పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం ఆదికాండం విషయసూచిక ఆదికాండం విషయసూచిక 1 ఆకాశాన్ని, భూమిని సృష్టించడం (1, 2) ఆరు రోజుల్లో భూమిని సిద్ధం చేయడం (3-31) 1వ రోజు: వెలుగు; పగలు, రాత్రి (3-5) 2వ రోజు: విశాలం (6-8) 3వ రోజు: ఆరిన నేల, మొక్కలు (9-13) 4వ రోజు: ఆకాశ జ్యోతులు (14-19) 5వ రోజు: చేపలు, పక్షులు (20-23) 6వ రోజు: భూజంతువులు, మనుషులు (24-31) 2 ఏడో రోజున దేవుడు విశ్రాంతి తీసుకోవడం (1-3) యెహోవా దేవుడు భూమ్యాకాశాల సృష్టికర్త (4) ఏదెను తోటలో పురుషుడు, స్త్రీ (5-25) మట్టితో మనిషిని చేయడం (7) తెలివినిచ్చే చెట్టును నిషేధించడం (15-17) స్త్రీని సృష్టించడం (18-25) 3 పాపం పుట్టుక (1-13) మొదటి అబద్ధం (4, 5) తిరుగుబాటుదారుల మీద యెహోవా తీర్పు (14-24) స్త్రీ సంతానం గురించి ప్రవచించడం (15) ఏదెను తోట నుండి వెళ్లగొట్టడం (23, 24) 4 కయీను, హేబెలు (1-16) కయీను వంశస్థులు (17-24) షేతు, అతని కుమారుడు ఎనోషు (25, 26) 5 ఆదాము నుండి నోవహు వరకు (1-32) ఆదాముకు కుమారులు, కూతుళ్లు పుట్టారు (4) హనోకు దేవునితో నడిచాడు (21-24) 6 దేవుని కుమారులు భూమ్మీది స్త్రీలను పెళ్లిచేసుకోవడం (1-3) నెఫీలీయులు పుట్టారు (4) మనుషుల చెడుతనం చూసి యెహోవా నొచ్చుకున్నాడు (5-8) ఓడను తయారుచేయమని నోవహుకు ఆజ్ఞాపించడం (9-16) జలప్రళయం రాబోతుందని దేవుడు ప్రకటించడం (17-22) 7 ఓడలోకి వెళ్లడం (1-10) భూవ్యాప్త జలప్రళయం (11-24) 8 జలప్రళయపు నీళ్లు తగ్గడం (1-14) పావురాన్ని బయటికి పంపడం (8-12) ఓడలో నుండి బయటికి రావడం (15-19) భూమి విషయంలో దేవుని వాగ్దానం (20-22) 9 మానవాళికి నిర్దేశాలు (1-7) రక్తం గురించిన నియమం (4-6) ఇంద్రధనుస్సు ఒప్పందం (8-17) నోవహు వంశస్థుల గురించిన ప్రవచనాలు (18-29) 10 జనాల జాబితా (1-32) యాపెతు వంశస్థులు (2-5) హాము వంశస్థులు (6-20) నిమ్రోదు యెహోవాను వ్యతిరేకించడం (8-12) షేము వంశస్థులు (21-31) 11 బాబెలు గోపురం (1-4) యెహోవా భాషను తారుమారు చేయడం (5-9) షేము నుండి అబ్రాము వరకు (10-32) తెరహు కుటుంబం (27) అబ్రాము ఊరును విడిచివెళ్లడం (31) 12 అబ్రాము హారాను నుండి కనానుకు బయల్దేరడం (1-9) అబ్రాముకు దేవుని వాగ్దానం (7) ఐగుప్తులో అబ్రాము, శారయి (10-20) 13 అబ్రాము కనానుకు తిరిగెళ్లడం (1-4) అబ్రాము, లోతు వేరైపోయారు (5-13) దేవుడు తన వాగ్దానాన్ని అబ్రాముకు మళ్లీ చెప్పడం (14-18) 14 అబ్రాము లోతును కాపాడడం (1-16) మెల్కీసెదెకు అబ్రామును దీవించడం (17-24) 15 అబ్రాముతో దేవుని ఒప్పందం (1-21) 400 ఏళ్ల బానిసత్వం గురించిన ప్రవచనం (13) దేవుడు తన వాగ్దానాన్ని అబ్రాముకు మళ్లీ చెప్పడం (18-21) 16 హాగరు, ఇష్మాయేలు (1-16) 17 అబ్రాహాము అనేక జనాలకు తండ్రి అవుతాడు (1-8) అబ్రాము పేరు అబ్రాహాముగా మారడం (5) సున్నతి ఒప్పందం (9-14) శారయి పేరు శారాగా మారడం (15-17) ఇస్సాకు పుడతాడని వాగ్దానం (18-27) 18 ముగ్గురు దేవదూతలు అబ్రాహామును సందర్శించడం (1-8) శారాకు కుమారుడు పుడతాడని వాగ్దానం; ఆమె నవ్వడం (9-15) సొదొమ గురించి అబ్రాహాము వేడుకోవడం (16-33) 19 దేవదూతలు లోతును సందర్శించడం (1-11) లోతును, అతని కుటుంబాన్ని త్వరపెట్టడం (12-22) సొదొమ, గొమొర్రాల నాశనం (23-29) లోతు భార్య ఉప్పు స్తంభం అవ్వడం (26) లోతు, అతని కూతుళ్లు (30-38) మోయాబీయుల, అమ్మోనీయుల ఆరంభం (37, 38) 20 అబీమెలెకు నుండి శారా కాపాడబడడం (1-18) 21 ఇస్సాకు పుట్టడం (1-7) ఇష్మాయేలు ఇస్సాకును ఎగతాళి చేయడం (8, 9) హాగరును, ఇష్మాయేలును పంపించేయడం (10-21) అబీమెలెకుతో అబ్రాహాము ఒప్పందం (22-34) 22 ఇస్సాకును బలి ఇవ్వమని అబ్రాహామును అడగడం (1-19) అబ్రాహాము సంతానం వల్ల దీవెన (15-18) రిబ్కా కుటుంబం (20-24) 23 శారా మరణం, సమాధుల స్థలం (1-20) 24 ఇస్సాకుకు భార్యను వెతకడం (1-58) రిబ్కా ఇస్సాకును కలవడానికి వెళ్లడం (59-67) 25 అబ్రాహాము మళ్లీ పెళ్లి చేసుకోవడం (1-6) అబ్రాహాము మరణం (7-11) ఇష్మాయేలు కుమారులు (12-18) యాకోబు, ఏశావు పుట్టడం (19-26) ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేయడం (27-34) 26 గెరారులో ఇస్సాకు, రిబ్కా (1-11) దేవుని వాగ్దానం ఇస్సాకుతో ఖరారు (3-5) బావుల గురించి గొడవ (12-25) అబీమెలెకుతో ఇస్సాకు ఒప్పందం (26-33) హిత్తీయులైన ఏశావు ఇద్దరు భార్యలు (34, 35) 27 ఇస్సాకు దీవెనను యాకోబు పొందడం (1-29) దీవెన కోసం ఏశావు ప్రయత్నిస్తాడు కానీ పశ్చాత్తాపపడడు (30-40) యాకోబు మీద ఏశావు శత్రుభావం (41-46) 28 ఇస్సాకు యాకోబును పద్దనరాముకు పంపడం (1-9) బేతేలు దగ్గర యాకోబు కల (10-22) దేవుని వాగ్దానం యాకోబుతో ఖరారు (13-15) 29 యాకోబు రాహేలును కలవడం (1-14) యాకోబు రాహేలు ప్రేమలో పడడం (15-20) యాకోబు లేయాను, రాహేలును పెళ్లిచేసుకోవడం (21-29) యాకోబుకు లేయా ద్వారా పుట్టిన నలుగురు కుమారులు: రూబేను, షిమ్యోను, లేవి, యూదా (30-35) 30 బిల్హాకు దాను, నఫ్తాలి పుట్టారు (1-8) జిల్పాకు గాదు, ఆషేరు పుట్టారు (9-13) లేయాకు ఇశ్శాఖారు, జెబూలూను పుట్టారు (14-21) రాహేలుకు యోసేపు పుట్టాడు (22-24) యాకోబు మందలు వర్ధిల్లడం (25-43) 31 యాకోబు రహస్యంగా కనానుకు బయల్దేరడం (1-18) లాబాను యాకోబును కలవడం (19-35) యాకోబు లాబానుతో ఒప్పందం చేసుకోవడం (36-55) 32 యాకోబుకు దేవదూతలు ఎదురవ్వడం (1, 2) యాకోబు ఏశావును కలవడానికి సిద్ధపడడం (3-23) యాకోబు దేవదూతతో కుస్తీ పడడం (24-32) యాకోబు పేరు ఇశ్రాయేలుగా మారడం (28) 33 యాకోబు ఏశావును కలవడం (1-16) యాకోబు షెకెముకు ప్రయాణించడం (17-20) 34 దీనా చెరచబడడం (1-12) యాకోబు కుమారులు మోసపూరితంగా ప్రవర్తించడం (13-31) 35 యాకోబు అన్యదేవతల విగ్రహాల్ని తీసిపారేయించడం (1-4) యాకోబు బేతేలుకు తిరిగిరావడం (5-15) బెన్యామీను పుట్టడం; రాహేలు చనిపోవడం (16-20) ఇశ్రాయేలు 12 మంది కుమారులు (21-26) ఇస్సాకు మరణం (27-29) 36 ఏశావు వంశస్థులు (1-30) ఎదోము రాజులు, షేక్‌లు (31-43) 37 యోసేపు కలలు (1-11) యోసేపు, అసూయపరులైన అతని సహోదరులు (12-24) యోసేపును బానిసగా అమ్మేయడం (25-36) 38 యూదా, తామారు (1-30) 39 పోతీఫరు ఇంట్లో యోసేపు (1-6) యోసేపు పోతీఫరు భార్యకు అడ్డుచెప్పడం (7-20) చెరసాలలో యోసేపు (21-23) 40 ఖైదీల కలలకు యోసేపు అర్థం చెప్పడం (1-19) “కలల అర్థం చెప్పగలిగేది దేవుడే” (8) ఫరో పుట్టినరోజు విందు (20-23) 41 ఫరో కలలకు యోసేపు అర్థం చెప్పడం (1-36) ఫరో యోసేపును హెచ్చించడం (37-46ఎ) యోసేపు ఆహార నిర్వహణ (46బి-57) 42 యోసేపు సహోదరులు ఐగుప్తుకు వెళ్లడం (1-4) యోసేపు తన సహోదరుల్ని కలవడం, పరీక్షించడం (5-25) యోసేపు సహోదరులు యాకోబు దగ్గరికి తిరిగిరావడం (26-38) 43 యోసేపు సహోదరులు రెండోసారి ఐగుప్తుకు వెళ్లడం; బెన్యామీనుతో (1-14) యోసేపు మళ్లీ తన సహోదరుల్ని కలవడం (15-23) యోసేపు తన సహోదరులతో విందు ఆరగించడం (24-34) 44 బెన్యామీను సంచిలో యోసేపు వెండి గిన్నె (1-17) యూదా బెన్యామీను గురించి వేడుకోవడం (18-34) 45 యోసేపు తానెవరో చెప్పడం (1-15) యోసేపు సహోదరులు యాకోబు కోసం తిరిగెళ్లడం (16-28) 46 యాకోబు, అతని ఇంటివాళ్లు ఐగుప్తుకు తరలివెళ్లడం (1-7) ఐగుప్తుకు తరలివెళ్లిన వాళ్ల పేర్లు (8-27) గోషెనులో యోసేపు యాకోబును కలవడం (28-34) 47 యాకోబు ఫరోను కలవడం (1-12) యోసేపు తెలివైన నిర్వహణ (13-26) ఇశ్రాయేలు గోషెనులో స్థిరపడడం (27-31) 48 యోసేపు ఇద్దరు కుమారుల్ని యాకోబు దీవించడం (1-12) ఎఫ్రాయిము మనష్షే కన్నా గొప్ప దీవెన పొందడం (13-22) 49 మరణశయ్యపై యాకోబు ప్రవచనం (1-28) షిలోహు యూదా వంశంలో వస్తాడు (10) తనను పాతిపెట్టడం గురించి యాకోబు నిర్దేశాలివ్వడం (29-32) యాకోబు మరణం (33) 50 యోసేపు యాకోబును కనానులో పాతిపెట్టడం (1-14) క్షమించానని యోసేపు భరోసా ఇవ్వడం (15-21) యోసేపు చివరి రోజులు, మరణం (22-26) తన ఎముకల గురించి యోసేపు ఇచ్చిన ఆజ్ఞ (25)