సిరియన్లు అమ్మోనీయులకు సహాయం చేయడానికి ఇష్టపడలేదు.
20 సంవత్సరం ఆరంభంలో,* రాజులు యుద్ధాలకు వెళ్లే కాలంలో, యోవాబు+ ఒక సైన్యాన్ని తీసుకెళ్లి అమ్మోనీయుల దేశాన్ని నాశనం చేశాడు; అతను వెళ్లి, రబ్బాను+ ముట్టడించాడు. ఆ సమయంలో దావీదు యెరూషలేములోనే ఉన్నాడు.+ యోవాబు రబ్బా మీద దాడిచేసి దాన్ని పడగొట్టాడు.+ 2 తర్వాత, దావీదు మల్కాము* తలమీద ఉన్న కిరీటాన్ని తీసుకున్నాడు. ఆ బంగారు కిరీటం బరువు ఒక తలాంతు.* ఆ కిరీటంలో రత్నాలు పొదిగివున్నాయి; ఆ కిరీటాన్ని దావీదు తలమీద పెట్టారు. అతను ఆ నగరం నుండి పెద్ద మొత్తంలో దోపుడుసొమ్ము కూడా తీసుకున్నాడు.+ 3 దావీదు అక్కడి ప్రజల్ని తీసుకొచ్చి, వాళ్లచేత రంపాలతో రాళ్లను కోయించాడు, పదునైన ఇనుప పనిముట్లతో, గొడ్డళ్లతో పని చేయించాడు.+ అమ్మోనీయుల నగరాలన్నిటికీ దావీదు అలాగే చేశాడు. చివరికి దావీదు, అతని సైన్యమంతా యెరూషలేముకు తిరిగొచ్చారు.
4 తర్వాత గెజెరు దగ్గర ఇశ్రాయేలీయులకు, ఫిలిష్తీయులకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో హూషాతీయుడైన సిబ్బెకై+ రెఫాయీము+ వంశస్థుడైన సిప్పయిని చంపాడు, దాంతో ఫిలిష్తీయులు లొంగిపోయారు.
5 ఆ తర్వాత ఫిలిష్తీయులతో మరోసారి యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో యాయీరు కుమారుడైన ఎల్హానా గిత్తీయుడైన గొల్యాతు+ సహోదరుడైన లహ్మీని చంపాడు. అతని ఈటెకు ఉన్న కర్ర, నేత నేసేవాళ్ల కర్రంత పెద్దది.+
6 గాతులో+ మళ్లీ యుద్ధం జరిగింది, అక్కడ చాలా ఎత్తుగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు.+ అతని ఒక్కో చేతికి, ఒక్కో పాదానికి ఆరేసి వేళ్ల చొప్పున మొత్తం 24 వేళ్లు ఉన్నాయి; అతను కూడా రెఫాయీము వంశస్థుడే.+ 7 అతను ఇశ్రాయేలీయుల్ని సవాలుచేస్తూ* ఉన్నాడు.+ అప్పుడు దావీదు సహోదరుడైన షిమ్యా+ కుమారుడు యోనాతాను అతన్ని చంపాడు.
8 వీళ్లు గాతులో+ ఉన్న రెఫాయీము+ వంశస్థులు; వీళ్లు దావీదు చేతిలో, అతని సేవకుల చేతిలో చనిపోయారు.
21 తర్వాత సాతాను* ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా లేచి, ఇశ్రాయేలీయుల్ని లెక్కపెట్టేలా దావీదును ప్రేరేపించాడు.+ 2 దాంతో దావీదు యోవాబుకు,+ ప్రజల అధిపతులకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు వెళ్లి, బెయేర్షెబా నుండి దాను+ వరకు ఉన్న ఇశ్రాయేలీయుల్ని లెక్కపెట్టి ఆ వివరాలు నాకు చెప్పండి, వాళ్లు ఎంతమంది ఉన్నారో నాకు తెలుస్తుంది.” 3 అయితే యోవాబు ఇలా అన్నాడు: “యెహోవా తన ప్రజల్ని 100 రెట్లు వృద్ధి చేయాలి! నా ప్రభువైన రాజా, వాళ్లందరూ నీ సేవకులే కాదా? నా ప్రభూ, నువ్వు ఎందుకిలా చేయాలనుకుంటున్నావు? నీ కారణంగా ఇశ్రాయేలు మీదికి ఎందుకు అపరాధం రావాలి?”
4 అయితే యోవాబు మాట మీద రాజు మాటే నెగ్గడంతో, యోవాబు బయల్దేరి ఇశ్రాయేలు అంతటా సంచరించి, తర్వాత యెరూషలేముకు తిరిగొచ్చాడు.+ 5 యోవాబు ప్రజల సంఖ్యను దావీదుకు తెలియజేశాడు. కత్తి దూయగలవాళ్లు ఇశ్రాయేలు ప్రజలందరిలో 11,00,000 మంది, యూదాలో 4,70,000 మంది ఉన్నారు.+ 6 అయితే యోవాబు లేవి, బెన్యామీను గోత్రాల వాళ్లను ఆ సంఖ్యలో చేర్చలేదు,+ ఎందుకంటే రాజు చెప్పిన మాట అతనికి అస్సలు నచ్చలేదు.+
7 దావీదు చేసిన పని వల్ల సత్యదేవునికి కోపం వచ్చింది, కాబట్టి ఆయన ఇశ్రాయేలును శిక్షించాడు. 8 అప్పుడు దావీదు సత్యదేవునితో ఇలా అన్నాడు: “నేను ఈ పని చేసి చాలా పెద్ద పాపం చేశాను.+ నేనెంతో మూర్ఖంగా ప్రవర్తించాను, దయచేసి నీ సేవకుని తప్పును క్షమించు.”+ 9 అప్పుడు యెహోవా దావీదు కోసం దర్శనాలు చూసే గాదుకు+ ఇలా చెప్పాడు: 10 “నువ్వు వెళ్లి దావీదుకు ఇలా చెప్పు, ‘యెహోవా ఏమంటున్నాడంటే: “నేను నీ ముందు మూడు విషయాలు పెడుతున్నాను. వాటిలో ఏది నీ మీదికి తీసుకురమ్మంటావో చెప్పు.” ’ ” 11 గాదు దావీదు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “యెహోవా చెప్పేదేమిటంటే, ‘వీటిలో నీకు ఏది కావాలో ఎంచుకో, 12 మూడు సంవత్సరాలు కరువు రావడమా?+ నీ శత్రువుల కత్తి నిన్ను తరుముతుంటే, నువ్వు వాళ్ల చేతిలో మూడు నెలలు ఓడిపోవడమా?+ మూడు రోజులు యెహోవా కత్తితో శిక్ష పడడమా, అంటే దేశంలో తెగులు వచ్చి,+ యెహోవా దూత ఇశ్రాయేలు ప్రాంతమంతటినీ నాశనం చేయడమా?’+ నన్ను పంపించిన ఆయనకు నేను ఏం జవాబివ్వాలో జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పు.” 13 అప్పుడు దావీదు గాదుతో ఇలా అన్నాడు: “నేను పెద్ద చిక్కులో పడ్డాను. అయితే మనుషుల చేతిలో పడడం కన్నా+ యెహోవా చేతిలో పడడమే నాకు మంచిది, ఎందుకంటే ఆయన ఎంతో కరుణగల దేవుడు.”+
14 కాబట్టి యెహోవా ఇశ్రాయేలు మీదికి తెగులు+ రప్పించాడు. దాంతో ఇశ్రాయేలులో 70,000 మంది చనిపోయారు.+ 15 అంతేకాదు, యెరూషలేమును నాశనం చేయడానికి సత్యదేవుడు ఒక దేవదూతను పంపించాడు; అయితే ఆ దూత యెరూషలేమును నాశనం చేయడం మొదలుపెట్టగానే, యెహోవా అది చూసి తన ప్రజల విషయంలో దుఃఖపడ్డాడు.*+ నాశనం చేస్తున్న ఆ దేవదూతతో ఆయన, “చాలు!+ నీ చెయ్యి దించు” అన్నాడు. అప్పుడు, యెహోవా దూత యెబూసీయుడైన+ ఒర్నాను కళ్లం+ దగ్గర ఉన్నాడు.
16 దావీదు తలెత్తి చూసినప్పుడు, యెహోవా దూత భూమికీ ఆకాశానికీ మధ్య నిలబడివున్నాడు. ఆ దూత చేతిలో ఉన్న కత్తి+ యెరూషలేము వైపు చాపబడివుంది. గోనెపట్ట కట్టుకొనివున్న+ దావీదు, పెద్దలు వెంటనే నేలమీద సాష్టాంగపడ్డారు.+ 17 దావీదు సత్యదేవునితో ఇలా అన్నాడు: “ప్రజల్ని లెక్కపెట్టమని చెప్పింది నేనే కదా? పాపం చేసింది నేను, తప్పు చేసింది నేను;+ కానీ గొర్రెల్లాంటి వీళ్లేం చేశారు? నా దేవా యెహోవా, దయచేసి నీ చెయ్యి నా మీదికి, నా తండ్రి ఇంటివాళ్ల మీదికి రానివ్వు; నీ ప్రజల మీదికి ఈ తెగులు తీసుకురాకు.”+
18 అప్పుడు, యెబూసీయుడైన ఒర్నాను కళ్లం దగ్గరికి వెళ్లి, అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టించమని దావీదుకు ఆజ్ఞాపించమని యెహోవా దూత గాదుతో+ చెప్పాడు.+ 19 కాబట్టి గాదు ద్వారా యెహోవా చెప్పిన మాట ప్రకారం దావీదు అక్కడికి వెళ్లాడు. 20 ఆ సమయంలో ఒర్నాను గోధుమల్ని నూర్చుతున్నాడు, అతను వెనక్కి తిరిగినప్పుడు దేవదూత కనిపించాడు; అది చూసి అతను, అతనితో ఉన్న అతని నలుగురు కుమారులు దాక్కున్నారు. 21 దావీదు ఒర్నాను దగ్గరికి వచ్చినప్పుడు అతను దావీదును చూసి, వెంటనే కళ్లం దగ్గర నుండి బయటికి వచ్చి దావీదు ముందు సాష్టాంగపడ్డాడు. 22 అప్పుడు దావీదు ఒర్నానుతో, “కళ్లం ఉన్న ఈ స్థలాన్ని నాకు అమ్ము,* నేను ఇక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టాలి. ప్రజల మీదికి వచ్చిన తెగులు ఆగిపోయేలా+ దీన్ని నాకు పూర్తి వెలకు అమ్ము” అన్నాడు. 23 అయితే ఒర్నాను దావీదుతో, “ఇది నీదే అనుకొని తీసుకో, నా ప్రభువైన రాజుకు ఏది మంచిదనిపిస్తే అది చేయాలి. ఇదిగో, నేను దహనబలుల కోసం ఎద్దులు, కట్టెల కోసం నూర్చే పనిముట్టును,+ ధాన్యార్పణ కోసం గోధుమల్ని ఇస్తున్నాను. ఇవన్నీ నీకు ఇస్తున్నాను” అన్నాడు.
24 అయితే దావీదు రాజు ఒర్నానుతో, “లేదు, నేను దాన్ని పూర్తి వెలకు కొనాల్సిందే; నీకు చెందినదాన్ని తీసుకుని నేను యెహోవాకు ఇవ్వను, వెల ఇవ్వకుండా తీసుకున్న* వాటిని నేను దహనబలులుగా అర్పించను” అన్నాడు.+ 25 కాబట్టి దావీదు ఆ స్థలం కోసం ఒర్నానుకు 600 షెకెల్‌ల* బంగారం తూచి ఇచ్చాడు. 26 దావీదు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టి+ దహనబలుల్ని, సమాధాన బలుల్ని అర్పించాడు; అతను యెహోవా పేరున ప్రార్థించాడు, అప్పుడు దేవుడు ఆకాశం నుండి అగ్ని పంపించి, దహనబలులు అర్పించే బలిపీఠం మీద ఉన్న వాటిని దహించడం ద్వారా దావీదుకు జవాబిచ్చాడు.+ 27 తర్వాత, కత్తిని తిరిగి ఒరలో పెట్టమని యెహోవా దూతకు ఆజ్ఞాపించాడు.+ 28 యెబూసీయుడైన ఒర్నాను కళ్లం దగ్గర యెహోవా తనకు జవాబిచ్చాడని చూసిన దావీదు అక్కడ బలులు అర్పిస్తూ ఉన్నాడు. 29 అయితే ఎడారిలో మోషే చేయించిన యెహోవా గుడారం, అలాగే దహనబలులు అర్పించే బలిపీఠం ఆ సమయంలో గిబియోనులోని ఉన్నత స్థలం మీద ఉన్నాయి.+ 30 అయితే దావీదు యెహోవా దూత పట్టుకున్న ఖడ్గానికి భయపడి, దేవుని దగ్గర విచారణ చేయడానికి అక్కడికి వెళ్లలేకపోయాడు.
22 తర్వాత దావీదు ఇలా అన్నాడు: “ఇది సత్యదేవుడైన యెహోవా మందిరం, ఇది ఇశ్రాయేలీయులు దహనబలులు అర్పించే బలిపీఠం.”+
2 అప్పుడు దావీదు ఇశ్రాయేలు దేశంలో ఉన్న పరదేశుల్ని+ ఒకచోట పోగుచేయమని ఆజ్ఞాపించాడు; అతను వాళ్లను సత్యదేవుని మందిర నిర్మాణం కోసం రాళ్లను తొలిచి, వాటిని చెక్కే పనిలో పెట్టాడు.+ 3 ద్వారాల తలుపులకు కావాల్సిన మేకుల కోసం, బందుల కోసం పెద్ద మొత్తంలో ఇనుమును, అలాగే రాగిని కూడా దావీదు సిద్ధం చేశాడు; ఆ రాగి, తూకం వేయలేనంత విస్తారంగా ఉంది.+ 4 వాటితోపాటు అతను లెక్కలేనన్ని దేవదారు మ్రానుల్ని+ సిద్ధం చేశాడు. ఎందుకంటే సీదోనీయులు,+ తూరువాళ్లు+ పెద్ద మొత్తంలో దేవదారు మ్రానుల్ని దావీదు దగ్గరికి తెచ్చారు. 5 దావీదు ఇలా అన్నాడు: “నా కుమారుడు సొలొమోను చిన్నవాడు, అనుభవం లేనివాడు;*+ యెహోవా కోసం కట్టబోయే మందిరం చాలా వైభవంగా ఉండాలి,+ దాని పేరుప్రఖ్యాతుల గురించి, దాని అందం గురించి+ దేశాలన్నిట్లో తెలియాలి.+ కాబట్టి నేను అతనికి అవసరమైనవి సిద్ధం చేస్తాను.” అలా దావీదు తాను చనిపోకముందు పెద్ద మొత్తంలో వస్తువుల్ని సిద్ధం చేశాడు.
6 అంతేకాదు దావీదు తన కుమారుడు సొలొమోనును పిలిపించి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా కోసం ఒక మందిరాన్ని కట్టమని ఆదేశించాడు. 7 దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇలా అన్నాడు: “నా దేవుడైన యెహోవా పేరు కోసం ఒక మందిరాన్ని కట్టాలనేది నా హృదయ కోరిక.+ 8 కానీ యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: ‘నువ్వు చాలా రక్తం చిందించావు, పెద్దపెద్ద యుద్ధాలు చేశావు. నువ్వు నా ఎదుట భూమ్మీద ఎంతో రక్తాన్ని చిందించావు కాబట్టి నా పేరు కోసం ఒక మందిరాన్ని నువ్వు కట్టవు.+ 9 ఇదిగో! నీకు ఒక కుమారుడు పుడతాడు, అతను శాంతిపరుడిగా* ఉంటాడు; నేను అతని చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి అతనికి విశ్రాంతి ఇస్తాను;+ అతని పేరు సొలొమోను* అని పిలవబడుతుంది, నేను అతని రోజుల్లో ఇశ్రాయేలుకు శాంతిని, నెమ్మదిని అనుగ్రహిస్తాను.+ 10 అతనే నా పేరు కోసం ఒక మందిరం కడతాడు.+ అతను నాకు కుమారుడు అవుతాడు, నేను అతనికి తండ్రిని అవుతాను.+ నేను ఇశ్రాయేలు మీద అతని రాజ్య సింహాసనాన్ని ఎప్పటికీ స్థిరపరుస్తాను.’+
11 “నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండాలి; ఆయన నీ గురించి చెప్పినట్టు, నీ దేవుడైన యెహోవా మందిరాన్ని కట్టడంలో నువ్వు సఫలం అవ్వాలి.+ 12 యెహోవా నీకు ఇశ్రాయేలు మీద అధికారం ఇచ్చినప్పుడు, నువ్వు నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటించేలా ఆయన నీకు బుద్ధిని, అవగాహనను ఇవ్వాలి;+ 13 యెహోవా ఇశ్రాయేలుకు ఇవ్వమని మోషేకు ఆజ్ఞాపించిన నియమాల్ని, తీర్పుల్ని నువ్వు జాగ్రత్తగా పాటిస్తే,+ విజయం సాధిస్తావు.+ ధైర్యంగా, నిబ్బరంగా ఉండు. భయపడకు, బెదిరిపోకు.+ 14 ఇదిగో నేను ఎంతో ప్రయాసపడి యెహోవా మందిరం కోసం 1,00,000 తలాంతుల* బంగారాన్ని, 10,00,000 తలాంతుల వెండిని, చాలా విస్తారంగా రాగిని, ఇనుమును సిద్ధం చేశాను,+ వాటిని తూకం వేయడం సాధ్యం కాదు; నేను మ్రానుల్ని, రాళ్లను కూడా సిద్ధం చేశాను;+ నువ్వు వాటితోపాటు మరికొన్ని సమకూర్చు. 15 పెద్ద సంఖ్యలో పనివాళ్లు, అంటే రాళ్లు కొట్టేవాళ్లు, తాపీ పనివాళ్లు,+ వడ్రంగులు, అన్నిరకాల నైపుణ్యాలు ఉన్న పనివాళ్లు+ నీ దగ్గర ఉన్నారు. 16 లెక్కించలేనంత బంగారం, వెండి, రాగి, ఇనుము ఉన్నాయి. నువ్వు లేచి పని మొదలుపెట్టు, యెహోవా నీకు తోడుగా ఉండాలి.”+
17 తర్వాత దావీదు, తన కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయమని ఇశ్రాయేలు అధిపతులందరికీ ఆజ్ఞాపించాడు, అతనిలా చెప్పాడు: 18 “మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నాడు కదా? ఆయన అన్నివైపులా మీకు విశ్రాంతి ఇచ్చాడు కదా? దేశ నివాసుల్ని ఆయన నా చేతికి అప్పగించాడు; దేశం యెహోవా, ఆయన ప్రజల ఆధిపత్యం కిందికి వచ్చింది. 19 ఇప్పుడు మీరు నిండు హృదయంతో, నిండు ప్రాణంతో* మీ దేవుడైన యెహోవాను వెదకాలని నిశ్చయించుకోండి;+ యెహోవా ఒప్పంద మందసాన్ని, సత్యదేవుని పవిత్రమైన పాత్రల్ని యెహోవా పేరు కోసం కట్టబడే మందిరంలోకి+ తెచ్చేలా+ సత్యదేవుడైన యెహోవా పవిత్రమైన స్థలాన్ని కట్టడం మొదలుపెట్టండి.”+
23 దావీదు ముసలివాడై, మరణానికి దగ్గరపడినప్పుడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలు మీద రాజును చేశాడు.+ 2 అప్పుడు దావీదు ఇశ్రాయేలు అధిపతులందర్నీ, యాజకుల్ని,+ లేవీయుల్ని+ సమకూర్చాడు. 3 30 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న లేవీయులు లెక్కించబడ్డారు;+ వాళ్ల సంఖ్య 38,000. 4 వాళ్లలో 24,000 మంది యెహోవా మందిర పనిని పర్యవేక్షించేవాళ్లు; 6,000 మంది అధికారులుగా, న్యాయమూర్తులుగా ఉండేవాళ్లు;+ 5 4,000 మంది ద్వారపాలకులుగా+ ఉండేవాళ్లు. అంతేకాక, 4,000 మంది దేవుణ్ణి స్తుతించడానికి దావీదు చేయించిన వాద్యాలతో యెహోవాను స్తుతించేవాళ్లు.+
6 తర్వాత దావీదు, లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి వంశస్థుల ప్రకారం వాళ్లను విభాగాలుగా వ్యవస్థీకరించాడు.*+ 7 గెర్షోనీయుల్లో నుండి లద్దాను, షిమీ. 8 లద్దాను కుమారులు వీళ్లు: అధిపతైన యెహీయేలు, జేతాము, యోవేలు;+ మొత్తం ముగ్గురు.9 షిమీ కుమారులు వీళ్లు: షెలోమోతు, హజీయేలు, హారాను; మొత్తం ముగ్గురు. వీళ్లు లద్దాను పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు. 10 షిమీ కుమారులు వీళ్లు: యహతు, జీనా, యూషు, బెరీయా. ఈ నలుగురు షిమీ కుమారులు. 11 వాళ్లలో యహతు అధిపతి, రెండోవాడు జీజా. అయితే యూషుకు, బెరీయాకు ఎక్కువమంది పిల్లలు లేరు కాబట్టి వాళ్లు ఒకే పూర్వీకుల కుటుంబంగా లెక్కించబడ్డారు. వాళ్లకు ఒకే పని అప్పగించబడింది.
12 కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు,+ హెబ్రోను, ఉజ్జీయేలు;+ మొత్తం నలుగురు. 13 అమ్రాము కుమారులు: అహరోను,+ మోషే.+ అయితే అతి పవిత్ర స్థలాన్ని ప్రతిష్ఠించడానికి, యెహోవా ఎదుట బలులు అర్పించడానికి, ఆయనకు సేవ చేయడానికి, ఆయన పేరున ఎల్లప్పుడూ ప్రజల్ని ఆశీర్వదించడానికి+ అహరోనూ అతని కుమారులూ శాశ్వతంగా ప్రత్యేకపర్చబడ్డారు.+ 14 సత్యదేవుని సేవకుడైన మోషే విషయానికొస్తే, అతని కుమారులు లేవీయుల గోత్రంవాళ్ల మధ్య లెక్కించబడ్డారు. 15 మోషే కుమారులు: గెర్షోము,+ ఎలీయెజెరు.+ 16 గెర్షోము కుమారుల్లో షెబూయేలు+ అధిపతి. 17 ఎలీయెజెరు వంశస్థుల్లో* రెహబ్యా+ అధిపతి; ఎలీయెజెరుకు కుమారులు ఇంకెవ్వరూ లేరు, కానీ రెహబ్యా కుమారులు మాత్రం చాలామంది ఉన్నారు. 18 ఇస్హారు కుమారుల్లో+ షెలోమీతు+ అధిపతి. 19 హెబ్రోను కుమారులు వీళ్లు: అధిపతైన యెరీయా, రెండోవాడు అమర్యా, మూడోవాడు యహజీయేలు, నాలుగోవాడు యెక్మెయాము.+ 20 ఉజ్జీయేలు కుమారుల్లో+ మీకా అధిపతి, రెండోవాడు ఇష్షీయా.
21 మెరారి కుమారులు: మహలి, మూషి.+ మహలి కుమారులు: ఎలియాజరు, కీషు. 22 ఎలియాజరు చనిపోయాడు, అతనికి కూతుళ్లే గానీ కుమారులు లేరు. కాబట్టి వాళ్లను వాళ్ల బంధువులైన* కీషు కుమారులు పెళ్లి చేసుకున్నారు. 23 మూషి కుమారులు: మహలి, ఏదెరు, యెరేమోతు; మొత్తం ముగ్గురు.
24 వీళ్లు తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం, పూర్వీకుల కుటుంబ పెద్దల ప్రకారం నమోదు చేయబడిన లేవి వంశస్థులు. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న లేవీయులు తమ పేర్ల ప్రకారం యెహోవా మందిరంలో సేవ చేయడానికి లెక్కించబడ్డారు, పట్టికలో నమోదు చేయబడ్డారు. 25 ఎందుకంటే దావీదు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలకు విశ్రాంతి ఇచ్చాడు,+ ఆయన యెరూషలేములో ఎప్పటికీ నివసిస్తాడు.+ 26 అంతేకాదు, లేవీయులు గుడారాన్ని గానీ సేవ కోసం ఉపయోగించే దాని ఉపకరణాల్ని గానీ మోయాల్సిన అవసరం లేదు.”+ 27 దావీదు ఇచ్చిన చివరి ఆదేశాల ప్రకారం 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న లేవీయులు లెక్కించబడ్డారు. 28 యెహోవా మందిర సేవలో అహరోను కుమారులకు+ సహాయం చేయడం, ప్రాంగణాల్ని,+ భోజనాల గదుల్ని చూసుకోవడం, పవిత్రమైన ప్రతీదాన్ని శుద్ధి చేయడం, సత్యదేవుని మందిర సేవకు అవసరమైన ఏ పనినైనా చూసుకోవడం లేవీయుల బాధ్యత. 29 అంతేకాదు సముఖపు రొట్టెలు,*+ ధాన్యార్పణ కోసం మెత్తని పిండి, పులవని పిండితో చేసే అప్పడాలు,+ పెనం మీద కాల్చే రొట్టెలు, నూనెతో కలిపిన పిండి,+ అలాగే అన్ని పరిమాణాలకు, కొలతలకు సంబంధించిన విషయాల్లో వాళ్లు సహాయం చేసేవాళ్లు. 30 వాళ్లు ప్రతీరోజు ఉదయం+ అలాగే సాయంత్రం నిలబడి యెహోవాకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించాలి.+ 31 ధర్మశాస్త్రంలో రాయబడినదాని ప్రకారం విశ్రాంతి రోజుల్లో,+ అమావాస్య రోజుల్లో,+ అలాగే పండుగ సమయాల్లో+ యెహోవాకు దహనబలుల్ని అర్పించినప్పుడల్లా వాళ్లు సహాయం చేసేవాళ్లు; వాళ్లు యెహోవా ముందు క్రమంగా ఆ పని చేసేవాళ్లు. 32 అంతేకాదు ప్రత్యక్ష గుడారానికి, పవిత్ర స్థలానికి సంబంధించిన సేవ చేసేవాళ్లు. అలాగే యెహోవా మందిరంలో తమ సహోదరులకు, అంటే అహరోను కుమారులకు సహాయం చేసేవాళ్లు.
24 అహరోను వంశస్థుల విభాగాలు ఇవి: అహరోను కుమారులు నాదాబు, అబీహు,+ ఎలియాజరు, ఈతామారు.+ 2 అయితే నాదాబు, అబీహు తమ తండ్రి కన్నా ముందే చనిపోయారు,+ వాళ్లకు కుమారులు లేరు. ఎలియాజరు,+ ఈతామారు మాత్రం యాజకులుగా సేవ చేస్తూ ఉన్నారు. 3 దావీదు, ఎలియాజరు కుమారుల్లో నుండి సాదోకుతో,+ ఈతామారు కుమారుల్లో నుండి అహీమెలెకుతో కలిసి అహరోను వంశస్థుల్ని వాళ్ల సేవ కోసం విభాగాలుగా విభజించాడు. 4 ఈతామారు కుమారుల్లో కన్నా ఎలియాజరు కుమారుల్లో ఎక్కువమంది అధిపతులు ఉన్నారు కాబట్టి, వాళ్లను దానికి తగ్గట్టుగా విభజించారు; ఎలియాజరు కుమారుల్లో 16 మంది తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలుగా ఉన్నారు, ఈతామారు కుమారుల్లో 8 మంది తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలుగా ఉన్నారు.
5 అంతేకాదు, పవిత్ర స్థల అధిపతులు, సత్యదేవుని సేవచేసే అధిపతులు ఎలియాజరు కుమారుల్లోనూ ఈతామారు కుమారుల్లోనూ ఉన్నారు. కాబట్టి ఒక గుంపును ఇంకో గుంపుతో పాటు చీట్లు+ వేసి వాళ్లను విభజించారు. 6 అప్పుడు నెతనేలు కుమారుడూ లేవీయుల కార్యదర్శీ అయిన షెమయా, రాజు ఎదుట, అధిపతుల ఎదుట, యాజకుడైన సాదోకు+ ఎదుట, అబ్యాతారు+ కుమారుడైన అహీమెలెకు+ ఎదుట, యాజకుల అలాగే లేవీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దల ఎదుట వాళ్ల పేర్లను నమోదు చేశాడు; ఎలియాజరు కుమారుల్లో నుండి ఒక పూర్వీకుల కుటుంబం ఎంచుకోబడింది, అలాగే ఈతామారు కుమారుల్లో నుండి ఒక పూర్వీకుల కుటుంబం ఎంచుకోబడింది.
7 మొదటి చీటి యెహోయారీబుకు వచ్చింది; రెండో చీటి యెదాయాకు, 8 మూడో చీటి హారీముకు, నాలుగో చీటి శెయొరీముకు, 9 ఐదో చీటి మల్కీయాకు, ఆరో చీటి మీయామినుకు, 10 ఏడో చీటి హక్కోజుకు, ఎనిమిదో చీటి అబీయాకు,+ 11 తొమ్మిదో చీటి యేషూవకు, పదో చీటి షెకన్యాకు, 12 పదకొండో చీటి ఎల్యాషీబుకు, పన్నెండో చీటి యాకీముకు, 13 పదమూడో చీటి హుప్పాకు, పద్నాలుగో చీటి యెషెబాబుకు, 14 పదిహేనో చీటి బిల్గాకు, పదహారో చీటి ఇమ్మేరుకు, 15 పదిహేడో చీటి హెజీరుకు, పద్దెనిమిదో చీటి హప్పిస్సేసుకు, 16 పందొమ్మిదో చీటి పెతహయాకు, ఇరవయ్యో చీటి యెహెజ్కేలుకు, 17 ఇరవై ఒకటో చీటి యాకీనుకు, ఇరవై రెండో చీటి గామూలుకు, 18 ఇరవై మూడో చీటి దెలాయ్యాకు, ఇరవై నాలుగో చీటి మయజ్యాకు వచ్చింది.
19 యెహోవా మందిరంలోకి వచ్చి సేవ చేయడానికి, వాళ్ల కోసం చేసిన అధికారిక ఏర్పాటు అది.+ అది ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అహరోనుకు ఆజ్ఞాపించినట్టు, వాళ్ల పూర్వీకుడైన అహరోను నియమించిన పద్ధతి ప్రకారం చేయబడింది.
20 మిగతా లేవీయుల్లో వీళ్లు: అమ్రాము+ కుమారుల్లో షూబాయేలు;+ షూబాయేలు కుమారుల్లో యెహెదయా; 21 రెహబ్యా+ కుమారుల్లో అధిపతైన ఇష్షీయా; 22 ఇస్హారీయుల్లో షెలోమోతు;+ షెలోమోతు కుమారుల్లో యహతు; 23 హెబ్రోను కుమారుల్లో అధిపతైన యెరీయా,+ రెండోవాడైన అమర్యా, మూడోవాడైన యహజీయేలు, నాలుగోవాడైన యెక్మెయాము; 24 ఉజ్జీయేలు కుమారుల్లో మీకా; మీకా కుమారుల్లో షామీరు. 25 మీకా సహోదరుడు ఇష్షీయా; ఇష్షీయా కుమారుల్లో జెకర్యా.
26 మెరారి+ కుమారులు: మహలి, మూషి; యహజీయాహు కుమారుల్లో బెనో. 27 మెరారి వంశస్థుల్లో: యహజీయాహు కుమారుల్లో బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ; 28 మహలి కుమారుల్లో ఎలియాజరు; ఈ ఎలియాజరుకు కుమారులు లేరు;+ 29 కీషు కుమారుల్లో యెరహ్మెయేలు; 30 మూషి కుమారులు: మహలి, ఏదెరు, యెరీమోతు.
వీళ్లు తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం లేవి కుమారులు. 31 వాళ్లు కూడా తమ సహోదరులైన అహరోను కుమారులు చేసినట్టే రాజైన దావీదు ఎదుట, సాదోకు ఎదుట, అహీమెలెకు ఎదుట, యాజకుల అలాగే లేవీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దల ఎదుట చీట్లు+ వేశారు. పెద్దవాళ్ల పూర్వీకుల కుటుంబం అలాగే చిన్నవాళ్ల పూర్వీకుల కుటుంబం ఒకేలా ఎంచబడింది.
25 అంతేకాదు దావీదు, అలాగే ఆలయ సేవ అధిపతులు కలిసి ఆసాపు, హేమాను, యెదూతూను+ కుమారుల్లో కొంతమందిని ప్రత్యేకపర్చారు; వీణలతో,* తంతివాద్యాలతో,+ తాళాలతో+ ప్రవచిస్తూ సేవ చేయడం కోసం వాళ్లను అలా ప్రత్యేకపర్చారు. ఆ సేవ కోసం నియమించబడిన వాళ్ల పట్టిక ఇది, 2 ఆసాపు కుమారుల్లో: జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యేలా; వీళ్లు ఆసాపు నిర్దేశం కింద ఉండేవాళ్లు. ఆసాపు, రాజు నిర్దేశంలో ప్రవచించేవాడు. 3 యెదూతూను+ కుమారుల్లో: గెదల్యా, జెరీ, యెషయా, షిమీ, హషబ్యా, మత్తిత్యా,+ వీళ్లు మొత్తం ఆరుగురు; వీళ్లు వీణతో ప్రవచిస్తూ, యెహోవాకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించే+ తమ తండ్రి యెదూతూను నిర్దేశం కింద ఉండేవాళ్లు. 4 హేమాను+ కుమారుల్లో: బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు, హనన్యా, హనానీ, ఎలీయ్యాతా, గిద్దల్తీ, రోమమ్తీయెజెరు, యొష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు. 5 వీళ్లందరూ హేమాను కుమారులు; అతను రాజు కోసం దర్శనాలు చూసేవాడు, సత్యదేవుణ్ణి మహిమపర్చడానికి దేవుని మాటల్ని రాజుకు ప్రకటించేవాడు; సత్యదేవుడు హేమానుకు 14 మంది కుమారుల్ని, ముగ్గురు కూతుళ్లను ఇచ్చాడు. 6 సత్యదేవుని మందిర సేవ కోసం తాళాలతో, తంతివాద్యాలతో, వీణలతో+ యెహోవా మందిరంలో పాటలు పాడడానికి వీళ్లందరూ తమ తండ్రి నిర్దేశం కింద ఉండేవాళ్లు.
ఆసాపు, యెదూతూను, హేమాను రాజు నిర్దేశం కింద ఉండేవాళ్లు.
7 వీళ్లూ, యెహోవాకు పాటలు పాడడంలో శిక్షణ పొందిన వీళ్ల సహోదరులూ మొత్తం 288 మంది, వీళ్లంతా ప్రవీణులు. 8 కాబట్టి గొప్పవాళ్లు-తక్కువవాళ్లు, ప్రవీణులు-నేర్చుకునేవాళ్లు అనే తేడా లేకుండా అందరూ చీట్లు+ వేసుకుని బాధ్యతల్ని పంచుకున్నారు.
9 మొదటి చీటి ఆసాపు కుమారుడైన యోసేపు+ పేరున వచ్చింది, రెండో చీటి గెదల్యాకు+ వచ్చింది (అతను, అతని సహోదరులు, అతని కుమారులు మొత్తం 12 మంది); 10 మూడో చీటి జక్కూరుకు+ వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 11 నాలుగో చీటి యిజ్రీకి వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 12 ఐదో చీటి నెతన్యాకు+ వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 13 ఆరో చీటి బక్కీయాహుకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 14 ఏడో చీటి యెషర్యేలాకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 15 ఎనిమిదో చీటి యెషయాకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 16 తొమ్మిదో చీటి మత్తన్యాకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 17 పదో చీటి షిమీకి వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 18 పదకొండో చీటి అజరేలుకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 19 పన్నెండో చీటి హషబ్యాకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 20 పదమూడో చీటి షూబాయేలుకు+ వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 21 పద్నాలుగో చీటి మత్తిత్యాకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 22 పదిహేనో చీటి యెరేమోతుకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 23 పదహారో చీటి హనన్యాకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 24 పదిహేడో చీటి యొష్బెకాషాకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 25 పద్దెనిమిదో చీటి హనానీకి వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 26 పందొమ్మిదో చీటి మల్లోతికి వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 27 ఇరవయ్యో చీటి ఎలీయ్యాతాకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 28 ఇరవై ఒకటో చీటి హోతీరుకు వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 29 ఇరవై రెండో చీటి గిద్దల్తీకి+ వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 30 ఇరవై మూడో చీటి మహజీయోతుకు+ వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది; 31 ఇరవై నాలుగో చీటి రోమమ్తీయెజెరుకు+ వచ్చింది, అతని కుమారులు, అతని సహోదరులు మొత్తం 12 మంది.
26 ద్వారపాలకుల+ విభాగాలు ఈ విధంగా ఉన్నాయి: కోరహీయుల్లో మెషెలెమ్యా,+ అతను ఆసాపు వంశస్థుడైన కోరే కుమారుడు. 2 మెషెలెమ్యా కుమారులు ఎవరంటే: మొదటివాడైన జెకర్యా, రెండోవాడైన యెదీయవేలు, మూడోవాడైన జెబద్యా, నాలుగోవాడైన యత్నీయేలు, 3 ఐదోవాడైన ఏలాము, ఆరోవాడైన యెహోహానాను, ఏడోవాడైన ఎల్యోయేనై. 4 ఓబేదెదోము కుమారులు ఎవరంటే: మొదటివాడైన షెమయా, రెండోవాడైన యెహోజాబాదు, మూడోవాడైన యోవాహు, నాలుగోవాడైన శాకారు, ఐదోవాడైన నెతనేలు, 5 ఆరోవాడైన అమ్మీయేలు, ఏడోవాడైన ఇశ్శాఖారు, ఎనిమిదోవాడైన పెయుల్లెతై; ఆ విధంగా దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించాడు.
6 అతని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టారు; వాళ్లు బలవంతులు, సమర్థులు కాబట్టి తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులుగా ఉండేవాళ్లు. 7 షెమయా కుమారులు: ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు; అతని సహోదరులైన ఎలీహు, సెమక్యా కూడా సమర్థులే. 8 వీళ్లందరూ ఓబేదెదోము వంశస్థులు; వాళ్లూ, వాళ్ల కుమారులూ, వాళ్ల సహోదరులూ సమర్థులు, సేవ చేయడానికి అర్హులు; ఓబేదెదోముకు చెందినవాళ్లు మొత్తం 62 మంది. 9 మెషెలెమ్యాకు+ మొత్తం 18 మంది కుమారులు, సహోదరులు ఉన్నారు; వాళ్లు సమర్థులు. 10 మెరారి వంశస్థుడైన హోసాకు కుమారులు ఉన్నారు. షిమ్రీ వాళ్లకు అధిపతి, అతను మొదటి కుమారుడు కాకపోయినా అతని తండ్రి అతన్ని అధిపతిగా నియమించాడు. 11 హిల్కీయా రెండోవాడు, టెబల్యాహు మూడోవాడు, జెకర్యా నాలుగోవాడు. హోసా కుమారులు, సహోదరులు మొత్తం 13 మంది.
12 ఈ ద్వారపాలకుల విభాగాల్లో, అధిపతులకు కూడా తమ సహోదరుల్లాగే యెహోవా మందిరంలోని సేవకు సంబంధించిన బాధ్యతలు ఉన్నాయి. 13 కాబట్టి వేర్వేరు ద్వారాల దగ్గర కాపలా కాయడానికి, తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం తక్కువవాళ్లు, గొప్పవాళ్లు అందరూ చీట్లు+ వేశారు. 14 తూర్పు వైపున్న ద్వారం కోసం చీటి వేసినప్పుడు అది షెలెమ్యా పేరున పడింది. అతని కుమారుడైన జెకర్యా తెలివిగల* సలహాదారుడు; వాళ్లు చీట్లు వేసినప్పుడు, ఉత్తరం వైపున్న ద్వారం అతనికి వచ్చింది. 15 దక్షిణం వైపున్న ద్వారం ఓబేదెదోముకు వచ్చింది, అతని కుమారులు+ గోదాముల మీద నియమించబడ్డారు. 16 పడమటి వైపున్న ద్వారం షుప్పీముకు, హోసాకు+ వచ్చింది; అది పైకి వెళ్లే రహదారి దగ్గర్లోని షల్లెకెతు ద్వారం దగ్గర ఉండేది; కాపలాకాసే గుంపులు పక్కపక్కన ఉండేవి. 17 తూర్పు వైపున ఆరుగురు లేవీయులు ఉండేవాళ్లు; ప్రతీరోజు ఉత్తరం వైపున నలుగురు, దక్షిణం వైపున నలుగురు ఉండేవాళ్లు; గోదాముల దగ్గర ఇద్దరేసి చొప్పున రెండు గుంపులు ఉండేవి.+ 18 పడమటి వైపున్న వరండాను కాపలా కాయడానికి రహదారి+ దగ్గర నలుగురు, వరండా దగ్గర ఇద్దరు ఉండేవాళ్లు. 19 ఇవి కోరహీయుల వంశస్థుల్లో, మెరారీయుల వంశస్థుల్లో ద్వారపాలకుల విభాగాలు.
20 లేవీయుల విషయానికొస్తే, సత్యదేవుని మందిర ఖజానాల మీద, ప్రతిష్ఠించిన* వస్తువులు ఉన్న ఖజానాల మీద అహీయా అధికారిగా ఉండేవాడు.+ 21 లద్దాను కుమారుల్లో: అంటే గెర్షోనీయుడైన లద్దాను కుమారుల్లో యెహీయేలీ;+ అతను గెర్షోనీయుడైన లద్దానుకు చెందిన పూర్వీకుల కుటుంబాల పెద్దల్లో ఒకడు. 22 యెహీయేలీ కుమారులు: జేతాము, అతని సహోదరుడైన యోవేలు. వాళ్లు యెహోవా మందిర ఖజానాల+ మీద అధికారులుగా ఉండేవాళ్లు. 23 అమ్రామీయుల్లో నుండి ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు;+ 24 మోషే మనవడూ గెర్షోము కుమారుడూ అయిన షెబూయేలు గోదాముల మీద అధికారిగా ఉన్నాడు. 25 అతని సహోదరులైన ఎలీయెజెరు+ వంశస్థుల విషయానికొస్తే, ఎలీయెజెరు కుమారుడు రెహబ్యా,+ రెహబ్యా కుమారుడు యెషయా, యెషయా కుమారుడు యోరాము, యోరాము కుమారుడు జిఖ్రీ, జిఖ్రీ కుమారుడు షెలోమోతు. 26 దావీదు రాజు,+ పూర్వీకుల కుటుంబాల పెద్దలు,+ సహస్రాధిపతులు,* శతాధిపతులు,* సైన్యాధిపతులు ప్రతిష్ఠించిన* వస్తువులున్న ఖజానాలన్నిటి+ మీద ఈ షెలోమోతు, అతని సహోదరులు అధికారులుగా ఉన్నారు. 27 యుద్ధాల్లో+ కొల్లగొట్టిన వాటిలో+ నుండి కొంతభాగాన్ని యెహోవా మందిర నిర్వహణ కోసం వాళ్లు పవిత్రపర్చారు; 28 అలాగే దీర్ఘదర్శి+ అయిన సమూయేలు, కీషు కుమారుడైన సౌలు, నేరు కుమారుడైన అబ్నేరు,+ సెరూయా+ కుమారుడైన యోవాబు+ ప్రతిష్ఠించిన వాటన్నిటినీ కూడా వాళ్లే చూసుకునేవాళ్లు. ఎవరైనా దేన్నైనా ప్రతిష్ఠిస్తే అది షెలోమీతు,* అతని సహోదరుల పర్యవేక్షణ కింద ఉంచబడేది.
29 ఇస్హారీయుల్లో+ కెనన్యా, అతని కుమారులు ఇశ్రాయేలు మీద అధికారులుగా, న్యాయమూర్తులుగా+ దేవుని మందిరం బయటి బాధ్యతల్ని నిర్వహించడానికి నియమించబడ్డారు.
30 హెబ్రోనీయుల్లో+ హషబ్యా, అతని సహోదరులు యొర్దాను పడమటి వైపున్న ప్రాంతంలో ఇశ్రాయేలు కార్యనిర్వహణను చూసుకునేవాళ్లు; వాళ్లు యెహోవా సేవకు, రాజు సేవకు సంబంధించిన పనులన్నిటి విషయంలో బాధ్యత వహించేవాళ్లు; వాళ్లు మొత్తం 1,700 మంది, వాళ్లు సమర్థులు. 31 హెబ్రోనీయుల్లో, తమ కుటుంబాల వంశావళి పట్టిక ప్రకారం యెరీయా+ హెబ్రోనీయుల అధిపతి. దావీదు పరిపాలన 40వ సంవత్సరంలో,+ కొంతమంది దావీదు మనుషులు హెబ్రోనీయుల్లో బలవంతులు, సమర్థులు అయిన పురుషుల కోసం వెదికారు. అలాంటివాళ్లను గిలాదులోని యాజెరులో+ కనుగొన్నారు. 32 యెరీయా సహోదరులు మొత్తం 2,700 మంది; వాళ్లు సమర్థులు, పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు. కాబట్టి రాజైన దావీదు సత్యదేవునికి, రాజుకు సంబంధించిన పనులన్నిటి కోసం వాళ్లను రూబేనీయుల మీద, గాదీయుల మీద, మనష్షే అర్ధగోత్రం మీద నియమించాడు.
27 ఇది ఇశ్రాయేలీయుల, అంటే పూర్వీకుల కుటుంబాల పెద్దల, సహస్రాధిపతుల,* శతాధిపతుల,*+ అధికారుల సంఖ్య; వీళ్లు సంవత్సరంలో ప్రతీ నెల వంతులవారీగా, విభాగాలకు సంబంధించిన ప్రతీ విషయంలో రాజుకు సేవ చేసేవాళ్లు;+ ప్రతీ విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు.
2 మొదటి నెలలో మొదటి విభాగం మీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము+ ఉండేవాడు, అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు. 3 ఇతను పెరెసు వంశస్థుడు;+ మొదటి నెలలో సేవ చేయడానికి నియమించబడిన గుంపుల అధిపతులందరికీ ఇతను నాయకుడు. 4 రెండో నెలలోని విభాగానికి అహోహీయుడైన+ దోదై+ అధిపతి, వాళ్లలో మిక్లోతు నాయకుడు; అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు. 5 మూడో నెలలో సేవ చేయడానికి నియమించబడిన మూడో గుంపుకు ముఖ్య యాజకుడైన యెహోయాదా+ కుమారుడు బెనాయా+ అధిపతి, అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు. 6 ఈ బెనాయా ఆ ముప్పై మంది బలమైన యోధుల్లో ఒకడు, ఆ ముప్పై మందికి అధిపతి; అతని విభాగానికి అతని కుమారుడైన అమ్మీజాబాదు అధిపతి. 7 నాలుగో నెలలో నాలుగో అధిపతి యోవాబు సహోదరుడైన+ అశాహేలు,+ అతని తర్వాత అతని కుమారుడు జెబద్యా అధిపతి; అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు. 8 ఐదో నెలలో ఐదో అధిపతి ఇశ్రాహేతీయుడైన షమ్హూతు, అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు. 9 ఆరో నెలలో ఆరో అధిపతి తెకోవీయుడైన+ ఇక్కేషు కుమారుడు ఈరా,+ అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు. 10 ఏడో నెలలో ఏడో అధిపతి ఎఫ్రాయిమీయులకు చెందిన పెలోనీయుడైన హేలెస్సు,+ అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు. 11 ఎనిమిదో నెలలో ఎనిమిదో అధిపతి జెరహీయులకు+ చెందిన హూషాతీయుడైన సిబ్బెకై,+ అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు. 12 తొమ్మిదో నెలలో తొమ్మిదో అధిపతి బెన్యామీనీయులకు చెందిన అనాతోతీయుడైన+ అబీయెజరు,+ అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు. 13 పదో నెలలో పదో అధిపతి జెరహీయులకు+ చెందిన నెటోపాతీయుడైన మహరై,+ అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు. 14 పదకొండో నెలలో పదకొండో అధిపతి ఎఫ్రాయిము గోత్రానికి చెందిన పిరాతోనీయుడైన బెనాయా,+ అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు. 15 పన్నెండో నెలలో పన్నెండో అధిపతి ఒత్నీయేలు సంతతికి చెందిన నెటోపాతీయుడైన హెల్దయి, అతని విభాగంలో 24,000 మంది ఉండేవాళ్లు.
16 వీళ్లు ఇశ్రాయేలు గోత్రాల నాయకులు: రూబేనీయుల్లో జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు; షిమ్యోనీయుల్లో మయకా కుమారుడైన షెఫట్య; 17 లేవి గోత్రంలో కెమూయేలు కుమారుడైన హషబ్యా; అహరోను వంశస్థుల్లో సాదోకు; 18 యూదా గోత్రంలో దావీదు సహోదరుల్లో ఒకడైన ఎలీహు;+ ఇశ్శాఖారు గోత్రంలో మిఖాయేలు కుమారుడైన ఒమ్రీ; 19 జెబూలూను గోత్రంలో ఓబద్యా కుమారుడైన ఇష్మయా; నఫ్తాలి గోత్రంలో అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు; 20 ఎఫ్రాయిమీయుల్లో అజజ్యా కుమారుడైన హోషేయ; మనష్షే అర్ధగోత్రంలో పెదాయా కుమారుడైన యోవేలు; 21 గిలాదులోని మనష్షే అర్ధగోత్రంలో జెకర్యా కుమారుడైన ఇద్దో; బెన్యామీను గోత్రంలో అబ్నేరు+ కుమారుడైన యహశీయేలు; 22 దాను గోత్రంలో యెరోహాము కుమారుడైన అజరేలు. వీళ్లు ఇశ్రాయేలు గోత్రాల అధిపతులు.
23 దావీదు 20 సంవత్సరాలు, అంతకన్నా తక్కువ వయసు ఉన్నవాళ్లను లెక్కపెట్టలేదు, ఎందుకంటే ఇశ్రాయేలీయుల్ని ఆకాశ నక్షత్రాలంత మందిని చేస్తానని యెహోవా వాగ్దానం చేశాడు.+ 24 సెరూయా కుమారుడైన యోవాబు లెక్కించడం మొదలుపెట్టాడు, కానీ దాన్ని పూర్తి చేయలేదు; అలా లెక్కించడం వల్ల దేవుని కోపం ఇశ్రాయేలు మీదికి వచ్చింది;+ దావీదు రాజు చరిత్ర వివరాల్లో ఆ సంఖ్య నమోదు చేయబడలేదు.
25 రాజు ఖజానాల+ మీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు అధికారి. పొలాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, కోటల్లో ఉన్న గోదాముల* మీద ఉజ్జియా కుమారుడైన యోనాతాను అధికారి. 26 భూమిని సాగుచేసే పొలం పనివాళ్ల మీద కెలూబు కుమారుడైన ఎజ్రీ అధికారి. 27 రామాతీయుడైన షిమీ ద్రాక్షతోటల మీద అధికారి; కోతకోసిన ద్రాక్షలతో తయారుచేసిన ద్రాక్షారసాన్ని నిల్వచేసే గోదాముల మీద షిప్మోతీయుడైన జబ్ది అధికారి. 28 షెఫేలాలోని+ ఒలీవ తోటల మీద, అత్తి చెట్ల+ మీద గెదెరీయుడైన బయల్-హానాను అధికారి; నూనెను నిల్వచేసే స్థలం మీద యోవాషు అధికారి. 29 షారోనులో+ మేతమేసే మందల మీద షారోనీయుడైన షిట్రయి అధికారి, లోయ మైదానాల్లోని మందల మీద అద్లాయి కుమారుడైన షాపాతు అధికారి. 30 ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలు అధికారి, గాడిదల మీద మేరోనోతీయుడైన యెహెద్యాహు అధికారి. 31 గొర్రెల, మేకల మందల మీద హగ్రీయుడైన యాజీజు అధికారి. వీళ్లందరూ దావీదు రాజు ఆస్తి మీద నియమించబడిన అధికారులు.
32 దావీదు సహోదరుని కుమారుడైన యోనాతాను+ ఒక సలహాదారుడు, అవగాహన ఉన్నవాడు, కార్యదర్శి; హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాకుమారుల్ని+ చూసుకునేవాడు. 33 అహీతోపెలు+ రాజు సలహాదారుడు, అర్కీయుడైన హూషై+ రాజు స్నేహితుడు.* 34 అహీతోపెలు తర్వాత, బెనాయా+ కుమారుడైన యెహోయాదా, అబ్యాతారు సలహాదారులు; యోవాబు+ రాజు సైన్యాధిపతి.
28 తర్వాత దావీదు ఇశ్రాయేలు అధిపతులందర్నీ, అంటే గోత్రాల అధిపతుల్ని, రాజుకు పరిచర్య చేసే విభాగాల అధిపతుల్ని,+ సహస్రాధిపతుల్ని,* శతాధిపతుల్ని,*+ రాజుకూ అతని కుమారులకూ+ చెందిన మొత్తం ఆస్తినీ మందల్నీ చూసుకునే అధిపతుల్ని,+ ఆస్థాన అధికారుల్ని, బలవంతులూ సమర్థులూ అయిన ప్రతీ ఒక్కర్ని యెరూషలేములో సమావేశపర్చాడు. 2 దావీదు లేచి నిలబడి ఇలా అన్నాడు:
“నా సహోదరులారా, నా ప్రజలారా, నేను చెప్పేది వినండి. యెహోవా ఒప్పంద మందసం కోసం విశ్రాంతి స్థలంగా, మన దేవుని పాదపీఠంగా ఒక మందిరం కట్టాలనేది నా హృదయ కోరిక;+ దాన్ని కట్టడానికి నేను ఏర్పాట్లు చేశాను.+ 3 కానీ సత్యదేవుడు నాతో, ‘నా పేరు కోసం ఒక మందిరాన్ని నువ్వు కట్టవు, ఎందుకంటే నువ్వు యుద్ధాలు చేసి రక్తం చిందించావు’ అని అన్నాడు.+ 4 అయితే నేను ఇశ్రాయేలు మీద శాశ్వతంగా రాజు అయ్యేలా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వాళ్లందరిలో నన్ను ఎంచుకున్నాడు.+ ఆయన యూదాను నాయకునిగా ఎంచుకున్నాడు,+ యూదా గోత్రంలో నా తండ్రి ఇంటిని ఎంచుకున్నాడు; ఇశ్రాయేలు అంతటి మీద నన్ను రాజును చేయడానికి ఆయన నా తండ్రి కుమారుల్లో నన్ను ఆమోదించాడు.+ 5 యెహోవా నాకు చాలామంది కుమారుల్ని ఇచ్చాడు, యెహోవా రాజరిక సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలును పరిపాలించడానికి+ వాళ్లందరిలో నా కుమారుడైన సొలొమోనును ఆయన ఎంచుకున్నాడు.+
6 “ఆయన నాతో ఇలా అన్నాడు, ‘నీ కుమారుడైన సొలొమోనే నా మందిరాన్ని, నా ప్రాంగణాల్ని కడతాడు; ఎందుకంటే నేను అతన్ని నా కుమారునిగా ఎంచుకున్నాను, నేను అతనికి తండ్రిని అవుతాను.+ 7 అతను ఇప్పుడు చేస్తున్నట్టుగా నా ఆజ్ఞల్ని, నా న్యాయనిర్ణయాల్ని దృఢ నిశ్చయంతో పాటిస్తే+ నేను అతని రాజరికాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.’+ 8 కాబట్టి యెహోవా సమాజమైన ఇశ్రాయేలీయులందరి కళ్లముందు, మన దేవుని ముందు నేను చెప్పేదేమిటంటే: మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ తెలుసుకుని, వాటిని పాటించండి; అప్పుడు మీరు మంచి దేశంలోనే ఉంటారు, మీ తర్వాత మీ కుమారులకు దాన్ని శాశ్వత ఆస్తిగా అందజేస్తారు.
9 “నా కుమారుడా, సొలొమోనా, నీ తండ్రి దేవుణ్ణి తెలుసుకుని, సంపూర్ణ* హృదయంతో, ఇష్టపూర్వకంగా* ఆయన్ని సేవించు;+ ఎందుకంటే యెహోవా హృదయాలన్నిటినీ పరిశీలిస్తాడు,+ ఆయన ప్రతీ ఆలోచనను, ఉద్దేశాన్ని గ్రహిస్తాడు.+ నువ్వు ఆయన్ని వెదికితే ఆయన్ని కనుగొంటావు;+ కానీ నువ్వు ఆయన్ని విడిచిపెడితే, ఆయన నిన్ను శాశ్వతంగా తిరస్కరిస్తాడు.+ 10 ఇదిగో, పవిత్రమైన స్థలంగా ఉండేందుకు ఒక మందిరాన్ని కట్టడానికి యెహోవా నిన్ను ఎంచుకున్నాడు. ధైర్యంగా ఉండి, పని చేయి.”
11 తర్వాత దావీదు వసారాకు,+ మందిరానికి సంబంధించిన వేర్వేరు గదులకు, నిల్వచేసే గదులకు, మేడ గదులకు, లోపలి గదులకు, ప్రాయశ్చిత్త మూత మందిరానికి*+ సంబంధించిన నిర్మాణ నమూనాను+ తన కుమారుడైన సొలొమోనుకు ఇచ్చాడు. 12 యెహోవా మందిరంలోని ప్రాంగణాలకు,+ దాని చుట్టూ ఉన్న అన్ని భోజనాల గదులకు, సత్యదేవుని మందిర ఖజానాలకు, ప్రతిష్ఠించిన* వస్తువులు ఉంచే ఖజానాలకు+ సంబంధించి పవిత్రశక్తి* ద్వారా తనకు వెల్లడిచేయబడిన ప్రతీదాని నిర్మాణ నమూనాను దావీదు సొలొమోనుకు ఇచ్చాడు. 13 అలాగే యాజకుల, లేవీయుల విభాగాల+ గురించి, యెహోవా మందిర సేవలోని బాధ్యతలన్నిటి గురించి, యెహోవా మందిర సేవలో ఉపయోగించే పాత్రలన్నిటి గురించి నిర్దేశాలు ఇచ్చాడు. 14 అంతేకాదు వేర్వేరు సేవల్లో ఉపయోగించే బంగారు పాత్రలన్నిటి కోసం ఎంత బంగారం వాడాలో, వేర్వేరు సేవల్లో ఉపయోగించే వెండి పాత్రలన్నిటి కోసం ఎంత వెండి వాడాలో దావీదు నిర్దేశాలు ఇచ్చాడు. 15 ఆయా బంగారు దీపస్తంభాల,+ వాటి బంగారు దీపాల బరువును అలాగే ఆయా వెండి దీపస్తంభాల, వాటి దీపాల బరువును కూడా తెలియజేశాడు. 16 అలాగే, సముఖపు రొట్టెలు* పెట్టే బల్లల్లో+ ఒక్కో బల్లకు ఎంత బంగారం వాడాలో, వెండి బల్లల కోసం ఎంత వెండి వాడాలో, 17 స్వచ్ఛమైన బంగారంతో చేసే ముళ్ల గరిటల, గిన్నెల, కూజాల బరువు ఎంత ఉండాలో, చిన్న బంగారు గిన్నెల్లో+ అలాగే చిన్న వెండి గిన్నెల్లో ఒక్కోదాని బరువు ఎంత ఉండాలో తెలియజేశాడు. 18 ధూపవేదిక+ కోసం ఎంత మేలిమి బంగారం వాడాలో, అలాగే రథం ప్రతీక+ కోసం, అంటే తమ రెక్కల్ని చాచి యెహోవా ఒప్పంద మందసాన్ని కప్పే బంగారు కెరూబుల+ కోసం ఎంత మేలిమి బంగారం వాడాలో తెలియజేశాడు. 19 దావీదు ఇలా అన్నాడు: “యెహోవా చెయ్యి నా మీద ఉంది, నిర్మాణ నమూనాకు+ సంబంధించిన వివరాలన్నిటినీ రాసేలా+ ఆయన నాకు లోతైన అవగాహన ఇచ్చాడు.”
20 అప్పుడు దావీదు తన కుమారుడు సొలొమోనుతో ఇలా చెప్పాడు: “ధైర్యంగా, నిబ్బరంగా ఉండి, పని చేయి. నా దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడకు, బెదిరిపోకు.+ ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను వదిలేయడు;+ యెహోవా మందిర సేవకు సంబంధించిన పనంతా పూర్తయ్యే వరకు ఆయన నీకు తోడుగా ఉంటాడు. 21 సత్యదేవుని మందిర సేవంతటి కోసం యాజకుల, లేవీయుల+ విభాగాలు+ సిద్ధంగా ఉన్నాయి. అన్నిరకాల పనుల్ని ఇష్టంగా చేసే నైపుణ్యంగల పనివాళ్లు+ నీ దగ్గర ఉన్నారు; అలాగే నీ నిర్దేశాలన్నిటినీ పాటించే అధిపతులు,+ ప్రజలందరు ఉన్నారు.”
29 అప్పుడు, దావీదు రాజు సమాజమంతటితో ఇలా అన్నాడు: “దేవుడు ఎంచుకున్న నా కుమారుడైన సొలొమోను+ చిన్నవాడు, అనుభవం లేనివాడు;* కానీ ఈ పని చాలా గొప్పది, ఎందుకంటే ఇది మనిషి కోసం కాదు, యెహోవా దేవుని కోసం కట్టబోయే ఆలయం.*+ 2 నా దేవుని మందిరం కోసం నేను ఎంతో ప్రయాసపడి బంగారం పని కోసం బంగారాన్ని, వెండి పని కోసం వెండిని, రాగి పని కోసం రాగిని, ఇనుప పని కోసం ఇనుమును,+ కలప పని కోసం మ్రానుల్ని,+ అలాగే సులిమాని రాళ్లను, సున్నంతో అమర్చే రాళ్లను, రంగురంగుల చిన్న అలంకరణ రాళ్లను, ప్రతీ విధమైన అమూల్యమైన రాళ్లను, విస్తారంగా పాలరాళ్లను సిద్ధం చేశాను. 3 అంతేకాదు, నా దేవుని మందిరం మీదున్న ఇష్టం వల్ల,+ పవిత్ర మందిరం కోసం నేను సిద్ధం చేసిన వాటన్నిటితోపాటు నా సొంత బంగారాన్ని, వెండిని+ కూడా నా దేవుని మందిరానికి ఇస్తున్నాను. 4 గదుల గోడలకు పూత పూయడానికి 3,000 తలాంతుల* ఓఫీరు బంగారాన్ని,+ 7,000 తలాంతుల మేలిమి వెండిని ఇస్తున్నాను, 5 బంగారం పని కోసం బంగారాన్ని, వెండి పని కోసం వెండిని, నైపుణ్యంగల పనివాళ్లు చేసే పనంతటి కోసం అవసరమైన వాటిని ఇస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు ఎవరెవరు యెహోవాకు కానుకలు ఇవ్వాలనుకుంటున్నారు?”+
6 అప్పుడు పూర్వీకుల కుటుంబాల అధిపతులు, ఇశ్రాయేలు గోత్రాల అధిపతులు, సహస్రాధిపతులు,* శతాధిపతులు,*+ రాజు పని చూసుకునే అధిపతులు+ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. 7 వాళ్లు సత్యదేవుని మందిర సేవకోసం 5,000 తలాంతుల బంగారాన్ని, 10,000 డారిక్‌లను,* 10,000 తలాంతుల వెండిని, 18,000 తలాంతుల రాగిని, 1,00,000 తలాంతుల ఇనుమును ఇచ్చారు. 8 ఎవరి దగ్గరైతే రత్నాలు ఉన్నాయో, వాళ్లు వాటిని గెర్షోనీయుడైన+ యెహీయేలు+ సంరక్షణ కింద ఉన్న యెహోవా మందిర ఖజానాకు ఇచ్చారు. 9 ప్రజలు సంపూర్ణ హృదయంతో యెహోవాకు ఈ స్వేచ్ఛార్పణలు ఇచ్చారు కాబట్టి వాళ్లు సంతోషించారు,+ రాజైన దావీదు కూడా ఎంతో సంతోషించాడు.
10 అప్పుడు సమాజంలోని ప్రజలందరి కళ్ల ఎదుట దావీదు యెహోవాను ఇలా స్తుతించాడు: “మా తండ్రీ, ఇశ్రాయేలు దేవా, యెహోవా, నువ్వు శాశ్వతకాలం* స్తుతించబడాలి. 11 యెహోవా, గొప్పతనం,+ బలం,+ తేజస్సు, వైభవం, ఘనత+ నీకే చెందుతాయి. ఎందుకంటే ఆకాశంలో, భూమ్మీద ఉన్న ప్రతీది నీదే.+ యెహోవా, రాజ్యం నీది.+ అందరి మీద నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు. 12 ఐశ్వర్యాన్ని, మహిమను ఇచ్చేది నువ్వే,+ నువ్వు అన్నిటి మీద పరిపాలన చేస్తున్నావు;+ శక్తి,+ బలం+ నీ చేతిలో ఉన్నాయి, నీ చెయ్యి ఎవరినైనా గొప్ప చేయగలదు,+ అందరికీ బలాన్ని ఇవ్వగలదు.+ 13 ఇప్పుడు మా దేవా, మేము నీకు కృతజ్ఞతలు చెప్తున్నాం, నీ రమ్యమైన పేరును స్తుతిస్తున్నాం.
14 “అయినా, ఇలా స్వేచ్ఛార్పణలు ఇవ్వడానికి నేను ఎంతటివాణ్ణి? నా ప్రజలు ఎంతటివాళ్లు? ఎందుకంటే అన్నీ నీ నుండే వచ్చాయి; నీ చేతి నుండి వచ్చిన వాటినే మేము నీకు ఇచ్చాం. 15 మా పూర్వీకులందరిలా మేము నీ సమక్షంలో పరదేశులం, వలసదారులం.+ భూమ్మీద మా జీవితాలు నీడలాంటివి,+ అస్థిరమైనవి. 16 మా దేవా, యెహోవా, నీ పవిత్రమైన పేరు కోసం నీకు ఒక మందిరాన్ని కట్టడానికి మేము సిద్ధం చేసిన ఈ సంపదంతా నీ చేతి నుండి వచ్చిందే, ఇదంతా నీదే. 17 నా దేవా, నువ్వు హృదయాన్ని పరిశీలిస్తావనీ,+ ఒక వ్యక్తి యథార్థతను* చూసి సంతోషిస్తావనీ+ నాకు బాగా తెలుసు. నేను నిజాయితీగల హృదయంతో వీటన్నిటినీ స్వచ్ఛందంగా ఇచ్చాను, ఇక్కడున్న నీ ప్రజలు నీకు స్వేచ్ఛార్పణలు ఇవ్వడం చూసి ఎంతో సంతోషిస్తున్నాను. 18 మా పూర్వీకులైన అబ్రాహాముకు, ఇస్సాకుకు, ఇశ్రాయేలుకు దేవా, యెహోవా, ఈ ఉద్దేశాలు, ఆలోచనలు నీ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉండేలా చేయి, వాళ్ల హృదయాల్ని నీ వైపుకు తిప్పుకో.+ 19 నా కుమారుడైన సొలొమోను సంపూర్ణ* హృదయంతో+ నీ ఆజ్ఞల్ని, నీ జ్ఞాపికల్ని, నీ నియమాల్ని పాటించేలా+ అతనికి సహాయం చేయి. సొలొమోను వీటన్నిటినీ చేసేలా నేను దేని కోసమైతే ఏర్పాట్లు చేశానో+ ఆ ఆలయాన్ని* కట్టేలా అతనికి సహాయం చేయి.”
20 తర్వాత దావీదు సమాజంలోని వాళ్లందరితో, “ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించండి” అని చెప్పాడు. అప్పుడు వాళ్లందరూ తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను స్తుతించారు; యెహోవా ముందు, రాజు ముందు సాష్టాంగపడ్డారు. 21 వాళ్లు యెహోవాకు బలులు అర్పిస్తూ ఉన్నారు; ఆ రోజు, ఆ తర్వాతి రోజు యెహోవాకు దహనబలులు+ అర్పిస్తూ ఉన్నారు; వాళ్లు 1,000 కోడెదూడల్ని, 1,000 పొట్టేళ్లను, 1,000 మగ గొర్రెపిల్లల్ని, వాటి పానీయార్పణల్ని+ అర్పించారు. వాళ్లు ఇశ్రాయేలీయులందరి కోసం పెద్ద ఎత్తున బలులు అర్పించారు.+ 22 వాళ్లు ఆ రోజు యెహోవా ఎదుట గొప్ప సంతోషంతో తింటూ, తాగుతూ ఉన్నారు;+ వాళ్లు దావీదు కుమారుడైన సొలొమోనును రెండోసారి రాజును చేసి, అతన్ని యెహోవా ఎదుట నాయకునిగా అభిషేకించారు;+ అలాగే సాదోకును యాజకునిగా అభిషేకించారు.+ 23 సొలొమోను తన తండ్రైన దావీదు స్థానంలో రాజుగా యెహోవా సింహాసనం మీద కూర్చున్నాడు,+ అతను వర్ధిల్లాడు; ఇశ్రాయేలీయులందరూ అతనికి విధేయులయ్యారు. 24 అధిపతులందరూ,+ బలమైన యోధులందరూ,+ అలాగే దావీదు రాజు కుమారులందరూ+ రాజైన సొలొమోనుకు విధేయులయ్యారు. 25 యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి కళ్లముందు ఎంతో గొప్ప చేశాడు, అతనికి ముందున్న ఏ ఇశ్రాయేలు రాజుకూ లేనంత రాజరిక వైభవాన్ని సొలొమోనుకు ఇచ్చాడు.+
26 యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలు అంతటినీ పరిపాలించాడు, 27 అతను ఇశ్రాయేలు మీద పరిపాలించిన కాలం 40 సంవత్సరాలు. దావీదు హెబ్రోనులో 7 సంవత్సరాలు,+ యెరూషలేములో 33 సంవత్సరాలు పరిపాలించాడు.+ 28 దావీదు దీర్ఘాయుష్షును, ఐశ్వర్యాన్ని, ఘనతను అనుభవించి మంచి ముసలితనంలో తృప్తిగా చనిపోయాడు.+ అతని స్థానంలో అతని కుమారుడు సొలొమోను రాజయ్యాడు.+ 29 రాజైన దావీదు చరిత్ర మొదటినుండి చివరివరకూ, దీర్ఘదర్శి సమూయేలు, నాతాను ప్రవక్త,+ దర్శనాలు చూసే గాదు+ రాసిన పుస్తకాల్లో ఉంది. 30 వాటిలో అతని రాజరికం గురించి, అతని పరాక్రమ కార్యాల గురించి, అలాగే అతనికి, ఇశ్రాయేలుకు, చుట్టుపక్కల రాజ్యాలన్నిటికీ సంబంధించిన సంఘటనల గురించి కూడా రాయబడివుంది.
తర్వాత ఉన్నవాళ్లు అరాము కుమారులు. ఆదికాండం 10:23 చూడండి.
“విభజన” అని అర్థం.
అక్ష., “భూమి విభజించబడింది.”
అక్ష., “కుమారులు.”
అక్ష., “ఇశ్రాయేలు కుమారుల్ని.”
ఆదికాండం 36:39లో ఉన్న “హదరు” ఇతనే.
షేక్ అంటే గోత్రపు పెద్ద.
అక్ష., “కుమారులు.”
“విపత్తు తీసుకొచ్చేవాడు; కష్టం తీసుకొచ్చేవాడు” అని అర్థం. యెహోషువ 7:1లో ఆకాను అని కూడా పిలవబడ్డాడు.
లేదా “కష్టం.”
అక్ష., “కుమారులు.”
18, 19, 42 వచనాల్లో కాలేబు అని కూడా పిలవబడ్డాడు.
9వ వచనంలో కెలూబై అని కూడా పిలవబడ్డాడు.
ఈ అధ్యాయంలోని కొన్ని పేర్లు, మనుషుల్ని కాకుండా స్థలాల్ని సూచించవచ్చు. ఆ సందర్భాల్లో “తండ్రి” అనే మాట, స్థాపించిన వ్యక్తిని సూచిస్తుండవచ్చు.
అక్ష., “కుమారులు.”
అక్ష., “కుమారులు.”
అక్ష., “కుమారులు.”
9వ వచనంలో కెలూబై అని కూడా పిలవబడ్డాడు.
అక్ష., “కుమారులు.”
అక్ష., “కుమారులు.”
అక్ష., “కుమారులు.”
అక్ష., “కుమారులు.”
ఈ అధ్యాయంలోని కొన్ని పేర్లు, మనుషుల్ని కాకుండా స్థలాల్ని సూచించవచ్చు. ఆ సందర్భాల్లో “తండ్రి” అనే మాట, స్థాపించిన వ్యక్తిని సూచిస్తుండవచ్చు.
యబ్బేజు అనే పేరుకు “వేదన” అనే అర్థమున్న హీబ్రూ పదంతో సంబంధం ఉండవచ్చు.
అక్ష., “కుమారులు.”
“చేతిపనుల్లో నైపుణ్యం ఉన్నవాళ్ల లోయ” అని అర్థం.
అక్ష., “కుమారులు.”
18వ వచనంలో ఉన్న బిత్యాను సూచిస్తుండవచ్చు.
లేదా “అగౌరవపర్చాడు.”
పదకోశం చూడండి.
అంటే, యరొబాము II.
లేదా “దేవుళ్లతో ఆధ్యాత్మిక వ్యభిచారం చేశారు.”
అక్ష., “కుమారులు.”
1వ వచనంలో గెర్షోను అని కూడా పిలవబడ్డాడు.
అక్ష., “కుమారులు.”
అక్ష., “కుమారులు.”
లేదా “పెద్దపెట్టె.”
అక్ష., “ఇవ్వబడ్డారు.”
లేదా “ప్రాకారాలుగల శిబిరాలు.”
పదకోశం చూడండి.
లేదా యెహోషువ 21:13 అనుగుణంగా, “ఆశ్రయపురమైన” అయ్యుంటుంది.
లేదా “చీటి వేసి ఇచ్చారు.”
లేదా యెహోషువ 21:21 అనుగుణంగా, “ఆశ్రయపురమైన” అయ్యుంటుంది.
అక్ష., “కుమారులు.”
అక్ష., “ప్రధానులు.”
అక్ష., “కుమారులు.”
అక్ష., “కుమారులు.”
“విపత్తుతో” అని అర్థం.
“యెహోవాయే రక్షణ” అని అర్థం.
లేదా “గాజా” అయ్యుంటుంది; అయితే ఇది ఫిలిష్తీయుల గాజా కాదు.
32వ వచనంలో షోమేరు అని కూడా పిలవబడ్డాడు.
ఇతను బహుశా 32వ వచనంలోని హోతాము అయ్యుంటాడు.
లేదా “అతను తన భార్యలైన హుషీమును, బయరాను పంపించేసిన తర్వాత” అయ్యుంటుంది.
అంటే, తోటి బెన్యామీనీయులు.
ఇష్బోషెతు అని కూడా పిలవబడ్డాడు.
మెఫీబోషెతు అని కూడా పిలవబడ్డాడు.
లేదా “నెతీనీయులు.” అక్ష., “ఇవ్వబడినవాళ్లు.”
లేదా “ఆలయ.”
అక్ష., “బలవంతులైన.”
లేదా “భోజనాల గదుల.”
లేదా “సన్నిధి రొట్టెల.”
లేదా “సబ్బాతు రోజున.”
లేదా “భోజనాల గదుల్లో.”
అక్ష., “షిమ్యామును.”
అంటే, తోటి బెన్యామీనీయులు.
లేదా “అవమానకరంగా.”
అక్ష., “నీ ఎముక, మాంసం.”
లేదా “నిబంధన.”
ఈ హీబ్రూ పదం, కోటలాంటి నిర్మాణాన్ని సూచిస్తుండవచ్చు. అక్ష., “మట్టిదిబ్బ.”
లేదా “బార్లీతో నిండిన.”
లేదా “రక్షణను.”
అక్ష., “వీరుని కుమారుడు.”
అతని ఎత్తు దాదాపు 2.23 మీటర్లు (7.3 అడుగులు). అనుబంధం B14 చూడండి.
పదకోశం చూడండి.
అక్ష., “కమ్ముకుంది.”
లేదా “దావీదు దగ్గరికి వచ్చిన వాళ్లెవ్వరూ ద్వంద్వ హృదయంగల వాళ్లు కాదు.”
లేదా “ఒకే హృదయంతో.”
అంటే, 1,000 మంది మీద అధిపతులు.
అంటే, 100 మంది మీద అధిపతులు.
లేదా “ఈజిప్టు.”
లేదా “షీహోరు నుండి.”
లేదా “హమాతు ప్రవేశ ద్వారం.”
లేదా “మధ్య” అయ్యుంటుంది.
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
అంటే, గిలకల తప్పెట.
పదకోశం చూడండి.
లేదా “దావీదు బాధపడ్డాడు.”
“ఉజ్జా మీద కోపం కట్టలు తెంచుకోవడం” అని అర్థం.
లేదా “గోడలు నిర్మించేవాళ్లను.”
“కూల్చడంలో నిపుణుడు” అని అర్థం.
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
అంటే, 1,000 మంది మీద అధిపతులు.
అక్ష., “కొమ్ములూ.”
అక్ష., “గుర్తు చేయడానికి.”
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
లేదా “సంగీతం వాయించండి.”
లేదా “మాట్లాడండి” అయ్యుంటుంది.
అక్ష., “ముఖాన్ని.”
లేదా “అద్భుతమైన పనుల్ని.”
లేదా “వంశస్థులారా.” అక్ష., “విత్తనమా.”
అక్ష., “ఆయన ఆజ్ఞాపించిన మాటను.”
లేదా “సంభ్రమాశ్చర్యాలు పుట్టించేవాడు.”
లేదా “ఆయన పవిత్రతకు ఉన్న వైభవాన్ని బట్టి” అయ్యుంటుంది.
లేదా “ఆరాధించండి.”
లేదా “పండే భూమి.”
లేదా “అది ఊగిసలాడదు.”
లేదా “వచ్చాడు.”
లేదా “నీ స్తుతిని బట్టి సంతోషిస్తాం.”
లేదా “శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు.”
లేదా “అలాగే జరగాలి!”
లేదా “కీర్తించడానికి.”
బహుశా “ఒక డేరా స్థలం నుంచి మరోదానికి, ఒక నివాస స్థలం నుంచి మరోదానికి” అనే అర్థం ఉండవచ్చు.
అక్ష., “నువ్వు నీ పూర్వీకులతో ఉండడానికి వెళ్లాక.”
అక్ష., “విత్తనాన్ని.”
లేదా “ఉన్నత స్థాయిలో ఉన్నవాణ్ణి.”
లేదా “నీ హృదయానికి అంగీకారమైన విధంగా.”
లేదా “నమ్మకమైనదిగా నిరూపించబడాలి.”
లేదా “రక్షణను.”
లేదా “పవిత్రపర్చాడు.”
లేదా “రక్షణను.”
అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
అక్ష., “అరామ్నహరాయిము.”
అంటే, యూఫ్రటీసు.
అంటే, వసంతకాలంలో.
2 సమూయేలు 12:30 అధస్సూచి చూడండి.
దాదాపు 34.2 కిలోలు. అనుబంధం B14 చూడండి.
లేదా “నిందిస్తూ; హేళనచేస్తూ.”
లేదా “ఎదిరించేవాడు” అయ్యుంటుంది.
లేదా “విచారపడ్డాడు.”
అక్ష., “ఇవ్వు.”
లేదా “నాకు ఏ ఖర్చూ అవ్వని.”
అప్పట్లో ఒక షెకెల్ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “కోమలమైనవాడు.”
అక్ష., “విశ్రాంతిపరుడిగా.”
“శాంతి” అనే అర్థమున్న హీబ్రూ పదం నుండి వచ్చింది.
అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
పదకోశం చూడండి.
లేదా “విభజించాడు.”
అక్ష., “కుమారుల్లో.”
అక్ష., “సహోదరులైన.”
లేదా “సన్నిధి రొట్టెలు.”
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
లేదా “బుద్ధిగల.”
లేదా “పవిత్రపర్చిన; సమర్పించిన.”
అంటే, 1,000 మంది మీద అధిపతులు.
అంటే, 100 మంది మీద అధిపతులు.
లేదా “పవిత్రపర్చిన.”
లేదా “షెలోమోతు.”
అంటే, 1,000 మంది మీద అధిపతులు.
అంటే, 100 మంది మీద అధిపతులు.
లేదా “ఖజానాల.”
లేదా “ఆంతరంగికుడు.”
అంటే, 1,000 మంది మీద అధిపతులు.
అంటే, 100 మంది మీద అధిపతులు.
లేదా “పూర్తిగా అంకితమైన.”
లేదా “సంతోష హృదయంతో.” పదకోశంలో “ప్రాణం” చూడండి.
లేదా “కరుణా పీఠం మందిరానికి.”
లేదా “పవిత్రపర్చిన; సమర్పించిన.”
పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
లేదా “సన్నిధి రొట్టెలు.”
లేదా “కోమలమైనవాడు.”
లేదా “కోట; భవనం.”
అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
అంటే, 1,000 మంది మీద అధిపతులు.
అంటే, 100 మంది మీద అధిపతులు.
డారిక్ ఒక పారసీక బంగారు నాణెం. అనుబంధం B14 చూడండి.
లేదా “శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు.”
లేదా “నిజాయితీని.”
లేదా “పూర్తిగా అంకితమైన.”
లేదా “కోటను; భవనాన్ని.”